కోలీవుడ్‌కు మెగాబ్రదర్స్‌ వారసురాలు | niharika entry into kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు మెగాబ్రదర్స్‌ వారసురాలు

Published Sat, Feb 18 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

కోలీవుడ్‌కు మెగాబ్రదర్స్‌ వారసురాలు

కోలీవుడ్‌కు మెగాబ్రదర్స్‌ వారసురాలు

టాలీవుడ్‌లో మెగాబ్రదర్స్‌గా పేరు మోసిన మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుంచి  కోలీవుడ్‌కు కథాయకిగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి పెద్ద సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక. అందం, ఆకర్షణీయం, అంతకుంటే చక్కని వాచకం కలిగిన హారిక తొలుత బుల్లితెరపై తన ప్రతిభను నిరూపించుకుని, ఆ తరువాత వెండితెరపై కథానాయకిగా ఒక మనసు అనే తెలుగు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచి ఫీల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, నిహారికకు మాత్రం నటిగా మంచి ప్రశంసలు లభించాయి.

ఆ ఒక్క చిత్రంతోనే ఈ బ్యూటీ కోలీవుడ్‌ను ఆకర్షించారు. ఏకంగా సక్సెస్‌ఫుల్‌ కథానాయకుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వరించింది. ఇందులో మరో హీరోగా యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌ నటిస్తున్నారు. నవ దర్శకుడు ఆర్ముగకుమార్‌ మెగాఫోన్   పట్టిన ఈ చిత్రంలో నిహారికను ఎంపక చేయడం గురించి ఆయన తెలుపుతూ తమ చిత్రంలో నూతన నటి అయితే బాగుంటుందని భావించామన్నారు. ఆ సమయంలో నిహారిక ఒక మిత్రుడి ద్వారా పరిచయం అయ్యారని తెలిపారు.

కథ వినిపించగానే చాలా ఇంప్రైసె నటించడానికి సమ్మతించారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైందని, నిహారిక అందంలోనే కాదు అభినయంలోనూ చక్కని ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇందులో తనది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిపారు. అంత మెగా కుటుంబం నుంచి వచ్చినా చాలా సింపుల్‌గా ఉంటారని, ఒక మంచి నటిని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నిహారికకు మంచి భవిష్యత్‌ ఉందని దర్శకుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement