
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్ర. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు, సందర్భాలపై నిత్యం ట్విటర్‌లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన ఫాలోవర్లు సైతం ఆనంద్ మహీంద్ర పెట్టే పోస్టలకు అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు.
తాజాగా ఇద్దరు బిలియనీర్లు లంచ్ కోసం కలిస్తే దానిపై ఆనంద్ మహీంద్ర ఫన్నీగా ట్వీట్ చేశారు. ఆ ఇద్దరు బిలియనీర్లు ఎవరో కాదు.. ఒకరు టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్. మరొకరు పారిస్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవో అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్.
బిల్ ఎవరు కట్టారో..
ఆర్నాల్ట్, మస్క్ ఇద్దరూ లంచ్ కోసం శుక్రవారం(జూన్ 16) పారిస్‌లో కలిశారు. వీరి మీట్‌కు సంబంధించిన ఫొటోలను ఆర్నాల్ట్ కుమారుడు ఆంటోనీ ఆర్నాల్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే ఫొటోను డెక్సెర్టో అనే సంస్థ ట్విటర్‌లో షేర్ చేయగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. వీరిద్దరిలో బిల్లు ఎవరు కట్టారోనని తన భార్య ఉత్సుకతతో ఆలోచిస్తోందంటూ చమత్కరించారు. దీనిపై పలువురు పలు విధాలుగా ప్రతిస్పందించారు. ఇంకెవరు రెస్టారెంట్ వాళ్లే కట్టి ఉంటారని, వారికి ఫ్రీ మార్కెటింగ్ దొరికిందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
కాతా వివా టెక్నాలజీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ పారిస్‌లో ఉన్నారు. టెస్లా ఫాక్టరీలకు అనుకూలంగా ఉన్న దేశంగా ఫ్రాన్స్‌ను ప్రోత్సహించడం, సాంకేతిక నియంత్రణ గురించి చర్చించడంలో భాగంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా కలవనున్నారు.
My wife was wondering who paid for the lunch…@elonmusk https://t.co/NIsPR4o9Oj
— anand mahindra (@anandmahindra) June 18, 2023