నా చేతిలో ఉన్న సూట్ కేస్ చూసి మా అమ్మ నన్ను గుర్తుపట్టింది అంటున్నారు బాలీవుడ్ తాజా సెన్సేషన్, సైఫ్ అమృతా సింగ్‌ల గారాల పట్టి సారా అలీఖాన్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు సారా అలీఖాన్ దాదాపు 96 కేజీల బరువు ఉండేదంట. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు పీసీఓడి ఉండేది. దాంతో నేను చాలా చబ్బీగా ఉండేదాన్ని. కానీ ఉన్నత చదువుల కోసం ఎప్పుడైతే అమెరికా వెళ్లానో.. అప్పటి నుంచి నేను విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించాను. ఒకానొక సమయంలో నా బరువు 96 కేజీలు ఉండేది అంటూ చెప్పుకొచ్చారు సారా. అమెరికన్ తిండి వల్లే తాను ఇంతలా బరువు పెరిగానని చెప్పారు సారా.
‘అమెరికాలో పిజ్జా దొరుకుతుంది... చాకెలెట్ దొరుకుతుంది.. సలాడ్ కూడా దొరుకుతుంది. వీటన్నంటిని తినడంతో నేను బాగా లావయ్యాను’ అన్నారు. సారా మాట్లాడుతూ ‘అలాంటి సమయంలో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నాను. తొలుత ఈ విషయం గురించి మా అమ్మతో చెప్పినప్పుడు తను ముందు నువ్వు బరువు తగ్గు ఆ తర్వాతే.. సినిమాలు అన్నారు. అప్పటికి నా చదువు పూర్తవ్వడానికి ఇంకా రెండేళ్లు ఉంది. కానీ నేను ఒక్క సంవత్సరంలోను నా స్టడీస్‌ని కంప్లీట్ చేసుకుని.. మరో ఏడాదిలో నా బరువు తగ్గే ప్రయత్నాలు ప్రారంభించాను. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి అధిక బరువును తగ్గించుకున్నాను. తిరిగి ఇండియా వచ్చినప్పుడు.. మా అమ్మ కూడా నన్ను గుర్తు పట్టలేకపోయింది. నా చేతిలో ఉన్న సూట్‌కేస్ చూసి నన్ను గుర్తు పట్టింద’ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సారా రణ్‌వీర్ సింగ్‌సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment