Manjima Mohan Opens Up About Trolls On Body Shaming In Her Marriage Photos, Deets Inside - Sakshi
Sakshi News home page

Manjima Mohan: 'నా పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా లావుగా ఉన్నానని కామెంట్‌ చేశారు'..

Published Thu, Dec 1 2022 12:53 PM | Last Updated on Thu, Dec 1 2022 1:56 PM

Manjima Mohan Reveals She Was Body Shamed At Her Wedding With Gautham Karthik - Sakshi

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ మంజిమా మోహన్‌- హీరో గౌతమ్‌ కార్తిక్‌ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్‌ లుక్‌పై ట్రోల్స్‌ కూడా అదే స్థాయిలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఈ హీరోయిన్‌న ఇలా ట్రోల్‌ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్‌ చేస్తూ దారుణంగా ట్రోల్‌ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్‌ చేశారని మంజిమా మోహన్‌  పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్‌ ఎదుర్కుంటున్నా.

మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్‌పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్‌ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్‌ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement