over weight
-
ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్?
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఊహించని షాకిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై జట్టు నుంచి పృథ్వీ షాను అర్ధంతరంగా ఎంసీఏ తప్పించింది.రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో ఉన్న ముంబై జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో షాకు చోటు దక్కలేదు. ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడిపై వేటు వేసినట్లు ఎంసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. "పృథ్వీ షాకు సెలక్టర్లు బ్రేక్ ఇచ్చారు. త్రిపురతో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉండనున్నాడు. కోచ్, సెలక్టర్లు అతడితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉందని"ఎంసీఎ వెల్లడించింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. సంజయ్ పాటిల్ నేతృత్వంలో ముంబై సెలక్షన్ కమిటీ పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పృథ్వీ ఓవర్ వెయిట్(ఆధిక బరువు) ఉన్నట్లు సెలక్టర్లు గుర్తించారు. నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా పృథ్వీ షా నిర్లక్ష్యం చేస్తున్నాడని టీమ్ మేనేజ్మెంట్ సెలక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. కాగా పృథ్వీ షా గత కొన్నాళ్లుగా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 59 పరుగులే మాత్రమే షా చేశాడు.చదవండి: IND vs NZ: టీమిండియాతో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్ -
పెరుగుతో అధిక బరువు చెక్, మేనికి మెరుపు
మారుతున్న జీవన శైలి రీత్యా అధిక బరువు, ఊబకాయం చాలామందిన వేధిస్తున్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారికి ఏ ఆహారం తీసుకోవలన్నా భయంగానే ఉంటుంది. ఇది తింటే ఎన్ని కేలరీల బరువుపెరిగిపోతామో అని ఆందోళనపడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పెరుగు. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలుంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారుబరువు తగ్గాలని, ఆహారం తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు ఎక్కువగా అందే ఆహారంపై దృష్టి పెట్టాలి. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినొచ్చు. పెరుగు తింటే బరువు బాధ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. పెరుగులో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తినవచ్చు. దీంతో కడుపు నిండి ఉంటుందిన. పోషకాలు అందుతాయి. కీర, పుదీనా కలిపి తీసుకోవచ్చు. అలాగే కప్పు పెరుగుకు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేడి చేసినపుడు పెరుగు, చక్కెర కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పెరుగు డీహైడ్రేషన్నుంచి కాపాడుతుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.ఇలాంటి కొన్ని చిట్కాలతోపాటు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంఊ జంక్ ఫుడ్ ,ఆయిలీ ఫుడ్ జోలికి పోకూడదు. ఒత్తిడి లేని జీవనశైలికి అలవాటుపడాలి. సరిపడా నీళ్ళు నిద్రకూడా చాలా అవసరం అనేది గుర్తించాలి. -
గట్టి గాలొస్తే ఎగిరిపోయేలా ఉంది..ఇంకా బరువు తగ్గుతుందట!
మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, వ్యాయామం ఇవన్నీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా మనకు సహకరిస్తాయి. అయితే ప్రస్తుత జీవన శైలి,ఆహారం కారణంగా చిన్నా పెద్దా, తేడాలేకుండా ప్రపంచంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు.ఇలా శరీర బరువు పెరగడానికి చాలా కారణాలను విశ్లేషించుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో కొంతమంది విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ యువతి ఉదంతం నెట్టింట చర్చనీయాంశమైంది.బేబీ టింగ్జీ యువతి 160 సెం.మీ పొడవు (5అడుగుల 2 అంగుళాలు) ఉంటుంది. బరువు కూడా 25 కిలోలు మాత్రమే. సన్నబడాలనే విపరీతమైన కోరికతో అమ్మాయి బాగా తగ్గించుకుంది. ఎంతలా అంటే.. గట్టిగా గాలివీస్తే ఎగిరిపోతుందా అన్నట్టు పీలగా తయారైంది. గట్టిగా అడుగులు వేస్తేనే ఎముకలు విరిగిపోతాయో అన్నట్టు అస్థిపంజరం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకో క్రేజీ విషయం ఏమిటంటే..తన బరువును ఇంకా తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. ఇది చూసి నెటిజన్లు విస్తు పోతున్నారు. బేబీ టింగ్జీకి సోషల్ మీడియాలో 42 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. బేబీ టింగ్జీ కోల్పోయిన బరువుని చూసి నెటిజన్లు పలు సలహాలిస్తున్నారు. ఇంతకంటే బరువు తగ్గవద్దని, పోషకాహారం లోపంతో పలు రోగాల బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. -
బార్లీ నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? షుగర్ అదుపులో ఉంటుందా?
మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిని మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిల్లో అద్భుతమైన తృణధాన్యం బార్లీని ఒకటిగా చెప్పుకోవచ్చు. బార్లీలో బి-కాంప్లెక్స్, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్ ఖనిజాలు లభిస్తాయి. ఇంకా పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.బీ విటమిన్, పీచు పదార్థం సంపూర్ణంగా మనకు అందాలంటే పొట్టుతోపాటు బార్లీ గింజలను తీసుకుంటే మంచిది. బార్లీ గింజల్ని బ్రెడ్, సూప్‌లు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ, ఆల్కహాలిక్ పానీయాల్లో కూడా వాడతారు. ముఖ్యంగా బీర్మాల్ట్ మూలంగా కూడా పనిచేస్తుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడితే, వారికి ఎదుగుదలకి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. బరువు నియంత్రణలోబార్లీ వాటర్‌లో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మంచి ఆహారం, వ్యాయామంతో పాటు బార్లీ నీళ్లు తాగితే వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.షుగర్ వ్యాధిగ్రస్తులకుబార్లీ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ స్థాయిల నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. కేన్సర్ నివారణలో సాయపడుతుంది. అంతేకాదు బార్లీ నీళ్లతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది కూడా. -
బరువు తగ్గాలని రోజూ కూరగాయలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం. బ్రకోలీ బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. -
బాగా సన్నబడ్డ రోహిత్.. వడపావ్ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సన్నబడ్డాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు బాగా వెయిట్ లాస్ అయ్యాడు. బరువు పెరగడంతో ఫీల్డ్‌లో చురుగ్గా ఉండలేకపోయిన హిట్‌మ్యాన్.. ఒబేసిటి కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అమితంగా అభిమానించే వాళ్లు సైతం రోహిత్‌ను పలు సందర్భాల్లో వడాపావ్ అని సంబోధించేవారు. ఓవర్ వెయిట్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్.. ఇటీవలికాలంలో పరుగులు చేసేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అసలే నిదానంగా, బద్దకంగా కనిపించే రోహిత్.. బరువు పెరగడంతో మరింత నెమ్మదించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతని స్థాయి ఇన్నింగ్స్ ఆడి చాలాకాలమైంది. అయితే తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడం చూస్తుంటే అతను మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని నమ్మకం కలుగుతుంది. అతను బరువు తగ్గేందుకు చాలా శ్రమించినట్లు కనిపిస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ ఇంత పలచబడ్డాడని అనక మానరు. అంతలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా కనిపిస్తున్నాడు రోహిత్. అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయి. మునుపటితో పోలిస్తే చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు.. హిట్‌మ్యాన్ ఇదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నారు. Captain interviews vice-captain 🎙️pic.twitter.com/xSEfXzqeVG — CricTracker (@Cricketracker) July 11, 2023 కొత్త టెస్ట్ జెర్సీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. పెదవి విరుస్తున్న అభిమానులు వెస్టిండీస్‌తో సిరీస్ ముందు టీమిండియా ఆటగాళ్లు కొత్త టెస్ట్ జెర్సీల్లో కనిపించారు. డ్రీమ్ ఎలెవెన్ టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ దక్కించుకోవడంతో ఆ పేరు ముద్రించిన కొత్త కిట్లలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమిచ్చారు. కొత్త జెర్సీలో తీసుకున్న సెల్ఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. హిట్‌మ్యాన్ ఏంటీ.. గుర్తుపట్టలేనంతగా ఇలా సన్నబడిపోయాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ వెయిట్ లాస్ అయినట్లు ఈ జెర్సీలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కొత్త జెర్సీ డిజైన్‌పై టీమిండియా అభిమానులు పెదవి విరుస్తున్నారు. జెర్సీ ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. Indian Top 5 in Tests cricket. pic.twitter.com/cZX1lmS7lq— Johns. (@CricCrazyJohns) July 11, 2023 -
ఇంత బరువుంటే విమానం టేకాఫ్ కాదు.. ప్లీజ్ కొందరు దిగిపోండి..
విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు రెడీగా ఉంది. ప్రయాణీకులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో విమానంలో ఉన్న వారికి పైలట్ ఓ షాకింగ్ వార్త చెప్పాడు. విమానంలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టేకాఫ్ చేయలేము.. అందకు కొందరు ప్రయాణీకులు విమానం దిగాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో, ప్రమాణీకులంతా ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ఈజీ జెట్ విమానం లాంజరెటో నుంచి లివర్ పూల్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో, ప్రయాణీకులకు విమాన పైలట్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. విమానాశ్రయం రన్‌వే పొడువు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన టేకాఫ్ ఆలస్యమవుతోందని పైలట్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టేకాఫ్ కష్టమవుతోందని వివరించాడు. ఇక, పైలట్ వ్యాఖ్యలతో విమానం ఉన్న ప్రయాణీకులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే సమయంలో, పైలట్ మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో బరువైన ఈ విమానాన్ని టేకాఫ్ చేయడం కష్టతరమని తెలిపాడు. విమానం టేకాఫ్ కావలంటే కొందరు ప్రయాణీకులు విమానం దిగిపోవాల్సిందేనని చెప్పాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగి, తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించాడు. అలా దిగిన వారికి 500 యూరోలు పారితోషికం కూడా ఇస్తామనీ చెప్పాడు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి సిబ్బంది తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో విమానం రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్ అయ్యింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #easyJet's Captain asked 20 passengers to leave the aircraft because it was overweight and wouldn't be able to takeoff from #Lanzarote due to wind and warm weather. The flight from Lanzarote to #Liverpool was delayed by about 2 hours. 🎥 ©razza699/TikTok#Spain #uk #aviation pic.twitter.com/oa8pi4Imox — FlightMode (@FlightModeblog) July 8, 2023 ఇది కూడా చదవండి: మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..! -
మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ సర్వేలో వెల్లడైన అంశాలు... ►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్‌తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. ►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... ►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. ‘పొగ’బారిన 33% మంది సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు. ►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. వేధిస్తున్న ఊబకాయం... ►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు. ►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. పెరుగుతున్న బీపీ, షుగర్... ►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు. ►9.3 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 2040 నాటికి ‘బరువు’మూడింతలు ►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. ►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. వ్యాయామానికి విరామం... ►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు. ►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. ప్రతి మూడు మరణాల్లో రెండు అవే... గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. – డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్‌పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్‌పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
లావుగా ఉన్నానని అమ్మ పాత్రలు చేయమని అడుగుతున్నారు: హీరోయిన్
తమిళసినిమా: సూరరైపోట్రు చిత్రంలో నటనను చూసి ఫిదా అయిపోయిన తమిళ ప్రేక్షకులు నటి అపర్ణ బాలమురళిని ప్రశంసల్లో ముంచెత్తేశారు. ఆకాశమే హద్దు పేరుతో తెలుగులో అనువాదమైన ఈ చిత్రంతో అక్కడ ప్రేక్షకులను అపర్ణ అలరించింది. అయితే మలయాళంలో ప్రముఖ కథానాయికగా రాణిస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో అంతకుముందే 8 తోట్టాగళ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సర్వం తాళమయం, తీదుమ్ నానుమ్ చిత్రాల్లో నటించినా పేరు తెచ్చి పెట్టింది మాత్రం సూరరైపోట్రు సినిమానే. ఆ తరువాత వీట్లో విశేషం చిత్రంలో నటించింది. అయితే అప్పటికే ఈ అమ్ము లావెక్కిందనే విమర్శలను వచ్చాయి. కాగా ప్రస్తుతం తమిళంలో నిత్యం ఆరుదానం అనే చిత్రంలో అశోక్ సెల్వన్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్‌ను ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందులో అపర్ణ బాలమురళి బొద్దుగా ఉన్నట్లు కనిపించడంతో ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీనిపై ఈమె స్పందిస్తూ శరీర బరువుకు, ప్రతిభకు సంబంధమే లేదని తెలిపింది. తాను లావెక్కానన్న కామెంట్స్ రావడంతో మొదట్లో చాలా బాధపడ్డానని, కొందరైతే అమ్మ పాత్రలో నటిస్తావా? అని అడుగుతున్నారని, తనకు అంత వయసు లేదని పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవట్లేదని, ఆరోగ్య సమస్య తదితర ఇతర కారణాల వల్ల శరీర బరువులో మార్పులు జరగవచ్చంది. అయితే తాను ఎలా ఉన్నా చాలామంది అంగీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అదేవిధంగా బరువుకు, ప్రతిభకు సంబంధం లేదని, స్లిమ్‌గా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు అర్థం కాని విషయమన్నారు. -
‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్!
ఊబకాయం.. ఒబెసిటీ ఇదో పెద్ద సమస్య, కొండలా పేరుకుపోయిన Extra Fat ను కరిగించుకోవడం అంత తేలిక కాదు. మన దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది అధికబరువుతో పోరాడుతున్నారు. మరి అనేక సమస్యలకు మూలకారణంగా మారుతున్న అధికబరువును తగ్గించుకోవడానికి సాంప్రదాయమైన చక్కటి పెరటి ఔషధం ఉంది తెలుసా? చూడ్డానికి మన గుమ్మడి పండులా కనిపించే ఈ పుల్లటి పండు కొన్ని పొట్ట సమస్యలకు చెక్ చెప్పడమే కాదు, బరువును నియంత్రించడంలో బేషుగ్గా పనిచేస్తుందట. మరి పులి లాంటి ఆ పండు ఎక్కడ దొరుకుతుంది? అధిక బరువును తగ్గించుకునేందుకు చాలమంది పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొద్దో గొప్పో వ్యాయామం చేస్తూ నోరు కట్టేసుకున్నా కూడా ఎలాంటి ఫలితం కనిపించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే సాంప్రదాయమైన మన దేశంలో దొరికే మలాబార్ చింతపండు ద్వారా బరువు తగ్గ వచ్చిన తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కేరళలో విరివిగా లభించే దీన్ని మలయాళం, తమిళంలో కడంపులి లేదా పులి అని పిలుస్తారు. తెలుగువారి గుమ్మడికాయగా కనిపించే ఈ పులి పండు కేరళలో దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ పండిస్తారు. ఈ కుడంపులి వంటలకు పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో పాపులర్ అయింది. దీని శాస్త్రీయ నామం గార్సీనియా కాంబొజియా. అనేక వ్యాధుల నివారణకు పూర్వ కాలంనుంచి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. ముఖ్యంగా పొట్టలో పురుగులు, మలబద్ధకం, క్యాన్సర్, పైల్స్, రుమాటిజం, ఎడెమా, లేట్ పీరియడ్స్, లాంటి ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగించేవారట. ఒక విధంగా చెప్పాలంటే ఈ పండు మాత్రమే కాదు రూట్లో ఉండే గార్బోగియోల్ అనే క్సాంతోన్, బెరడులో గార్సినోల్, ఐసోగార్సినోల్ వంటి బెంజోఫెనోన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండుపైన ఉండే తొక్కల్ని ఎండబెట్టి కడుపు వ్యాధులకు నివారణగా తీసుకుంటారు. కేరళ, శ్రీలంకలో చేపల కూరకు మంచిరుచి, చిక్కదనం , సువాసనకోసం దీన్ని వాడతారట. అలాగే చేపలను ఎండబెడ్డే క్రమంలో దీన్ని విరివిగా వాడతారు. ఎల్డీఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను గణనీయంగా తగ్గించే లక్షణం కూడా దీనికి ఉంది. అయితే, ఈ పుల్లని పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. 40 మంది వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు పరీక్షలు నిర్వహించారు. ఒకరికి మలబార్ చింతపండుతో వాడిన ఆహారం అందించగా, మరొకరికి మలబార్ చింతపండు లేని ఆహారం అందించి పరిశీలించగా ఈ చింతపండును తిన్న గ్రూపులో ఉదర కొవ్వు , విసెరల్ కొవ్వులో తగ్గుదల కనపించిందంట. షుగర్ స్థాయిలను తగ్గిస్తుందని 2015లో ఎలుకలపై నిర్వహించిన స్టడీలో తేలింది. వివిధ కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ లేదా హెచ్‌సీఏ వంటి పోషకాలతో నిండి ఉంది. మలబార్ చింతపండు. హెచ్‌సీఏ బరువు తగ్గడానికి సాయడటమే కాదు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఇందులోని సిట్రేట్ లైజ్ అనే ఎంజైమ్ చక్కెరను కొవ్వులుగా మారకుండా అడ్డుకుంటుంది. సెరోటోనిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వీటితోపాటు పశువులలో నోటికి సంబంధించిన వ్యాధుల నివారణలో వెటర్నరీ మెడిసిన్‌లో కూడా ఈ చింతపండును వాడటం విశేషం. కుడం పులి టీ: అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రతి భోజనానికి 30 నిమిషాల ముందు కుడంపులి టీతాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎండిన రెండు పెద్ద కుడంపులి ముక్కలను సుకుని రాత్రంతా నానబెట్టాలి. దీన్ని సన్నటి మంటమీద మరగించి, జీలకర్ర పొడి , తాటి బెల్లం కలిపితే కుడంపులి టీ రడీ. సైడ్ ఎఫెక్ట్స్: మలబార్ చింతపండు ప్రభావంతో కొంతమందిలో తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, చలి, జీర్ణ సమస్యలు లో సుగర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా తింటే లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. -
Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం. తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అన్నీ ఉన్నా...ఆరోగ్యం? నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కోవిడ్ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. వేగం.. నగర జీవననాదం.. నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. ‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ వేదస్విరావు వెల్చల చెప్పారు. -
గుర్...ర్...ర్.... గురకకు చెక్ పెట్టండిలా
సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్‌స్టైల్ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్) ప్రమాదకరం కాదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకకు దారి తీసే కారణాలివి: ►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్ పాలిప్స్ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. ►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్ ఏర్పడుతుంది. ►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్ టిష్యూస్ కండిషన్ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే. ►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. ►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది. గురకను తగ్గించుకునే మార్గాల.... ►అధికబరువును తగ్గించుకోవాలి. ►దూమపానం, మద్యపానం మానేయాలి. ►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. ►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి) ►గురకను అరికట్టే ప్లాస్టిక్ డివైజ్ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు. -
World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 1980 నుండి రెట్టింపు అవుతూ వస్తుంది. 2014లో, 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది పెద్దలు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 600 మిలియన్లకు పైగా స్థూలకాయులు ఉన్నారు. 2014లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 41 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. 'CRAP': కు దూరంగా ఉండండి. అంటే కార్బోనేటేడ్ పానీయాలు,శుద్ధి చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. స్థూలకాయానికి దూరంగా ఉండాలంటే ఈ పదార్థాలకు కచ్చితంగా నో చెప్పాల్సిందే. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేద్దామా? అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కింగ్‌లాగా బ్రేక్ ఫాస్ట్ ఉండాలి అలా ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆహారంతో రోజు ప్రారంభించాలి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే ఆకలి ఎక్కువై ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లే అవకాశం ఉంది. మనం ఏం తాగుతున్నాం: ఈ మధ్య కాలంలో లెమన్ టీ, గ్రీన్ టీ పై అవగాహన బాగా పెరిగింది. గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ, అల్లం టీ, తులసి, పుదీనా టీ ఇలాంటి సహజ మూలికల టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు క్రమేపీ కరుగుతాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ నీరుతాగడం వల్ల జీర్ణవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నీరు మన శరీరంలోని మలినాలను కూడా శుభ్రపరుస్తుంది. వంటింట్లో డైట్ మేక్-ఓవర్ : వంటగదిలో "జంక్" ఫుడ్‌ని పూర్తిగా తొలగించేద్దాం. దీనికి బదులు వంట గదిలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కనిపించేలా పెట్టుకోండి. ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వండి. రుచికోసం కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే..రుచికి రుచితోపాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మోర్ ఎక్సర్సైజ్: ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం చురుగ్గా ఉండటం. ఎక్కువ సేపు కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోకుండా ఉండటం చాలా ముఖ్యం. లిఫ్ట్‌కు కాకుండా సాధ్యమైన ప్పుడల్లా మెట్లు ఎక్కడం. అలాగే మన రోజువారీ షెడ్యూల్లో సైక్లింగ్, నడక, స్కిప్కింగ్ లేదా స్విమ్మింగ్‌తోపాటు, పెంపుడు జంతువుతో షికారు చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది. మింగేయకండి.. నమలండి: తిన్నది ఎంతైనాగానీ ఆహారాన్ని బాగా నమలండి. తిన్న ప్రతిసారీ మీ పోర్షన్ పరిమాణాన్ని తగ్గించుకుంటే..తక్కువ కేలరీలు తగ్గుతాయి. ప్రతీ ముద్దా ఎంత ఎక్కువ నమిలితే అంత మంచిది. తద్వారా కేలరీల మోతాదు తగ్గుతాయి. పోషకాలు పెరుగుతాయి. ఇంటి భోజనమే అమృతం: ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వేస్ట్ అయిపోతోందనో, టేస్టీగా ఉందనో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో..సాధ్యమైనంతవరకు ఇంటిలో తయారు చేసిన ఫుడ్ తినడం ఉత్తమం. లేదంటే ఆ తరువాత అద్దం ముందు నిలబడి, ఏం తిన్నా.. ఇక్కడికే వస్తోంది అనుకోవాలి పెరుగుతున్న నడుమును చూసి. -
టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. జారిపడిన లిఫ్ట్..
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం ఓ ప్రమాదానికి కారణమైంది. పట్టణంలోని అర్కాన్ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన స్థానిక నేతలు పైకి వెళ్లేందుకు లిఫ్టు ఎక్కారు. గరిష్ఠంగా ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్టులో పదిహేను మందికి పైగా ఎక్కడంతో ఒక్కసారిగా పైకి లేచి కిందపడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లిఫ్టు నుంచి అందరికి బయటికి తీశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కూడా లిఫ్టులో వెళదామనుకున్నప్పటికి అప్పటికే లిఫ్టులో ఎక్కువమంది ఉండడంతో మెట్లు ఎక్కి పైకి పైకి వెళ్లారు. ముఖ్యనేతలు తాము అందులో ఎక్కక్కపోవడమే మంచిదైందని అనుకున్నారు. -
ఎఫ్బీ అకౌంట్ డిలీట్ చేసింది.. భారీగా బరువు తగ్గింది
బరువు తగ్గాలంటే.. వ్యాయామం చేయాలి.. డైట్ ఫాలో కావాలి.. అంతే కానీ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేయడం వల్ల బరువు తగ్గడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇదేమైన కొత్త టెక్నిక్ అనుకుంటున్నారా.. అవుననే అంటుంది ఓ మహిళ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లు డిలీట్ చేశాకే తాను ఏకంగా 32 కేజీల బరువు తగ్గినట్లు వెల్లడించింది. ఇదేలా సాధ్యం అయ్యిందో ఆమె మాటల్లోనే.. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితం అయ్యారు జనాలు. ఇంటి నుంచి పని చేస్తుండటంతో.. నోటికి కూడా బాగానే పని చెప్పారు. చాలా మంది లాక్డౌన్ సమయంలో విపరీతంగా బరువు పెరిగారు. దాన్ని తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడ్డారు.. పడుతున్నారు. (చదవండి: ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది) ఈ కోవకు చెందిన మహిళే బ్రెండా ఫిన్. లాక్డౌన్లో కాలంలో బ్రెండా దాదాపు 38 కిలోల బరువు పెరిగింది. వెయిట్ తగ్గించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అసలు సమస్య ఎక్కడ ఉంది అని ఆలోచించిన బ్రెండాకు.. సోషల్ మీడియా అకౌంట్లే తనకు అతి పెద్ద అని శత్రువు అని తెలుసుకుంది. దీని గురించి బ్రెండా మాట్లాడుతూ.. ‘‘నేను నా అధిక బరువు తగ్గించుకోవాలని చాలా ప్రయత్నించాను. ఆ సమయంలో సోషల్ మీడియా వినియోగించడంతో.. అందులో ఫుడ్‌కు సంబంధించి వచ్చే యాడ్స్.. నా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేవి. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ తినేదాన్ని. ఈ చెడు ఆహారపు అలవాట్లను మానుకోవడం నా వల్ల కాలేదు. కొన్ని రోజుల పాటు ఇలానే అయ్యింది. చివరకు సమస్య ఎక్కడ ఉందో అర్థం అయ్యింది’’ అని తెలిపింది బ్రెండా. (చదవండి: అసలు చూస్తున్నది కిమ్నేనా? 20 కిలోలు తగ్గిండు.. మనిషి మారిండు) ‘‘వెంటనే నా సోషల్ మీడియా అకౌంట్లయిన ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లను డిలీట్ చేశాను. ఆ తర్వాత నా ఫోకస్ బాగా పెరిగింది. నాకు నేను సాకులు చెప్పుకోవడం కూడా మానేశాను. నా ప్రయత్నం విజయవంతం అయ్యింది. అధికంగా పెరిగిన 32 కేజీల బరువును తగ్గించుకున్నాను. ప్రస్తుతం నా పూర్వపు వెయిట్ 58 కిలోగ్రాములకు వచ్చాను. ఇప్పుడు నాకు నేను ఎంతో నచ్చుతున్నాను. నా నిర్ణయం సరైందే అని నాకు అర్థం అయ్యింది’’ అని తెలిపారు బ్రెండా. చదవండి: రెండో కిలోలు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గినట్టే! -
పట్టణ మహిళల్లో అధిక బరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణ మహిళలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య గణాంకాల విభాగం రూపొందించిన 2019–20 నివేదికలో పేర్కొంది. 15–49 ఏళ్ల వయసున్న మొత్తం మహిళల్లో 28.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా, పట్టణాల్లోనే 39.5 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని తెలిపింది. అందులో తక్కువ బరువు ఉన్న మహిళలు 23.1 శాతం ఉన్నారు. కాగా, రాష్ట్రంలో మహిళలను రక్తహీనత వేధిస్తోంది. 15–49 ఏళ్ల వయసున్న మహిళల్లో 56.7 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. వీరిలో గర్భిణీలు 48.2 శాతం మంది ఉండటం గమనార్హం. అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. అధిక బీపీ ఉన్న మహిళలు 19.8 శాతం, పురుషులు 18.2 శాతం ఉన్నారు. డయాబెటిస్తో ఉన్న మహిళలు 6.9 శాతం, పురుషులు 6 శాతం ఉన్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పౌష్టికాహార లోపం కారణంగా బాధపడుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేని వారు 28.1 శాతం కాగా, బక్కచిక్కిన పిల్లలు 18 శాతం, బరువు తక్కువగా ఉన్న వారు 28.5 శాతంగా నమోదయ్యారు. వైద్యం పొందడంలో మూడో స్థానం.. ఆరోగ్య పథకాలు, వివిధ బీమా పథకాల ద్వారా వైద్యం పొందే కుటుంబాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 66.4 శాతం కుటుంబాలకు ఈ సౌకర్యం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందుతున్నవారు 40.5 శాతం మంది ఉండగా, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. ఇవీ ఇతర వివరాలు.. ►ఆరోగ్య కార్యకర్తల ద్వారా జరిగే జననాలు రాష్ట్రంలో 91.4 శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలోని చిన్న పిల్లల్లో పూర్తిస్థాయిలో టీకాలు పొందేవారు 68.1 శాతం. జాతీయ సగటు 62 శాతం. ►15–49 ఏళ్ల వయసు వారిలో వారానికోసారి మద్యం సేవించే మహిళలు 28.5 శాతం ఉంటే, పురుషులు 45.5 శాతం ఉన్నారు. ►15–49 ఏళ్ల వయసు వారిలో పొగాకు తాగేవారు 70.6% పురుషులు, 48.8% మంది మహిళలు ఉన్నారు. ►6 నెలలలోపు తల్లిపాలు తాగే పిల్లలు 67.3 శాతం. ►2011లో దేశ జనాభా 121 కోట్లు ఉం టే, 2016 నాటికి 129 కోట్లకు చేరు కుంది. 2021 నాటికి 136 కోట్లు, 2026 నాటికి 142.30 కోట్లు, 2031 నాటికి 147.50 కోట్లు, 2036 నాటికి 151.83 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. -
లాక్‌డౌన్‌కు ముందు వంద.. తర్వాత 100
చైనా: కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. చైనాలో సుమారు ఐదు నెలలు కొనసాగిన లాక్డౌన్ వల్ల ఓ యువకుడు ఊహించని విధంగా బరువు పెరిగిపోయాడు. చివరికి లేవలేని స్థితికి చేరుకున్నాడు. వుహాన్‌కు చెందిన జహౌ అనే 29 ఏళ్ల యువకుడు ఓ కేఫ్‌లో పనిచేసేవాడు. లాక్‌డౌన్‌కు ముందే జహౌ సుమారు 100 కిలోల బరువు ఉన్నాడు. ఈ ఐదు నెలల వ్యవధిలో అదనంగా మరో 100 కిలోలకు పైగా బరువు పెరిగిపోయాడు. లాక్డౌన్ నుంచి ఉపశమనం కల్పించిన తర్వాత జహౌ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బరువు వల్ల అతడికి నిద్ర కూడా కరవైంది. ఒకానొక సందర్భంలో అతడు 48 గంటలు నిద్రలేకుండా గడిపినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఆందోళనకు గురైన జహౌ.. సాయం కోసం ఎమర్జన్సీ సేవలను ఆశ్రయించాడు. (కరోనా: ఈ మందు బాగా పనిచేస్తోంది!) ఈ క్రమంలో వైద్యులు ఎంతో కష్టపడి అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి బరువు 280 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జహౌ ప్రస్తుతం వుహాన్ యూనివర్శిటీలో చికిత్స పొందుతున్నాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. రిపోర్టులు చూసి షాకయ్యారు. ఇంకొన్ని రోజులు అతడు అదే పరిస్థితిలో ఉండి ఉంటే గుండెనొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయేవాడని తెలిపారు. జూన్ 1న హాస్పిటల్లో చేరిన జహౌను ఐసీయూలో ఉంచి క్రమం తప్పకుండా మందులు ఇస్తున్నారు. ఫలితంగా జూన్ 11 నుంచి అతడిలో కాస్త మార్పు కనిపించినట్లు వైద్యులు వెల్లడించారు. గత ఐదు నెలలుగా అతడు ఇంట్లోనే కుర్చొని ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు తెలిపారు. కొంతమందిలో జన్యు సంబంధిత సమస్య వల్ల కూడా విపరీతంగా బరువు పెరిగిపోతారని, జహౌ అంత బరువు పెరగడానికి కూడా అదే కారణమని వైద్యులు తెలిపారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం ఇప్పుడు సాధ్యం కాదని.. అతడు ఇంకో 23 కిలోల బరువు తగ్గితే శస్త్ర చికిత్స చేయడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.(భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు) -
లావెక్కుతున్న కార్పొరేట్ ప్రపంచం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ‘ఫిట్నెస్’ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరో పక్క కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు బొజ్జలు పెంచుతూ లావెక్కుతున్నారు. కనుక వీరికి మధుమేహం, గుండెపోటు లాంటి ప్రాణాంతక జబ్బులు అనివార్యమవుతున్నాయి. దేశంలో మూడింట రెండు వంతుల మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు ‘బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)’ సగటున 25 ఉందని ‘హెల్దీఫైమీ’ అనే యాప్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. వారందరి మాస్, అంటే ద్రవ్యరాశి 24.9 ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మనిషి ఎత్తు, బరువును బట్టి బీఎంఐని నిర్ధారిస్తారు. ఎత్తును మీటర్లలో, బరువును కిలోల్లో లెక్కించి ద్రవ్యరాశిని లెక్కిస్తారు. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారి బీఎంఐ 25కు పైనే ఉంటుంది. ఎత్తుకు తగ్గ బరువుకన్నా తక్కువ బరువు ఉన్నవారే బీఎంఐకి 25లోపు వస్తారు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ వరకు కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం, మానసిక ఒత్తిడికి గురవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆర్థిక సర్వీసుల్లో, ఉత్పత్తిరంగాల్లో పనిచేస్తున్న వారి జీవన శైలి దాదాపు ఇలాగే ఉంటుంది కనుక వారు లావెక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వినిమయ సరుకులు, అతి వేగంగా అమ్ముడుపోయే వినిమయ సరకులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే వారి ఆరోగ్యం ఆర్థిక, ఉత్పత్తి రంగాల్లో పనిచేసే వారికన్నా మెరుగ్గానే ఉంటుంది. ఎందుకంటే భారతీయ ప్రమాణాల ప్రకారం వారు రోజు ఆఫీసు విధుల్లో వెయ్యి మెట్లు ఎక్కడానికయ్యేంత శ్రమను శారీరకంగా అనుభవిస్తారు. అందుకని వారు కాస్త ఫిట్‌గానే ఉంటారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లే కాకుండా గుమాస్తా గిరి చేసే ఉద్యోగులంతా లావెక్కడానికి మరొక ముఖ్య కారణం ఉంది. అదే ‘ఛాయ్... సమోసా’ కల్చర్. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసే వీరి సాయంత్రం వేళల్లో సరదాకు అన్నట్లు సమోసాల్లాంటి ఆయిల్లో మరిగించే పిండి పదార్థాలు తినడం బొజ్జ పెరగడానికి, లావెక్కడానికి ప్రధాన కారణమని ‘హెల్దీఫైమీ’ యాప్ ‘కార్పొరేట్ ఇండియా ఫిట్నెస్ రిపోర్ట్’లో వెల్లడించింది. ప్రొటీన్లు తక్కువ తిని, కొవ్వు పదార్థాలున్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్లనే సహజంగా స్థూలకాయం వస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. (చదవండి: ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!) -
‘అప్పుడు నా బరువు 96 కేజీలు’
నా చేతిలో ఉన్న సూట్ కేస్ చూసి మా అమ్మ నన్ను గుర్తుపట్టింది అంటున్నారు బాలీవుడ్ తాజా సెన్సేషన్, సైఫ్ అమృతా సింగ్‌ల గారాల పట్టి సారా అలీఖాన్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు సారా అలీఖాన్ దాదాపు 96 కేజీల బరువు ఉండేదంట. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు పీసీఓడి ఉండేది. దాంతో నేను చాలా చబ్బీగా ఉండేదాన్ని. కానీ ఉన్నత చదువుల కోసం ఎప్పుడైతే అమెరికా వెళ్లానో.. అప్పటి నుంచి నేను విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించాను. ఒకానొక సమయంలో నా బరువు 96 కేజీలు ఉండేది అంటూ చెప్పుకొచ్చారు సారా. అమెరికన్ తిండి వల్లే తాను ఇంతలా బరువు పెరిగానని చెప్పారు సారా. ‘అమెరికాలో పిజ్జా దొరుకుతుంది... చాకెలెట్ దొరుకుతుంది.. సలాడ్ కూడా దొరుకుతుంది. వీటన్నంటిని తినడంతో నేను బాగా లావయ్యాను’ అన్నారు. సారా మాట్లాడుతూ ‘అలాంటి సమయంలో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నాను. తొలుత ఈ విషయం గురించి మా అమ్మతో చెప్పినప్పుడు తను ముందు నువ్వు బరువు తగ్గు ఆ తర్వాతే.. సినిమాలు అన్నారు. అప్పటికి నా చదువు పూర్తవ్వడానికి ఇంకా రెండేళ్లు ఉంది. కానీ నేను ఒక్క సంవత్సరంలోను నా స్టడీస్‌ని కంప్లీట్ చేసుకుని.. మరో ఏడాదిలో నా బరువు తగ్గే ప్రయత్నాలు ప్రారంభించాను. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి అధిక బరువును తగ్గించుకున్నాను. తిరిగి ఇండియా వచ్చినప్పుడు.. మా అమ్మ కూడా నన్ను గుర్తు పట్టలేకపోయింది. నా చేతిలో ఉన్న సూట్‌కేస్ చూసి నన్ను గుర్తు పట్టింద’ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సారా రణ్వీర్ సింగ్సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు. -
రెండేళ్లలో ఎంత మార్పు...
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ నటుడు తన శరీర బరువు గురించి విపరీతమైన విమర్శలు ఎదుర్కోన్నారు. ‘మీరు బాగా లావెక్కుతున్నారు, తెగ చబ్బీ అవుతున్నారు చూడలేక పోతున్నామంటూ’ నెటిజన్లు ఈ నటున్ని తెగ ట్రోల్ చేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఫర్దీన్‌ను చూసిన వారు ముందు కాస్తా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. అంతేనా విమర్శలు ఇంత పని చేస్తాయా అనుకోక మానరు. ఫర్దీన్ ఎయిర్ పోర్టులో ఉండగా తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫర్దీన్ చాలా ఫిట్‌గా, పర్ఫేక్ట్ ఫిజిక్‌తో తనను విమర్శించిన వారందరి నోళ్లు మూయించాడు. ఈ విషయం గురించి ఫర్దీన్ ఖాన్ ‘నా శరీర బరువు గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తూ నా బుర్ర పాడు చేసుకోలేదు. నన్ను కామెంట్ చేసిన వారంతా నేను ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు కదా అనిపించింది. అందుకే ఫిట్నేస్పై శ్రద్ద పెట్టాను. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుతూ ‘ప్రతికూలంగా ట్రోల్ చేసేవారిని ప్రశ్నించకపోతే ఈ వెర్రి మరింత పెరిగిపోతుంది. ట్రోల్ చేసేవారు తామే కరెక్ట్ అనే భావనలోకి వెళ్లి పోతారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు అందరికి ఉంది. కానీ ఇలా చాటుగా (ఇంటర్నెట్లో)కాదు.. ధైర్యంగా ఎలుగెత్తి మీ అభిప్రాయాలను వ్యక్తపర్చండి’ అంటూ సలహా ఇచ్చారు -
బరువు పెరుగుతున్న అమెరికా
న్యూయార్క్: ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది పెద్దలు, పిల్లలు ఎక్కువ బరువు లేదా స్థూలకాయంతో బాధ పడుతున్నారు. అంటే ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మంది అధిక బరువుతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందులో అమెరికా ప్రజలే అన్ని దేశాల కన్నా ముందున్నారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పట్టణీకరణ, సరైన పోషకపదార్థాలు లేని ఆహారం తీసుకోవడం, వ్యాయామం లోపించడం ఇందుకు కారణాలని అధ్యయనం తేల్చింది. మొత్తం ప్రపంచ జనాభా దాదాపు 710 కోట్ల మందికాగా, వారిలో 220 మంది, అంటే వారిలో పిల్లలు ఐదుశాతం, పెద్దలు 12 శాతం అధిక బరువుతో బాధ పడుతున్నారు. అమెరికాలో 13 శాతం పిల్లలు, 35 శాతం పెద్ద వాళ్లు అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఈ అధిక బరువు కారణంగా కార్డియో వాస్కులర్ వ్యాధులు వచ్చి ఎక్కువ మంది పిన్న వయస్సులో చనిపోతున్నారు. అధిక బరువుతో బాధ పడుతున్న వారిలో 40 శాతం మంది అకాల మత్యువాత పడుతున్నారని వాషింఘ్టన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్రిస్టఫర్ ముర్రే తెలిపారు. స్థూలకాయం కారణంగా వారికి గుండె జబ్బులతోపాటు మధుమేహం, క్యాన్సర్ వస్తున్నాయని ఆయన తెలిపారు. అన్ని వయస్సుల గ్రూపుల్లోనూ మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువ బరువు పెరగుతున్నారు. జనాభా పరంగా చూసినట్లయితే చైనా, ఆ తర్వాత భారత దేశాలు అధిక బరువుతో బాధ పడుతున్నాయి. చైనాలో 1.53 కోట్ల మంది పిల్లలు, భారత్‌లో 1.44 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో బాధ పడుతున్నారు. బంగ్లాదేశ్, వియత్నాంలలో ఒక్క శాతం మంది మాత్రమే అధిక బరువుతో బాధ పడుతున్నారు. -
అమెరికాను వణికిస్తున్న అధిక బరువు
వాషింగ్టన్: అమెరికాలో మూడింట రెండు వంతుల మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ‘నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే’ ఆధారంగా 2007- 2012 సంవత్సరాలకు సంబంధించి విశ్లేషణ జరిపారు. 25 ఏళ్లు పైబడిన సుమారు 18.8 కోట్ల మంది వివరాలను పరిశీలించారు. 39.96 శాతం (3.63 కోట్ల మంది) పురుషులు, 29.74 శాతం (3.18 కోట్లమంది) మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. 35.04 శాతం మంది పురుషులు, 36.84 శాతం మంది మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.