washington university
-
సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!
ప్రస్తుత స్మార్ట్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ ఇల్లు లేదు అని చెప్పుకోవడంలో పెద్ద అతిశయోక్తి లేదు. అంతలా విస్తరించింది, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచం. అయితే, ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ కొనే ముందు తప్పక చూసే ఫీచర్స్‌లలో కెమెరా అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య కొన్ని కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం పెద్ద, పెద్ద కెమెరాల గల స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇవీ, పనితీరు పరంగా చూస్తే బాగానే ఉన్న, చూడాటానికి అంత బాగుండటం లేదు. దీనికి, ముఖ్య కారణం మన స్మార్ట్‌ఫోన్ కెమెరాల వెనుక ఉండే పెద్ద, పెద్ద కెమెరా బంప్స్. ఇలా కెమెరా బంప్స్ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ లుక్ కూడా దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రిన్స్టన్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. మన స్మార్ట్ఫోన్లు నానో కెమెరాలతో త్వరలో రానున్నాయి. మీరు నానో కెమెరా సైజ్ గురుంచి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది చూడాటానికి చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోబోటిక్స్ టెక్నాలజీ సహాయంతో నానో కెమెరాలను తయారు చేయవచ్చు అని పరిశోధకులు అన్నారు. ఈ అత్యంత చిన్న కెమెరాలో 1.6 మిలియన్ స్థూపాకార పోస్ట్‌లు ఉన్నాయి. ఇవి కాంతిని ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే?, ఈ నానో కెమెరా చిప్‌ను సంప్రదాయ కంప్యూటర్ చిప్స్ లాగా ఉత్పత్తి చేయవచ్చు. ఇవి అల్గోరిథంలపై ఆధారపడి పనిచేస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. నానో కెమెరాల కొత్త జెన్ ఔషధం, రోబోటిక్స్ లో ఉపయోగించే ప్రస్తుత నానో కెమెరా టెక్నాలజీతో సహాయంతో పనిచేస్తాయి. కొత్త నానో కెమెరాలతో చిత్రాలను సంప్రదాయ కెమెరాలతో సమానంగా పరిశోధకులు తీయగలిగారు. ఈ నానో కెమెరాలలో ఉపయోగించే కొత్త టెక్నాలజీని "మెటాసర్ఫేస్" అని పిలుస్తారు. దీనిలో సంప్రదాయ కెమెరా లోపల వక్రమైన కటకాలను నానో క్యామ్ ల ద్వారా ఉంచుతారు. ఇవీ, కేవలం అర మిల్లీమీటర్ వెడల్పుతో ఉంటాయి. పనితీరు పరంగా చూసిన ఇప్పుడు ఉన్న కెమెరాలతో సరిసమానంగా పనిచేస్తాయి అని వారు తెలిపారు. (చదవండి: ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా.. అదరగొట్టేస్తున్నాయ్!) -
ఐదు లోహాలు కలసి.. విషాన్ని ఇంధనం చేశాయి!
వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోందని తరచూ వింటుంటాం. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతీ మనకు తెలుసు. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐదు లోహాలతో తయారైన మిశ్రధాతువును ఉ్రత్పేరకంగా వాడటం ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను కార్బన్ మోనాక్సైడ్గా మార్చొచ్చని నిరూపించారు. ఈ కార్బన్ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్ మాదిరిగా నేరుగా ఇంధనంగా వాడుకోవచ్చు. లేదంటే కొన్ని రసాయన చర్యల ద్వారా అన్నింటికంటే మెరుగైన ఇంధనంగా చెప్పే హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చు. ఐదు లోహాలను కలపడం ద్వారా తయారైన సరికొత్త మిశ్రధాతువును ట్రాన్సిషన్ డై చాలకనాడులు అని పిలుస్తారు. అత్యంత పలుచగా ఉండే ఈ రకమైన మిశ్రధాతువులను ఎల్రక్టానిక్స్‌లో, ఆప్టికల్ పరికరాల్లో వాడుకోవచ్చని ఇప్పటికే తెలుసు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మిశ్రధాతువును రసాయన చర్యలకు ఉత్ప్రేరకంగా వాడొచ్చా అన్న అనుమానంతో పరిశోధనలు ప్రారంభించారు. కంప్యూటర్ మోడళ్ల సాయంతో ఈ ధాతువు తయారీకి అవసరమైన లోహ మిశ్రమాన్ని గుర్తించారు. మాలిబ్డినం, టంగ్స్టన్, వనాడియం, నియోబియం, టాన్టలం అనే ఐదు లోహాలను నిర్దిష్ట మోతాదుల్లో కలపడం ద్వారా కొత్త మిశ్రధాతువును తయారు చేయొచ్చని గుర్తించారు. ఈ మిశ్రధాతువును ఉపయోగించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ చాలా వేగంగా కార్బన్ మోనాక్సైడ్గా మారడాన్ని గుర్తించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ను కార్బన్ మోనాక్సైడ్గా మార్చుకుని ఇంధనంగా వాడుకోవచ్చు. -
ముక్కుద్వారా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు. మొత్తం నాలుగు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సి టీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్‌కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్‌లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. -
గున్యాతో కీళ్ల నొప్పులెలా..?
వాషింగ్టన్ : గున్యా జ్వరం వచ్చినప్పుడు భరించరాని స్థాయిలో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కీళ్ల నొప్పులకు, గున్యా వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సాధారణంగా గున్యా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ అనే జాతి దోమల కారణంగా గున్యా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌లో జన్యు పదార్థం సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ వైరస్ సోకినప్పుడు వెంటనే జ్వరం, వణుకు, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఎలాంటి మందులు ఇప్పటివరకు కనుక్కోలేదు. అయితే వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెబోరా లెన్స్హౌ అనే పరిశోధకురాలు.. ఈ వ్యాధి కారణంగా కీళ్ల నొప్పులు రావడానికి దారితీసే ప్రక్రియను గుర్తించారు. దీంతో ఈ వ్యాధికి మందులు కనుగొనేందుకు మార్గం సుగమమైందంటున్నారు. అయితే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు ఉండటానికి కారణాలను తెలుసుకునేందుకు లెన్స్హౌ ఈ వైరస్ సోకిన కణాలను శాశ్వతంగా మార్క్ చేసే సరికొత్త విధానాన్ని రూపొందించారు. -
పోయిందే.. ఇట్స్‌గాన్..
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు. ‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులతో పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాలపాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు. వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుసని, కానీ దాని వల్ల ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు. -
పెట్ యువర్ స్ట్రెస్ అవే!
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు. ‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’ పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులపై పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాల పాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు. వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుçసు కానీ, ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు. -
పాత తరం తిండితో మేలైన ఆరోగ్యం..
ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు పాత తరం తిండే మేలని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యత చాలా తక్కువని ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని శాస్త్రవేత్త లారా ఇయనోట్టి తెలిపారు. పాతతరం ఆహారం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని పేర్కొ న్నారు. పరిశోధన వివరాలు న్యూట్రీషన్ రివ్యూస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ ఆహారం వల్ల కాలక్రమంలో మానవ జన్యుక్రమంలోనూ వైవిధ్యత వచ్చి చేరిందని చెప్పారు. పాతకాలపు తిండి అలవాట్లను మరింత ఎక్కువగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని లారా చెప్పారు. అతిగా శుద్ధి చేసిన పదార్థాలు.. మరీ ముఖ్యంగా తిండిగింజల నుంచి తయారు చేసే నూనెలు, పిండి పదార్థాలు, చక్కెరలు పాతకాలపు ఆహారంలో లేవని, ఇవి చేరడం వల్లే ప్రస్తుతం పోషకాహార లోపం సమస్య ఎక్కువవుతోందని వివరించారు. -
‘కారు’ చీకట్లు, 12లక్షల మంది బలి!
- బస్సుల్లో కంటే కార్లలోనే కాలుష్యం ముప్పు ఎక్కువ - దేశంలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం - ఏటా 12లక్షల మంది మృత్యువాత - ఢిల్లీ ఐఐటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనం సాక్షి, అమరావతి బ్యూరో : కారు ప్రయాణికులు కూడా కాలుష్యం బారిన పడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దిల్లీ ఐఐటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా దిల్లీలో వాహన కాలుష్యంపై అధ్యయనం నిర్వహించాయి. అత్యంత ప్రమాదకర వ్యర్థ పదార్థం బ్లాక్ కార్బన్ మసి ప్రయాణికులపై కలిగిస్తున్న దుష్ప్రభావాన్ని ప్రధానంగా పరిశీలించారు. ఆ అధ్యయన నివేదిక పర్యావరణ సమాచార పత్రిక ‘ఎల్సేవియర్ జర్నల్’లో ప్రచురించారు. అందరికంటే ఎక్కువగా రిక్షా ప్రయాణికులు కాలుష్యం బారిన పడుతున్నారని వెల్లడైంది. రెండో స్థానంలో ఆటో ప్రయాణికులు, మూడో స్థానంలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. సీఎన్జీ సిటీ బస్సు ప్రయాణికులు, కారు ప్రయాణికులపై కూడా కాలుష్యం ప్రభావ అంశం అందర్నీ విస్మయపరిచింది. సీఎన్జీ సిటీ బస్సులో ప్రయాణికుల కంటే డీజిల్ కారులో ప్రయాణికులు ఎక్కువగా ‘బ్లాక్ కార్బన్’ బారిన పడుతున్నారని వెల్లడైంది. దిల్లీలో అన్నీ సీఎన్జీ సిటీ బస్సులే ఉన్నాయి. విజయవాడలో దాదాపు 300 సీఎన్జీ సిటీ బస్సులున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 200 సీఎన్జీ బస్సులున్నాయి. కాబట్టి ఆ అధ్యయనం విజయవాడ, హైదరాబాద్‌లలో సిటీ బస్సు, కారు ప్రయాణిలకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కార్బన్... అత్యంత ప్రమాదకారకం వాహనాలు ప్రయాణించేటప్పుడు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనం మండుతూ బ్లాక్ కార్బన్ మసిని వెదజల్లుతాయి. బ్లాక్ కార్బన్ మసి చాలా తేలికగా ఉంటుంది. తల వెంట్రుక కంటే తేలికగా ఉండే ఈ ధూళి కణం మనం పీల్చే గాలి ద్వారా చాలా సులువుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఏటా 12లక్షల మంది బలి వాయు కాలుష్యంవల్ల దేశంలో ఏటా 12లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారని గ్రీన్ పీస్ ఇండియా నివేదికలో వెల్లడించింది. అందుకు ప్రధాన కారణం వాతావరణంలోని బ్లాక్ కార్బన్ మసే. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. హృద్రోగాలు ఎక్కువవుతున్నాయి. క్యాన్సర్‌కి దారితీస్తోందని వెల్లడైంది. అందువల్లే ఏటా 12లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు. దానివల్ల దాదాపు 3 శాతం జీడీపీని దేశం నష్టపోతోంది. దేశంలో పొగాకు ఉత్పత్తులు సేవించడంవల్ల కూడా ఏటా 12.50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. దీనిపై మరింతగా అధ్యయనం చేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సీఎన్జీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ప్రజలు మరింతగా సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడుతున్నారు. -
మెదడు గురించి మరింత తెలిసింది..
97 కొత్త ప్రాంతాలను గుర్తించిన వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు మన శరీరంలోని అవయవాల వివరాల ఎంత ఎక్కువ తెలిస్తే వైద్యం అంత పురోగమిస్తుంది. గుండె మొదలుకొని ఇతర అవయవాలన్నింటి విషయంలో జరిగింది అదే. అయితే వందేళ్ల పరిశోధనల తరువాత కూడా మన మెదడు గురించి తెలిసింది చాలా తక్కువంటే ఆశ్చర్యం అనిపించకమానదు. హ్యూమన్ కనెక్టోమ్ ప్రాజెక్టు పుణ్యమా అని ఇప్పుడీ పరిస్థితిలో కొంచెం మార్పు రానుంది. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్టు మన మెదడులో మనకు తెలియని 97 కొత్త ప్రాంతాల వివరాలు అందించింది. వందల కోట్ల న్యూరాన్లు... అంతకుమించిన సైనాప్స్ (న్యూరాన్ల మధ్య సంబంధాలు) ఆక్సాన్లతో కూడిన మన మెదడు అతి సంక్లిష్టమైన అవయవమనడంలో సందేహం లేదు. దీన్ని అర్థం చేసుకునేందుకు వందేళ్లకుపైగా ప్రయత్నాలూ జరుగుతున్నాయి. 1909లో కొర్బినియన్ బ్రాడ్‌మాన్ అనే న్యూరోసైంటిస్ట్ తొలిసారి మెదడులో ఉండే వేర్వేరు కణాల ఆధారంగా సెర్రిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో దాదాపు 43 వేర్వేరు ప్రాంతాలున్నట్లు ఒక మ్యాప్‌ను సిద్ధం చేశారు. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల్లో ఈ ప్రాంతాల సంఖ్య 83కు చేరింది. తాజా పరిశోధనల ఫలితంగా ప్రస్తుతమిది 180కు చేరింది. ఎలా గుర్తించారు...? మెదడులోని కొత్త ప్రాంతాలను గుర్తించేందుకు 210 మంది ఆరోగ్యవంతులైన మానవుల ఎంఆర్ఐలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. కార్యకలాపాలు, నిర్మాణం వంటి వేర్వేరు అంశాల ద్వారా మెదడులో ఉండే ప్రత్యేక ప్రాంతాలను నిర్వచించారు. దాంతోపాటు కార్టెక్స్ మందాన్ని కూడా ఉపయోగించారు. ఒక్కో మనిషి మెదడు సైజు, నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి తాము గుర్తించిన ప్రాంతాలు కరెక్టేనా కాదా? అన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా మరో 210 మంది మెదడు ఎంఆర్ఐలతో పోల్చి చూశారు. తాము గుర్తించిన 97 ప్రాంతాలు ఇతరుల్లోనూ ఉన్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ ఎంత కచ్చితంగా పనిచేసిందంటే... కొంతమందిలో భాషకు సంబంధించిన ప్రాంతం రెండుగా విడిపోయిందని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఒక ప్రాంతం అనుకుంటున్నది కాస్తా 12 చిన్న భాగాలుగా విడిపోయి ఉందని తెలిసింది. తాము సృష్టించిన మ్యాప్‌ను మరింత విస్తృతంగా అధ్యయనం చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని అంటున్నారు. పరిశోధన వివరాలు సుప్రసిద్ధ సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. - సాక్షి, హైదరాబాద్ -
ప్రాణం పోయాక జన్యువులు బతుకుతాయట!
వాషింగ్టన్: మనిషి చనిపోయాక ఏమవుతాడు! ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్న. మనిషి చనిపోయాక శరీరం చల్లబడుతుందని, ప్రతి జీవాణువు చలనరహితమై నశించి పోతుందని, అంతా శూన్యం ఏర్పడుతుందని విజ్ఞానపరులు చెబుతారు. జీవం ఎగిరిపోయాకే మనిషి చనిపోతాడని, జీవం ఆత్మరూపంలో సంచరిస్తుందని, మరో జన్మగా అవతారం ఎత్తుతుందని కొందరు విశ్వాసకుల అభిప్రాయం. చనిపోవడం అంటే ఏమిటీ? చనిపోయిన తర్వాత మనిషిని బతికించవచ్చా ? అన్న దిశగా విజ్ఞాన జిజ్ఞాస కలిగిన శోధకులు మాత్రం నిరంతరంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చనిపోయాక కూడా మనిషి శరీరంలోని కొన్ని జన్యువులు బతికే ఉంటాయని, చనిపోయిన తర్వాతనే అవి క్రియాశీలకంగా మారుతాయని నేటి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారు ఈ అభిప్రాయానికి రావడానికి కారణం ఎలుకలు, జీబ్రా చేప, మరికొన్ని జంతువులపై వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రెండు ల్యాబుల్లో ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైన అద్భుత విషయాలే కారణం. రకరకాల జంతువుల్లో 1063 జన్యువులు శరీరానికి ప్రాణం ఉన్నంతకాలం స్తబ్దుగా ఉంటాయని, చనిపోయిన తర్వాత అవి క్రియాశీలకంగా మారుతాయని వారి పరిశోధనల్లో తాజాగా తేలింది. ఇదే ప్రక్రియ మానవుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వారు అంటున్నారు. దీనివల్ల చనిపోయిన మనిషిని బతికించలేకపోయినా, పాడై పోయిన అవయవాన్ని మార్పిడి చేసేందుకు కావాల్సినంత సమయం చిక్కుతుందన్నది వారి అభిప్రాయం. చనిపోయిన జంతువుల్లోని ఆర్ఎన్ఏను విశ్లేషించగా ప్రాణం పోయాక వాటిలో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న జన్యువులు 24 నుంచి 48 గంటల్లోగా క్రియాశీలకంకాగా, కొన్ని జంతువుల్లో రెండు, మూడు రోజుల తర్వాత కూడా క్రియాశీలకంగా మారాయని యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు. ఇవి ప్రాణి శరీరంలోని వ్యవస్థలన్నింటినీ మూసివేయడంలో భాగంగా జరుగుతుందని భావించినప్పటికీ ప్రాణం పోయాక కూడా జన్యువులు బతికి ఉండడం, అవి క్రియాశీలకంగా మారుతున్నాయని తెలియడం విశేషమని, భవిష్యత్తులో మనిషికి ప్రాణంపోసే దిశగా ఉపయోగపడే ముందడుగని వారు అంటున్నారు. -
బరువు తగ్గటానికి బెలూనే బెటర్!
వాషింగ్టన్: ఒబెసిటీ.. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయత్వంతో బాధపడే వారి సంఖ్య 640 మిలియన్లుగా పైగా ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరి వెయిట్ లాస్ కోసం స్థూలకాయులు చేస్తున్న సాధారణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే తక్కువనే చెప్పాలి. అహారం తక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజులు చేయటం లాంటి చిన్నచిన్న మార్పులతో టోటల్ బాడీ వెయిట్లో కలిగే వెయిట్ లాస్ సరాసరి 3.59 శాతంగానే ఉందట. అయితే, పొట్టలో గ్యాస్‌తో నింపబడిన ఒబలాన్ బెలూన్ వాడుతున్న స్థూలకాయుల్లో మాత్రం ఈ యావరేజ్ వెయిట్ లాస్ 6.81 శాతంగా ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అహార నియమాలు పాటించడం, ఎక్సర్సైజ్లు లాంటి ప్రయత్నాలతో బాడీ వెయిట్‌ను తగ్గించుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి బెలూన్ ట్రీట్మెంట్ చక్కని పరిష్కారం అని పరిశోధనకు నేతృత్వం వహించిన షల్బీ సల్లీవాన్ తెలిపారు. -
అమెరికాను వణికిస్తున్న అధిక బరువు
వాషింగ్టన్: అమెరికాలో మూడింట రెండు వంతుల మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని తాజా సర్వేలో తేలింది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ‘నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే’ ఆధారంగా 2007- 2012 సంవత్సరాలకు సంబంధించి విశ్లేషణ జరిపారు. 25 ఏళ్లు పైబడిన సుమారు 18.8 కోట్ల మంది వివరాలను పరిశీలించారు. 39.96 శాతం (3.63 కోట్ల మంది) పురుషులు, 29.74 శాతం (3.18 కోట్లమంది) మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. 35.04 శాతం మంది పురుషులు, 36.84 శాతం మంది మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. -
మహిళలకు అండగా కొత్త మొబైల్ యాప్