![Gautham Karthik Begins His Next Titled As Criminal - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/26/gautham.jpg.webp?itok=PvTQK47E)
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి క్రిమినల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. పార్సా పిక్చర్స్ మీనాక్షి సుందరం, బిగ్ ఫ్రింట్ పిక్చర్స్ కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దక్షణామూర్తి రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ సీఎస్.సంగీతాన్ని, ప్రసన్న ఎస్.కుమార్ చాయాగ్రహణను అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మధురైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను నిర్మాతలలో ఒకరైన మీనాక్షీసుందరం వెల్లడించారు.
చిత్ర షూటింగును మధురైలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది మధురై నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ నేరస్తుడిగా, శరత్‌కుమార్ పోలీస్ అధికారిగా విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు దక్షిణామూర్తి రామ్‌కుమార్ కథ చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపింందన్నారు. కథ, కథనం ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను 40 రోజుల పాటు ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment