![Kannada Actress Jayamala Daughter Marriage In Bangalore](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/mala.jpg.webp?itok=PMwI5TYT)
కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్‌గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్‌మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్‌గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.
తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్, కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
![k](https://www.sakshi.com/s3fs-public/inline-images/kgd.jpg)
చిరంజీవితో జయమాల..
కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.
![ja](https://www.sakshi.com/s3fs-public/inline-images/yas.jpg)
కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది. అనేక తెలుగు చిత్రాల్లో విలన్‌గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్‌గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించింది జయమాల.
Comments
Please login to add a commentAdd a comment