
మెగా వారింట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహం వ్యాపారవేత్త జొన్నగడ్డ వెంకట చైతన్యతో జరుగుతున్న విషయం తెలిసిందే. అగష్టు నిశ్చితార్థం జరుపుకున్న నిహారిక-చైతన్యలు రేపు(బుధవారం) రాత్రి 7 గంటలకు ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నాటి చిన్నారి నిహారికను ఆయన ఎత్తుకుని ఉన్న ఫొటోతో పాటు పెళ్లికూతురుగా ముస్తాబైన ఇప్పటి నిహారిక ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆశీర్వదించారు. (చదవండి: నిహారిక సంగీత్ వేడుక.. డ్యాన్స్ ఇరగదీశారు)
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020
కాగా రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో నిహారిక-చైతన్యల వివాహంలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకోసం మెగా కుటుంబం, బంధువులు, టాలీవుడ్ ప్రముఖులు రాజస్థాన్ వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాక ఉదయ్‌పూర్‌లో అడుగు పెట్టిన అనంతరం నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, వారి సింగీత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింటా సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిహారిక- చైతన్యలకు టాలీవుడ్ నుంచి శుభాకాంక్షలు వెల్లువత్తున్నాయి. (చదవండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment