ఇద్దరు స్టార్స్‌ కాంబినేషన్‌లో నా నా మూవీ.. రిలీజ్‌ అప్పుడే! | Sashi Kumar, Sarath Kumar Naa Naa Movie To Release on this Date | Sakshi
Sakshi News home page

Naa Naa Movie: ఇద్దరు స్టార్స్‌ కాంబినేషన్‌లో నా నా మూవీ.. రిలీజ్‌ అప్పుడే!

Published Sun, Dec 3 2023 9:54 AM | Last Updated on Sun, Dec 3 2023 10:11 AM

Sashi Kumar, Sarath Kumar Naa Naa Movie To Release on this Date - Sakshi

నటుడు శశికుమార్‌, శరత్‌కుమార్‌ ఇటీవల నటించిన చిత్రాలు విజయాలు సాధించడంతో మంచి జోష్‌లో ఉన్నారు. శశికుమార్‌.. అయోధి, శరత్‌కుమార్‌.. పొన్నియిన్‌సెల్వన్‌, పోర్‌ తొళిల్‌ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి ననా అనే చిత్రంలో నటించారు. కల్పనా పిక్చర్స్‌ పతాకంపై పీకే రామ్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్‌వి నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని గణేష్‌ చంద్ర ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ననా చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. శశికుమార్‌, శరత్‌కుమార్‌ అద్భుత నటనను ప్రదర్శించారని, యాక్షన్‌, థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

చిత్ర కథ ఆది నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. దీనికి భూపతి రాజా, ఎన్‌వీ నిర్మల్‌ కుమార్‌ కలిసి కథను సమకూర్చారు. భూపతి రాజా థాయమిది శివకుమార్‌, నైవేలి భరత్‌ కుమార్‌, సురులిపట్టి శివాజీ మొదలగు వారు సంభాషణలను రాయడం విశేషం.

చదవండి: ఆలయాన వెలసిన కథలతో పూనకాలు తెప్పిస్తున్న స్టార్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement