
ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు పాత తరం తిండే మేలని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యత చాలా తక్కువని ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని శాస్త్రవేత్త లారా ఇయనోట్టి తెలిపారు. పాతతరం ఆహారం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని పేర్కొ న్నారు.
పరిశోధన వివరాలు న్యూట్రీషన్ రివ్యూస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ ఆహారం వల్ల కాలక్రమంలో మానవ జన్యుక్రమంలోనూ వైవిధ్యత వచ్చి చేరిందని చెప్పారు. పాతకాలపు తిండి అలవాట్లను మరింత ఎక్కువగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని లారా చెప్పారు. అతిగా శుద్ధి చేసిన పదార్థాలు.. మరీ ముఖ్యంగా తిండిగింజల నుంచి తయారు చేసే నూనెలు, పిండి పదార్థాలు, చక్కెరలు పాతకాలపు ఆహారంలో లేవని, ఇవి చేరడం వల్లే ప్రస్తుతం పోషకాహార లోపం సమస్య ఎక్కువవుతోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment