lunch meet
-
అమిత్ షా తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ లంచ్
-
ఆర్నాల్ట్‌తో మస్క్ లంచ్.. ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్ర. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు, సందర్భాలపై నిత్యం ట్విటర్లో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన ఫాలోవర్లు సైతం ఆనంద్ మహీంద్ర పెట్టే పోస్టలకు అంతే యాక్టివ్‌గా స్పందిస్తుంటారు. తాజాగా ఇద్దరు బిలియనీర్లు లంచ్ కోసం కలిస్తే దానిపై ఆనంద్ మహీంద్ర ఫన్నీగా ట్వీట్ చేశారు. ఆ ఇద్దరు బిలియనీర్లు ఎవరో కాదు.. ఒకరు టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్. మరొకరు పారిస్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవో అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్. బిల్ ఎవరు కట్టారో.. ఆర్నాల్ట్, మస్క్ ఇద్దరూ లంచ్ కోసం శుక్రవారం(జూన్ 16) పారిస్‌లో కలిశారు. వీరి మీట్‌కు సంబంధించిన ఫొటోలను ఆర్నాల్ట్ కుమారుడు ఆంటోనీ ఆర్నాల్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇదే ఫొటోను డెక్సెర్టో అనే సంస్థ ట్విటర్లో షేర్ చేయగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. వీరిద్దరిలో బిల్లు ఎవరు కట్టారోనని తన భార్య ఉత్సుకతతో ఆలోచిస్తోందంటూ చమత్కరించారు. దీనిపై పలువురు పలు విధాలుగా ప్రతిస్పందించారు. ఇంకెవరు రెస్టారెంట్ వాళ్లే కట్టి ఉంటారని, వారికి ఫ్రీ మార్కెటింగ్ దొరికిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. కాతా వివా టెక్నాలజీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ పారిస్‌లో ఉన్నారు. టెస్లా ఫాక్టరీలకు అనుకూలంగా ఉన్న దేశంగా ఫ్రాన్స్‌ను ప్రోత్సహించడం, సాంకేతిక నియంత్రణ గురించి చర్చించడంలో భాగంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కూడా కలవనున్నారు. My wife was wondering who paid for the lunch…@elonmusk https://t.co/NIsPR4o9Oj — anand mahindra (@anandmahindra) June 18, 2023 -
రోజంతా తిట్టుకున్నారు.. ఆపై సరదాగా ఇలా..!
న్యూఢిల్లీ: భారత్ సూచనల మేరకు 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఎంపీలందరికీ పార్లమెంట్ ఆవరణలో మంగళవారం మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఒకే డైనింగ్ టేబుల్‌పై మిల్లెట్ లంచ్ చేశారు. ప్రఖ్యాత చెఫ్‌లతో తయారు చేసిన చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను నెతలంతా ఇష్టంగా తిన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్ లంచ్‌పై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.‘ 2023 ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా నిర్వహించబోతున్న తరుణంలో పార్లమెంట్లో నిర్వహించిన మిల్లెట్ లంచ్‌కు హాజరయ్యాము. పార్టీలకతీతంగా నేతలు హాజరవటం చాలా సంతోషంగా ఉంది.’అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ లంచ్‌లో బజ్రే కా రబ్డీ సూప్, రాగి దోస, యుచెల్ చట్నీ, కలుహులి, లేహ్‌సన్ చట్నీ, చట్నీ పౌడర్, జోల్దా రోటీ, గ్రీన్ సలడాా వంటివి ప్రత్యేకంగా నిలిచినట్లు నేతలు పేర్కొన్నారు. As we prepare to mark 2023 as the International Year of Millets, attended a sumptuous lunch in Parliament where millet dishes were served. Good to see participation from across party lines. pic.twitter.com/PjU1mQh0F3 — Narendra Modi (@narendramodi) December 20, 2022 ఆసక్తికరం.. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన నెలకొంది. రాజస్థాన్ అల్వార్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు శునకం, ఎలుకలు అంటూ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ అట్టుడుకింది. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఛైర్మన్ ధన్‌ఖడ్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళనకు దిగడంతో కొద్ది సమయంలో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న తర్వాత సాయంత్రం ఈ మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతా సంతోషంతో కలిసి లంచ్‌లో పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. A millet special lunch was organised today for all the MPs in Parliament by union government. Enjoyed this healthy & delicious meal with my colleagues. @narendramodi @nstomar @nitin_gadkari @PiyushGoyal @kharge @supriya_sule @adhirrcinc @SaugataRoyMP #IMY2023 #MilletsLunch pic.twitter.com/Qk88m5Mxpj — Praful Patel (@praful_patel) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్రమిస్తున్న తరుణంలో కన్నడ నాట రాజకీయ అసమ్మతి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పారీ్టకి ప్రమాదం ముంచుకొస్తోందని పుకార్లు షికారు చేశాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్న ఉమేశ్ కత్తి మరోసారి తన నివాసంలో గురువారం రాత్రి కొందరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాజకీయంగా చర్చ మొదలైంది. అంతేకాకుండా ఉమేశ్ కత్తిని తన ఇంటికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆహ్వానించారు. ఉమేశ్ కత్తి బెంగళూరులోని సీఎం నివాసం సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నివాసంలో సమావేశానికి.. రాజకీయానికి సంబంధం లేదని కొట్టి పారేశారు. రహస్య సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. రేణుకాచార్య ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నాయకత్వంపై తమకందరికి విశ్వాసముందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప ఎమ్మెల్యేలందరి విశ్వాసంతో పాలన అందిస్తున్నారన్నారు. సీఎం నాయకత్వంపై ఎవరికీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చిన్నపాటి వివాదాలున్నా పరిష్కరించేందుకు పార్టీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం యడియూరప్ప కరోనా సమస్యను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే కష్టసుఖాలు మాట్లాడుకున్నాం : ఉమేశ్ కత్తి బీజేపీలో బాధ్యతాయుత ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అందరూ కలిసి భోజనం చేశాం. కష్టసుఖాల గురించి మాట్లాడుకున్నాం. ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదు. బీజేపీలో తిరుగుబాటు లేచిందని, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారనే వార్తల్లో నిజం లేదు. మా నాయకుడు మోదీ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉండాలని కోరుకున్నాం. రాజ్యసభ స్థానం గురించి ఎలాంటి చర్చలు జరుగలేదు. చదవండి: ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదు : యత్నాళ్ తాము తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదని.. ప్రభుత్వాన్ని కూల్చటం లేదని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల్లో నిజం లేదన్నారు. లాక్డౌన్ ద్వారా హోటల్ బంద్ అయిన కారణంగా ఉమేశ్ కత్తి ఇంట్లో విందుకు వెళ్లామన్నారు. ప్రభుత్వానికి ఢోకా లేదు : మంత్రి బీ.సీ.పాటిల్ నాయకత్వ మార్పు ఎట్టి పరిస్థితిలోను ఉండబోదని.. మరో మూడేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం భద్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి బీసీ.పాటిల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప సమర్థ పాలన అందిస్తున్నారన్నారు. స్నేహితులందరు ఒకచోట కలిస్తే తప్పుగా భావించడం సరికాదన్నారు. -
మేరీకోమ్ బాధ్యతారాహిత్యం!
న్యూఢిల్లీ: ఆమె ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, జాతీయ రెండో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ గ్రహీత కావడంతో పాటు పార్లమెంట్ సభ్యురాలు కూడా. కానీ కరోనాతో దేశం అల్లకల్లోలమవుతున్న వేళ తన బాధ్యత మరచింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనను ఉల్లంఘించింది. ఇదంతా భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ గురించే. జోర్డాన్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో ఆమె పాల్గొంది. ఆ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన భారత బాక్సర్లంతా రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని బాక్సింగ్ సమాఖ్య ముందే చెప్పింది. దీనిని జట్టు సభ్యులంతా కచ్చితంగా పాటించాలని కోచ్ శాంటియాగో నీవా కూడా బాక్సర్లకు ముందే స్పష్టం చేసి దానికి తగినట్లుగా వారు ఇంట్లో చేసుకునేందుకు ఫిట్నెస్ షెడ్యూల్‌ను కూడా సూచించారు. ఈ బాక్సర్లంతా ఈ నెల 13న భారత్‌కు చేరుకున్నారు. కానీ మేరీకోమ్ మాత్రం దీనిని పట్టించుకున్నట్లుగా లేదు. ఈ నెల 18న రాష్ట్రపతి భవన్లో జరిగిన అల్పాహార విందులో ఆమె పాల్గొంది. రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన చిత్రాలలో ఇతర పార్లమెంట్ సభ్యులతో పాటు మేరీకోమ్ కూడా ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తాను పాల్గొన్న విషయాన్ని మేరీకోమ్ కూడా నిర్ధారించింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేసింది. ‘జోర్డాన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. ఒక్క రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి మాత్రమే వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న రాజస్తాన్ సీఎం వసుంధర రాజే తనయుడు, పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ సింగ్‌ను కలవడం గానీ కరచాలనం చేయడం గానీ చేయలేదు. జోర్డాన్ పర్యటన తర్వాత నిర్దేశించిన నా స్వీయ నిర్బంధం ముగిసింది. అయినా సరే రాబోయే 3–4 రోజులు ఇంట్లోనే ఉంటాను’ అని ఆమె స్పష్టం చేసింది. సిమ్రన్‌జిత్ కూడా... పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో సిమ్రన్ మేరీకోమ్ కంటే ముందుగా భారత్‌కే చెందిన మరో మహిళా బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ కూడా స్వీయ నిర్భంధం నిబంధనను ఉల్లంఘించింది. జోర్డాన్‌లోనే జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సిమ్రన్‌జిత్ పాల్గొని 60 కేజీల విభాగంలో ఫైనల్ చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా గుర్తింపు పొందింది. మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులపాటు స్వీయ నిర్భంధంలో ఉండాల్సిన సిమ్రన్‌జిత్ మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను... రాష్ట్ర క్రీడల మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధిని... శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు సిమ్రన్‌జిత్‌కు పంజాబ్ ప్రభుత్వం రూ. 5 లక్షలు... శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున సుఖ్బీర్ సింగ్ బాదల్ రూ. లక్ష నగదు పురస్కారం అందజేశారు. జోర్డాన్‌లోనూ కోవిడ్–19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు జోర్డాన్‌లో 69 కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
మెగా మీట్..
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్స్ మధ్య ఉండే అనుంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రమే కాకుండా.. వీలు దొరికినప్పుడల్లా వీరంతా ఒకచోట చేరి సందడి చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ తారలు లంచ్ మీట్‌తో ఒకచోట చేరారు. ఆదివారం కావడంతో.. సరదాగా గడిపారు. ఈ మీట్‌కు రామ్‌చరణ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్, సుష్మిత, వరుణ్‌తేజ్, నిహారిక, సాయిధరమ్ తేజ్, శ్రీజ పెద్ద కూతురు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సాయిధరమ్ తేజ్, నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విందుకు వైష్ణవ్ తేజ్ హాజరుకాలేదు. దీంతో కళ్యాణ్ దేవ్ ‘మిస్డ్ యూ’ వైష్ణవ్ తేజ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసి మెగా ఫ్యామిలీ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. View this post on Instagram Sunday well spent! 🥰🥰 FAMJAM 🧡 A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 23, 2019 at 4:02am PDT -
సోనియా విందు.. పసందేనా?
రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో శుక్రవారం జరిగిన ప్రతిపక్షాల విందు సమావేశం హఠాత్తుగా తన వ్యూహాన్ని మార్చుకుంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బదులు, పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా తామంతా ఏకమయ్యామనే సందేశం ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదంటూ బంతిని ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. రాష్ట్రపతి అభ్యర్థికి ప్రతిపాదిత పేర్లను తమ ముందుంచితే తమ అభిప్రాయం చెబుతామని, ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థి పేరు తమకు నచ్చకపోతే రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే అభ్యర్థిని తాము నిలబెడతామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యర్థులైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రత్యర్థులైన తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు హాజరుకావడం విశేషం కాగా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ నాయకురాలు మాయావతి, సమాజ్‌వాది పార్టీకి చెందిన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా లాంటి నాయకులు వచ్చారు. తరచు ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాకపోవడం ఒక్కటే కాస్త ప్రతికూలాంశం. అయితే ఆ పార్టీ తరఫున సీనియర్ నాయకుదు శరద్ యాదవ్ హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల వరకు తమ ఐక్యతను నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న ప్రతిపక్ష పార్టీలు చెన్నైలో జూన్ 3న కరుణానిధి 93వ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి కలవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత ఆగస్టులో తాను పట్నాలో ఏర్పాటుచేసే భారీసభకు హాజరు కావాలని లాలు ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. వీరు కేవలం సమావేశాలకే పరిమితమైతే ఆశించిన లక్ష్యం నెరవేరదు. మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వాటిపై క్షేత్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. భావ వ్యక్తీకరణలో దిట్టయిన మోదీని ఎదుర్కోవడం, ఆయనతో పోటీ పడే సమర్థుడిని ఎన్నుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఒకవేళ ఎన్నుకున్నా వాళల వెంట కలసికట్టుగా నడవడంలో ప్రతిపక్షాలు చిత్తశుద్ధితో కలసిరావాలి. అదే జరిగితే 2004లో ప్రతిపక్షాలను యూపీఏ వేదికపైకి తీసుకొచ్చి పదేళ్లపాటు అధికారం సాగించిన చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. లేదంటే ‘వో కహతే ఇందిరా హఠావో, మై కహతీ హు గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరాగాంధీ తిప్పి ప్రతిపక్షాన్ని మట్టి కరిపించిన అనుభవం చవిచూడాల్సి వస్తుంది.