![Sarathkumar Now Full Busy Actor In South Movies - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/30/sar.jpg.webp?itok=zGpuhVb9)
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతి నిండా చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు శరత్ కుమార్. సుప్రీం హీరోగా అభిమానులు పిలుచుకునే ఈయన మరో పక్క రాజకీయ నాయకుడిగానూ కొనసాగుతున్నారు. కాగా శరత్ కుమార్ ఇప్పుడు డజన్‌కు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల అశోక్ సెల్వన్‌తో కలిసి నటించిన పోర్ తొళిల్ మంచి విజయాన్ని సాధించింది.
(ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!)
తాజాగా మిస్టర్ ఎక్స్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. నటుడు ఆర్య గౌతమ్ కార్తీక్ నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. నటి అనకా, మంజు వారియర్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది.
కాగా ఇందులో నటుడు శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దీపం నీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment