Gautham Karthik
-
హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్‌ల మల్టీస్టారర్.. పోస్టర్ రిలీజ్
నటుడు ఆర్య, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. దీనికి మిస్టర్ ఎక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు విష్ణు విశాల్ హీరోగా ఎఫ్ఐఆర్ అనే సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన మణు ఆనంద్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మిస్టర్ ఎక్స్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఏస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మెన్ కుటుంబానికి ఆర్థికసాయం చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి దీపు నినన్ థామస్ సంగీతాన్ని, తన్వీర్ మిర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఉగాండా, సెర్పియా రాష్ట్రా ల్లో చిత్రీకించనున్నట్లు చెప్పారు. ఇందు లో కథ, కథనాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయన్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటు ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు తెలిపారు. చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు! -
హీరో గౌతమ్ కార్తీక్ ‘ఆగస్ట్ 16, 1947’.. రిలీజ్ డేట్ వచ్చేసింది
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఒక పల్లెటూరిలో జరిగిన కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ ‘ఆగస్ట్ 16, 1947’. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎన్.ఎస్. పాన్కుమార్ దర్శకత్వంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్ భాషల్లో ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘ప్రేక్షకులను ఈ సినిమా స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లోకి తీసుకెళ్తుంది. మంచి అనుభూతినిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహనిర్మాత: ఆదిత్య జోషి. -
డైరెక్టర్ మణిరత్నంకు థ్యాంక్స్ చెప్పిన యంగ్ హీరో
తమిళ సినిమా: గౌతమ్ కార్తీక్ ఇటీవలే నటి మంజిమా మోహన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. తాజాగా నటుడిగా మరో మైలురాయిని కూడా టచ్ చేశారు. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడిగా 2012లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. అలా నటుడిగా 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ తాజాగా నటిస్తున్న క్రిమినల్ చిత్ర షూటింగ్లో యూనిట్ వర్గాలు కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తనపై నమ్మకంతో మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకుడు మణిరత్నంకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఈ సినీ ప్రయాణం ఉత్సాహంగానూ, ఉన్నతంగానూ, భయంగానూ, చాలెంజ్ గానూ, అద్భుతంగానూ, కొత్త విషయాలను నేర్చుకునే విధంగా ఉందన్నారు. నటుడిగా విజయాలు, అపజయాలు ఇచ్చిన అనుభవంతో ఇకపై మంచి చిత్రాలతో అలస్తారని గౌతమ్ కార్తీక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన 1947, పత్తుతల, క్రిమినల్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. -
నేరస్తుడిగా యువ హీరో గౌతమ్ కార్తీక్.. కొత్త సినిమా ప్రారంభం
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి క్రిమినల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. పార్సా పిక్చర్స్ మీనాక్షి సుందరం, బిగ్ ఫ్రింట్ పిక్చర్స్ కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షణామూర్తి రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ సీఎస్.సంగీతాన్ని, ప్రసన్న ఎస్.కుమార్ చాయాగ్రహణను అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మధురైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను నిర్మాతలలో ఒకరైన మీనాక్షీసుందరం వెల్లడించారు. చిత్ర షూటింగును మధురైలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది మధురై నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ నేరస్తుడిగా, శరత్‌కుమార్ పోలీస్ అధికారిగా విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు దక్షిణామూర్తి రామ్‌కుమార్ కథ చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపింందన్నారు. కథ, కథనం ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను 40 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్‌పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్‌పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
ఒక్కటైన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన అభినందనలు
కోలీవుడ్ ప్రేమ జంట మంజిమా మోహన్- గౌతమ్ కార్తిక్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇవాళ వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల అనుమతితోనే పెళ్లి చేసుకుంది ఈ జంట. చెన్నైలోని ఓ హోటల్లో వైభవంగా జరిగిన పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు, సన్నిహితుల హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు యువ జంటను ఆశీర్వదించారు. వెడ్డింగ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫోటోను వధువు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త జంటకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. (చదవండి: హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్) దేవరట్టం అనే తమిళ సినిమాతో మంజిమా మోహన్ - గౌతమ్ కార్తీక్ కలిసి పనిచేశారు. అదే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తనే మొదట మంజిమాకు ప్రపోజ్ చేశానని ఇటీవలే గౌతమ్ వెల్లడించారు. దాదాపు మూడేళ్లుగా ప్రేమగా మునిగితేలిన ఈ జంట ఇవాళ ఒక్కటైంది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో మంజిమ, ‘కడలి’తో గౌతమ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) -
హీరోయిన్‌తో ప్రేమ.. బయటపెట్టిన స్టార్ హీరో కొడుకు
కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తాము రిలేషన్లో ఉన్నామంటూ ఇటీవలె ఈ జంట అధికారికంగా ప్రకటించింది కూడా. మరో నాలుగు రోజుల్లో(నవంబర్ 28)న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తమ ప్రేమకథను రివీల్ చేశారు ఈ క్యూట్ కపుల్. చెన్నై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. తాను ప్రపోజ్ చేస్తే మంజిమా వెంటనే ఒప్పుకోలేదని కానీ ఆ తర్వాత అంగీకరించిందని తెలిపాడు. 'మా ప్రేమకథ అంత గొప్పదేం కాదు. జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు మనం మంచి మనిషిగా ఎదుగుతాం అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అలా నా జీవితానికి సరైన వ్యక్తి మంజిమా. తను అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన వ్యక్తి. నేనెప్పుడైనా నిరాశకు గురైనా తను నా వెంటే ఉండేది. ఇక దేవరట్టం సినిమా షూటింగ్ సమయంలోనే మేం స్నేహితులుగా మారాం. ఆ తర్వాత ఏడాదికి తనతో రిలేషన్ కొనసాగించాలనిపించింది. వెంటనే ఆమెకు ప్రపోజ్ చేశా. కానీ మంజిమా రెండు రోజులు సమయం తీసుకున్న తర్వాత నా ప్రేమకు అంగీకారం చెప్పింది. అలా కుటుంబసభ్యుల అంగీకారంతో నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పేర్కొన్నారు. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం గౌతమ్ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. -
హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్
కోలీవుడ్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్. నటుడు శింబుకు జంటగా అచ్చం యంబదు మడమయడా చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట చాలా కాలంగానే ప్రేమించుకుంటున్నా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం మీడియాకు పొక్కడంతో అవును తాము ప్రేమలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సంచలన జంటకు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. ఈ నెల 28వ తేదీ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. చదవండి: హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మంజిమా మోహన్! అందుకోసం చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ ముస్తాబవుతోందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నటి మంజిమా మోహన్ తన ఇన్‌స్ట్ర్రాగామ్ లోని ఫొటోలన్నీ డిలీట్ చేశారు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించారు. గత జ్ఞాపకాలను తొలగించేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నానని, కాబట్టి తన పాత జ్ఞాపకాలను చూసుకుని బాధపడకూడదనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు తీసివేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిల పరచుకోవడానికి చోటు అవసరం కావడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాళీ చేసినట్లు మంజిమా మోహన్ పేర్కొన్నారు. కాగా గౌతమ్ కార్తీక్‌తో ఉన్న ఫొటోలను మాత్రమే తన ఇన్‌స్టాలో ఉంచారు. View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో-హీరోయిన్! ముహుర్తం కూడా ఫిక్స్?
‘కడల్’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్ కార్తీక్, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తాము రిలేషన్లో ఉన్నామంటూ ఇటీవల ఈ జంట అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు పెళ్లెప్పుడు అంటూ వారి పోస్ట్స్‌పై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు! ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ జంట పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకొబోతున్నట్టు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి అనంతరం భారీగా విందును ఇవ్వనున్నట్టు సమాచారం. పస్నేహితులు, సన్నిహితుల కోసం ఊటీ, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు జరుగుతున్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమా హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు గతంలో తమిళ మీడియాలో కథనాలువ చ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత అక్టోబర్ 31న కార్తీక్‌తో ప్రేమలో మంజిమా వెల్లడించగా.. నవంబర్ 5న తామిద్దరి ఫొటోలను షేర్ చేసి ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశాడు గౌతమ్ కార్తీక్. కాగా గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ తనయడు అనే విషయం తెలిసిందే. ❤️♾️🧿 pic.twitter.com/RlAlpLO2oS — Gautham Karthik (@Gautham_Karthik) October 31, 2022 -
Gautham Karthik-Manjima Mohan: అవును మేము ప్రేమలో ఉన్నాం!
చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలా తాజాగా కోలీవుడ్, మాలీవుడ్‌కు చెందిన మరో జంట ప్రేమలో పడ్డారు. ఆ జంటలో హీరో గౌతమ్ కార్తీక్. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు ఈయన. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన గౌతమ్ కార్తీక్ ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇకపోతే నటి మంజిమా మోహన్ గురించి చెప్పాలంటే మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా పరిచయం అయిన ముగ్గురు హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అచ్చం యన్బదు మడమయడ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ అమ్మడిని కోలీవుడ్‌కు దిగుమతి చేశారు. ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలా గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ కలిసి దేవరాట్టం చిత్రంలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ఆ వార్తలపై నటుడు గౌతమ్ కార్తీక్ గానీ, నటి మంజిమా మోహన్ స్పందించలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు కార్తీక్ తమ ప్రేమ గురించి బ్లో అప్ అయ్యారు. అవును మేము ప్రేమించుకున్నాం అని ఇన్ స్ట్రాగామ్ లో మంజిమామోహన్ కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. అయితే పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నది వెల్లడించలేదు. -
హీరోతో ప్రేమ విషయం బయటపెట్టేసిన హీరోయిన్, ఫొటోలు వైరల్
కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ మధ్య కుచ్కుచ్ హోతాహై అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఈ వార్తలపై స్పందించిన మంజిమా.. అతడి ప్రేమను అంగీకరించలేదని తెలిపింది. ఒకవేళ నిజంగా లవ్‌లో పడితే కచ్చితంగా అందరికీ చెప్తానంది. అయితే ఇన్నాళ్లకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందీ ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా వేదికగా కార్తీక్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 'మూడేళ్ల క్రితం నా జీవితంలో అడుగు పెట్టావు. లైఫ్‌ను ఎలా చూడాలో నేర్పించావు. దిక్కుతోచని పరిస్థితులెదురైన ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చావు. నాలా నేను ఉండాలని నేర్పించావు. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు, అందుకే నీతో లవ్‌లో పడిపోయాను. నువ్వు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే' అని రాసుకొచ్చింది. అటు గౌతమ్ కూడా తమ స్నేహం గాఢమైన ప్రేమగా మారినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం గౌతమ్ కోలీవుడ్‌లో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమా మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. ఆ మధ్య ఎఫ్ఐఆర్ సినిమాతోనూ ఆకట్టుకుంది. గౌతమ్, మంజిమ ఇద్దరూ దేవరత్తమ్ సినిమాలో కలిసి నటించారు. View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే! కాంతారలో ఏముందని ఎగబడుతున్నారు -
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్, కార్లిటీ ఇచ్చిన యంగ్ హీరో
కోలీవుడ్‌లో నవరస నాయకుడు ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కార్తీక్. ఈయన వారసుడే గౌతమ్ కార్తీక్. తనూ హీరోగా మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఇటీవల ఈయన ప్రేమ వ్యవహారంపై వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. నటి మంజిమా మోహన్‌తో ప్రేమ అంటూ త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం జోరందుకుంది. గౌతమ్ కార్తీక్ నటి మంజిమా మోహన్ దేవరాట్టం చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరూ చట్టపటాలు వేసుకుని షికారు చేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ విషయంపై ఇటు గౌతం కార్తీక్ గాని, అటు మంజిమా మోహన్ గాని స్పందించడంలేదు. చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక ఇలాంటి పరిస్థితుల్లో నటుడు గౌతమ్ కార్తీక్ ఒక భేటీలో తన వివాహం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాదిలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి గానీ, నటి మంజమా మోహన్ ప్రస్తావని గాని ఈయన ఎక్కడ తీసుకురాలేదు. తాను నటుడుగా సాధించాలని ఈ రంగంలోకి వచ్చానని, అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇకపై కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు అన్నది చెప్పకపోవడంతో ఆ వధువు ఎవరు చెప్పు నవరస నాయకుడి వారసుడా.. అంటూ నెట్టింట్లో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా.. -
క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా.. త్వరలో షూటింగ్
చెన్నై సినిమా: కోలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్, యువ నటుడు గౌతమ్ కార్తీక్ (హీరో కార్తీక్ కుమారుడు) కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. బిగ్‌ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐబీ. కార్తికేయన్ త్రిపుర క్రియేషన్స్, తరాస్ సినీ కార్పొ సంస్థలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షిణామూర్తి రామర్ దర్శకత్వం వహించనున్నారు. మదురై నేపథ్యంలో సాగే క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. నటుడు శరత్‌కుమార్ ఇంతకు ముందు పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారని, అయితే వాటికి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపిస్తారని చెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. శరత్‌కుమార్, గౌతమ్ కార్తీక్ వంటి అంకిత భావంతో పని చేసే నటులతో కలిసి పన చేయడంతో తన కల నెరవేరినట్లు భావిస్తున్నానన్నారు. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి అరవింద్ సింగ్ చాయాగ్రహణ, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? -
ఆ హీరో ప్రేమను నేను యాక్సెప్ట్ చేయలేదు: హీరోయిన్
తమిళ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ లవ్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ఈ వార్తలకు చెక్ పెట్టింది హీరోయిన్. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ ప్రేమను అంగీకరించలేదని వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం తనకు లేదని పేర్కొంది. నిజంగా ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తానంది. అంతేతప్ప ప్రేమ, పెళ్లిలాంటి పెద్దపెద్ద విషయాలను సీక్రెట్‌గా ఉంచనని చెప్పుకొచ్చింది. చదవండి: 'నా మాజీ భర్తకు స్పాలో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం' మొదట్లో.. గౌతమ్‌తో పెళ్లి అంటూ వచ్చి వార్తలు చూసి షాకయ్యానన్న మంజిమ దీనిపై తన పేరెంట్స్ ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని, కానీ వారు దీన్ని తేలికగా తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పింది. కాగా అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు తమిళంలో హీరోగా బిజీగా ఉన్నాడు. మంజిమ మోహన్ విషయానికి వస్తే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల ఎఫ్ఐఆర్ సినిమాతోనూ ఆకట్టుకుంది. గౌతమ్, మంజిమ దేవరత్తమ్ సినిమాలో కలిసి నటించారు. చదవండి: Allu Arjun: టీమ్ మెంబర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బన్నీ -
హీరోయిన్‌తో నటుడి పెళ్లి? వాలెంటైన్స్‌డే రోజు ప్రకటన?
తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఈ యంగ్ యాక్టర్ కుర్ర హీరోయిన్ మంజిమా మోహన్‌తో లవ్‌లో ఉన్నాడట. వీళ్లిద్దరూ తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో దేవరత్తమ్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటినుంచి వాళ్లిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజు వారి ప్రేమను అఫీషియల్‌గా వెల్లడించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇదిలా ఉంటే అలనాటి హీరో నవరస నయగన్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ప్రస్తుతం అతడు యుత సతం, పాటు తల సినిమాలు చేస్తున్నాడు. మంజిమ మోహన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్ఐఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, రైజా విల్సన్, రెబా మోనికా తదితరులు నటించారు. -
37 రోజులు...13 కిలోలు
చెప్పినంత ఈజీ కాదు సాధించడం. కానీ యాక్టర్ శింబు సాధించాడు. 37 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గుతానని సవాల్ చేశాడు. అన్నట్లుగానే తగ్గాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా సురేశ్ నిర్మాణంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం లండన్‌లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు శింబు. అలాగే లుక్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి సరైన డైట్‌తో కూడిన వర్కౌట్‌తో బరువు తగ్గాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు ఓ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాడు శింబు. ఇందులో గౌతమ్ కార్తీక్ మరో హీరో. -
దేవరాట్టం కాపాడుతుంది
దేవరాట్టం చిత్రం తనను కాపాడుతుందనే నమ్మకాన్ని ఆ చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ వ్యక్తం చేశారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ చిత్రం దేవరాట్టం. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ జంటగా నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ దర్శకుడు ముత్తయ్యతో తాను నిర్మించిన రెండవ చిత్రం దేవరాట్టం అని చెప్పారు. ఆయన చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారన్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రాన్ని ఏకధాటిగా పని చేసి పూర్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. చిత్ర నిర్మాణాన్ని కూడా అంతా ఆయనే చూసుకున్నారన్నారు. ఇది మదురై నేపధ్యంలో సాగే కథ, ఈ కథకు గౌతమ్‌కార్తీక్, మంజిమా మోహన్‌లు సరిపోతారా? అన్న భయం తనకు కలిగిందన్నారు. ఈ చిత్రం అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు. చిత్ర కథానాయకుడు గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనను కాపాడుతుందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం రావడానికి ముఖ్య కారణం నిర్మాత జ్ఞానవేల్‌రాజా అని తెలిపారు. దర్శకుడు ముత్తయ్య తనకు మదురై ప్రజల భాషను వారి ప్రవర్తనను, జీవన విధానాన్ని నేర్పించారని చెప్పారు. నటి మంజిమా మోహన్ చాలా సపోర్టు చేశారని చెప్పారు. అనంతరం దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ ఇది జాతి గురించి చర్చించే కథా చిత్రం అనే అపోహ పడుతున్నారనీ, నిజానికి దేవరాట్టం అనేది ఒక కళ అని తెలిపారు. -
గేమ్ ఆడండి..బహుమతి పట్టండి
తమిళసినిమా: మీ మొబైల్లో గేమ్ ఆడండి. బహుమతి పట్టండి అయితే అందుకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటున్నారు మిస్టర్ చంద్రమౌళి చిత్ర యూనిట్. నటుడు కార్తీక్ ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం మిస్టర్ చంద్రమౌళి. నటి రెజీనా హీరోయిన్గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రను పోషించారు. సతీష్, దర్శకుడు మహేంద్రన్, అగస్థ్యిన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. బోఫ్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ధనుంజయన్, క్రియేటివ్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించారు. చిత్రం జూలై 6న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మొబైల్ గేమ్‌ను ప్రవేశ పెట్టారు. ఆ గేమ్‌ను సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేమ్ వివరాలను నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ ఇది మూవీ క్విజ్ తరహా మొబైల్ యాప్ గేమ్ అని తెలిపారు. ఈ గేమ్‌లో రోజూ మిస్టర్ చంద్రమౌళి చిత్రానికి సంబంధించిన 10 ప్రశ్నలు ఉంటాయన్నారు. ఈ గేమ్‌ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని రెండు నిమిషాల్లో ఆ 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి వివో మొబైల్, వాచ్, టీషర్ట్, సినిమా టిక్కెట్స్‌లో ఏదో ఒకటి బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఈ గేమ్ మంగళవారం నుంచి మొదలవుతుందని చెప్పారు. సమాధానాలు చెప్పిన వారు తమ వాట్సాప్ మొబైల్‌ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేయాలని చెప్పారు. ఎక్కువ మంది కరెక్ట్ సమాధానాలు చెబితే డ్రా విధానంలో రోజూ ఒకరికి బహుమతులను అందిస్తామన్నారు. ఈ గేమ్‌ను జూలై 6 వరకూ ఆడి బహుమతులను గెలుసుకోవచ్చునని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో నటుడు గౌతమ్‌కార్తీక్, నటి రెజీనా, వరలక్ష్మీ, సతీష్, దర్శకుడు తిరు చిత్ర వర్గాలు పాల్గొన్నాయి. -
వన్ మోర్ మూవీ
మలయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముత్తయ్య దర్శకత్వంలో గౌతమ్ కార్తీక్ హీరోగా రూపొందనున్న తమిళ చిత్రం ‘దేవరదమ్’లో మంజిమా కథానాయికగా నటించనున్నారు. ‘‘ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయినందుకు హ్యాపీ. ఇక షూటింగ్ స్టార్ట్ కావడం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు మంజిమా. గతేడాది రెండు తమిళ సినిమాల్లో నటించిన ఈమె ఈ ఏడాది నటించనున్న ఫస్ట్ తమిళ చిత్రం ఇదే. సో.. మంజిమా కెరీర్లో వన్మోర్ తమిళ మూవీ క్రెడిట్ అయ్యిందన్నమాట. ప్రస్తుతం హిందీ హిట్ ‘క్వీన్’ మలయాళ రీమేక్ ‘జామ్ జామ్’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
గౌతమ్‌తో జోడీ కుదిరింది
తమిళసినిమా: తొలుత కాస్త తడబడ్డా రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాలతో సక్సెస్ రూట్లో పడ్డ యువ నటుడు గౌతమ్‌కార్తీక్. ఇటీవల హరహర మహాదేవకి, ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు లాంటి అడల్ట్ చిత్రాల్లో నటించి విమర్శలను ఎదుర్కొన్నా, ఆ చిత్రాల వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్ తన తండ్రి కార్తీక్‌తో కలిసి నటించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా దేవరాట్టం అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కొంబన్, మరుదు వంటి చిత్రాల ఫేమ్ ముత్తయ్య తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఈ దేవరాట్టం. చిత్ర హీరో, సాంకేతిక వర్గం వివరాలను వెల్లడించిన చిత్ర వార్గలు హీరోయిన్ ఎవరన్న ఇప్పుడే వెల్లడించారు. ఆమె ఎవరో కాదు నటి మంజిమామోహన్. మాలీవుడ్‌లో బాలతారగా పరిచయమై పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మాతృభాషలోనే హీరోయిన్‌గానూ పరిచయమై ఆ తరువాత కోలీవుడ్‌కు సంచలన నటుడు శింబు సరసన అచ్చం ఎన్బ్దు మడమయడా చిత్రంతో దిగుమతైంది. ఆ తరువాత క్షత్రియన్, ఇప్పడై వెల్లుమ్ చిత్రాల్లో నటించింది. అయితే తొలి చిత్రం ఓకే అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో నటి మంజిమామోహన్‌కు కోలీవుడ్‌లో చిన్న బ్రేక్ వచ్చింది. తాజాగా గౌతమ్ కార్తీక్‌తో జత కట్టే అవకాశం వరించింది. గ్రామీణ కథా చిత్రాల దర్శకుడి ఇమేజ్ను తె చ్చుకున్న దర్శకుడు ముత్తయ్య ఈ దేవరాట్టం చిత్రాన్ని అదే కోవలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో మంజిమామోహన్‌ను గ్రామీణ యువతిగా చూడబోతున్నామన్నమాట. చూద్దాం ఈ చిత్రం అయినా ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇస్తుందేమో! -
మిస్టర్ చంద్రమౌళికి డేట్ ఫిక్స్
తమిళసినిమా: కోలీవుడ్‌లో తండ్రీ కొడుకులు కలిసి హీరోలుగా నటించడం అన్నది అరుదైన విషయమే. అలా అరుదైన తండ్రీ కొడుకులుగా సీనియర్ నటుడు కార్తీక్, గౌతమ్ కార్తీక్ నమోదవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. చిత్రంలోనూ వీరిద్దరూ తండ్రికొడుకులుగా నటించడం విశేషం. నటి రెజీనా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో ధనుంజయన్ నిర్మించారు. కీలక పాత్రలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్, ముఖ్యపాత్రల్లో సతీష్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, రిచర్డ్, ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.యూ /ఏ. సర్టిఫికెట్తో జూలై 6న తెరపైకి రావడానికి మిస్టర్ చంద్రమౌళి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు వివరాలను తెలుపుతూ చిత్రం ప్రారంభం నుంచి పాజిటివ్‌గానే జరుగుతూ వచ్చిందన్నారు. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తాము అందించిన ఎంటర్టెయిన్మెంట్, ఎమోషనల్ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉందన్నారు. వారి సమయాన్ని వృథా చేయదన్న గ్యారెంటీ ఇస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గౌతమ్ కార్తీక్, రెజీనాల రొమాన్స్ సన్నివేశాలు యువతను గిలిగింతలు పెట్టిస్తాయని అన్నారు. చిత్రం కలర్‌ఫుల్‌గానూ, అదే సమయంలో చాలా భావోద్రేక సన్నివేశాలతోనూ జనరంజకంగా ఉంటుం దని తెలిపారు. నటుడు గౌతమ్‌కార్తీక్, రెజీనా, సతీష్, వరలక్ష్మి వంటి వారు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారన్నారు. అలాంటి వారితో ఈ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి వారందించిన సహకారమే కారణం అని పేర్కొన్నారు. చిత్రాన్ని జూలై 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తిరు చెప్పారు. -
అడల్ట్ చిత్రాలు మరిన్ని రావాలి
తమిళసినిమా: అడల్ట్ చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పులేదు అని పేర్కొన్నారు వర్ధమాన దర్శకుడు సంతోష్ పి.జయకుమార్. ఈయన హరహర మహాదేవకీ అనే అడల్ట్ డార్క్ కామెడీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని బ్లూఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజానే తాజాగా ఇదే దర్శక, కథానాయకుడితో రూపొందించిన చిత్రం ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు. ఇదీ అడల్ట్ కామెడీ కథా చిత్రమే. ఇందులో గౌతమ్ కార్తీక్‌కు జంటగా యాషీక ఆనంద్, వైభవి శాండిల్య, చంద్రిక రవి ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరులతో బుధవారం ముచ్చటించారు. చిత్రం గురించి దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు చాలా మంది చాలా బ్యానర్లలో చిత్రాలు చేశారని, అడల్ట్ బ్యానర్లో ఎందుకు చిత్రం చేయకూడదన్న ఆలోచనతో తెరకెక్కించిన చిత్రమే ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు అని చెప్పారు. ఇంతకు ముందు 30 శాతం అడల్ట్ సన్నివేశాలున్న చిత్రాలు వచ్చాయని, ఇది 100 శాతం అడల్ట్ కథా చిత్రం అని చెప్పారు. అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని చూడడానికి రావద్దు అని చెబుతున్నామని పేర్కొన్నారు. ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్రాన్ని ముగ్గురు మహిళా సభ్యురాళ్లు, ఇద్దరు మగ సభ్యులు చూశారని చెప్పారు. చిత్రం చూసిన తరువాత ఎలాంటి సర్టిఫికెట్ కావాలని సెన్సార్ సభ్యులు అడిగారని, ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదని తాము అన్నామని చెప్పారు. చిత్రంలో పలాన సన్నివేశాలున్నాయిగా వాటిని తొలగిస్తామని అంటే తాము ఓకే చెప్పామన్నారు. ఇంతకు ముందు ఇలాంటి అడల్ట్ కథాంశంలో హరహర మహాదేవకీ చిత్రం చేశారు. మళ్లీ అదే బ్యానర్లో ఇరుట్టు అరైయిల్ మురట్టుకుత్తు తెరకెక్కించారు. మీపై ఈ తరహా ఇమేజ్ ముద్ర పడే అవకాశం ఉంటుందన్న భయం లేదా? అన్న ప్రశ్నకు అలాంటి భయం లేదన్నారు. ఎందుకంటే తన తదుపరి చిత్రం గజనీకాంత్ మంచి ఎంటర్టెయిన్మెంట్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. తమిళ సినిమాలో అడల్ట్ చిత్రాలకు మీరు మార్గం చూపారని భావించవచ్చా? అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే అలాంటి చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పు లేదని అన్నారు. మనం కొన్ని విషయాలను గుట్టుగా ఉంచడం వల్లే సమాజంలో అత్యాచారాల్లాంటి సంఘటనలు జరగుతున్నాయని దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ దర్శకుడు సంతోస్ పి.జయకుమార్ ఈ చిత్ర కథను జస్టిఫై చేస్తారన్న నమ్మకంతోనే తాను నటించడానికి సమ్మతించానన్నారు. హర హర మహాదేవకీ చిత్రాన్ని చూసిన తన తండ్రి కార్తీక్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది అని చాలా ఎంజాయ్ చేశారని తెలిపారు. ఈ చిత్రాన్ని చూడడానికి ఆసక్తిగా ఉన్నారని అన్నారు. అయితే ఇలాంటి చిత్రాలు తాను మళ్లీ ఇప్పుట్లో చేయనని చెప్పారు. తదుపరి మంచి ప్రేమ కథా చిత్రం, మంచి యాక్షన్ చిత్రం చేయాలనుకుంటున్నానని అన్నారు. -
రెచ్చిపోయిన రెజీనా
తమిళసినిమా: నటి రెజీనా అందాలారబోతలో రెచ్చిపోయి నటిస్తోంది. ఈ బ్యూటీకిప్పుడు కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాల్లేవు. టాలీవుడ్‌లోనూ క్రేజ్ తగ్గింది. అలాంటిది ఒక క్రేజీ ఆఫర్ రెజీనాను వరించింది. దాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉందట. అసలు విషయానికి వస్తే యువ నటుడు గౌతమ్ కార్తీక్, ఆయన తండ్రి కార్తీక్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం మిస్టర్ చంద్రమౌళి. దీనికి తిరు దర్శకుడు. నాన్ శిగప్పు మనిదన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో రెజీనా నాయకిగా నటిస్తోంది. కోలీవుడ్ సమ్మెకు కొద్ది రోజుల ముందే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఈ చిత్రంలో పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ చుట్టొచ్చింది. అక్కడ గౌతమ్‌కార్తీక్, రెజీనాలతో చిత్రీకరించిన పాట దృశ్యాల ఫొటోలను చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఆ ఫొటోలను చూస్తే నటి రెజీనా గ్లామర్ విషయంలో విజృంభించిందని తెలుస్తోంది. ఆ పాటలో గౌతమ్ కార్తీక్, రెజీనాల సన్నిహిత దృశ్యాలు యూత్‌ను గిలిగింతలు పెట్టిస్తాయని మిస్టర్ చంద్రమౌళి చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకూ అంత గ్లామరస్‌గా కోలీవుడ్ చిత్రాల్లో నటించలేదట. మరి ఈ చిత్రం నటి రెజీనా ఆశలు తీరుస్తుందా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇందులో మరో ముఖ్య పాత్రను నటి వరలక్ష్మీశరత్‌కుమార్ పోషిస్తున్నారన్నది గమనార్హం. -
‘థాంక్స్ రెజీనా.. ఫర్ ది కోఆపరేషన్’
సాక్షి, చెన్నై: సినిమాకు కోఆపరేషన్, ఆపరేషన్ రెండూ జరుగుతుంటాయి. కోఆపరేషన్ చేస్తే ప్రశంసలు, ఆపరేషన్ అయితే ఫిర్యాదులు, కేసులు ఉంటాయి. ఇందులో హీరోయిన్ రెజీనా మొదటి కోవకు చెంది ప్రశంసలను అందుకుంది. అయితే అదేమిటో చూద్దాం. హీరోయిన్ రెజీనా కోలీవుడ్‌లో అడపాదడపానే మెరుస్తోంది. ఎక్కువగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తుందని అపవాదు కోలీవుడ్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం రెజీనా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు కర్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కర్తీక్ కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్టు ప్రణాళిక వేగంగా జరుపుకుని గురువారంతో పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ధనుంజయన్ తెలిపారు. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కేక్‌పై ‘థాంక్స్ రెజీ ఫర్ ది కోఆపరేషన్’ ఒన్ మోర్ డే ప్లీజ్ అంటూ పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. వృతిపై భక్తి కలిగిన నటి రెజీనా అని పేర్కొన్నారు. అంకితభావంలోనూ, నటనలనూ తనకు సాటి తనేనని పొగిడారు. ఈ చిత్రానికి ఆమె సహకారం చాలా ఉందని నిర్మాత చెప్పారు. -
రామ్‌చరణ్ లాంటి నటుడు నటిస్తే..
తమిళసినిమా: ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ చిత్ర కన్టెంట్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, అందుకే ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేమాలన్న ఆలోచన ఉందని ఆ చిత్రం దర్శక, నిర్మాత ఆరుముగకుమార్ తెలిపారు. 7సీ.ఎంటర్‌టైయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అమ్మె నారాయణ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, గౌతమ్‌కార్తీక్, నటి గాయత్రి, నిహారిక హీరోహీరోయిన్లుగా నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఆరుముగకుమార్ చిత్రం గురించి తెలుపుతూ ఒరు నల్లనాళ్ పాత్తు పొల్రేన్ గురించి మీడియాల్లో రకరకాల ప్రచారం జరుగుతోందన్నారు. ఇది బ్లాక్ కామెడీ చిత్రం అని, డార్క్ కామెడీ చిత్రం అని, ట్రైబల్ నేపధ్యంలో సాగే కథా చిత్రం అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. అయితే ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ చిత్రం మంచి వినోదభరిత కథా చిత్రం అని తెలిపారు. ఒక దొంగల ముఠా ఇతివృత్తంగా చిత్రం ఉంటుందని చెప్పారు. విజయ్సేతుపతిది అతిథి పాత్ర కాదు ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి గెస్ట్ రోల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోందని, చిత్ర కథంతా విజయ్‌సేతుపతి చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. అందులో ఇక భాగంగా నటుడు గౌతమ్‌కార్తీక్ పాత్ర వస్తుందని చెప్పారు. ఈ చిత్ర కథ నిహారికతో మొదలవుతుందని, నటి గాయత్రి కథను ముగిస్తుందని తెలిపారు. తెలుగులో రీమేక్ చేయాలనుంది ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే కన్టెంట్ ఉందని, అందువల్ల తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. ఇందులో రామ్‌చరణ్ లాంటి నటుడు నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని దర్శక,నిర్మాత ఆరుముగకుమార్ వ్యక్తం చేశారు. -
మలేషియా స్టార్ నైట్‌లో ఆడియో రిలీజ్
సినీరంగంలో వారసులుగా అమ్మాయిలు రావటం చాలా అరుదు. గతంలో కృష్ణ వారసురాలిగా మంజుల వెండితెరకు పరిచయం అయ్యే ప్రయత్నం చేసినా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావటంతో విరమించుకున్నారు. మెగా డాటర్ నిహారిక విషయంలోనే ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఫ్యామిలీ సపోర్ట్ తో నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి ఒక్క మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం తన రెండో సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రేం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఆడియోను మలేషియాలో నడిగర్ సంఘం నిర్వహిస్తున్న స్టార్ నైట్ లో రిలీజ్ చేయనున్నారు. -
ఒక మంచి రోజు చూసి చెబుతా!
ఏం చెబుతారు? తమిళ ప్రేక్షకులకు మంచి కథ! అంతే కదా... మంచి కథ కావడం వల్లే తమిళంలో సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పారీ తెలుగమ్మాయ్! ‘ఒక మనసు’ సిన్మాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నిహారిక తమిళ తెరకు పరిచయమవుతున్న సినిమా ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’. ఒక మంచి రోజు చూసి చెబుతా... తమిళ టైటిల్‌కి తెలుగు మీనింగ్! ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలు. విజయ్ సేతుపతికి జోడీగా నిహారిక నటిస్తున్నారట. ప్రేక్షకులకు సినిమా చూపించే మంచి రోజుని ఎప్పుడు నిర్ణయించారో గానీ... అంతకంటే ముందు అందులో ప్రేక్షకులకు నిహారిక ఎలా కనిపించేదీ చూపించేశారు చిత్రబృందం. ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్లరేన్’లో సౌమ్య అలియాస్ అభయలక్ష్మీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని సమాచారమ్! ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి, విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు ఆలోచిస్తున్నారట!! -
ఒక మంచి రోజు చూసి చెబుతా!
తమిళసినిమా: ఒక మంచి రోజు చూసి చెబుతానంటోంది నటి నిహారిక. ఈ పేరు వినగానే ఎలాంటి సినీ కుటుంబం నుంచి వచ్చిందన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఎస్.మెగాస్టార్ చిరంజీవి కుంటుంబం నుంచి రంగప్రవేశం చేసిన నటి నిహారిక. చిరంజీవి సోదరుడు, నిర్మాత, నటుడు నాగబాబు కూతురు ఈ వర్ధమాన నటి నిహారిక కొణెదల. ఇప్పటికే తెలుగులో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. తను కథానాయకిగా నటిస్తున్న చిత్రం ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఒక మంచి రోజు చూసి చెబుతా). వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి, ఇటీవలే సక్సెస్ ట్రాక్‌లో పడ్డ గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7సీస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అమ్మీ నారాయణ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ముగకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించడం గురించి నటి నిహారిక తెలుపుతూ కోలీవుడ్‌లో తొలి చిత్రమే ఇంత భారీ చిత్రంగా రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ లాంటి నిరాడంబరమైన నటులతో కలిసి నటించడం మంచి అనుభవం అని చెప్పింది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రంలో తనది రెగ్యులర్ కథా పాత్రగా ఉండదని అంది. ఇందులో తనకు రెండు పేర్లు ఉంటాయని, అలా ఎందుకన్నది చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని చెప్పింది. నటిగా తనకు తన కుటుంబం ఆదరణ, ప్రోత్సాహం ఎంతన్న మాటల్లో చెప్పలేనని, ఇంత మంచి కుటుంబంలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని నిహారిక పేర్కొంది. ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రం కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని నిహారిక కొణెదల వ్యక్తం చేసింది. -
ఇట్స్ ఏ వైన్ సాంగ్!
రెండు చుక్కలు నోట్లో పడితే... రెండో మనిషి బయటకొస్తాడు. మత్తులో ఏవేవో చేస్తారు. కొందరు మాంచి హుషారున్న పాటేసుకుంటారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... మత్తులోంచి వచ్చే పాటలు మస్తుగా మజా స్టెప్పులేయిస్తాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు గౌతమ్ కార్తీక్. మణిరత్నం ‘కడలి’తో కథానాయకుడిగా పరిచయమైన ఈ హీరో, ప్రస్తుతం తమిళంలో ‘ఇరతు అరయిల్ మురతు కుతువు’ అనే సినిమా చేస్తున్నారు. అందులో ‘నెక్ట్స్ నువ్వే’ (తెలుగు సినిమా) ఫేమ్ వైభవీ శాండల్య హీరోయిన్. ఈ సినిమా కోసం ఇప్పుడో మత్తుపాటను... అదేనండీ ‘వైన్ సాంగ్’ను షూట్ చేస్తున్నారు. హీరో వైన్ షాపులో రెండు చుక్కలు వేసిన తర్వాత ఈ పాట మొదలవుతుందట. అతను ఏ బాధలో ఉన్నాడో మరి! ‘‘బాబా భాస్కర్ మాస్టర్ వైన్ సాంగ్‌కి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్బ్‌గా వస్తోందీ సాంగ్. నెక్ట్స్ షెడ్యూల్ కోసం థాయ్‌లాండ్ వెళతాం’’ అన్నారు చిత్రదర్శకుడు సంతోష్ పి. జయకుమార్. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... కలప్రభు దర్శకత్వంలో గౌతమ్ కార్తీక్ హీరోగా ‘ఇంద్రసేన’ సినిమా చేస్తున్నారు. అందులోని టు మినిట్స్ బైక్ అండ్ జీప్ రేస్ కోసం 10 రోజుల పాటు రిహార్సల్ చేసి సూపర్‌గా నటించారట! ఆయన కమిట్మెంట్ చూసి, టీమ్‌ను షాక్‌కు గురి చేశారట గౌతమ్ కార్తీక్. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేస్తారట!! -
అలా చూపిస్తే నటించను
తమిళసినిమా: నన్ను సభ్యతగా చూపించని పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం సమ్మతించను అని అంటోంది నటి నిక్కీగల్రాణి. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరని చెప్పవచ్చు. నిక్కీగల్రాణి తాజాగా నటించిన చిత్రం హరహర మహాదేవకి. గౌతమ్కార్తీక్కు జంటగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ పి.జయకుమార్ దర్శకుడు. ఇది అడల్ట్ చిత్రం అని 18 ఏళ్ల కంటే చిన్న వయసు వాళ్లు చూడకూడదంటూ సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. హరహర మహాదేవకి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇందులో హీరోహీరోయిన్లు గౌతమ్‌కార్తిక్, నిక్కీగల్రాణి ప్రేమించుకుని ఆ తరువాత బ్రేకప్ అవుతారని, ఆ తరువాత జరిగే సంఘటనలే చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. హరహర మహాదేవకి అనే ఒక గెస్ట్‌హౌస్‌లో చిత్ర కథ జరగడంతో అదే పేరును చిత్రానికి నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇందులో తన పాత్ర గురించి నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనను అసభ్యంగా చూపిస్తే అలాంటి చిత్రాల్లో నటించనని పేర్కొంది. ఇకపోతే హరహర మహాదేవకి చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేవని స్పష్టం చేసింది. నలుగురు స్నేహితులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారో అదే హరహర మహాదేవకి చిత్రం అని గౌతమ్‌కార్తీక్ పేర్కొన్నారు. కచ్చితంగా స్నేహితులు మాట్లాడుకునే విషయాలు కుటుంబసభ్యులతో మాట్లాడరని అన్నారు. అయినా ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అని ఆయన అన్నారు. -
వాళ్లను ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి
చెన్నై: ఈ తరం నటీనటులు కొత్తదనం కోసం ఆరాట పడుతున్నారనిపిస్తోంది. చాలా ఏళ్ల క్రితం నడిగర్ తిలగం శివాజీగణేశన్ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించారు. ఆ తరువాత విశ్వనటుడు కమల్‌హాసన్ దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించి ఆ రికార్డును బద్దలు కొట్టారు. తాజాగా వారి బాటలో నటుడు విజయ్ సేతుపతి పయనించడానికి సాహసిస్తున్నారు. ఆయన 8 గెటప్‌లలో నటిస్తున్న చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. వరుస విజయాలను అందుకుంటున్న విజయ్ సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రాలలో ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్లు ఒకటి. ఇందులో ఆయనతోపాటు యువ నటుడు గౌతమ్ కార్తీక్ నటిస్తున్నారు. నాయకిగా టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక నటిస్తున్నారు. నవ దర్శకుడు ఆర్ముగ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రైబల్ నాయకుడిగా నటిస్తున్నారట. ఆయన నగరానికి రావడంతో జరిగే సంఘటనలే చిత్ర కథ. అయితే చిత్రం రెండవ భాగం అంతా అడవుల్లోనే జరుగుతుందని, షూటింగ్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు. -
నాన్నకు ఆమే సరైన జోడీ
నాన్న కార్తీక్‌కు నటి నగ్మా సరైన జోడీ అని ఆయన కొడుకు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్నారు. కడల్ చిత్రం ద్వారా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పరిచయం చేసిన నటుడు గౌతమ్ కార్తీక్. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా గౌతమ్ కార్తీక్ నటించిన రంగూన్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఇవన్ తందిరన్ చిత్రంలో నటిస్తున్నారు శ్రద్ధా కథానాయకి. కండేన్ కాదలై చిత్రం ఫేమ్ ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంకే.రామ్ ప్రసాద్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రెండురోజుల క్రితం చెన్నైలో జరిగింది. నటుడు గౌతమ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన తరుణంలో విలేకరులతో మాట్లాడాలని భావించానన్నారు. అందుకు ఇది సరైన తరుణం అనిపించిందన్నారు. తాను నటించిన రంగూన్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడటం సంతోషంగా ఉందన్నారు. సిపాయ్, ఇవన్ తందిరన్, హరహర మహాదేవకీ చిత్రాలను పూర్తి చేశానని, ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నల్ల నాళ్ పార్తు సొల్రేన్ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. నాన్న కార్తీక్ నటించిన చిత్రాల్లో అగ్నినక్షత్రం మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ఆ చిత్రం రీమేక్‌లో నటించనని అన్నారు. తనకు నటనపై ఆసక్తి కలిగించిన చిత్రం కడల్ అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైతే నిసత్తు కలిగి ఉంటానో అప్పుడు తనను ఉత్సాహపరిచేది అమ్మేనన్నారు. అమ్మంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. ఇకపోతే తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందన్నారు. అయితే 35–40 వయసులోనే పెళ్లి చేసుకోవాలన్నది తన భావన అని పేర్కొన్నారు. తన తండ్రి, తాత చిత్రాలను తప్పకుండా చూస్తున్నానని చెప్పారు. నటుడిగా నాన్న లెజెండ్ అని పేర్కొన్నారు. షూటింగ్ స్పాట్లో ఆయన గురించి చెబుతున్నప్పుడు తనకు అర్థమైందని అన్నారు. కథానాయికల్లో ఆయనకు సరైన జోడీ నగ్మా, రేవతి అని అన్నారు.ఇకపై నటనలో మరింత శ్రద్ధ చూపుతానని గౌతమ్‌కార్తీక్ చెప్పారు. -
ఆ హీరోలకు నో చాన్స్ !
ఆ హీరోలకు నో కాల్షీట్స్ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రారంభ దశలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ఫొటో ఆల్బమ్‌లు పట్టుకుని దర్శక నిర్మాతల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నటీమణులు లేకపోలేదు. అలాగే వర్థ్ధమాన హీరోలతో నటించి ఎదిగిన వారిని చూశాం. అలా ఒకటి రెండు విజయాలు వరించగానే ఆది కాలాన్ని మరచిపోవడం, స్టార్ హీరోలతో నటించే అవకాశం రాగానే చిన్న హీరోల సరసన నటించడానికి సుముఖత చూపని హీరోయిన్లను చూస్తున్నాం. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఇందుకు అతీతం కాదని నిరూపించుకుంటోంది. ఈ జాణ తొలిరోజుల్లో కోలీవుడ్‌లో ఆర్య తమ్ముడు సత్య, గౌతమ్‌కార్తీక్ లాంటి నవ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం, అమ్మడిని కోలీవుడ్ పట్టించుకోకపోవడంతో టాలీవుడ్‌కు జంప్ చేసింది. అక్కడ ఆదిలో వర్థమాన హీరోలతోనే జత కట్టింది. లక్కీగా ఆ చిత్రాలు సక్సెస్ అవడంతో స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటివారితో నటించే అవకాశాలు వరించాయి. దీంతో ఆటోమేటిక్‌గా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఎర్ర తివాజీ పరుస్తున్నారు. ఆ మధ్య విశాల్ సరసన నటించే అవకాశం వచ్చినా జార విడుచుకున్న ఈ భామకు తాజాగా కార్తీతో రొమాన్స్ చే సే అవకాశం వరించింది. అంతే కాదు తదుపరి కార్తీ సోదరుడు, స్టార్ హీరో సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడంతో ఇకపై ఇలాంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయం కూడా తీసేసుకుందట. ఇందుకు ప్రధాన కారణం పెద్ద హీరోల సరసన నటిస్తే పారితోషికం ఆ స్థాయిలోనే ముడుతుండడమే. ఇంకేముంది ఇక చిన్న హీరోలకు నో కాల్షీట్స్ అంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అలాంటి చిత్రాలను నిరాకరిస్తోందంటున్నారు సినీ వర్గాలు. -
నిక్కీ పాలసీ తెలుసా?
చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్న లక్కీ నాయకి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్ర విజయం జోరును పెంచింది. లారెన్స్ తో రొమాన్స్ చేసిన మొట్టశివ కెట్టశివ సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అమ్మడు మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం విక్రమ్ ప్రభుతో నెరుప్పుడా, గౌతమ్ కార్తీక్‌కు జంటగా హరహర మహేదేవకీ చిత్రాలతో పాటు మరగద నాణయం, కీ, పక్కా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు మలయాళంలో టీమ్–5 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తోందట. కారణం ఇందులో వివాదాస్పద క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు జంటగా నటించిందట. దీంతో టీమ్–5 చిత్రం కోసం మలయాళ చిత్ర పరిశ్రమే ఆసక్తిగా ఎదురు చూస్తోందని, తానూ ఈ చిత్రంతో మాలీవుడ్‌లో బలంగా చొచ్చుకుపోతాననే నమ్మకం ఉందని నిక్కీగల్రాణి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మడి పాలసీ ఏమిటో తెలుసా? తక్కువ పారితోషికం దారాళంగా అందాలారబోయడం. అందుకే అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అలాగే మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది నిక్కీ. ఇకపోతే ఈ బ్యూటీ శునక ప్రేమికురాలట. నటి త్రిష తరువాత అంతగా కుక్కల్ని పెంచుకుంటున్న నటి నిక్కీగల్రాణినేనట. షూటింగ్ లేని సమయాల్లో ఈ భామకు కాలక్షేపం తన పెట్టీ డాగ్సేనట. -
కోలీవుడ్‌కు మెగాబ్రదర్స్ వారసురాలు
టాలీవుడ్లో మెగాబ్రదర్స్గా పేరు మోసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి కోలీవుడ్‌కు కథాయకిగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి పెద్ద సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక. అందం, ఆకర్షణీయం, అంతకుంటే చక్కని వాచకం కలిగిన హారిక తొలుత బుల్లితెరపై తన ప్రతిభను నిరూపించుకుని, ఆ తరువాత వెండితెరపై కథానాయకిగా ఒక మనసు అనే తెలుగు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచి ఫీల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, నిహారికకు మాత్రం నటిగా మంచి ప్రశంసలు లభించాయి. ఆ ఒక్క చిత్రంతోనే ఈ బ్యూటీ కోలీవుడ్‌ను ఆకర్షించారు. ఏకంగా సక్సెస్ఫుల్ కథానాయకుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వరించింది. ఇందులో మరో హీరోగా యువ నటుడు గౌతమ్‌కార్తీక్ నటిస్తున్నారు. నవ దర్శకుడు ఆర్ముగకుమార్ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నిహారికను ఎంపక చేయడం గురించి ఆయన తెలుపుతూ తమ చిత్రంలో నూతన నటి అయితే బాగుంటుందని భావించామన్నారు. ఆ సమయంలో నిహారిక ఒక మిత్రుడి ద్వారా పరిచయం అయ్యారని తెలిపారు. కథ వినిపించగానే చాలా ఇంప్రైసె నటించడానికి సమ్మతించారని చెప్పారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని, నిహారిక అందంలోనే కాదు అభినయంలోనూ చక్కని ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇందులో తనది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిపారు. అంత మెగా కుటుంబం నుంచి వచ్చినా చాలా సింపుల్‌గా ఉంటారని, ఒక మంచి నటిని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నిహారికకు మంచి భవిష్యత్ ఉందని దర్శకుడు అన్నారు. -
గౌతమ్‌కార్తీక్‌తో నిక్కీ రెడీ
యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టడానికి నటి నిక్కీగల్రాణి రెడీ అవుతున్నారు. ఈ డార్లింగ్ నాయకి నటించి తెరపైకి వచ్చిన చివరి చిత్రం వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్. అయితే లారెన్సతో నటిస్తున్న మొట్టశివ కెట్టశివ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఒక చిత్రం అంటూ నిక్కీగల్రాణి బిజీగా ఉన్నారు. తాజాగా గౌతమ్కార్తీక్కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తంగం సినిమాస్ పతాకంపై ఎం.తంగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి హరహర మహాదేవకి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో ఇతర పాత్రల్లో సతీశ్, మొటై రాజేంద్రన్, రవిమరియ, నమో నారాయణన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రానికి పాల్-మురళిబాలు ద్వయం సంగీతాన్ని, సెల్వకుమార్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 23 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్ర విడుదల హక్కుల్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా పొందడం విశేషం. ప్రస్తుతం ఈయన సూర్య హీరోగా సీ-3(ఎస్-3) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సీ-3 చిత్ర టీజర్‌ను డిసెంబర్ 16న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.అదే విధంగా సూర్య కథానాయకుడిగా విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానాసేర్న్‌ద కూటం చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. -
గౌతమ్ కార్తీక్‌తో శ్రద్ధాశ్రీకాంత్ రొమాన్స్
కథానాయికలకు పుట్టినిల్లుగా మారిన కేరళ రాష్ట్రం నుంచి మరో నాయకి కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. ఆమె పేరు శ్రద్ధాశ్రీకాంత్. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే యూటర్న్ చిత్రంలో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ మాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్‌లో యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోంది. కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ వారసుడన్న విషయం తెలిసిందే. మణిరత్నం చిత్రం కడల్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్ కార్తీక్‌కు ఆ చిత్రం చాలా నిరాశ పరచిందన్నది తెలిసిందే. ఆ తరువాత నటించిన ఎన్నమో ఏదో చిత్రం ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న గౌతమ్‌కార్తీక్ తాజాగా ఆర్.కన్నన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఆయనకు జంటగా శ్రద్ధాశ్రీకాంత్ను నాయకిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ఇవన్ తందిరన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు వెల్లడించారు. అభిరా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆషాశ్రీ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ఆర్.కన్నన్ తెలుపుతూ ఇది ప్రేమ, యాక్షన్ అంశాలు కలిపిన జనరంజక కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో హీరో, హీరోయన్లతో పాటు వర్షం ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకే ఇంతకు ముందే ప్రారంభించాల్సిన షూటింగ్‌ను వర్షం సీజన్ కోసం అక్టోబర్, నవంబర్‌లో షూటింగ్ నిర్వహించాలని ఎనిమిది నెలలు వేచి ఉన్నామన్నారు. ఈ నెల 12న చెన్నైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. హీరోగా గౌతమ్ కార్తీక్‌ను అనుకున్న తరువాత హీరోయిన్ కోసం చాలా మందిని పరిశీలించామన్నారు. వారిలో ఒక్కరూ సెట్ కాకపోవడంతో మలయాళ చిత్రం యూటర్న్ నాయకి శ్రద్ధాశ్రీకాంత్ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. -
నేనూ ఎంజాయ్ చేస్తున్నా
తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగి, మోడలింగ్‌లో అడుగిడి, నటిగా రాణిస్తున్న నటి ప్రియాఆనంద్. వామనన్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అరిమా తంబి, ఇరుంబు కుదిరై, వైరాజావై చిత్రాలతో వేగంగా ఎదుగుతూ వచ్చిన ప్రియాఆనంద్ అనూహ్యంగా వెనుక పడింది. చాలా గ్యాప్ తరువాత ముత్తురామలింగం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మతో చిన్న భేటీ.. ప్ర: మధ్యలో మిమ్మల్ని కోలీవుడ్ దూరం పెట్టినట్లుందే? జ:నేనలా భావించడం లేదు. నిజం చెప్పాలంటే హీరోయిన్ హీరోను ప్రేమిస్తూ తన చుట్టూ చెట్లు, గుట్టలు తిరుగుతూ పాటలు పాడే పాత్రలు చేసి బోర్ కొట్టింది. చెబితే నమ్మరు గానీ అలాంటి పలు అవకాశాలను నేను నిరాకరించాను. అయినా ఇప్పుడు నేను నటిగా బిజీగానే ఉన్నాను. ఎస్రా అనే చిత్రం ద్వారా తొలి సారిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను.అందులో పృథ్వీరాజ్‌కు జంటగా నటిస్తున్నాను.అదే విధంగా రాజకుమారా అనే కన్నడ చిత్రంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన నటిస్తున్నాను.తమిళంలో ముత్తురామలింగం చిత్రం చేస్తున్నాను. నేను ఇంటి ముఖం చూసి 45 రోజులైంది. ప్ర: ముత్తురామలింగం చిత్రంలో మీ పాత్ర గురించి? జ: ఇందులో తొలిసారిగా గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. నన్ను అందరూ అమెరికా రిటర్న్ అమ్మాయిగానే చూస్తున్నారు. నిజానికి నాలో ఉన్నది గ్రామీణ యువతినే. ఇప్పటికీ సొంత ఊరికి వెళితే స్వర్గానికి వచ్చినట్లు ఫీల్ అవుతాను.నేను ఇష్టపడే పాత్ర ఇన్నాళ్లకు లభించింది. ప్ర:నటుడు గౌతమ్‌కార్తీక్ కోసమే ముత్తురామలింగం చిత్రాన్ని అంగీకరించారనే ప్రచారం గురించి మీ స్పందన? జ: నిజం అదికాదు. ఇంకా చెప్పాలంటే ఆయన తండ్రి కార్తీక్ కోసం ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను. ఇందులో ఆయన ఒక ముఖ్య పాత్రలో నటించాల్సిఉంది. నేను చిన్నతనం నుంచి నటుడు కార్తీక్, శ్రీదేవిల వీరాభిమానిని. శ్రీదేవితో కలిసి నటించాను. ఇక కార్తీక్‌తో నటిస్తే నా ఆశ నేరవేరుతుందని ముత్తురామలింగం చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అయితే కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో కార్తీక్ నటించలేకపోయారు. ప్ర:సరే గౌతమ్‌కార్తీక్‌తో ప్రేమ అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఏమంటారు? జ: మొదట్లో నాపై ప్రేమ వదంతులు ప్రసారం అయిన ప్పుడు చాలా బాధ కలిగేది. ఇలా రాస్తున్నారేమిటని చింతించేదాన్ని. సినిమాకు వచ్చి ఏడేళ్లు దాటింది. అందరిలా నేనూ అలాంటి వార్తలను ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాను. -
యువహీరో కోసం పాట పాడిన కమల్!
నటన, రచన, దర్శకత్వం, గానం, నిర్మాణం.. ఇలా సినిమా పరిశ్రమలోని 24 శాఖలపై మంచి పట్టు సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్. గాయకునిగా ఇప్పటివరకూ కమల్ తాను నటించిన చిత్రాలకు చాలా పాటలు పాడారు. తొలిసారి వేరే హీరోకి ఆయన తన గాత్రం అందించారు. రాజ్‌దురై దర్శకత్వంలో తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ (‘కడలి’ ఫేమ్) హీరోగా ‘ముత్తురామలింగం’ అనే చిత్రం రూపొందుతోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో పరిచ య గీతానికి ఓ గంభీరమైన గొంతు కావాలనుకున్నారు ఇళయరాజా. వెంటనే కమల్‌ను సంప్రతించారు. ఇప్పటికే ఇళయరాజా సంగీతంలో పలు చిత్రాలకు పాటలు పాడిన కమల్ ఆయన మీద గౌరవంతో వెంటనే ఒప్పుకున్నారు. కమల్ పాడగా ఈ పాటను ఇటీవల రికార్డ్ చేశారు. -
ఆ వార్తల్లో నిజం లేదు
చెన్నై: నటి ప్రియాఆనంద్‌ను తాను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు గౌతం కార్తిక్ తెలిపారు. గౌతం కార్తిక్, ప్రియాఆనంద్ ప్రేమించుకుంటున్నట్లు కోలీవుడ్ సమాచారం. దీని గురించి గౌతం కార్తిక్ మాట్లాడుతూ ప్రియా ఆనంద్ తనకు స్నేహితురాలు మాత్రమే, అయితే తాము ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయన్నాడు. 'సిపాయి' చిత్రంలో తనతో నటిస్తున్న లక్ష్మీమీనన్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వదంతులు వ్యాపించాయని, గతంలో 'కడల్' చిత్రంలో నటిస్తుండగా తులసిని ప్రేమిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయన్నాడు. అయితే ఆ గాలి వార్తలన్నిటినీ తాను స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నానని, తదుపరి రిలీజ్ కానున్న చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయని. అందువల్ల ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తున్నట్లు గౌతం కార్తిక్ తెలిపాడు. -
గౌతమ్ కార్తీక్‌తో సనా
యువ నటుడు గౌతమ్ కార్తీక్‌తో రొమాన్స్ చేస్తోంది వర్ధమాననటి సనా మక్బూల్. టాలీవుడ్లో దిక్కులు చూడకు రామయ్య చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రంగూన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవు తున్న సనా మక్బూల్ మాట్లాడుతూ రంగూన్ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న చిత్రం అని చెప్పింది. దర్శకుడు రాజ్‌కుమార్ కథను చాలా ఆసక్తికరంగా తయారు చేశారని తెలిపింది. చిత్రంలో మంచి పాజిటివ్ సందేశం ఉంటుందని పేర్కొంది. చిత్ర షూటింగ్ చెన్నైలో ఇటీవలే ప్రారంభ మైందని తెలిపింది. నటన విషయంలో తికమక పడరాదని ముందు నుంచే తమిళ భాష నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే భాషను అర్థం చేసుకుంటూ చక్కని అభినయాన్ని పలికిస్తున్నట్లు తెలిపింది. తాను విధిని నమ్ముతానని తమిళంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటానని అంటోంది. ఇప్పటికే మరికొన్ని తమిళ చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సనా వెల్లడించింది. -
అలా చేయడం ఆనందమే
మా ఆయన్ని డెరైక్ట్ చేసినప్పుడు చాలా ఆనందం కలిగిందంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్య. ఈమె తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘3’. ధనుష్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అంతగా విజయం సాధించకపోయినా ఆ చిత్రంలో సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కట్టిన వై దిస్ కొలెవైరి డీ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ఐశ్వర్య ధనుష్ మలి ప్రయత్నం వై రాజా వై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగాను ప్రియా ఆనంద్ హీరోయిన్‌గాను నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వినోద భరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ మాట్లాడుతూ తాను తొలి చిత్రం దర్శకత్వం వహించినప్పుడు అధిక శ్రద్ధ చూపించలేదన్నారు. దీంతో తదుపరి చిత్రానికి కొత్త ప్రయోగం చేయాలని భావించానన్నారు. తాను, తన భర్త చిత్రాల పనిలో బిజీగా ఉండడంవలన ఇంటిలో మాట్లాడుకోవడానికి చాలా తక్కువ సమయమే ఉంటుందన్నారు. అయినా నా చిత్ర కథ ధనుష్‌కు తెలుసని తెలిపారు. ధనుష్ తన కంటే సీనియర్ అని అంతేకాకుండా తనకు మార్గదర్శకుడు కూడా అని అన్నారు. తనకాయన చాలా సాయం చేస్తారని వై రాజా వై చిత్రంలో కూడా అతిథి పాత్రలో నటించారని ఆయన్ని దర్శకత్వం వహించడం చాలా ఆనందం కలిగించిందని ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. -
భార్య దర్శకత్వంలో మరోసారి
నటుడు ధనుష్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో మరోసారి నటించనున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ పెద్దకుమార్తె, ధనుష్ భార్య అయిన ఐశ్వర్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తన భర్త హీరోగా ‘3’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటి శ్రుతిహాసన్ హీరోయిన్గా తొలి తమిళ చిత్రం ఇదే. అనిరుధ్ సంగీ తాన్ని అందించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించక పోయినా అందులోని వై దిస్ కొల్లవెరి డీ పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కొంచెం గ్యాప్ తర్వాత ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వై రాజా వై’. యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. చిత్ర కథను మలుపు తిప్పే ముఖ్య భూమికను నటుడు ధనుష్ పోషించనున్నారన్నది తాజా వార్త. ఈ క్యామియో పాత్ర పోషించాలని ఐశ్వర్య తన భర్త ధనుష్‌ను కోరగా అందుకాయన ఓకే చెప్పారట. ఈ పాత్ర చిత్రీకరణ త్వరలో నిర్వహించనున్నట్లు తెలిసింది. -
రంగూన్‌కు సిద్ధం
ప్రస్తుత యువ నటుల్లో అధిక చిత్రాలు చేతిలో ఉన్న హీరో గౌతమ్ కార్తీక్. విశేషం ఏమిటంటే ఈయన నటించిన తొలి, మలి చిత్రాలు కడల్, ఎన్నమో ఎదో రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయినా గౌతమ్ కార్తీక్ పై ఆ ప్రభావం ఇసుమంత కూడా లేకుండా ఆయన్ని వెతుక్కుంటూ అవకాశాలు రావడం గమనార్హం. ప్రస్తుతం గౌతమ్ కార్తీక్ నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రంగూన్ అనే వైవిధ్య భరిత కథా చిత్రంలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించనున్నారు. ఆయన శిష్యుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఈయన ఎ.ఆర్.మురుగసామి వద్ద 7ఆమ్ అరివు, తుపాకి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజ్‌కుమార్, పెరియసామి చెప్పిన కథకు అంగీకరించినట్లు నటుడు గౌతమ్ కార్తీక్ తెలిపారు. దర్శకుడు మాత్రం ఈ చిత్రం వివరాలు చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉందంటూనే ఇదొక కల్పిత కథతో తెరకెక్కించనున్న చిత్రం అని తెలిపారు. 25 ఏళ్ల ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ కార్తీక్‌ను హీరోగా ఎంపిక చెయ్యడానికి ప్రధాన కారణం ఆయన శారీరక భాష ముఖ్యంగా ఆయన వయసు అని తెలిపారు. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నాయిక ఇతర నటవర్గం ఎంపిక జరుగుతోందని తెలిపారు. చిత్రం షూటింగ్‌ను వచ్చే నెల ప్రారంభించి వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ముద్దుల్లో అశ్లీలం ఉండదు
ఒకప్పుడు కథానాయికలు ముద్దంటే వద్దనే వారు. ఇప్పుడు ఓకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్దుల్లో అశ్లీలం ఏముంది? అని ప్రశ్నిస్తోంది వర్ధమాన నటి లక్ష్మీమీనన్. మొన్నటి వరకు గ్లామర్ పక్కకే వెళ్లనని స్టేట్మెంట్లు ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌కు ఓకే చెప్పేసింది. పైగా అదేం తప్పు కాదే అంటోంది. ఈ లక్కీగర్ల్తో చిన్న భేటి... ప్ర : కుంకీ చిత్రంలో మొదలైన మీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. 2014 మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? జ : నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి వరుసగా నటిస్తున్నాను. గత ఏడాది ఒప్పుకున్న చిత్రాల్లోనే ఇప్పుడు నటిస్తున్నాను. ప్ర : నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో మరోసారి జతకట్టడం గురించి? జ : నటుడు విశాల్‌తో మరోసారి జంటగా నటించడం సంతోషమే. మీరనుకుంటున్నట్లు ఏమీ లేదు. దర్శకుడు తిరు ఁనాన్ శివప్పు మనిదన్ చిత్ర కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. నా పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉండడంతో వెంటనే నటించడానికి అంగీకరించాను. విశాల్‌తో ఇంతకుముందు పాండియనాడు చిత్రంలో నటించడం వల్ల ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉంది. ప్ర : గ్లామర్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లోనూ నటించనని చెప్పిన మీరు ఇప్పుడు నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించారే? జ : నాన్ శివప్పు మనిదన్ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించాను. అందులో అశ్లీలం ఉండదు. గ్లామర్ అస్సలు ఉండదు. కథకు అవసరం కావడంతో ఆ సన్నివేశంలో నటించాను. దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు. చిత్ర విడుదలైన తర్వాత దాని గురించి మీరే తెలుసుకుంటారు. ప్ర : యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్ని షూటింగ్లలోనూ తెగపొగిడేస్తున్నారట? జ : నేను చూసిన, నటించిన హీరోలందరిలోనూ లేటెస్ట్ నటుడు గౌతమ్ కార్తీక్. ఆయనతో నటిస్తే నేను స్కోర్ చేయగలనా అనే సందేహించిన ఏకైక హీరో గౌతమ్ కార్తీకే. ఆయన తండ్రి నవరస కథా నాయకుడు. ఆయన జీన్స్ గౌతమ్ కార్తీక్లోనూ ఉంటాయిగా. ప్ర : కమర్షియల్ చిత్రాల్లోకి దిగిపోయారు. మంచి కథా పాత్రల్లో నటించి జాతీయ అవార్డు గెలుచుకోవాలని లేదా? జ : జాతీయ అవార్డు గెలుచుకోవాలని నేనీ రంగంలోకి రాలేదు. అవకాశం వచ్చింది నటించడానికి సిద్ధమయ్యాను. అవార్డు నటి అనే పేరు తెచ్చుకోవాలన్న ఆశ నాకు లేదు. మంచి చిత్రాలు చేయాలి అంతవరకే నేను కోరుకునేది. ప్ర : మీ గురించి వస్తున్న గాసిప్స్ గురించి? జ : నా గురించి ప్రచారం అవుతున్న గాసిప్స్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా గురించి వదంతులు రాస్తున్నారని తలచుకుంటే సంతోషం కలుగుతోంది. -
ఊహకు అందని పాత్రలో...
గ్లామర్‌ని కాసేపు పక్కన పెట్టేసి ఆర్టిస్టుగా తనేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు తాప్సీ. ‘ఆరంభం’తో తమిళంలో కూడా హిట్ కొట్టేసి, అక్కడ కూడా విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారీమె. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గంగ’ చిత్రంలో తాప్సీ నటిస్తున్న చిత్రం తెలిసిందే. ఈ సినిమాలో కూడా అభినయానికి ఆస్కారమున్న పాత్రనే పోషిస్తున్నారు తాప్సీ. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి తాప్సీ పచ్చజెండా ఊపేశారు. ‘3’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ప్రశంసలందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ఓ స్పెషల్ రోల్ పోషించనున్నారు. తాప్సీ కెరీర్లోనే గుర్తుంచుకోదగ్గదిగా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ‘‘ ‘వై రాజా వై’లో భిన్నమైన పాత్ర చేయబోతున్నాను. ఆడియన్స్ ఊహలకు అందని స్థాయిలో ఇందులో నా పాత్ర ఉంటుంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌కి థ్యాంక్స్’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వెలిబుచ్చారు తాప్సీ. యువన్‌శంకర్‌రాజా స్వరాలందిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. -
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరు
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరంటున్నారు సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు, కాదల్ హీరో గౌతమ్ కార్తీక్. తొలి చిత్రం కడల్ నిరాశ పరిచినా గౌతమ్ కార్తీక్‌కు పలు అవకాశాలు క్యూకట్టడం విశేషం ప్రస్తుతం ఈ వర్ధమాన నటుడి చేతిలో మూడు నాలుగు చిత్రాలున్నాయి. గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. కడల్ చిత్రం తరువాత అభిమానులు నన్ను గుర్తిస్తున్నారు. అయితే ఆ అభిమానం ఇతర రాష్ట్రాలకు పాకలేదు. ఇటీవల బెంగళూరు వెళ్లాను. అక్కడ నన్నెవరూ గుర్తుపట్టలేదు స్వేచ్ఛగా తిరిగి ఎంజాయ్ చేశాను. నాన్న నటించిన పలు చిత్రాలు చూశాను. నటుడిగా ఆయనంత స్థాయికి చేరుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఎన్నమో ఏదో చిత్రంలో సీనియర్ నటుడు ప్రభుతో కలిసి నటిస్తున్నాను. ఆయన నటనలో చాలా మెళకువలు నేర్పారు. ఆ విధంగా నటనలో కాస్త పరిణితి చెందాననే చెప్పాలి. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో వై రాజా వై చిత్రంలో నటిస్తున్నాను. ఇది లవ్ థ్రిల్లర్. కాగా చిత్రం హీరోయిన్ ప్రియా ఆనంద్ చాలా స్నేహశీలి. ఇక సిపాయి చిత్రంలో లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెకు పాత్రను అర్ధం చేసుకుని నటించాలనే ఆసక్తి అధికంగా ఉంది. ఇక నా తండ్రి కార్తీక్‌కు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్లుగా మీకూ ఉన్నారా? అని తరచూ చాలామంది అడుగుతున్నారు. నాకు గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే అని గౌతమ్ కార్తీక్ చాలా స్పష్టంగా తెలిపారు.