మెగా మీట్‌.. | Mega Family Young Stars Meet For Luch | Sakshi
Sakshi News home page

మెగా మీట్‌..

Published Sun, Jun 23 2019 7:24 PM | Last Updated on Sun, Jun 23 2019 7:38 PM

Mega Family Young Stars Meet For Luch - Sakshi

మెగా ఫ్యామిలీ యంగ్‌ స్టార్స్‌ మధ్య ఉండే అనుంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఫంక్షన్‌లకు మాత్రమే కాకుండా.. వీలు దొరికినప్పుడల్లా వీరంతా ఒకచోట చేరి సందడి చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ తారలు లంచ్ మీట్‌తో ఒకచోట చేరారు. ఆదివారం కావడంతో.. సరదాగా గడిపారు. ఈ మీట్‌కు రామ్‌చరణ్‌, శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌, సుష్మిత, వరుణ్‌తేజ్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, శ్రీజ పెద్ద కూతురు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సాయిధరమ్‌ తేజ్‌, నిహారిక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ విందుకు వైష్ణవ్‌ తేజ్‌ హాజరుకాలేదు. దీంతో కళ్యాణ్‌ దేవ్‌ ‘మిస్డ్‌ యూ’ వైష్ణవ్‌ తేజ్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసి మెగా ఫ్యామిలీ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. 


 

Sunday well spent! 🥰🥰 FAMJAM 🧡

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement