విశాఖపట్నం, సాక్షి: తెలుగు వికాసం ముసుగులో బడుగు బలహీన వర్గాల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని, అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా? అని విదసం ఐక్య వేదిక ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలంటూ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది.
తెలుగు మహా సభలు తీర్మానాలను వ్యతిరేకిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం రద్దును మేము ఖండిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వేదిక మీద మాట్లాడిన వారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు?. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా?.. మా పిల్లల మాత్రం మీ దొడ్లుల్లో పశువులు కాయలా.. అసలు తెలుగు వికాసం కోసం మాట్లాడిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివారా?..
.. తెలుగు మహా సభల వేదిక మీద ఉన్నవారు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా మాట్లాడారు. వేదికపై ఒకరు కూడా బడుగు బలహీను వర్గాలకు చెందిన వారు లేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలే!. అందుకే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి. ప్రపంచీకరణలో ఉద్యోగాల రావాలంటే ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కి వచ్చిన వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు రాక ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రాక నష్టపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని విదసం ఐక్య వేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment