బరువు తగ్గాలంటే.. వ్యాయామం చేయాలి.. డైట్ ఫాలో కావాలి.. అంతే కానీ ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేయడం వల్ల బరువు తగ్గడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇదేమైన కొత్త టెక్నిక్ అనుకుంటున్నారా.. అవుననే అంటుంది ఓ మహిళ. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లు డిలీట్ చేశాకే తాను ఏకంగా 32 కేజీల బరువు తగ్గినట్లు వెల్లడించింది. ఇదేలా సాధ్యం అయ్యిందో ఆమె మాటల్లోనే..
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితం అయ్యారు జనాలు. ఇంటి నుంచి పని చేస్తుండటంతో.. నోటికి కూడా బాగానే పని చెప్పారు. చాలా మంది లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా బరువు పెరిగారు. దాన్ని తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడ్డారు.. పడుతున్నారు.
(చదవండి: ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది)
ఈ కోవకు చెందిన మహిళే బ్రెండా ఫిన్. లాక్‌డౌన్‌లో కాలంలో బ్రెండా దాదాపు 38 కిలోల బరువు పెరిగింది. వెయిట్ తగ్గించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అసలు సమస్య ఎక్కడ ఉంది అని ఆలోచించిన బ్రెండాకు.. సోషల్ మీడియా అకౌంట్లే తనకు అతి పెద్ద అని శత్రువు అని తెలుసుకుంది. దీని గురించి బ్రెండా మాట్లాడుతూ..
‘‘నేను నా అధిక బరువు తగ్గించుకోవాలని చాలా ప్రయత్నించాను. ఆ సమయంలో సోషల్ మీడియా వినియోగించడంతో.. అందులో ఫుడ్‌కు సంబంధించి వచ్చే యాడ్స్.. నా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేవి. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ తినేదాన్ని. ఈ చెడు ఆహారపు అలవాట్లను మానుకోవడం నా వల్ల కాలేదు. కొన్ని రోజుల పాటు ఇలానే అయ్యింది. చివరకు సమస్య ఎక్కడ ఉందో అర్థం అయ్యింది’’ అని తెలిపింది బ్రెండా.
(చదవండి: అసలు చూస్తున్నది కిమ్‌నేనా? 20 కిలోలు తగ్గిండు.. మనిషి మారిండు)
‘‘వెంటనే నా సోషల్ మీడియా అకౌంట్లయిన ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లను డిలీట్ చేశాను. ఆ తర్వాత నా ఫోకస్ బాగా పెరిగింది. నాకు నేను సాకులు చెప్పుకోవడం కూడా మానేశాను. నా ప్రయత్నం విజయవంతం అయ్యింది. అధికంగా పెరిగిన 32 కేజీల బరువును తగ్గించుకున్నాను. ప్రస్తుతం నా పూర్వపు వెయిట్ 58 కిలోగ్రాములకు వచ్చాను. ఇప్పుడు నాకు నేను ఎంతో నచ్చుతున్నాను. నా నిర్ణయం సరైందే అని నాకు అర్థం అయ్యింది’’ అని తెలిపారు బ్రెండా.
చదవండి: రెండో కిలోలు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గినట్టే!
Comments
Please login to add a commentAdd a comment