![Sarath Kumar, Amithash Starrer Paramporul Trailer Out - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/16/sarath-kumar.jpg.webp?itok=PYccviQt)
నటుడు శరత్ కమార్, అమితాష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పరం పొరుల్. ఈ సినిమాలో కాశ్మీరా ప్రదేశీ హీరోయిన్‌గా నటించింది. కవి క్రియేషన్‌న్స్ బ్యానర్‌పై మనోజ్, గిరీష్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సీ. అరవింద్ రాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఎస్.పాండికుమార్ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలకు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం సతీమణి సుహాసిని మణిరత్నం ట్రైలర్ ఆవిష్కరించారు. నటుడు అమితాష్ మాట్లాడుతూ 2023 ఎంతో ఇన్‌స్పైరింగ్ సంవత్సరం అని చెప్పవచ్చన్నారు. దాదా, పోర్ తొళిల్, లవ్ టుడే వంటి పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు.
కాగా పరంపొరుల్ చిత్ర కథను నిర్మించాలని భావించినప్పుడు ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్ర కోసం ముందుగా గుర్తుకొచ్చింది శరత్ కుమారేనని పేర్కొన్నారు. ఆయన ఇందులో నటించడానికి సమ్మతించడంతో చిత్ర దశే తిరిగిపోయిందన్నారు. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో ఇన్వాల్ అయి నటించారన్నారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా చిత్రం కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ ఒక పాట పాడడం విశేషం అన్నారు. శరత్ కుమార్ మాట్లాడుతూ ఫుల్ ఎఫర్ట్ పెడితే సక్సెస్ ఖాయం అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment