మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), నాగాలాండ్ మంత్రి, బీజేపీ నేత టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఆనంద్ మహీంద్రాను మంత్రి అలోంగ్ బిగ్ బ్రో అని సంబోధించగా.. మంత్రిని ఆనంద్ మహీంద్రా చోటా బ్రో అంటూ సంబోధించారు.
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల ఎక్స్ (ట్విటర్)లో మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వాహన (Mahindra Thar.e) చిత్రాన్ని పోస్ట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అలోంగ్ ప్రశంసిస్తూ ‘బిగ్ బ్రో ఆనంద్ మహీంద్రా.. కొత్త వాహనం నెక్ట్స్ లెవల్‌లో ఉంది’ అంటూ రాసుకొచ్చారు. వాహనాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు.
అలోంగ్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా కూడా ప్రతిస్పదించారు. ‘హే చో బ్రో (చోటా బ్రో)’ అంటూ ఆప్యాయంగా సంబోధించారు. మహీంద్రా థార్.ఈ వాహనాన్ని ఉద్దేశిస్తూ ఇది మీ స్థాయికి చేరిందంటూ పేర్కొన్నారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత మిమ్మల్ని షికారుకు తీసుకెళ్తుందని అలోంగ్‌కు తెలియజేశారు.
Hey Cho Bro (Chota Bro) @AlongImna Aakhir aapke level tak pahunch gaye! When this is launched, will take you for a spin in it… #TharE https://t.co/3eY8a24e9j
— anand mahindra (@anandmahindra) August 20, 2023
Comments
Please login to add a commentAdd a comment