అలా చూపిస్తే నటించను | Harmahara MahadevaKI is coming to film on THIS Friday. | Sakshi
Sakshi News home page

అలా చూపిస్తే నటించను

Published Fri, Sep 29 2017 4:49 AM | Last Updated on Fri, Sep 29 2017 4:49 AM

Harmahara MahadevaKI is coming to film on THIS Friday.

తమిళసినిమా: నన్ను సభ్యతగా చూపించని పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం సమ్మతించను అని అంటోంది నటి నిక్కీగల్రాణి. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరని చెప్పవచ్చు. నిక్కీగల్రాణి తాజాగా నటించిన చిత్రం హరహర మహాదేవకి. గౌతమ్‌కార్తీక్‌కు జంటగా నటించిన ఈ చిత్రానికి సంతోష్‌ పి.జయకుమార్‌ దర్శకుడు.

ఇది అడల్ట్‌ చిత్రం అని 18 ఏళ్ల కంటే చిన్న వయసు వాళ్లు చూడకూడదంటూ సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. హరహర మహాదేవకి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇందులో హీరోహీరోయిన్లు గౌతమ్‌కార్తిక్, నిక్కీగల్రాణి ప్రేమించుకుని ఆ తరువాత బ్రేకప్‌ అవుతారని, ఆ తరువాత జరిగే సంఘటనలే చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు. హరహర మహాదేవకి అనే ఒక గెస్ట్‌హౌస్‌లో చిత్ర కథ జరగడంతో అదే పేరును చిత్రానికి నిర్ణయించామని ఆయన తెలిపారు. 

ఇందులో తన పాత్ర గురించి నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనను అసభ్యంగా చూపిస్తే అలాంటి చిత్రాల్లో నటించనని పేర్కొంది. ఇకపోతే హరహర మహాదేవకి చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేవని స్పష్టం చేసింది. నలుగురు స్నేహితులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారో అదే హరహర మహాదేవకి చిత్రం అని గౌతమ్‌కార్తీక్‌ పేర్కొన్నారు. కచ్చితంగా స్నేహితులు మాట్లాడుకునే విషయాలు కుటుంబసభ్యులతో మాట్లాడరని అన్నారు. అయినా ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement