![అమెరికాను వణికిస్తున్న అధిక బరువు](/styles/webp/s3/article_images/2017/09/3/71435138877_625x300.jpg.webp?itok=CD6hKNOY)
అమెరికాను వణికిస్తున్న అధిక బరువు
వాషింగ్టన్: అమెరికాలో మూడింట రెండు వంతుల మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ‘నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే’ ఆధారంగా 2007- 2012 సంవత్సరాలకు సంబంధించి విశ్లేషణ జరిపారు.
25 ఏళ్లు పైబడిన సుమారు 18.8 కోట్ల మంది వివరాలను పరిశీలించారు. 39.96 శాతం (3.63 కోట్ల మంది) పురుషులు, 29.74 శాతం (3.18 కోట్లమంది) మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. 35.04 శాతం మంది పురుషులు, 36.84 శాతం మంది మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.