funny tweets
-
మైక్రోసాఫ్ట్ డౌన్ : మస్క్ సైటైర్, సోషల్‌మీడియా మీమ్స్, ఫన్సీ ట్వీట్స్ వైరల్
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అర్థాంతరంగా విండోస్ స్క్రీన్లపై "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ సందడి చేశాయి. పనిలో పనిగా టెస్లా అధినే, ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం.మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై స్పందించిన సంస్థ 365 యాప్‌లు, సేవలను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినట్టు వివరణ ఇచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. మస్క్ రియాక్షన్ మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ ఒక మీమ్‌కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అంటూ సెటైర్ వేస్తూ పాత ట్వీట్‌ను రీట్వీట్ చేవారు. అంతేకాదు ఎలన్ మస్క్ జోస్యం నిజ మైందంటున్నార నెటిజన్లు.IT departments: #Microsoft #Windows #bluescreen pic.twitter.com/cwO7x4QqF4— NEELKAMAL MEENA NEWAI (@NEELKAMALBhonda) July 19, 2024 Happy Weekend, thank you #Microsoft #Bluescreen pic.twitter.com/P8NywbSv6S— Parmatma Yadav (@yparmatma561) July 19, 2024 కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ముందే వచ్చిందని కొందరు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ మరికొందరి మీమ్స్ , ఫన్నీ జోక్‌లతో ఇంటర్నెట్ సందడిగా మారింది.… https://t.co/X9a2ghyo4P— Elon Musk (@elonmusk) July 19, 2024 -
నాగబాబు నీతులు..!
-
రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
కావేవీ మీమ్స్‌కు అనర్హం అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పైనా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం పూర్తయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, ఒక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్‌కు చేరవలో ఉన్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఆయా పార్టీలు పోటీ పడే క్రమంలో రిసార్టు రాజకీయాలు మొదలవుతాయని భావిస్తున్నారు. దీంతో రిసార్ట్‌లకు డిమాండ్ వస్తుందని, సొమ్ము చేసుకునేందుకు రిసార్ట్ ఓనర్లకు మంచి అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది ఆరోజే తేలనుంది. #ExitPoll Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/NDKixJkBaL — वेल्ला इंसान (@vella_insan1) November 30, 2023 Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/KcEHtjVb5S — Pakchikpak Raja Babu (@HaramiParindey) November 30, 2023 Resort owners right now after Exit poll predicts hung assembly #ExitPolls pic.twitter.com/7dx0ysXQ9a — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) November 30, 2023 -
బిగ్ బ్రో.. హే చోటా బ్రో.. ఆనంద్ మహీంద్రా, నాగాలాండ్ మంత్రి ఫన్నీ ట్వీట్స్!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), నాగాలాండ్ మంత్రి, బీజేపీ నేత టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఆనంద్ మహీంద్రాను మంత్రి అలోంగ్ బిగ్ బ్రో అని సంబోధించగా.. మంత్రిని ఆనంద్ మహీంద్రా చోటా బ్రో అంటూ సంబోధించారు. నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల ఎక్స్ (ట్విటర్)లో మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వాహన (Mahindra Thar.e) చిత్రాన్ని పోస్ట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అలోంగ్ ప్రశంసిస్తూ ‘బిగ్ బ్రో ఆనంద్ మహీంద్రా.. కొత్త వాహనం నెక్ట్స్ లెవల్లో ఉంది’ అంటూ రాసుకొచ్చారు. వాహనాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు. అలోంగ్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా కూడా ప్రతిస్పదించారు. ‘హే చో బ్రో (చోటా బ్రో)’ అంటూ ఆప్యాయంగా సంబోధించారు. మహీంద్రా థార్.ఈ వాహనాన్ని ఉద్దేశిస్తూ ఇది మీ స్థాయికి చేరిందంటూ పేర్కొన్నారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత మిమ్మల్ని షికారుకు తీసుకెళ్తుందని అలోంగ్‌కు తెలియజేశారు. Hey Cho Bro (Chota Bro) @AlongImna Aakhir aapke level tak pahunch gaye! When this is launched, will take you for a spin in it… #TharE https://t.co/3eY8a24e9j — anand mahindra (@anandmahindra) August 20, 2023 -
ఆర్నాల్ట్‌తో మస్క్ లంచ్.. ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్ర. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు, సందర్భాలపై నిత్యం ట్విటర్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన ఫాలోవర్లు సైతం ఆనంద్ మహీంద్ర పెట్టే పోస్టలకు అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు. తాజాగా ఇద్దరు బిలియనీర్లు లంచ్ కోసం కలిస్తే దానిపై ఆనంద్ మహీంద్ర ఫన్నీగా ట్వీట్ చేశారు. ఆ ఇద్దరు బిలియనీర్లు ఎవరో కాదు.. ఒకరు టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్. మరొకరు పారిస్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవో అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్. బిల్ ఎవరు కట్టారో.. ఆర్నాల్ట్, మస్క్ ఇద్దరూ లంచ్ కోసం శుక్రవారం(జూన్ 16) పారిస్‌లో కలిశారు. వీరి మీట్‌కు సంబంధించిన ఫొటోలను ఆర్నాల్ట్ కుమారుడు ఆంటోనీ ఆర్నాల్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే ఫొటోను డెక్సెర్టో అనే సంస్థ ట్విటర్లో షేర్ చేయగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. వీరిద్దరిలో బిల్లు ఎవరు కట్టారోనని తన భార్య ఉత్సుకతతో ఆలోచిస్తోందంటూ చమత్కరించారు. దీనిపై పలువురు పలు విధాలుగా ప్రతిస్పందించారు. ఇంకెవరు రెస్టారెంట్ వాళ్లే కట్టి ఉంటారని, వారికి ఫ్రీ మార్కెటింగ్ దొరికిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కాతా వివా టెక్నాలజీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ పారిస్‌లో ఉన్నారు. టెస్లా ఫాక్టరీలకు అనుకూలంగా ఉన్న దేశంగా ఫ్రాన్స్‌ను ప్రోత్సహించడం, సాంకేతిక నియంత్రణ గురించి చర్చించడంలో భాగంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా కలవనున్నారు. My wife was wondering who paid for the lunch…@elonmusk https://t.co/NIsPR4o9Oj — anand mahindra (@anandmahindra) June 18, 2023 -
అది చెప్తే.. నా ఉద్యోగం ఊడుతుంది: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Funny Tweet Reply: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఫ్రెండ్లీ ఇంటెరాక్టర్ కూడా. ఎవరేం అడిగినా.. చాలా ఓపికగా సమాధానం చెప్తుంటాడాయన. ఈ క్రమంలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ, ఫన్నీగా మాత్రం ఓ బదులు ఇచ్చారు ఆయన. ఐఎన్‌సీ ప్రాజెక్టు మేకర్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి.. ‘‘సర్.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పటి నుంచో చెప్పండి’’ అంటూ ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. Sir please tell me on which date the Scorpio is going to launch because we are waiting for it — Inc project makers (@Incprojectmake1) May 5, 2022 దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘ష్.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారాయన. Sshhhh. If I tell you, I’ll be fired… But I can say this much..I’m as excited as you are… https://t.co/6EnseHYZDE — anand mahindra (@anandmahindra) May 6, 2022 సమాధానం అందుకున్న వ్యక్తి సంతోషంగా ఉన్నాడో లేదో తెలియదుగానీ.. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ సరదా ట్వీట్‌ను మాత్రం పలువురు నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచి మిమ్మల్ని ఎవరు సార్ తీసేది అంటూ ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. అఫ్కోర్స్.. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడానికి ఇలాంటి టైమింగ్ కూడా ఒక కారణం కాబోలు! You are the King of Mahindra residing in heart of every Indian,who will fire you? — Agrawal Rishi (@AgrawalRishi1) May 6, 2022 Who will fire your sir, you yourself..??? pic.twitter.com/f4lD2TmXMj — R.V (@R_Vatsh) May 6, 2022 ఇదిలా ఉండగా.. కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో.. అదీ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: నా స్కోర్ సున్నా.. అయినా గర్వంగా ఉంది -
లాక్డౌన్ సడలింపులపై ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సమకాలీన అంశాలపై స్పందిస్తూ ట్రెండింగ్ లో ఉంటారు. తాజాగా ఆయన కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ పై చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. దేశంలోని ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం దేశంలోని సుమారు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుంది. కరోనా తీవ్రత క్రమ క్రమంగా తగ్గుతున్న సమయంలో కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. లాక్డౌన్ పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆనంద్ మహీంద్రా వ్యంగ్యంగా సమాధానమిస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఉన్న ఒక యువకుడు తలుపు గొళ్లానికి తాడు కట్టాడు. ఆ తాడుకు తాళం తగిలించి క్రిందకి, పైకి లాగుతున్నాడు. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నావని సదరు యువకుడిని అడిగితే.. లాక్డౌన్ అంటూ సమాధానమిచ్చాడు. అంటే తాళాన్ని కిందకు లాగుతున్నాను అని వ్యంగ్యంగా చెప్పాడు. ఈ వీడియోను చూసి అందరూ నెటిజన్లు నవ్వుతున్నారు. ఈ విధంగానే ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తేద్దామా అని పాలకులు ఆలోచిస్తున్నట్లు ఆయన వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఏ కఠిన సంధర్భంలోనైన భారతీయులు హాస్యంగా మలుచుకోగలరు. ఈ కఠిన పరిస్థితులలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంచిది. ఇది మనకు మానసికంగా ఎంతో సాంత్వన చేకూర్చుతుంది” అని అన్నారు. This is the silliest kind of joke possible—but I’m still glad that as a nation we have our sense of humour intact. And frankly, this is the perfect time to replay this when every state leader is trying to figure out how much to lower that lock! pic.twitter.com/jj1sDYGHZ1 — anand mahindra (@anandmahindra) June 6, 2021 చదవండి: ఆన్లైన్లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర -
స్కూల్‌కు వెళ్తున్న కమెడియన్లు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హాస్యనటుడు వెన్నెల కిషోర్. సినిమాల్లో ఏవిదంగా ఉంటాడో.. ట్విటర్లో కూడా అలాంటి పంచ్‌లే వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ట్వీట్ ఫన్ క్రియేట్ చేస్తోంది. వెన్నెల కిషోర్ పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్ అవుతోంది. నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్ అందరూ స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు. బ్యాక్2స్కూల్ థీమ్ పార్టీ అంటూ.. పోస్ట్ చేసిన వెన్నెల కిషోర్.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్ వచ్చిందంటూ.. ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్, రోలర్ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్లతో పాటు మరికొంతమంది ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఆదివారం బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. ‘Back2School’ theme party this time and yep was lil cranky🤣 coz my shorts were way too short🙈..#FlyingColors #MonthlyMeet pic.twitter.com/70H1QuevmU — vennela kishore (@vennelakishore) August 12, 2018 -
వెన్నెల కిశోర్ ఫన్నీ డైట్ ప్లాన్
-
వెన్నెల కిశోర్ ఫన్నీ డైట్ ప్లాన్
టాలీవుడ్ స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్న వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటాడు. తన షూటింగ్ అప్డేట్స్ ఇవ్వటంతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా అలాంటి ఆసక్తికరమైన ఒక ట్వీట్ తో ఆకట్టుకున్నాడు కిశోర్. కొన్ని బాదం పప్పుల మాత్రమే ఉన్న చిన్న బౌల్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన కిశోర్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘నా బ్రేక్ ఫాస్ట్ ఇది మాత్రమే. 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు, కొంచెం పొంగల్, రెండు ఆనియన్ దోశలు (ఆనియన్స్ లేకుండా), ఒక టీ మాత్రం స్నాక్స్ లా తీసుకుంటా’ అంటూ ట్వీట్ చేశాడు. వెన్నెల కిశోర్ చేసిన ఈ ట్వీట్‌పై స్పందించిన మంచు లక్ష్మీ ‘నా జీవితంలో ప్రతీరోజు ఆనందానికి నువ్వు కూడా ఓ కారణం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పదించిన చాలా మంది అభిమానులకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు కిశోర్. My only breakfast..then after almost 15 mins will have a light snack of just two idlis, little pongal, two onion dosas (without onions) and one tea..#eathealthy pic.twitter.com/wAWQ9yNcJ5 — vennela kishore (@vennelakishore) 17 March 2018 -
గుర్గావ్ గురుగ్రామైతే.. తెలంగాణ టెలిగ్రామా?
'గుర్గావ్ను ఇప్పటినుంచి గురుగ్రామ్ అని పిలువాలి.. మరీ ఎప్పుడు తెలంగాణను టెలిగ్రామ్ అని పిలుస్తారు? దిగ్బోయ్ని డయాగ్రామ్, ఆనంద్‌ను అనగ్రామ్, మోహన్పూర్ను మోనోగ్రామ్ అని ఎప్పుడు పిలువనున్నారు'.. గుర్గావ్ పేరును గురుగ్రామ్ గా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ఓ నెటిజన్ వేసిన సెటైర్ ఇది.. Gurgaon now called #Gurugram. When will Telangana be called Telegram, Digboi be called Diagram,Anand called Anagram and Monohurpur Monogram. — Harsh Goenka (@hvgoenka) 12 April 2016 ఢిల్లీ శివార్లలో ఉండే ప్రముఖ పట్టణం గుర్గావ్ పేరును గురుగ్రామ్‌గా మారుస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తున్నాయి. ఈ నిర్ణయం వెలువడిన మంగళవారం నుంచి ఇప్పటివరకు ట్విట్టర్లో చాలామంది నెటిజన్లు ఈ అంశంపై స్పందించారు. హర్యానా సర్కార్ నిర్ణయంపై వ్యంగ్యంగా స్పందిస్తూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కొందరు తప్పుబట్టారు. కొందరు విమర్శించారు. దీంతో ఈ అంశం కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ గా మారిపోయింది. గురుగ్రామ్ హ్యాష్‌ట్యాగ్ (#Gurugram)తో ఇప్పటివరకు 24.6వేలకుపైగా ట్వీట్లు వెలువడ్డాయి. దీంతో ట్విట్టర్లో ఇది అత్యధికంగా మాట్లాడిన అంశంగా మారిపోయింది. How would like to be called collectively, people of Gurugram? Gramvasiyon? Gurulog? Grammars? Gur naal ishq mitha oye hoye... — Karthik Srinivasan (@beastoftraal) 12 April 2016 గుర్గావ్గా గురుగ్రామ్‌గా మారిపోవడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'ఇక నుంచి గురుగ్రామ్ వాసులను ఉమ్మడిగా కలిపి ఎలా పిలుస్తారు? గురువంశీయులారా అనా? గురులోకులు అనా? గ్రామర్స్ అనా? గురు నాల్ ఇష్క్ మిథా ఓయ్ హోయ్ అనా?..' అని వ్యంగ్యంగా పేర్కొనగా.. ఇన్స్టాగ్రామ్ తరహాలో బాబాలు, సన్యాసాలు సెల్ఫీలు అప్లోడ్ చేసుకునేందుకు గురుగ్రామ్ యాప్ తీసుకురావాలని తాను అనుకొన్నానని, తన ఐడియాను కాపీ కొట్టేశారని మరో నెటిజన్ వాపోయాడు. ఇక పేరు మార్చడం వల్ల 250 ఫార్చూన్ 500 కంపెనీలకు నెలవైన గుర్గావ్ పట్టణ పరిస్థితులు ఏమైనా మెరుగవుతాయా? అని పలువురు ప్రశ్నించారు. మహాభారతంలో ఏకలవ్యుడి బొటనవేలిని పొట్టనబెట్టుకున్న ద్రోణాచార్యుడి పేరు మీద గురుగ్రామ్ అని పెట్టడం, అది కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్ణయం తీసుకోవడమేమిటని పలువురు విమర్శించారు. హర్యానా రాజకీయ నాయకులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. Delhi govt must learn from Haryana. Instead of wasting time improving the education system, just change it's name to Indraprastha. #Gurugram — Shirish Kunder (@ShirishKunder) 12 April 2016 @farzana_versey Gurugram sounds more like a photo uploading app for Delhiites. — Masroor Dhar (@ImMasroor_) 13 April 2016 So does that make Instagram our cousin brother? #Gurugram — Shivangi (@Shivangiyadav) 12 April 2016 BJP's swift balancing act - within days of opening Ambedkar Memorial, name of #Gurgaon is changed to #Gurugram - invoking Dronacharya 1/2 — Pawan Khera (@Pawankhera) 12 April 2016 In perception what Aurangzeb was to Hindus, Dronacharya was to Dalits. If name changes symbolise corrective intervention, why #Gurugram? 2/2 — Pawan Khera (@Pawankhera) 12 April 2016