Konidela Niharika
-
వరుణ్ తేజ్ బర్త్‌డే: చెల్లి అలా..వైఫ్ ఇలా.. మెగా పిక్స్ (ఫొటోలు)
-
విడిపోయిన కొణిదెల నిహారిక, చైతన్య దంపతులు
-
భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం
నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టి విషయం తెలిసిందే. నిహారిక, చైతన్యల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ చైతన్యపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు నిహారిక. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లిలో జరిగిన కొన్ని కీలకమైన దృశ్యాలను కట్ చేసి ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. ఇందులో నిహారికను పెళ్లి కూతురిని చేస్తున్నప్పటి నుంచి తాళి కట్టే సందర్భం, పెళ్లి వేడుకలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు, ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ఇక తాళి కడుతున్న సందర్భంలో నిహారిక తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. చదవండి: మాటలు తగ్గించేసింది: నాగబాబు ఎమోషనల్ అలాగే పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో నిహారిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ''డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది'' అని పేర్కొన్నారు చైతన్య. ఇక కాబోయే వాడు అంతా ప్రేమగా ఈ మాటలు చెప్పడంతో అది విన్న నిహారిక పట్టరానంత ఆనందంతో ఏడ్చేశారు. కళ్యాణ తిలకం దిద్దుతున్న చిరంజీవి కూతూరు సుష్మితను హత్తుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి : హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్ యూ.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
మా చిన్నారి నిహారిక- చైతన్యకు శుభాకాంక్షలు
మెగా వారింట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహం వ్యాపారవేత్త జొన్నగడ్డ వెంకట చైతన్యతో జరుగుతున్న విషయం తెలిసిందే. అగష్టు నిశ్చితార్థం జరుపుకున్న నిహారిక-చైతన్యలు రేపు(బుధవారం) రాత్రి 7 గంటలకు ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నాటి చిన్నారి నిహారికను ఆయన ఎత్తుకుని ఉన్న ఫొటోతో పాటు పెళ్లికూతురుగా ముస్తాబైన ఇప్పటి నిహారిక ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆశీర్వదించారు. (చదవండి: నిహారిక సంగీత్ వేడుక.. డ్యాన్స్ ఇరగదీశారు) మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020 కాగా రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో నిహారిక-చైతన్యల వివాహంలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకోసం మెగా కుటుంబం, బంధువులు, టాలీవుడ్ ప్రముఖులు రాజస్థాన్ వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాక ఉదయ్‌పూర్‌లో అడుగు పెట్టిన అనంతరం నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, వారి సింగీత్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింటా సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిహారిక- చైతన్యలకు టాలీవుడ్ నుంచి శుభాకాంక్షలు వెల్లువత్తున్నాయి. (చదవండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిహారిక సంగీత్ వేడుక.. డ్యాన్స్ ఇరగదీశారు
మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. కొణిదెల నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యను మనువాడనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఈ వేడుకకు సందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పవన్ కల్యాణ్ మినహా మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్తాన్ చేరుకున్నారు. ఇక ఈ రోజు పవన్ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ తన స్టైలిష్ లుక్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. చదవండి: నిహారిక పెళ్లి వేడుకల్లో చెర్రీ, బన్నీ.. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్తాన్‌లో సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల, అల్లు వారి ఫ్యామిలీ సభ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా నిహారిక, చైతన్యతో కలిసి మెగాస్టార్ పాటకు డ్యాన్స్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లోని హోటల్లో దిగిన సమయంలో హారిక, చైతూలకి అక్కడి బ్యాండ్ మేళం బృందం ఘన స్వాగతం పలకగా జోష్‌లో నిహరిక తన కాబోయే భర్త చైతన్యతో కలిసి చిందులేశారు. చదవండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం ఫోటోలు
-
నిహారిక పోస్ట్: పెళ్లి గురించేనా?
మెగాడాటర్ నిహారిక కొణిదెల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నిహారిక పెళ్లి వార్తలపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆమె చేసిన పోస్ట్‌లో.. ఓ కాఫీ కప్‌పై ‘మిస్ నిహారిక’ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత మిస్ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్ అని రాసి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్‌ను కూడా జత చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. (నిహారిక, యశ్‌ల డ్యాన్స్ చూశారా?) పెళ్లి గురించి నిహారిక హింట్ ఇచ్చింది అని నెటిజన్లు పేర్కొంటుండగా మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్‌కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం స్పందిస్తూ.. వై అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని ఇప్పటికే నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే నిహారిక పోస్టుపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు') View this post on Instagram Uh.. what? A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 17, 2020 at 6:45am PDT -
'ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు'
మెగా కాంపౌండ్ నుంచి వారసులుగా వచ్చి తమ టాలెంట్‌ని నిరూపించుకొని స్టార్స్‌గా మారారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నిహారికకు హీరోయిన్గా సరైన సక్సెస్ ఇప్పటి వరకు లభించలేదు. ముద్దపప్పు ఆవకాయ వెబ్‌సిరీస్‌తో మొదలైన నిహారిక ప్రయాణం ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాల వరకు కొనసాగింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.( పిల్లలను చూసి నేర్చుకోండి: నటుడు) కాగా నిహారిక సినిమాల కన్నా ఆమె పెళ్లి వార్తలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. నిహారిక వివాహంపై ఇప్పటికే చాలా రూమర్లు వచ్చాయి. ఆమె పెళ్లి నాగశౌర్యతో జరగనుందని ఒకసారి, తన బావ సాయిధరమ్ తేజ్‌తో జరగనుందంటూ మరోసారి గాసిప్స్ పుట్టాయి. అయితే వీటన్నింటిని నిహారిక ఎప్పటికప్పుడు ఖండించారు. తాజాగా ప్రభాస్‌తో మీ పెళ్లి అనే వార్తలు వింటున్నాం అని ఓ నెటిజన్ .. నిహారికని అడిగాడు. నిహారిక అందుకు స్పందిస్తూ.. 'ప్రభాస్‌తో నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవం. నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం లేదు. నా కుటుంబసభ్యులు చూపించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా' అని స్పష్టం చేశారు. నిహారిక తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చేసిన బ్రష్ ఛాలెంజ్ వీడియో వైరల్‌గా మారింది. -
మెగా మీట్..
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్స్ మధ్య ఉండే అనుంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రమే కాకుండా.. వీలు దొరికినప్పుడల్లా వీరంతా ఒకచోట చేరి సందడి చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ తారలు లంచ్ మీట్‌తో ఒకచోట చేరారు. ఆదివారం కావడంతో.. సరదాగా గడిపారు. ఈ మీట్‌కు రామ్‌చరణ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్, సుష్మిత, వరుణ్‌తేజ్, నిహారిక, సాయిధరమ్ తేజ్, శ్రీజ పెద్ద కూతురు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సాయిధరమ్ తేజ్, నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విందుకు వైష్ణవ్ తేజ్ హాజరుకాలేదు. దీంతో కళ్యాణ్ దేవ్ ‘మిస్డ్ యూ’ వైష్ణవ్ తేజ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసి మెగా ఫ్యామిలీ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. View this post on Instagram Sunday well spent! 🥰🥰 FAMJAM 🧡 A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 23, 2019 at 4:02am PDT -
వేసవిలో వెడ్డింగ్
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పెళ్లి కుదిరిన రోజు నుంచి జరిగే వరకూ ఉన్న టైమ్‌లో రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని లక్ష్మణ్ చక్కగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం జరిగి ఉంటుంది. ఆయా పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది. సుమంత్ అశ్విన్, నిహారిక చక్కగా నటించారు. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ మా సినిమాకి పాటలు అందించారు. త్వరలోనే టీజర్‌ని రిలీజ్ చేస్తాం. ఈ సమ్మర్‌కి చక్కని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. నరేశ్, మురళీ శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
ఒక మంచి రోజు చూసి చెబుతా!
తమిళసినిమా: ఒక మంచి రోజు చూసి చెబుతానంటోంది నటి నిహారిక. ఈ పేరు వినగానే ఎలాంటి సినీ కుటుంబం నుంచి వచ్చిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఎస్.మెగాస్టార్ చిరంజీవి కుంటుంబం నుంచి రంగప్రవేశం చేసిన నటి నిహారిక. చిరంజీవి సోదరుడు, నిర్మాత, నటుడు నాగబాబు కూతురు ఈ వర్ధమాన నటి నిహారిక కొణెదల. ఇప్పటికే తెలుగులో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. తను కథానాయకిగా నటిస్తున్న చిత్రం ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఒక మంచి రోజు చూసి చెబుతా). వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి, ఇటీవలే సక్సెస్ ట్రాక్‌లో పడ్డ గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7సీస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అమ్మీ నారాయణ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ముగకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించడం గురించి నటి నిహారిక తెలుపుతూ కోలీవుడ్‌లో తొలి చిత్రమే ఇంత భారీ చిత్రంగా రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ లాంటి నిరాడంబరమైన నటులతో కలిసి నటించడం మంచి అనుభవం అని చెప్పింది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రంలో తనది రెగ్యులర్ కథా పాత్రగా ఉండదని అంది. ఇందులో తనకు రెండు పేర్లు ఉంటాయని, అలా ఎందుకన్నది చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని చెప్పింది. నటిగా తనకు తన కుటుంబం ఆదరణ, ప్రోత్సాహం ఎంతన్న మాటల్లో చెప్పలేనని, ఇంత మంచి కుటుంబంలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని నిహారిక పేర్కొంది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రం కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని నిహారిక కొణెదల వ్యక్తం చేసింది. -
కోలీవుడ్‌కు మెగాబ్రదర్స్ వారసురాలు
టాలీవుడ్లో మెగాబ్రదర్స్గా పేరు మోసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి కోలీవుడ్‌కు కథాయకిగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి పెద్ద సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక. అందం, ఆకర్షణీయం, అంతకుంటే చక్కని వాచకం కలిగిన హారిక తొలుత బుల్లితెరపై తన ప్రతిభను నిరూపించుకుని, ఆ తరువాత వెండితెరపై కథానాయకిగా ఒక మనసు అనే తెలుగు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచి ఫీల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, నిహారికకు మాత్రం నటిగా మంచి ప్రశంసలు లభించాయి. ఆ ఒక్క చిత్రంతోనే ఈ బ్యూటీ కోలీవుడ్‌ను ఆకర్షించారు. ఏకంగా సక్సెస్ఫుల్ కథానాయకుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వరించింది. ఇందులో మరో హీరోగా యువ నటుడు గౌతమ్‌కార్తీక్ నటిస్తున్నారు. నవ దర్శకుడు ఆర్ముగకుమార్ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నిహారికను ఎంపక చేయడం గురించి ఆయన తెలుపుతూ తమ చిత్రంలో నూతన నటి అయితే బాగుంటుందని భావించామన్నారు. ఆ సమయంలో నిహారిక ఒక మిత్రుడి ద్వారా పరిచయం అయ్యారని తెలిపారు. కథ వినిపించగానే చాలా ఇంప్రైసె నటించడానికి సమ్మతించారని చెప్పారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని, నిహారిక అందంలోనే కాదు అభినయంలోనూ చక్కని ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇందులో తనది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిపారు. అంత మెగా కుటుంబం నుంచి వచ్చినా చాలా సింపుల్‌గా ఉంటారని, ఒక మంచి నటిని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నిహారికకు మంచి భవిష్యత్ ఉందని దర్శకుడు అన్నారు.