nutrition food
-
యువతలో పోషకలోపం..
దేశంలో 81 శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రదిన్, నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదలచేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వేలో 20 మిలియన్ల మంది 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు గల యువత నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 96 శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మపోషకాలు, మలీ్టవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు,నిత్యం ఉద్యోగంలో, ఇతర పనుల్లో అన్ని స్థాయిల్లోనూ వేగంగా అలసటకు గురవుతున్నారట. పెరుగుతున్న పోషకాహార లోపంపై అవగాహన కలి్పంచడం, స్వీయ సంరక్షణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. సర్వే సంస్థ వన్ నేషన్ 100% న్యూట్రిషన్ మిషన్‌లో భాగంగా ఉద్యోగ, శ్రామిక జనాభాలో అలసట పెరుగుతోందని తేలింది. ఈ సమస్యకు గల కారణాలు, పరిష్కార మార్గాలు, తక్షణ పోషక విలువలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు అందులో వివరించారు. విధి నిర్వహణలో 83 శాతం మంది అలసట కారణంగా తరచూ విరామాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. 74 శాతం మంది పగటిపూట నిద్రతో ఇబ్బంది పడుతున్నారు. 69 శాతం మంది పనులు ప్రారంభించడం లేదా పూర్తి చేయడం కష్టంగా ఉందని తెలిపారు. 66 శాతం మంది రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతున్నామని, 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారిలో 78% మంది, 36 ఏళ్ల నుంచి 45 ఏళ్లలో 72% మంది పగటిపూట మగతగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.ముందే గుర్తించారు.. యువతలో అలసట పెరగడం చాలా మంది ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార అంతరాలను తగ్గించడానికి మలీ్టవిటమిన్లను ప్రోత్సహించడం ద్వారా 70% వరకూ అవసరమైన సూక్ష్మపోషకాలను అందించవచ్చు. రోజువారీ సప్లిమెంట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. – డాక్టర్ కేతన్ కె మెహతా, సీనియర్ కన్సల్టెంట్ ఇంటికి వచ్చేసరికే నీరసం.. నగర జీవనంలో శారీరక వ్యాయామం తగ్గుతోంది. నిత్యం పని ఒత్తిడి ఉంటోంది. ఇటువంటి సందర్భంలో అలసటకు గురవుతున్నాం. దీనికి తగ్గట్లే ఆఫీస్‌లో విరామం ఇస్తున్నారు. ఇంటికి వచ్చే సరికి నీరసం అనిపిస్తుంది. సెలవు రోజుల్లో ప్రశాతంగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాం. – ఆలేటి గోపి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, కొండాపూర్ -
ఆ వ్యాధులకు ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వల్ల మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘవ్యాధుల వస్తాయని అందరికీ తెలిసిందే. నిపుణులు కూడా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ చాలామంది వాటిని తినే అలవాటుని మానుకోరు. పైగా అందుకు తగ్గట్టు యాడ్లు కూడా ఆకర్షణీయంగా వస్తాయి. అందులోనూ ప్రముఖులు, సెలబ్రెటీలే వాటిని ప్రమోట్ చేయడంతో నిపుణుల సలహాలను పక్కకు పెట్టేస్తుంటారు. అందువల్లే దేశమంతటా ఊబకాయం, మధుమేహ వ్యాధుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడూ ఆ విషయం నిపుణులు జరిపిన తాజా నివేదికలో తేలింది. ఆయా ఫుడ్స్ యాడ్స్ తప్పుదారి పట్టించి..తినేలా ప్రేరేపిస్తున్నట్లు న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్ఏపీఐ) 50 షేడ్స్ ఆఫ్ ఫుడ్ అడ్వర్టైజింగ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో ఢిల్లీలో అందుబాటులో ఉన్న ప్రముఖ, ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో వస్తున్న సుమారు 50 ఫుడ్ ప్రకటనలను పరిశీలించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. భావోద్వేగాలు రేకెత్తించేలా అనారోగ్యకరమైన ఆ ఆహార ఉత్పత్తులను ప్రముఖులచే అడ్వర్టైజింగ్ చేపించి, వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలోనూ, సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్ఏపీఐ) కన్వీనర్, పీడియాట్రిక్ అరుణ్ గుప్తా నివేదించారు. అంతేగాదు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వస్తున్న వాణిజ్య ప్రకటనలపై ముగింపు పలికేలా ప్రస్తుత నిబంధనలను సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఆయా ప్రొడక్ట్‌లు వందగ్రాములు/మిల్లీ లీటర్‌కు ఎన్ని పోషకాలు ఉంటున్నాయనేది బోల్డ్ అక్షరాలతో బహిర్గం చేసే చర్యలకు పిలుపునిచ్చారు. కాగా, ఇటీవలే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఈ ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో 10 ఏళ్లలోపు వయసుగల పిల్లల్లో పదిశాతానికి పైగా ఎక్కువ మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారని పేర్కొంది.(చదవండి: అరటి కాండంతో చాట్..! ఎప్పుడైనా ట్రై చేశారా..?) -
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్‌ను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డెరెక్టర్ డాక్టర్. హేమలత బుధవారం విడుదల చేశారు.ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.8. నాణ్యమైన ప్రోటిన్, ఆమైనో యాసిడ్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.9. జీవనశైలిలో ఉబకాయం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.15. అధిక కొవ్వు, తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్ లెబుల్స్‌ను చదవాలి. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్‌గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్‌లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్‌లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్‌ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్‌లో ‘మీ స్కూల్ కరిక్యులమ్‌లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్‌తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్‌లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
ఇంటర్నేషనల్ ఫుడ్ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?
World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు మీకోసం.. 1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్ ఫుడ్ డే ధీమ్ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోంది మీకు తెలుసా? మీకు తెలుసా... ►ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్ ఫుడ్ డేను ఆచరిస్తున్నాం. ► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు. ►ఇజ్రాయెల్ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది. ►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. ► కోవిడ్-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. Water is not an infinite resource. We need to stop taking it for granted. What we eat and how that food is produced all affect water. On #WorldFoodDay @FAO calls on countries to take greater #WaterAction for food.https://t.co/DKBqAUky9y pic.twitter.com/I3TYWf4LrL — UN Environment Programme (@UNEP) October 16, 2023 ► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. ►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు ఆకలి సూచీలో అధోగతి -
తగ్గేదేలే.. ప్రతీ నెలా నాన్‌వెజ్ కోసం రూ.240కోట్లు ఖర్చు చేస్తున్న జనాలు
ప్రపంచం మారుతోంది. ఆర్థికంగా ప్రతీ కుటుంబం బలపడుతోంది. జీవన విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంపాదనలో దాచుకునే కాలం నుంచి సంపాదించిన సొమ్ములో సంతోషంగా జీవించడానికి సరిపడా ఖర్చు చేసి మిగిలిందే దాచుకుందాం అనే ధోరణి కనిపిస్తోంది. సంపాదనలో అత్యధిక శాతం విద్య, ఆహారం, ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు ఇస్తే చాలు అదే వాళ్లకు ఆస్తి అనే భావనతో చాలామంది విద్య విషయంలో రాజీ పడటం లేదు. ఆ తర్వాత మంచి పోషకాహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి కర్నూలు: పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ముఖ్యంగా పేదరికం అత్యధికంగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. బతకడం కోసం మరో ప్రాంతానికి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా శ్రమించి తినీతినక ప్రతి రూపాయి దాచుకొని బతుకీడ్చేవారు.ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఆర్థిక భరోసా లభిస్తోంది. వారి కష్టానికి ప్రభుత్వ సాయం దన్నుగా నిలుస్తోంది. దీంతో పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో చైతన్యం కూడా అధికమైంది. జీవన విధానంలో ప్రాధాన్యతలు గ్రహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే భావనకు వచ్చారు. ఆరోగ్యానికీ ప్రాధాన్యత ప్రతి వందమందిలో 63శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 2030కి ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో చనిపోతారని స్పష్టం చేసింది. ఎన్సీడీ(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వ్యాధుల బారిన పడుతున్నారు. 35 ఏళ్లుదాటితే హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్, బీపీ వస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే 18 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్సీడీ బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. మంచి ఆహారం, వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ఫిట్నెస్, జుంబా సెంటర్లకు వెళ్తున్నారు. పిల్లలను ఏదో ఒక స్పోర్ట్‌లో చేర్పిస్తే శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని స్పోర్ట్స్‌వైపు పంపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం వయస్సుకు తగ్గట్లు బరువు ఉన్నవారు 2019కి ముందు 90 శాతంలోపు ఉంటే 2022లో 93.82 శాతం ఉన్నారు.2023లో 94.15 శాతంఉన్నారు. దీన్నిబట్టే పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గుతోందని స్పష్టమవుతోంది. పోషకాహారం కోసం ఖర్చులో తగ్గేదేలే.. 10–15ఏళ్ల కిందట కిరాణా మినహా ఏదైనా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనాలంటే జేబులో డబ్బులు చూసేవారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం మినహా ప్రత్యేకంగా పండ్లు, మాంసంపై దృష్టి సారించేవారు కాదు. పండుగలు, బంధువులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనే నాన్‌వెజ్ ఉండేది. ఇప్పుడు ప్రతీవారం కచ్చితంగా, కొందరు వారంలో 2, 3 సార్లు నాన్‌వెజ్ తీసుకుంటున్నారు. అలాగే డ్రైప్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. చాలామంది బాదం, పిస్తా, ఖర్జూర, కాజు, ఆఫ్రికాట్స్తో పాటు పలు రకాల డ్రైప్రూట్స్ కొంటున్నారు. పిల్లలకు రోజూ డ్రైప్రూట్స్ ఇస్తే పటిష్టంగా ఉంటారనే భావనకు వచ్చారు. ఏదైనా బేకరీ, డ్రైప్రూట్స్ లేదా మరో దుకాణానికి వెళితే ధరలు అడగకుండా కావల్సింది తీసుకుని బిల్లు చూసి ఫోన్‌పే చేసి వస్తున్నారు. దీంతో పాటు మిల్లెట్స్ వినియోగం కూడా పెరిగింది. కొర్రలు, అరికెలు, కినోవాతో పాటు మిల్లెట్స్ తినేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ పోషకాహారం తీసుకోవడంలో భాగమే. వీటన్నిటి కంటే ప్రధానమైంది మాంసాహారం. వారంలో ఒకరోజు.. కనీసం నెలలో ఒక రోజు ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్లే సంస్కృతి పెరిగింది. ప్రతీ నెలా నాన్‌వెజ్ ఖర్చు రూ.240కోట్లు దేశంలోని 29 రాష్ట్రాల్లో మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 98.4శాతం పురుషులు, 98.1శాతం సీ్త్రలు మాంసాహారం తీసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చివరిస్థానంలో రాజస్తాన్ ఉంది. అయితే ఎన్ఎఫ్హెచ్ఎస్–5(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రాంతాల వారీగా 33,755 మంది సీ్త్రలు, 5,048 మంది పురుషులతో 2019–20లో సర్వే నిర్వహించింది. ఇందులో మహిళలు 71.8శాతం, పురుషులు 83.2శాతం మాంసాహారం తీసుకుంటున్నట్లు తేలింది. కోవిడ్ తర్వాత ప్రతీ జిల్లాలో మాంసాహార వినియోగం అధికమైంది. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా 5వేల మెట్రిక్ టన్నుల మాంసాహారం వినియోగిస్తున్నారు. ఇందులో 2,400 టన్నులు చికెన్, 1600 టన్నులు చేపలు, 1400 టన్నుల మటన్ ఉంటోంది. దీనికి నెలకు రూ.209కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాకుండా కోడిగుడ్లు, బీఫ్, ఫోర్క్, కంజు ఇతర మాంసాహార ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.240కోట్లు మాంసాహారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది. -
పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులు.. రోజూ ఏం తినాలంటే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో పోషణ మాసోత్సవాన్ని చేపట్టారు. తద్వారా ఆరోగ్యకరంగా జీవించేందుకు బాటలు వేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నగరంతో సహా శివారు జిల్లాలైన మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డిలలో పోషకాల లోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పోషకాలపై అవగాహన కల్పించి, పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించే మాసోత్సవాన్ని పోషణ్ అభియాన్ పేరుతో ఈ నెలాఖరు వరకు ఆయా జిల్లా సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇదీ లక్ష్యం.. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలతో తల్లిదండ్రులను చైతన్యం చేస్తారు. పోషకాహార లోపం లేని తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గర్భిణులు మిటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. బహుమతుల ప్రదానం పోషణ మాసోత్సవంలో భాగంగా నగరంతో సహా శివారు జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో పిల్లల ఎత్తు, బరువు చూస్తారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు బహుమతులు అందజేస్తారు. రక్తహీనత శిబిరాలు నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం వల్ల.. మాసోత్సవాల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు పాలు, పండ్లు సూచిస్తున్నారు. యువజన, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. బరువు లేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసోత్సవాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసోత్సవం సజావుగా సాగేలా చూస్తున్నాం. వయస్సుకు తగ్గ బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై వారికి వివరిస్తున్నాం. – కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి, మేడ్చల్–మల్కాజిగిరి. -
పీరియడ్స్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
పూర్వం 15 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్లు కాబట్టి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని ఆ సమయంలో నేతితో తయారు చేసిన స్వీట్లు ఎక్కువగా తినిపించేవాళ్లు. నిజానికి రజస్వల అయినప్పుడే కాదు, ఏ వయసు పిల్లలకయినా స్వీట్లు, నేతి పదార్థాలు ఎక్కువగా పెట్టకూడదు. పైగా రజస్వల అయిన పిల్లలను కొద్దికాలం పాటు ఇంటికే పరిమితం చేస్తారు కాబట్టి పిల్లలు ఆ కొద్దిరోజుల్లో విపరీతంగా బరువు పెరగటంతో పాటు ఆ ఆహార శైలికి అలవాటు పడి అలాగే కొనసాగుతారు. అధిక బరువు వల్ల హర్మోన్లలో అవకతవకలు మొదలవుతాయి. ఇది ప్రమాదకరం.రజస్వల సమయంలో హార్మోన్ల స్రావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రక్తస్రావం ఎక్కువగా ఉండి ఐరన్ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా ఇవ్వాలి. క్యాల్షియం, విటమిన్ డి లోపాలు రాకుండా పాలు ఇవ్వడంతో పాటు వేరుసెనగ పప్పు, బెల్లం, ఖర్జూరాలు, పప్పులు, అటుకులు, రాగులు, నువ్వులతో తయారుచేసిన చిరుతిళ్లు తినిపించాలి. -
అలాంటి వారు నేరేడు పండ్లు తినకపోవడమే మంచిది!
వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు.ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.తియ్యగా, పుల్లగా పంటికి భలే రుచికరంగా ఉండే ఈ పండ్లు వర్షాకాలంలో విరివిగా దొరుకుతాయి. పండు పోషకాల గని, అనారోగ్యాల నివారిణి కూడా. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి తో అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేరుడుతో భలే ప్రయోజనాలు ► నేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి.నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. ► డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది ► ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి ► మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిది ► నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.. ► నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ► నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ► నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఈ సమస్యలు ఉంటే తినకూడదు నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం. అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ఉంది. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని,వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నేరేడు పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయని, అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి. -
‘గుడ్లు’తేలేస్తుండ్రు... బెంబేలెత్తిస్తున్న కోడిగుడ్ల ధర
దౌల్తాబాద్: మధ్య తరగతి ప్రజల పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా మరో వైపు చికెన్, మటన్, చేపల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ధర కూడా అమాంతంగా పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం.. ఆరోగ్యంగా ఉండాలంటే బలవర్ధకమైన పౌష్టికాహారం తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాన్యులు ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తారు. ఇమ్యూనిటినీ పెంచుకోవడం కోసం ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటం విశేషం. మండలంలో కోడిగుడ్లు ఉత్పత్తి అంతంత మాత్రంగా నే ఉండడంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి పౌల్ట్రిఫాం రైతులు నష్టాలు చవిచూడడం.. కోడిపల్లల పెంపకాన్ని తగ్గించడంతో గుడ్ల ధరల పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటునారు. గత ఏప్రిల్‌లో గడ్డు ధర రూ.4నుంచి రూ.4.50వరకు ఉండగా ప్రస్తుతం రిటైల్‌గా రూ.6.50 వరకు ఉంది. ఓల్‌సేల్ వ్యాపారులు మార్కెట్ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ రిటైల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
World Food Safety Day 2023: కలుషితాహారానికి 4.2 లక్షల మంది బలి!
ఆహారం బాగుంటే అది మనకు జవసత్వాలనిస్తుంది. అది కలుషితమైతే మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది.. ఒక్కోసారి ప్రాణాన్నే తీస్తుంది! అందుకని, మనకు ప్రమాణాలతో కూడిన శుద్ధమైన ఆహారం కావాలి. ఆహార భద్రతలో దీని పాత్ర కీలకం. అంతే కాదు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కలుషిత లేదా నాణ్యత లేని ఆహారం వల్ల ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది దాదాపు 200 రకాల అనారోగ్యాల పాలవుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, యువతే. ఇందులో ప్రతి ఏటా 4 లక్షల 20 వేల మంది చనిపోతున్నారు. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను అరికడితే ఈ మరణాలను నివారించవచ్చు. అందుకే, ఈ అంశంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి 10 మందిలో ఒకరు! ►ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. పేద, ధనిక అని తేడా లేదు. అన్ని దేశాల్లోనూ ఆహార నాణ్యతా సమస్యలు తలెత్తుతున్నాయి. ►బాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా భార లోహాలు వంటి రసాయన పదార్థాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులైన పిల్లలు జనాభాలో 9 శాతం ఉన్నారు, అయితే, ఆహార వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మంది వీరే. ► అందువల్ల ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తే.. అవి అందరి ప్రాణాలనే కాదు, అనేకమంది జీవనోపాధిని కూడా కాపాడతాయి. ►వినియోగదారులను రక్షించడంలో, ఆహారోత్పత్తిపై విశ్వాసాన్ని కలిగించడంలో ఆహార భద్రతా ప్రమాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ► ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా 1963లో ఏర్పాటైన కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్.. గత 60 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ►236 ప్రమాణాలు, 84 మార్గదర్శకాలు, 56 ఆచరణాత్మక నియమాలు ఉన్నాయి. ఆహారంలో కలుషితాల గరిష్ట స్థాయికి సంబంధించిన 126 ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. వీటితో పాటు.. ఆహారోత్పత్తుల తయారీ ప్రక్రియలో కలిపే పదార్థాలకు సంబంధించి.. పురుగుమందుల అవశేషాలు, పశువైద్యంలో వాడే ఔషధాల అవశేషాల గరిష్ట స్థాయిలకు సంబంధించిన 10 వేలకు పైగా పరిమాణాత్మక ప్రమాణాలను కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ నిర్దేశిస్తోంది. ►పశువైద్యంలో ఉపయోగించే యాంటీమైక్రోబయల్ ఔషధాలకు లొంగని మొండి సూక్ష్మక్రిములతో సోకే ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ మరణాలను తగ్గించేందుకు కూడా ఆహార భద్రతా ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. 2016 నుంచి 50 అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ► సురక్షితమైన, పోషకవంతమైన ఆహారం మేధో, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పిల్లల పెరుగుదలకు, అభివృద్ధికి దోహదపడుతుంది. ►ఐరాస నిర్దేశిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆహార భద్రతా ప్రమాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
కరీంనగర్ శిరీష: రూ. 50 లక్షల ‘ఇమ్మన’ ఫెలోషిప్! పోషకాహారంపై
గ్రామీణ–పట్టణ కుటుంబాల్లో పోషకాహార లేమి ఏ విధంగా ఉందో మూలాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కరీంనగర్ వాసి శిరీష జునుతులకు ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ మెట్రిక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ ఆక్షన్స్ (ఇమ్మన)నుంచి యాభై లక్షల రూపాయల ఫెలోషిప్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌ను ఆరుగురు అందుకోగా వారిలో మన దేశం నుంచి శిరీష ఒక్కరే కావడం విశేషం. ఫెలోషిప్ వివరాలతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగాల్లో తను చేస్తున్న కృషి గురించి వివరించింది శిరీష. ‘‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో పీహెచ్డీ చేశాను. మేనేజ్‌లో రెండేళ్లుగా వర్క్ చేస్తున్నాను. అర్బన్ ఫార్మింగ్, మైక్రో గ్రీన్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌లో ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేశాను. ఇప్పుడు ఈ ఫెలోషిప్ అగ్రికల్చర్, న్యూట్రిషన్, హెల్త్ ఈ మూడు విభాగాల్లో చేసిన ప్రాజెక్ట్‌కి వచ్చింది. ఇలా వచ్చిన నగదు మొత్తాన్ని ప్రాజెక్ట్ వర్క్‌కే వాడతాను. నేను గ్రామీణ, గిరిజన స్థాయిల్లో చేసిన ప్రాజెక్ట్ రిజల్ట్‌ని ఇక్రిశాట్లో జరిగిన కాన్ఫరెన్స్‌లో ప్రెజెంట్ చేశాను. స్వీడన్, మలావిల్లోనూ ఈ విశేషాలు తెలియజేయబోతున్నాను. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తులో ప్రెజెంటేషన్‌కి అవకాశం వచ్చిందంటే దీని ప్రాముఖ్యత ఈ సమయంలో చాలా ఉందని అర్ధమవుతోంది. కష్టమైన టాస్క్ అయినప్పటికీ సకాలంలో పూర్తి చేయగలిగానని ఆనందంగా ఉంది. గ్రామీణ స్థాయికి వెళ్లాలి... వ్యవసాయం అనగానే మన జనాభాకు సరిపడా ఆహారోత్పత్తి జరగాలనే ఇన్నాళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకు మన దేశం ఈ విషయంలో రెండవ స్థానంలో ఉంది. పోషకాహారలోపంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. మన దగ్గర చాలా మంది పోషకాహార లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అధికారులకు గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల, వారు సులువుగా ప్రజల్లోకి తీసుకెళతారు. ఈ అధికారులు చెప్పడం వల్ల దీని ప్రభావం కూడా బాగుంటుంది. ఏ సాగు చేయాలి, ఎలాంటి పంటలు వేయాలి, కుటుంబాన్ని బట్టి, వారి పోషకాహార స్థాయులను బట్టి దిగుబడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల మీద ఇంకా సరైన అవగాహన రావాల్సి ఉంది. దీనివల్ల రక్తహీనత, పోషకాహారం లేమి వంటివి తగ్గించవచ్చు. గిరిజనుల ఆహారం అంగన్వాడీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా గ్రామీణ మహిళల కుటుంబాల పోషకాహార స్థాయిలు ఎలా ఉన్నాయి.. అనే దానిమీద స్టడీ చేశాను. మిల్లెట్స్‌ని ఆహారంగా తీసుకోవడం ఇటీవల పట్టణాల్లోనూ పెరిగింది. అయితే, గిరిజనులు ఎప్పటి నుంచో వీటిని తీసుకుంటున్నారు. దీనివల్ల వారి రోగనిరోధకశక్తి పట్టణాల్లో వారికన్నా మెరుగ్గా ఉంది. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడానికి తెలంగాణలోని గిరిజనుల కుటుంబాలను కలుసుకొని స్టడీ చేశాను. రాగి అంబలి, జొన్నరొట్టె, ఆకుకూరలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. అదే గ్రామాల్లో అయితే అవగాహన తక్కువే. ఈ విషయంగా అవగాహన సదస్సులు జరగాల్సిన అవసరం ఉంది. మార్పు తీసుకురావడానికి అందరి కృషి అవసరం’’ అని వివరించింది శిరీష. అవగాహన ముఖ్యం: శిరీష మాది కరీంనగర్ జిల్లా, బొంతుపల్లి గ్రామం. వ్యవసాయం కుటుంబం. బిఎస్సీ హోమ్‌సైన్స్ చేశాక ఎమ్మెస్సీకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ను ఎంచుకున్నాను. ఆ తర్వాత పీహెచ్‌డి చేస్తున్నప్పుడే ఎన్ఐఆర్డిలో జరిగిన మీటింగ్‌లో ఈ ఫెలోషిప్‌కి అప్లయ్ చేసుకోవచ్చు అని తెలిసి అప్లయ్ చేశాను. దాదాపుగా నా చదువు అంతా ఫెలోషిప్స్తోనే గడిచింది. మా అన్నయ్య ఇచ్చే గైడ్‌లైన్స్ కూడా బాగా సహాయపడ్డాయి. – నిర్మలారెడ్డి -
బ్రాండెడ్ గుడ్డు గురూ.. ‘ఎగ్గోజ్’తో మరో సంచలనం!
సాక్షి, అమరావతి : బ్రాండింగ్ మానియా ఇప్పుడు కోడిగుడ్లకూ వచ్చి చేరింది. వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల కొనుగోళ్లలో వినియోగదారులు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో వారి అంచనాలకనుగుణంగా గుడ్లను ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి రసాయనాలు, యాంటి బయోటిక్స్ వినియోగించని సహజ సిద్ధమైన కోడి గుడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న గుడ్లు, అధిక ప్రొటీన్లున్న గుడ్లు.. ఇలా రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. సాధారణ గుడ్డు ధరతో పోలిస్తే ఈ బ్రాండెడ్ గుడ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సాధారణ గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 ఉంటే, బ్రాండెడ్ గుడ్డు దాని లక్షణాలను బట్టి ధర రూ.10 నుంచి రూ.25 దాకా ఉంటోంది. ఉదాహరణకు హ్యాపీ హెన్స్ బ్రాండ్‌తో విక్రయిస్తున్న సంస్థ ఫ్రీ రేంజ్ ఎగ్స్‌ను ఒక్కోటి రూ.25కు విక్రయిస్తోంది. ఈ గుడ్డు బరువు 100 గ్రాములుండటమే గాక, అధిక ప్రొటీన్లు, విటమిన్లతో ఉంటుందని చెబుతోంది. ‘ఎగ్గోజ్’తో సంచలనం ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన అభిషేక్ నగీ 2017లో తొలిసారిగా ఎగ్గోజ్ పేరుతో బ్రాండెడ్ ఎగ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఐఐటీ పూర్తి చేశాక ఒక రిటైల్ సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. కోడిగుడ్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుండటం, వినియోగం మాత్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటాన్ని నగీ గమనించాడు. పైగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి గుడ్డు రావడానికి ఎనిమిది రోజులకు పైగా సమయం పడుతోంది. ఈలోపు తనలో ఉన్న సహజసిద్ధమైన ప్రొటీన్లు కొన్నింటిని ఆ గుడ్డు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు. గుడ్డు పెట్టిన 24 గంటల్లోగా వినియోగదారుడికి చేర్చేలా ఎగ్గోజ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టి విజయం సాధించాడు. ఆ తర్వాత అనేక మంది బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ఎగ్గోజ్తో పాటు కెగ్స్, గుడ్ మార్నింగ్, హలో, ఎగ్గీ, హెన్ ఫ్రూట్, ఫ్రెషో, ఫామ్ మేడ్, బీబీ కాంబో, హ్యాపీ హెన్ తదితర బ్రాండెడ్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కోళ్ల పెంపకం దగ్గర నుంచి గుడ్డు ఎంపిక వరకూ అంతా ప్రత్యేకం. కొన్ని కోళ్లను సహజసిద్ధమైన వాతావరణం అంటే తోటల్లో పెంచితే, మరికొన్నింటిని ఫామ్స్‌లో పెంచుతారు. వాటికి దాణా, మందులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని కోళ్లకు శాఖాహార దాణాను అందిస్తూ పెంచితే, మరికొన్నింటిని హెర్బల్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ప్రత్యేక దాణాతో పెంచుతున్నారు. సాధారణంగా కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాముల మధ్యలో ఉంటుంది. గుడ్డు పరిమాణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. 53–60 గ్రాముల మధ్యలో ఉండే గుడ్లను ప్రీమియం గుడ్లుగా, 60 గ్రాముల దాటితే సూపర్ ప్రీమియంగానూ పరిగణించి ధర నిర్ణయిస్తుంటారు. బ్రాండెడ్ గుడ్డును ఎంపిక చేసేప్పుడు గుడ్డుపై పెంకు నాణ్యత కూడా కీలకం. మచ్చలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మరీ మందంగా కాకుండా పల్చగా ఉండే గుడ్లను ఎంపిక చేస్తున్నారు. వాటిని అందంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా గుడ్ల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.25,412.32 కోట్లుగా ఉంటే, అది ఏటా 6 శాతంపైన వృద్ధి చెందడం ద్వారా 2028 నాటికి రూ.37,960.24 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశించాం.. బ్రాండెడ్ ఎగ్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హలో బ్రాండ్ పేరుతో మేమూ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం దాణా దగ్గర నుంచి గుడ్ల ఎంపిక వరకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హై ఎండ్ ధరల సెగ్మెంట్లోకి కాకుండా సాధారణ గుడ్డు కంటే రెండు మూడు రూపాయలు అధికంగా ఉండే మార్కెట్‌పై తొలుత దృష్టిసారిస్తున్నాం. – సురేష్ చిట్టూరి, ఎండీ, శ్రీనివాస హేచరీస్ -
పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి?
తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు. పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించాలి. దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. ఎత్తు పెరగడం వెంటనే సాధ్యమయ్యే పని కాదు. కృత్రిమంగా వచ్చేదీ కూడా కాదు. ఆపరేషన్ చేయించుకుంటే వచ్చేది కాదు. ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది. ►క్యారెట్ క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి. ►బీన్స్ ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. ►బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ►బచ్చలికూర ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి. ►బఠానీలు బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ►అరటిపండు బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు. ►సోయాబీన్ ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ►పాలు రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది. మంచి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. ►ఉసిరికాయను రోజు తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి. ►గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో రెండు స్పూన్ల చొప్పున తినటం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ చేయటానికి మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ►ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ►ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు. ►మనం రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలకూర, క్యారెట్, బెండకాయ సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. - డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు -
Andhra Pradesh: పసందైన భోజనం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలని, ఇందులో ఏమాత్రం అలక్ష్యం వహించరాదని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని అందించాలని సూచించారు. మహిళా–శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి. నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్ఎంఎఫ్ తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి. దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు.. రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది. మనో వైకల్య బాధితులకు పెన్షన్లు మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్లో పెన్షన్లు మంజూరు కానున్నాయి. పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సూపర్ వైజర్ల పర్యవేక్షణతోపాటు అంగన్వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా అంగన్వాడీల్లో పాలు, ఆహారం సరఫరా మెరుగైన రీతిలో పర్యవేక్షించనున్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. -
చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు
రోజూ సాయంకాలం అయ్యిందంటే చాలు పిల్లలు, పెద్దలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనుకుంటారు. చిప్స్లాంటి జంక్ ఫుడ్‌ని బయట కొని తింటుంటారు. వాటిలో పోషకాల లేమి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ సౌమ్య మందరపు పోషకాలు పుష్కలంగా ఉండే చిరుతిళ్లను కూరగాయలు, చిరుధాన్యాలతో తయారుచేస్తున్నారు. ఉదయపు అల్పాహారంగానూ బ్రేక్‌ఫాస్ట్ బార్‌ను అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉంటున్న ఈ పోషకాహార నిపుణురాలు చేస్తున్న కృషికి సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు. ‘వరి,గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒకసారి భోజనంగా తీసుకుంటూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు తింటే జీవనశైలి జబ్బులతో బాధపడేవారు నెలరోజుల్లోనే తమ ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు’ అంటున్నారు డాక్టర్ మందరపు సౌమ్య. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన సౌమ్య 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. తన కృషిని సౌమ్య ఈ విధంగా వివరిస్తూ... ప్రకృతి దిశగా ఆలోచనలు ‘‘పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో. ఇంటర్మీడియెట్ తర్వాత ఇష్టంతో న్యూట్రీషియన్ విభాగంలోకి వచ్చాను. డిగ్రీ పూర్తవగానే మా జిల్లాలోనే కృషి విజ్ఞాన కేంద్రంలో వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో చేరాను. గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణ మన దేశంలోని పల్లె ప్రాంతాల్లో పిల్లలు, గర్భవతులు, మహిళల్లో రక్తహీనత సమస్య ఉందనే విషయం తెలిసిందే. ఈ విషయంగా పల్లె ప్రాంతాల్లో క్యాంప్స్ నిర్వహించాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. పిల్లలు, పెద్దలు ఎంత పోషకాహారం తీసుకోవాలనేది వయసులవారీగా ఉంటుంది. దాని ప్రకారం మనమేం ఆహారం తింటున్నాం, ఎలా ఉంటున్నామనేది పరిశోధనలో భాగంగానే గడిచింది. దీంతో ఎంతోమంది వారు తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పల్లె నుంచి పట్టణ స్థాయి వరకు తెలుసుకున్నాను. చిరుధాన్యాలతో ప్రయోగాలు రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవన విధానం సరిగా లేకుండా వచ్చే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం.. వంటి వాటి వల్ల అనారోగ్యం బారినపడుతుంటారు. వీటిలో ముఖ్యంగా ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు.. ఇలా ఆరోగ్యాన్ని పెంచేవాటిని ఎలా సరైన విధంగా తీసుకోవాలో పరిశోధనలు చేశాను. దాదాపు పదహారేళ్లు్ల ఈ విభాగంలో చేసిన వర్క్ నాకు సరైన దిశను చూపింది. మూడేళ్లు చిరుధాన్యాలపైన చేసిన రీసెర్చ్ సంస్థ నెలకొల్పేలా చేసింది. ప్రొటీన్ బార్ ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ పోషకాహారంతో కూడుకున్నదై ఉంటే ఆ రోజంతా చురుగ్గా పనిచేయగలం. ఆ దిశలోనే.. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్ బార్, బ్రేక్‌ఫాస్ట్ బార్, ఇమ్యూనిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించాను. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నాం. పోషకాల చిరుతిళ్ల తయారీ, సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణా తరగతులను కూడా ఇస్తున్నామ’ని తెలియజేశారు ఈ పోషకాహార నిపుణురాలు. - నిర్మలారెడ్డి -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
World Food Day: పాలకూర, పప్పు దినుసులు, బాదం..తింటే స్త్రీలలో ఆ సమస్యలు ..
మన దేశంలో అనేకమంది స్త్రీలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ విధితమే. దీనితో తాము అనారోగ్యంగా ఉండటమేకాకుండా, పోషకాహార లోపం ఉన్న రేపటి తరానికి జన్మనిస్తున్నారు. అందువల్ల మహిళలకు వారి పోషకాలలో వాటా అందేలా చూడడం అత్యవసరం. మన దేశంలో కేవలం ఆకలిని మాత్రమే నిర్మూలిస్తే సరిపోదు, బదులుగా, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉంచడమూ అవసరమేనని పోషకాహారనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందాం.. పాలకూర పాలకూరలో పోషకాలను తక్కువగా అంచనా వేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల పుష్టికి సహాయపడుతుంది. పాలకూరను మహిళల సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మహిళల గర్భధారణ సంమయంలో అవసరమైనంతమేరకు శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! పప్పు దినుసులు పప్పు దినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలకు అవసరమైన ప్రొటీన్లు అందించడంలో వీటి పాత్ర కీలకం. ప్రతి రకం పప్పుల్లో దానిదైన ప్రత్యేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఓట్స్ రోజువారీ శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ను అందించడంలో ఓట్స్ కీలకం. వీటిల్లో ఇతర ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమే. పాలు వర్కింగ్ ఉమెన్‌కు ఎముకల్లో పటుత్వం తగ్గి, ఎముకల నిర్మాణంలో మార్పులు సంభవించే ప్రమాధం ఉంది. ఇది ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గ్లాస్ పాలు తాగితే రోజువారీ అవసరమైన కాల్షియంను తగుమోతాదులో అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, భాస్వరం, పొటాషియం, డి, బి విటమిన్లు కూడా ఉన్నాయి. బ్రోకోలీ మహిళలకు మేలుచేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బ్రోకోలీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారణలో దీని పాత్ర కీలకం. గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల పటుత్వానికి దోహదపడుతుంది. బాదం జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి బాదం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పావు కప్పు బాదంలో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మెగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. నిపుణులు సూచిస్తున్న ఈ ఆహారాలను తీసుకుంటే మహిళల్లో పోషకాహారలోపాన్ని అరికట్టవచ్చు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం!
ఇంటిని, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఇల్లాలు. నిర్ణయమైనా, పనైనా కుటుంబ యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుంటారు గృహిణులు. ఈ కోవకు చెందిన ఇల్లాలే విజయా రాజన్. తన భర్త, పిల్లలకు పుష్కలంగా పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించాలని ఎప్పుడూ అనుకుంటుండేది. ఈక్రమంలో ఎటువంటి ఆహారంలో.. శరీరానికి కావల్సిన పోషకాలు దొరుకుతాయో జాగ్రత్తగా పరిశీలించి, ఆహార పదార్థాలను ఎంపిక చేసి, వాటితో రకరకాల స్నాక్స్‌ను తయారుచేసి కుటుంబ సభ్యులకు పెట్టేది. విజయ చేసే స్నాక్స్ ఇరుగుపొరుగు స్నేహితులకు కూడా నచ్చడంతో .. వారి సలహాతో చిన్న స్టార్టప్‌ను ప్రారంభించింది విజయ. స్టార్టప్ దినదినాభివృద్ధి చెందుతూ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఇంగ్లిష్ చానల్ ఈదేందుకు.. విజయ భర్త రాజన్ శ్రీనివాసన్ కి టెలికాంలో ఉద్యోగం. ఆయన సైక్లిస్ట్, రన్నర్, స్విమ్మర్ కూడా. అతడు 2015లో ఇంగ్లిష్ చానల్ ఈదడానికి శిక్షణ తీసుకుంటున్నారు. ఆ చానల్‌ను ఈదాలంటే శరీరంలో శక్తి బాగా ఉండాలి. అందుకోసం బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఆలోచించిన విజయ భర్తకు అధికమొత్తంలో శక్తినిచ్చే ఆహారం ఏంటి? అని మరింత లోతుగా వెతికింది. ఈక్రమంలోనే ఖనిజ పోషకాలు ఉండే ఆహారాలను పంచదార, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా స్నాక్స్ తయారు చేసి భర్తకు పెట్టేదామె. వాటిని తిన్న రాజన్ చురుకుగా, ఆరోగ్యంగా కనిపించేవారు. డ్రైఫ్రూట్స్, ధాన్యాలు, పండ్లతో తయారుచేసిన స్నాక్స్‌ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. అంతేగాక మూడు నాలుగురోజులపాటు స్నాక్స్ తాజాగా ఉండేవి. ఇదే సమయంలో తన బంధువులు, స్నేహితుల్లో కొందరు కూడా.. పోషకాలతో కూడిన ఆహారం కోసం వెతుకుతున్నారని తెలిసి, తాను తయారుచేసిన స్నాక్స్‌కు వారికి ఇచ్చి రుచిచూడమనేది. అవి తిన్నవాళ్లు ‘‘చాలా బావున్నాయి, ఇలాంటి ఫుడ్ మార్కెట్లో దొరకడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎందుకు ఈ స్నాక్స్‌ను బయట అమ్మకూడదు. బయట అమ్మావంటే మంచి ఆదాయం కూడా వస్తుంది’’ అని ప్రోత్సహించారు. సిరిమిరి.. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆదరణతో విజయ స్నాక్స్ విక్రయాలను ప్రారంభించింది. పోషకాలతో కూడిన స్నాక్స్ కావడంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో.. స్నాక్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇదే క్రమంలో 2017లో బెంగళూరులో 15 మంది పనివాళ్లతో ‘సిరిమిరి’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. తన కుటుంబం కోసం తయారు చేసిన స్నాక్స్‌లో కొద్దిపాటి మార్పులు చేసి, మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి పెద్దమొత్తంలో మార్కెట్లో విక్రయిస్తోంది. విజయ తన బ్రాండ్ పేరు అర్థవంతంగా ఉండాలనుకుని, ‘సిరిమిరి’ని బ్రాండ్ నేమ్‌గా పెట్టుకుంది. కన్నడలో సిరిమిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. వ్యాపార విస్తరణలో భాగంగా ‘అమెజాన్ సహేలి కార్యక్రమం’లో సిరిమిరి ఉత్పత్తులను చేర్చింది. ఈ కార్యక్రమం ద్వారా తన ఉత్పత్తులను మార్కెట్లో ఎలా విక్రయించాలో నేర్చుకుని కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సిరిమిరి ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇంతింతై వటుడింతై.. భర్త, పిల్లల ఆరోగ్యం కోసం వచ్చిన ఐడియా విజయను ఎంట్రప్రెన్యూర్‌గా మార్చేసింది. తొలినాళ్లలో మూడు రకాల ఎనర్జీ బార్లను విక్రయించిన సిరిమిరి క్రమంగా తమ ఉత్పత్తులను పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం సిరిమిరి పేరిట ఎనిమిది హెల్థీ బార్స్, ఆరు కండరాలకు పుష్టినిచ్చే బార్లు, మరొక హెల్థీ మిక్స్ ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. తన స్టార్టప్‌లో తయారైన ఉత్పత్తులను ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. స్టార్టప్ ప్రారంభంలో కేవలం రెండున్నర లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికి ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్‌తో సిరిమిరి వ్యాపారం సాగుతోంది. భార్య స్నాక్స్ వ్యాపారం ఇంతింటై వటుడింతయై అన్నట్లుగా విస్తరించడంతో... బ్రిటీష్ టెలికమ్లో కంప్యూటర్ ఇంజినీర్‌గా రెండు దశాబ్దాలుగా చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలేసి రాజన్ ఇండియా తిరిగి వచ్చి, సిరిమిరి వ్యాపారంలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివద్ధికి కృషి చేస్తున్నారు. ఆడవాళ్లు అనుకోవాలేగానీ ఏదైనా సాధించగలరు అన్న మాటకు విజయారాజన్ ఉదాహరణగా నిలుస్తూ, ఎంతోమంది ఔత్సాహిక మహిళలకు ప్రేరణనిస్తున్నారు. చదవండి: టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టానికి మహిళల నిరసన సెగ..!! -
మీకో విషయం తెలుసా? రోజూ ఈ సంఖ్యలో వెంట్రుకలు రాలడం సహజమేనట!
పొడవైన, ఒత్తైన జుట్టు ప్రతి అమ్మాయికి ఉండే కల. జుట్టు వత్తుగా ఏవిధంగా పెరుగుతుంది? చుండ్రు సమస్యను అరికట్టడం ఎలా? జుట్టు రాలిపోకుండా ఎట్లా కాపాడుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకనివారుండరు. అయితే జుట్టు ఆరోగ్యం, పెరుగుదల విధానం మన జెనెటిక్స్ నిర్మాణాన్నిబట్టి ఉంటుందని, తలపై దాదాపుగా లక్ష రంధ్రాలుంటాయని, వాటి నుంచే వెంట్రుకలు పెరుగుతాయని, రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వెల్లడించింది. వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగితే జట్టురాలడం తగ్గి, ఆరోగ్యంగా పెరుగుతుందని ఆ అకాడెమీ తెలిపింది. కాగా కొన్ని ఆహారపు అలవాట్లతో జుట్టును ఆరోగ్యంగా పాకాడుకోవడం వల్ల కూడా సహజపద్ధతుల్లో వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం జుట్టు పెరుగుదలకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎంతో ఉపకరిస్తుంది. 95శాతం కెరటీన్ ప్రొటీన్, 18 శాతం అమైనో యాసిడ్లు వెంట్రుకల పెరుగుదలకు అవసరమవుతాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో కార్బొహైడ్రేట్లు ఉండేవే ఎక్కువ. కానీ ప్రొటీన్ల గురించి అంతగా పట్టించుకోం. ఫలితంగా జుట్టు బలహీనపడి ఊడిపోయే అవకాశం ఉంటుంది. గుడ్డు, పాలు, పన్నీర్, పెరుగు, వెన్న, చికెన్, తృణధాన్యాలు.. వంటి ఇతర పధార్థాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ‘బి’ విటమన్ ఉండే ఆహారం జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ‘బి’ విటమన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, వాల్నట్స్ వంటి కాయధాన్యాలు, క్యాలీఫ్లవర్, క్యారెట్లను మీ రోజువారి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: అతిపిన్న వయసులోనే పైలట్ అయిన పేదింటి బిడ్డ!! ఐరన్ అధికంగా ఉండే ఆహారం ఐరన్ లోపం వల్ల వెంట్రుకల కుదుళ్లలోని కణాలకు ఆక్సిజన్ తగు మోతాదులో అందదు. ఐరన్‌తోపాటు ఫెర్రిటిన్ కూడా జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మాంసం, గుడ్డు, ఆకు పచ్చ కూరగాయలు, జామ వంటి ఫలాల్లో ఫెర్రిటిన్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. బి12, బి6, ఫోలెట్స్ విటమిన్లు రక్తహీనతను నిర్మూలించడంలో విటమిన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. రాజ్మా, బీన్స్, పాలల్లో ‘బి’ విటమిన్ నిండుగా ఉంటుంది. ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలు, అవిసెగింజల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. తల మీద చర్మం పొడిగా ఉంటే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. ఈ ఒమేగా - 3 నూనెలు పొడి చర్మాన్ని అరికట్టి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. విటమిన్ ‘సి’ విటమిన్ ‘సి’చర్మ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకం. తలపై వెండ్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి మాత్రమే కాకుండా, రక్తహీనతకు, ఐరన్ పెరుగుదలకు తోడ్పడుతుంది. సిట్రస్ ఫలాలు, క్యాప్సికం, నిమ్మ రసం.. ఇతర పధార్ధలను మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే సరిపోతుంది. జింక్ ఉండే ఆహారం మన శరీరానికి జింక్ అతి తక్కువ మోతాదులో అవసరమైన ఖనిజమైనప్పటికీ, అది నిర్వహించే పాత్ర చాలా కీలకమైనది. శిరోజాల విషయంలో కుదుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మన శరీరంలో ప్రొటీన్ల నిల్వకు ఉపకరిస్తుంది. తృణ ధాన్యాలు, చిక్కుల్లు, వేరుశనగ, పొద్దు తిరుగుడు విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఈ సూచలను పాటించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చనేది నిపుణుల మాట. చదవండి: Eye Health: స్మోకింగ్ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే.. -
ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే!
How To Boost Immunity.. 5 Simple Ways శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కొంత మందికి చిన్నతనం నుంచే రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. మరి కొంతమందికి వయసుతో పాటు జీవన ప్రమాణాల కారణంగా పెంపొందుతుంది. అందుకు పోషకాహారం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే విషయంలో మనలో చాలా మందికి క్లారిటీ లేదు. ప్రస్తుత కరోనా కల్లోలకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ యేటా సెప్టెంబర్ మొదటి వారంలో జరుపుకునే వార్షిక కార్యక్రమమే నేషనల్ న్యూట్రిషన్ వీక్(జాతీయ పోషకాహార వారం). ఈ ఏడాది కార్యక్రమంలో.. 5 సులభతర మార్గాల ద్వారా రోగనిరోధకతను పెంపొందించుకునే పద్ధతులు మీకోసం.. సరిపడినంతగా నీరు మనిషి శరీరంలోని ప్రతి జీవాణువు, కణజాలం, అవయవం సమర్థవంతంగా పనిచేయాలంటే సరిపడినంతగా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన జీవనానికి మూల సూత్రమే ఇది. హైడ్రేషన్ శరీరం పనితీరును నియంత్రించడంలో, జీవక్రియను సరైన మార్గంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నీరు రోగనిరోధకతను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు కూరగాయలు, ఆకుకూరలు తినమని పేరెంట్స్ ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ సహజసిద్ధంగా అందిస్తాయి కాబట్టే! విటమన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్లు.. మొదలైనవి అధిక మోతాదులో అందించడమే కాకుండా రోగనిరోధకత పెంపుకు తోడ్పడతాయి. ప్రొబియోటిక్ ఫుడ్ రోగనిరోధకతను పెంపొందించడంలో కడుపులోని ఆహారనాళం కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకతను పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే మన రోజువారి ఆహారంలో పెరుగు, మజ్జిగ మొదలైన పాల ఉత్పత్తులు ఉండాలని న్యూట్రిషనిస్ట్స్ సూచిస్తుంటారు. తాజా పండ్లు, పండ్ల రసాలు పండ్లు, పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాన్ని కొట్టిపారేయలేము. నేరుగా తిన్నా లేదా జ్యూస్ రూపంలో తాగినా ముఖ్యమైన పోషకాలన్నీ సహజమైన మార్గంలో అందిస్తాయి. మన ఆహారంలో వీటి పాత్ర కూడా కీలకమే. మూలికలు, సుగంధ ద్రవ్యాలు రోగనిరోధకతను పెంచడంలో దాల్చినచెక్క, జీలకర్ర, పసుపు.. వంటగదిలో ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల ప్రాధాన్యాన్ని మరచిపోకూడదు. వంటల్లో ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాకుండా, యుగాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా విరివిగా వాడుకలో ఉన్నాయనేది నిపుణులు చెప్పే మాట. కరోనా మహమ్మారి కాలంలో కూడా కషాయం, హెర్బల్ టీ, చూర్ణం మొదలైన పద్ధతుల్లో.. వీటిని వినియోగించడం చూశాం. ఈ మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో యాంటి ఆక్సిడెంట్స్, యాంటి బ్యాక్టీరియాలను బలపరిచే లక్షణాలు పుష్కలంగా ఉండటమే వీటి ప్రత్యేకతకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. చదవండి: గర్భిణులూ.. చక్కెర తగ్గించండి! -
మీనమే వస్తుంది... మన ఇంటికి..
సాక్షి, అమరావతి: పోషక విలువలున్న మత్స్యసంపద వినియోగాన్ని రాష్ట్రంలో పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మత్స్యసంపద ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఆ ఉత్పత్తుల్ని వినియోగించడంలో మాత్రం చివరిస్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక, తలసరి వినియోగాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోంది. వీటిని ప్రజల ముంగిటకు చేర్చేందుకు రూ.325.15 కోట్లతో ప్రణాళికలు రూపొందించి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తోపుడు బండ్లపై తాజా కూరగాయలను విక్రయిస్తున్నట్టుగా మత్స్య ఉత్పత్తులు కూడా ప్రజల ముంగిటకు వచ్చేలా ఆక్వాహబ్‌లు, ఫిష్ కియోస్క్‌లు, రిటైల్ అవుట్‌లెట్స్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కమ్ ఫుడ్ కార్టులు, ఈ–రిక్షాలు, వాల్యూయాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యసంపదతో వండిన ఆహార ఉత్పత్తులను కూడా ఆన్లైన్ ద్వారా సరఫరా చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. వీటి ఏర్పాటు ద్వారా ఇటు రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. 2025 నాటికి తలసరి వినియోగం 22.88 కిలోలకు పెంచాలని లక్ష్యం రాష్ట్రంలో 2014–15లో 20 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2020–21లో 46.23 లక్షల టన్నులకు పెరిగాయి. స్థానిక వినియోగం 4.36 లక్షల టన్నులు (10 శాతంకన్నా తక్కువ) కాగా తలసరి వినియోగం 8.07 కిలోలు. 2025 నాటికి స్థానిక వినియోగాన్ని కనీసం 30 శాతానికి తలసరి వినియోగాన్ని 22.88 కిలోలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా రైతు, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో 100 ఆక్వాహబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌ల నుంచి సరఫరా చేసే లైవ్ ఫిష్, తాజా, డ్రై, ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలను జనతా బజార్లు, రిటైల్ పాయింట్లకు సరఫరా చేసేందుకు సప్లై చైన్‌ను రూపొందించారు. ఒక్కో హబ్ పరిధిలో ఒక వాల్యూయాడెడ్ యూనిట్, 5 లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు, 8 ఫిష్ కియోస్క్‌లు, 10 ఫిష్ వెండింగ్ కార్టులు, 2 ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ కార్టులు, సచివాలయానికి ఒకటి చొప్పున 100 మినీ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో హబ్ పరిధిలో రోజుకు 15 టన్నుల వంతున మత్స్యసంపదను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. తొలివిడతగా ఏర్పాటు చేస్తున్న 25 హబ్‌లు, అనుబంధ యూనిట్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చడమేగాక ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చురుగ్గా లబ్ధిదారుల ఎంపిక తొలిదశకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 20 ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు ఆక్వా ఫార్మర్ సొసైటీలను ఎంపికచేశారు. కడప, కర్నూలు, అనంతపురం, తెనాలి, నంద్యాల ఆక్వాహబ్‌లకు సొసైటీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. రిటైల్ అవుట్‌లెట్స్ కోసం 621 మందిని, మినీ రిటైల్ అవుట్‌లెట్స్ కోసం 1,145 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు ఆక్వాహబ్, దాని పరిధిలోని స్పోక్స్, మినీ రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఈనెలాఖరులో ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తీసుకురానున్నారు. పెనమలూరు, పులివెందుల ఆక్వాహబ్‌లు, వాటి పరిధిలోని స్పోక్స్, మినీ రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఆగస్టు 15న, మిగిలిన 23 ఆక్వాహబ్‌లు, వాటి పరిధిలోని 3,335 స్పోక్స్, మినీ రిటైల్ అవుట్‌లెట్స్‌ను అక్టోబరు 2న ప్రారంభించనున్నారు. ప్రతిపాదించిన మరో 75 ఆక్వాహబ్‌లను వచ్చే జనవరి 26న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
కరోనా: మాత్రలు వద్దు.. పౌష్టికాహారమే ముద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా సోకకుండా విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే ప్రయోజనమంటూ సామాజిక మాధ్యమాల్లో కనిపించగానే మెజార్టీ ప్రజలు అందులో నిజమెంతని నిర్ధారణ చేసుకోకుండానే వెంటనే ఆచరణలో పెట్టేస్తున్నారు. గతంలో శానిటైజర్లు, ఎన్ 95 మాస్క్‌ల కోసం ఎగబడిన వారు నేడు వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్రలను ముందస్తుగానే కొంటున్నారు. దీంతో మార్కెట్లో కొన్ని రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వివిధ రకాల సమాచారం చూసి ప్రజలు ముందస్తుగా కరోనా నియంత్రణ కోసం విటమిన్–సి, విటమిన్–డి, జింక్ మాత్రలను కొని ఇంట్లో భద్రం చేసుకుంటున్నారు. ఈ మందులు వాడడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే ప్రచారం విపరీతంగా ఉండడంతో మార్కెట్లో ఆయా మాత్రలకు బాగా డిమాండ్ ఏర్పడింది. అవసరం ఉన్నా లేకపోయినా అందరూ ఆ మాత్రలను కొని నిల్వ చేసుకుంటున్నారు. ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు... ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరా చేసుకుని కొన్ని మందుల కంపెనీలు, వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. విటమిన్–సి మాత్రలు విడివిడిగా తీసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. డిమాండ్‌ను గుర్తించిన కొన్ని కంపెనీలు ఆ రెండు మందులతోపాటుగా బి–కాంప్లెక్స్, మరికొన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటూ కాంబినేషన్ డ్రగ్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో పది మాత్రల స్ట్రిప్ రూ.200 వరకూ ధర పలుకుతోంది. నెల రోజులుగా కరోనా సెకెండ్ వేవ్ కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో కరోనా పట్ల భయాందోళనలు పట్టుకున్నాయి. వైరస్ రాకుండా ఉండేందుకు ఎవరు ఏది చెప్పినా దాన్ని ఆచరిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కషాయాలు, పసుపు, మిరియాలు కలిపిన పాలు, అల్లం సొంటి టీలు తాగుతున్నారు. ఆవిరి పట్టుకుంటున్నారు. విటమిన్–సి, విటమిన్–డి, జింక్ మాత్రలను నెలకు సరిపడా కుటుంబ సభ్యులందరి కోసం బాక్సులను కొనుగోలు చేస్తున్నారు. విటమిన్ మాత్రలకు బాగా డిమాండ్ జిల్లా వ్యాప్తంగా నేడు విటమిన్ మాత్రలకు బాగా డిమాండ్ పెరిగింది. జిల్లాలో రెండు వేల రిటైల్ షాపులు, వెయ్యి హోల్‌సేల్ మెడికల్ షాపులున్నాయి. గతంలో రోజూ ఐదుగురికి మించి విటమిన్ మాత్రలు అడిగేవారు కారు. కొద్ది రోజులుగా 20 నుంచి 30 మంది విటమిన్ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు. జింక్ మాత్రలు ప్రస్తుతం రెండు వారాలుగా స్టాక్ లేవు. – కె.శ్రీధర్, పార్వతీపురం చదవండి: 12 గంటల తర్వాత నో ఎంట్రీ.. ఏపీలో కఠిన ఆంక్షలు -
విశాఖలో కరోనా బాధితులకు పౌష్టికాహారం అందజేత
-
బీట్రూట్తో బెనిఫిట్స్ ఎన్నో...
ఆరోగ్యాన్ని పెంపొందించే కూరగాయలు ఎన్నో.. కానీ ఇలాంటి పౌష్టికాహారాన్ని ఎక్కువమంది ఇష్టపడరు. అలాంటి వాటిలో బీట్రూట్ కూడా ఒకటి. చూడ్డానికి అందంగా కనిపించని బీట్రూట్ దుంపను తినడానికి పిల్లలైతే మొఖం తిప్పేస్తారు. కానీ బీట్రూట్లో ఆరోగ్యసుగుణాలు మెండుగా ఉన్నాయనేది కాదనలేని సత్యం. బయట వందల రూపాయలు ఖర్చుపెట్టి హెల్త్ డ్రింకులను కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్నా, బీట్ రూట్ లాంటి సహజ సిద్ధ ఆహారాన్ని పచ్చిగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా, కూర వండుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి బీట్రూట్లో ఉండే ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం.. ►బీట్రూట్లో ఫైటోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేగాక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. ►మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్(పీచుపదార్థం) బీట్రూట్లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్రూట్లో గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, 3.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్ క్యాన్సర్ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీవక్రియలను మెరుగుపరుస్తాయి. ►బీట్రూట్లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలికూడా వేయదు. ►బీట్రూట్లో ఉన్న నైట్రేట్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడనం(బీపీ) నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్ ఎటాక్స్ వంటి సమస్యలేవి తలెత్తవు. ►బీట్రూట్లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమద్ధిగా ఉన్నాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిని బీట్రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. ►బీట్రూట్ను రోజూ డైట్లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్రూట్ జ్యూస్‌ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ►డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్రూట్ ఒక వరంలాంటిది. బీట్రూట్ను జ్యూస్‌రూపంలో డీ హైడ్రేషన్ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసరమైన నీరు బీట్రూట్ నుంచి దొరుకుతుంది. ►రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఒక దివ్యౌషధం. బీట్రూట్ను ప్రతిరోజూ తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది. ►విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సో.. బీట్రూట్ను సలాడ్‌గా గానీ,జ్యూస్ లేదా బీట్రూట్ డిప్గానీ తీసుకోవడం వల్ల దీనిలో పోషకాలన్నీ మీకు అందుతాయి. దైనందిన ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చు. -
హెల్దీ బాడీతో తల్లీ బిడ్డల వికాసం
సాక్షి, అమరావతి: ‘హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్.. అప్పుడే తల్లీ బిడ్డల్లో వికాసం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేటి తరంలో చాలా మంది పిల్లలు, తల్లుల్లో పౌష్టికాహార లోపం కనిపిస్తోందని, వారందరిలో మార్పు తీసుకురావడానికే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను తీసుకువచ్చామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులు చేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అత్యంత మెరుగైన పౌష్టికాహారం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, 77 గిరిజన మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో చాలీచాలని నిధులు ► గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేరా? పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారు? అనే వాటి గురించి ఎవరూ ఆలోచించలేదు. ► గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాలు, చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం చాలీ చాలని నిధులు ఇచ్చేవారు. ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లు ఉండేది. ► నేటి తరంలో మంచి ఆహారం లభించని పిల్లలు, తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అందుకే 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల వరకు, బిడ్డకు జన్మనివ్వనున్న తల్లులు, బాలింతలకు వర్తించేలా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు అమలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని గర్భవత్లులో దాదాపు 53 శాతం మందిలో రక్తహీనత ఉంది. 31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు ఆ పరిస్థితిలోనే పెరుగుతున్నారు. ► 5 ఏళ్లలోపు పిల్లల్లో 17.2 శాతం మంది బరువుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారున్నారు. వయసుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారు 32 శాతం మంది ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మార్పు దిశగా అడుగులు ► రాష్ట్ర వ్యాప్తంగా నాడు–నేడు ద్వారా 55,607 అంగన్వాడీల రూపురేఖలు మార్చబోతున్నాం. వాటిని ప్రిప్రైమరీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నాం. పీపీ–1, పీపీ–2 మొదలు పెడుతున్నాం. ఆట పాటల ద్వారా, మాటల ద్వారా ఇంగ్లిష్ మీడియంకు గట్టి పునాది వేస్తున్నాం. తద్వారా దాదాపు 30.16 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, చిన్న పిల్లలకు లబ్ధి కలుగుతుంది. ► రాష్ట్రంలో 47,287 అంగన్వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 26.36 లక్షల మంది తల్లులు, పిల్లలకు దాదాపు రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► 77 గిరిజన మండాలాల్లోని 8,320 అంగన్వాడీల పరిధిలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ చేపట్టాం. 3.8 లక్షల మంది పిల్లలు, తల్లులకు మేలు జరుగుతుంది. ఇందుకు రూ.307.55 కోట్లు ఖర్చవుతుంది. మొత్తంగా ఏటా రూ.1,863.11 కోట్లు ఈ కార్యక్రమాల కోసం వ్యయం చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, ఎం.శంకర నారాయణ, సీఎస్ నీలం సాహ్ని, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఆ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పలువురు అధికారులు, పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆహారం అందకపోవడమే కరువు ఆహార కొరత వల్ల కరువు ఏర్పడదు. ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల కరువు ఏర్పడుతుంది. పేదలు, అట్టడుగు వర్గాల వారికి సామాజిక, ఆర్థిక, పాలనా పరమైన కారణాల వల్ల ఆహారం అందించడానికి ఆటంకం కలుగుతుంది. రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిలో సరిగా పని చేయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వాల తీరు ఇందుకు కారణం కావచ్చు. – అమర్త్యసేన్, ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఈ పరిస్థితి మార్చబోతున్నాం పిల్లలు, తల్లులు, వారి మెదడు, ఆలోచనా సరళిపై పౌష్టికాహార లోపం కనిపిస్తుంది. తద్వారా పిల్లల చదువు, మేధస్సు, దేహం మీద ప్రభావం ఉంటుంది. హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్ కాన్సెప్ట్‌తో ఈ పరిస్థితిని మార్చబోతున్నాం. ఈ రెండూ కూడా ఇంటర్ రిలేటెడ్. హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్ ఉంటుంది. –సీఎం వైఎస్ జగన్ -
దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది
సాక్షి, న్యూఢిల్లీ : ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివద్ధికి పునాది పడుతుందని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో..‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్లైన్ వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21 శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు) -
సంపూర్ణ పోషణే లక్ష్యం
-
అమ్మకు పౌష్టికాహారం
నెల్లూరు(వేదాయపాళెం): ప్రతి మహిళ అమ్మ కావడాన్ని అదృష్టంగా భావిస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి తన కడుపులో బిడ్డను ఊహించుకుంటూ ఎన్నో కలలు కంటుంది. ఈ క్రమంలో అటు పేదరికం.. ఇటు మూఢనమ్మకాలతో పౌష్టికాహారానికి దూరమై రక్తహీనత బారిన పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా బలహీనంగా పుట్టే బిడ్డ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ దశలో ప్రభుత్వం ఇలాంటి సమస్యలను గుర్తించి గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 56 వేల మందికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 3774 అంగన్వాడీ కేంద్రాలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న 3774 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 56 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్నారు. అయినా జిల్లాలో 31.78 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలకు ఇంట్లో ఉండే కొందరు పెద్దలు ఆహార నియమాలంటూ పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పేదరికంతో తీసుకోలేకపోతున్నారు. అధికారుల లెక్కల మేరకు సగటున ప్రతి వెయ్యి మంది మహిళల్లో 320 మంది రక్తహీనత బారిన పడ్డారని సమాచారం. ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారాన్ని అందించే బాలసంజీవని స్థానంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో లోపభూయిష్టం అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బాలసంజీవని పథకాన్ని ప్రవేశపెట్టినా, పథకంలో సరఫరా చేసే సరుకుల ధరల విషయంలో భారీ అవకతవకలు జరిగాయి. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం అవకతవకలను సరిచేసి, అంతకన్నా తక్కువ ధరకే ఎక్కువ పౌష్టికాహారాన్ని అందించేలా ఆరు రకాల సరుకులను వచ్చే నెల నుంచి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఈ పథకం అమలుకు జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. నిర్దేశిత సరుకుల కొనుగోలు, రవాణాకు, సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఇచ్చేందుకు టెండర్లను పిలిచామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. సంపూర్ణ పోషణ ఇప్పటివరకు ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో 56 వేల మంది గర్భిణులు, బాలింతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భిణులు, బాలింతలకు సరిపడా పౌష్టికాహార సరుకులను ప్రతి నెలా ఇంటింటికీ అందజేయనున్నారు. గతంలో రక్తహీనత కలిగిన పిల్లలు, ఎస్సీ, ఎస్టీ బాలింతలు, గర్భిణులకు మాత్రమే ఇచ్చేవారు. అయితే నూతనంగా ప్రవేశపెట్టిన పథకంలో అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులు, బాలింతలకు ఈ సరుకులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని ఐసీడీఎస్ అధికారులు చెప్తున్నారు. రోజూ 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు, 125 గ్రాముల కూరగాయలను అందించనున్నారు. -
ఆశాజనకంగా వరి – చేపల మిశ్రమ సాగు!
వరి సాగు చేసే ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు, అభ్యుదయ రైతులతో వరి తోపాటు చేపలను కలిపి సాగు చేయిస్తే వారికి ఆదాయం పెరగడంతోపాటు భూతాపోన్నతి తగ్గి పర్యావరణానికీ మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వరి బియ్యంతోపాటు చేపలు కూడా అందుబాటులోకి రావడం వల్ల పేద రైతు కుటుంబాలకు పౌష్టికాహారం అందుతుంది. నీటిని నిల్వగట్టే వరి చేలల్లో చేపలు, పీతలు, రొయ్యలతోపాటు బాతులను సైతం పెంచుతూ సమీకృత వ్యవసాయం చేయింవచ్చు. నీటిని నిల్వ గట్టే పద్ధతిలో వరి సాగు చేయటం వల్ల భూగోళాన్ని వేడెక్కించే మిథేన్ వాయువు వెలువడుతోంది. వాతావరణంలోకి చేరుతున్న మిథేన్‌లో 10–20 శాతం వరి పొలాల వల్లనే. కార్బన్ డయాక్సయిడ్ కన్నా మిథేన్ 25 రెట్లు ఎక్కువగా భూతాపోన్నతికి కారణభూతమవుతోంది. వట్టిగా వరి సాగు చేసినప్పటి కన్నా.. వరి–చేపల సాగులో 34.6 శాతం మిథేన్ వాయువు వెలువడినట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గింది. ఆ మేరకు ఉత్పాదకాలపై ఖర్చూ తగ్గింది. భూసారం పెరుగుతుంది. వరి–చేపల మిశ్రమ సాగు వల్ల ధాన్యం దిగుబడి10–26% పెరిగింది. కూలీల అవసరం 19–22 శాతం మేరకు తగ్గింది. ఇతర ఉత్పాదకాలు 7% మేరకు తగ్గాయి. చేపల పెంపకం వల్ల ఆదాయమూ పెరిగింది. ఇండోనేషియాలో వరి–చేపల మిశ్రమ సాగు చేసిన రైతుల నికరాదాయం 27 శాతం పెరిగింది. వరి–చేపల మిశ్రమ సాగుకు వరి పొలాలన్నీ పనికిరావు. మన దేశంలో వరి సాగవుతున్న 4.35 కోట్ల హెక్టార్లలో లోతట్టు, మధ్యస్థ వర్షాధార సాగు భూములతో కూడిన 2 కోట్ల హెక్టార్లు (ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో) ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ మిశ్రమ సాగు కొత్తదేమీ కాదు. అక్కడా ఇక్కడా పూర్వకాలం నుంచీ 2.3 లక్షల హెక్టార్లలో రైతులు అనుసరిస్తున్నదే. అధిక దిగుబడి వరి వంగడాలకు రసాయనిక పురుగుమందులు విధిగా వాడాల్సి ఉండటం వల్లనే రైతులు వరి–చేపల మిశ్రమ సాగును ఎక్కువగా చేపట్టలేకపోతున్నారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో దేశీ వరి రకాలను వాడే రైతులకు, కూలీలపై ఆధారపడకుండా చిన్న కమతాల్లో వ్యవసాయ పనులన్నిటినీ ఇంటిల్లపాదీ కలిసి చేసుకునే సంస్కృతి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వరి–చేపల మిశ్రమ సాగు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, వరి–చేపల మిశ్రమ సాగు నిర్లక్ష్యానికి గురైంది. దీనిపై పరిశోధకులు దృష్టి పెట్టడం లేదు. వరి దిగుబడి కూడా పెంచుకోవడానికి వీలున్న ఈ దివ్యమైన సాగు పద్ధతిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఏయే నేలలకు ఏయే రకాల చేపలను వరితో కలిపి సాగు చేయింవచ్చో స్థానికంగా పరిశోధనలు చేయించాలి. ఈ పద్ధతిలోకి మారాలంటే రైతులు తమ పొలాలను అందుకు తగినట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇంజినీరింగ్ నిపుణుల సహాయంతోపాటు పెట్టుబడి కూడా అవసరమవుతుంది. ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాలను ప్రవేశపెట్టి వరి–చేపల సాగుకు చేదోడుగా ఉంటే చిన్న రైతులకు ఆదాయం పెరిగే వీలుందన్నది నిపుణుల మాట. -
చికెన్ బిర్యానీ... డ్రై ప్రూట్స్
అనంతపురం హాస్పిటల్: కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అలాగే వైరస్ బారిన వారు త్వరగా కోలుకునేందుకు కిమ్స్–సవీరా, బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్, సర్వజనాస్పత్రి తదితర ఆస్పత్రుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తోంది. దీంతో పాటు క్వారంటైన్లో ఉన్న వారికి పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందువల్లే వైరస్ బారిన పడిన వారు త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. జిల్లాలో బుధవారం వరకూ 58 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లడం గమనార్హం. ఆదివారం బిర్యానీ జిల్లాలో మొత్తం 36 క్వారంటైన్లు ఏర్పాటు చేశారు. అందులో 7,485 పడకలు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం అందులో 652 మంది ఉన్నారు. వీరికిచ్చే డైట్లో పౌష్టికాహారాన్ని అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ, మంగళవారం రైస్‌తో పాటు చికెన్ కర్రీ, శుక్రవారం రైస్‌తో పాటు చికెట్ కర్రీ ఇస్తున్నారు. దీంతో పాటు రెగ్యులర్‌గా మూడు పూటల భోజనంతో పాటు పాలు, గుడ్డు, చిక్కీ, స్నాక్స్, రాత్రి వేళల్లో ప్రూట్స్ ఇస్తున్నారు. అలాగే ఓ మెడికల్ ఆఫీసర్, తదితర సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు. కరోనా లక్షణాలు కన్పిస్తే వారిని నిర్ధారణ పరీక్షలు చేసి, మెరుగైన వైద్యం కోసం కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడొద్దన్నారు క్వారన్‌టైన్‌లో ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలని, ఖర్చుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలతో జిల్లాలోని వివిధ క్వారన్‌టైన్‌లలో ఉన్న వారికి పౌష్టికారం అందిస్తున్నాం. తాజా పండ్లు, డ్రైప్రూట్స్ అందించేలా చర్యలు తీసుకున్నాం. – గంధం చంద్రుడు, కలెక్టర్ అలరిస్తున్న వినోద కార్యక్రమాలు గుత్తి: లాక్డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలను అధికారులు క్వారం టైన్ సెంటర్లకు పంపారు. ఎస్కేడీ, కేంద్రీయ విద్యాలయా ( క్వారంటైన్ సెంటర్లు)ల్లో సుమారు 20 రోజులుగా వలస కూలీలు ఒంటరి జీవితం గడుపుతున్నారు. వారికి మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు ఆనందింపజేయాలన్న ఉద్దేశంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి చొరవతో బుధవారం కళాకారుల చేత వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో వలస కూలీలు ఎంతో హుషారుగా కార్యక్రమాలను వీక్షించారు. 36 జిల్లాలోని క్వారంటైన్లు 7,485 పడకల సంఖ్య 652 క్వారంటైన్లో ఉన్న వారు -
ఆహార ‘శైలి’ మారింది!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో జనాలంతా ఇంటికే పరిమితమవడంతో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రోజువారీ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. మామూలు రోజుల్లో తీసుకునే ఆహారానికి బదులు పోషకాలున్న ఆహారానికే మొగ్గుచూపుతున్నారు. ఖాళీ సమయాల్లో అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి అనారోగ్యాల బారిన పడరాదన్న వైద్యుల సూచనలకు అనుగుణంగా తమ ఆహార శైలిని మార్చుకుంటున్నారు. తృణధాన్యాలు, బ్రౌన్‌రైస్, బ్రెడ్, పాలు, చేపలు, గుడ్లు, చికెన్ వంటి ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సమతుల ఆహారానికి ప్రాధాన్యం.. లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడటంతో బయటి నుంచి ఆహారం తెచ్చుకొని తినే పరిస్థితులు లేవు. దీంతో ఇంటి ఆహారం తప్పనిసరైంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సమతుల ఆహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పప్పుల వినియోగం పెరిగింది. పిండి వంటకాలు ఎక్కువగా వండుతున్నారు. హెర్మల్ టీ తాగుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు మూతపడినప్పటికీ రాష్ట్రంలో ఆరెంజ్, దానిమ్మ, అరటిపళ్లు, మోసంబి, వాటర్ మిలన్‌ల సగటు వినియోగం ప్రతి రోజూ 20 వేల క్వింటాళ్లకు పైనే ఉంది. పండ్లను స్వయంగా ఇంటికే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వీటి వినియోగం పెరిగింది. ఇక సగటున వారానికి డజన్ కోడి గుడ్లను తినే కుటుంబాలు ఇప్పుడు రెండు డజన్లు తింటున్నాయి. యూట్యూబ్ చిట్కాలతో వంటలు.. రాష్ట్ర ప్రభుత్వం జొమాటో, స్విగ్గీ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో స్వయం పాకం తప్పనిసరైంది. వంట చిట్కాలకై ఎక్కువగా బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు గూగుల్‌పైనే ఆధారపడుతున్నారు. కేక్ మొదలు, బర్గర్ వరకు, బటర్ చికెన్ నుంచి చికెన్ బిర్యానీ వరకు ఎలాంటివి తినాలన్నా.. చిట్కాలకై యూట్యూబ్ వీడియోలు, పలు వంటకాల యాప్‌లపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చికెన్ బిర్యానీకై సుమారు 15 లక్షల మంది గూగుల్‌లో శోధించారు. చికెన్ టిక్కా మసాలా, తందూరీ చికెన్, పాలక్ పన్నీర్, దహీవడ, పానీపూరి, కేక్‌ల తయారీకై శోధించిన వారి సంఖ్య ఈ నెల రోజుల్లో 120 శాతం పెరిగిందని ఆన్లైన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా కుటుంబాలు కలిసి భోజనం చేస్తుండటంతో ఆరోగ్యకర భోజనం వండటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేల్లో తెలింది. నో డ్రింక్స్.. ఓన్లీ పాలు, పెరుగు.. లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన కూల్‌డ్రింక్స్ సంస్థలన్నీ తమ ఉత్పత్తులను నిలిపివేయడంతో వాటి లభ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో కూల్‌డ్రింక్స్ స్థానంలో పాలు, పెరుగు వినియోగం పెరిగిందని సర్వేల ద్వారా తెలుస్తోంది. స్వీట్స్ వంటి వాటికి వినియోగించే పాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మళ్లాయని, ప్యాకేజ్డ్ పాల వినియోగం లాక్డౌన్ తర్వాత 15 నుంచి 25 శాతం పెరిగిందని సర్వేలు తెలిపాయి. డ్రింక్స్‌కు బదులు ప్రతి ఇంట్లో వేసవి తాపానికి విరుగుడుగా ఇప్పుడు చల్లని మజ్జిగ, నిమ్మకాయ రసాలు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ తర్వాత కూడా అన్ని రంగాలపై ఆర్థిక వ్యవస్థ తన ప్రభావం చూపుతున్నందున ప్రజలు తినడానికి రెస్టారెంట్లు, బార్లకు రారని తెలిపింది. ఆరోగ్య భయాలతోనూ బయటి ఆహారాన్ని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపరని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 40 శాతానికి పైగా రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని తెలిపింది. -
విద్యకు వందనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం సంక్షేమ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడానికి పలు పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆదాయ పరిమితికి లోబడి నూరు శాతం ఈ వర్గాల వారికి దేశంలోనే ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 25,86,392 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించి చదివించడం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఉచిత విద్యను అందించడం ప్రధాన ఉద్దేశం. వైఎస్సార్ విద్యోన్నతి పథకం కింద ఉచితంగా సివిల్స్‌కు కోచింగ్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా విదేశీ విద్య, స్కిల్ అప్‌గ్రేడేషన్ ద్వారా ఉచితంగా కొత్త కోర్స్‌లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, ప్రీమెట్రిక్ సంక్షేమ హాస్టళ్లు, సంక్షేమ పీజీ హాస్టళ్ల ద్వారా ఉచితంగా విద్యను ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ విద్యకు రూ.4,980 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దీనికి అదనంగా ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కలిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘ఆహార బుట్ట’తో పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నారు. అమ్మఒడి పథకం కింద పిల్లలను స్కూళ్లకు పంపిస్తే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఉచితంగా అన్ని వర్గాల్లోని ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు పొందుతున్న పేద విద్యార్థులు (లక్షల్లో..) ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.20 వేలు... ప్రభుత్వం కొత్తగా మెయింటెనెన్స్ చార్జీలు (ఎంటీఎఫ్) కింద వసతి, భోజన సౌకర్యాల కోసం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. మెస్ చార్జీల కింద ఒక్కో పీజీ విద్యార్థికి నెలకు రూ.1,400లు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి రూ.14,000 ఖర్చవుతున్నది. ఇవి కాకుండా మరో రూ.6 వేలు కలిపి సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తారు. ఇంత భారీ స్థాయిలో విద్యార్థుల వసతి సౌకర్యాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి ఏపీలో అమలవుతున్నది. -
పౌష్టికాహారంలో పురుగులు
సాక్షి, బలిజిపేట(విజయనగరం) : గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంలో పురుగులు కనిపిస్తుండడంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలు, గుడ్లు, శనగ చెక్కీలు, నువ్వు చెక్కీలు నాణ్యంగా ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాసిరకంగా ఉన్న ఉండలను తినడానికి ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు భయపడుతున్నారు. పొరపాటున చూడకుండా వాటిని తింటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గుడ్లు కూడా పూర్తిగా కుళ్లిపోవడంతో ఇవేం గుడ్లని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పౌష్టికాహార పదార్థాలు పాడవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.అలాగే పాల ప్యాకెట్లను కేంద్రాల కార్యకర్తలు ఇచ్చే ఇండెంట్ ప్రకారం మొత్తం సరుకును ఒకేసారి సరఫరా చేస్తున్నారు. దీంతో వచ్చిన పాలప్యాకెట్లను కేంద్రాలలో నిల్వ చేయాల్సి వస్తోంది. రోజుల తరబడి పాల ప్యాకెట్లు ఉంచాల్సి రావడంతో పాడవుతున్నాయని కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు సరైన సమయానికి సరుకులు సరఫరా చేసిన దాఖాలు లేవు. గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ గుడ్డు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ఇవ్వాల్సి ఉంది. అయితే సరుకు ఒకేసారి రావడం... వాటిని నిల్వ చేసి ఇవ్వడంతో పాడుతున్నాయి. చిలకలపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఊర్మిల అనే లబ్ధిదారుకు బుధవారం సరఫరా చేసిన చెక్కీలలో పురుగులు కనిపించాయి. అలాగే గుడ్లు కూడా కూళ్లిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఈ ఒక్క కేంద్రానిదే కాదని.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణిలు, బాలింతలు, ప్రీ స్కూల్ చిన్నారులకు ఇవ్వాల్సిన మెనూ.. ► సోమ, గురువారాలలో: సాంబారు, అన్నం ► మంగళ, శుక్రవారాలలో పప్పు, ఆకుకూర, అన్నం. ► బుధ, శనివారాలలో కాయగూర లేదా ఆకుకూరతో పప్పు, అన్నం. ► సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణిలు, బాలింతలకు గుడ్లు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ► 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు నాలుగు రోజులు గుడ్లు. (గురువారం, శనివారం ఉండవు) ► 3 సంవత్సరాల లోపున్న వారికి వారానికి 2 రోజుల మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు. ► 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండేవారికి బరువు పెరిగేవరకు పాలు పంపిణీ చేస్తారు. కార్యకర్తలు చూసుకోవాలి కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను కార్యకర్తలే చూసుకోవాలి. చెక్కీలు, పాలు నెలకొకసారి సరఫరా అవుతున్నాయి. గుడ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అటువంటప్పుడు చూసుకోవాలి. పాడైతే అధికారుల దృష్టికి తీసుకురావాలి. – ఉమాభారతి, సీడీపీఓ, బొబ్బిలి. -
ఈ నీటిమొక్క... పోషకాల పుట్ట!
మన్ కాయి డక్‌వీడ్! నాచులా.. నీటి వనరుల ఉపరితలంపై పెరిగే చిన్నసైజు మొక్కలు ఇవి. చాలామంది ఈ మొక్కలను చెత్త అనుకుంటారుగానీ... ప్రపంచం ఇప్పుడిప్పుడే దీని ప్రాముఖ్యతను గుర్తిస్తోంది. ఇదో పోషకాల గుట్ట అని చెబుతోంది. బెన్ గురియాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ మన్‌కాయి డక్‌వీడ్ కార్బోహైడ్రేట్లు బాగా తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదు పెరిగిపోకుండా అడ్డుకోగలదు. అంటే.. ముధుమేహానికి మంచి విరుగుడన్నమాట. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న మరో ఆహారంతో పోల్చి చూసినప్పుడు మన్‌కాయి తీసుకున్న వారిలో అత్యధిక గ్లూకోజ్ మోతాదు తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు శరీరం నుంచి గ్లూకోజ్ వేగంగా తొలగిపోవడం.. ఉదయాన్నే పరగడుపున ఉండాల్సిన గ్లూకోజ్ కూడా తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. అంతేకాకుండా.. మన్‌కాయి తీసుకున్న వారు చాలాకాలంపాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని పొందారు. అంతేకాదు.. హిటా జెలీజా అనే శాస్త్రవేత్త జరిపిన పరిశోధన ద్వారా ఈ డక్‌వీడ్ కనీసం 45 శాతం ప్రొటీన్ అని తెలిసింది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఏడాది పొడవునా దీన్ని పండించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో వందల సంవత్సరాలుగా ఆహారంగా తీసుకుంటున్న మన్కాయిలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, పీచుపదార్థం, ఇనుము, జిక్ లాంటి మినరల్స్, ఏ, బీ కాంప్లెక్స్, బీ12 వంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నట్లు పరిశోధనల్లో స్పష్టమైంది. -
చౌకీదార్ కే లియే.. హ్యాపీబార్
సాక్షి, సిటీబ్యూరో :వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్.. ఎంత మంచి స్నేహితులంటే ఏ దేశంలో ఉన్నా ఏటా తప్పనిసరిగా ఒక రోజున కలిసేంత. సమాజానికి ఏదో మంచి చేయాలనే తపన ఉన్న స్నే‘హితులు’. తీయటి తమ స్నేహాన్ని పరిపుష్టం చేసుకుంటున్న వీరంతా సమాజానికి తీపి బహుమతి ఇస్తున్నారు. ‘హ్యాపీ బార్’ పేరుతో వీరు సృష్టించిన ఓ చాక్లెట్ ఆరోగ్యార్థులకు బహుమతి మాత్రమే కాదు ఆపన్నులకు ఆసరా కూడా. ‘‘మేం మొత్తం 15 మంది స్నేహితులం. చదువు పూర్తయ్యాక యూకే, ఆస్ట్రేలియా, అమెరికా.. ఇలా పలు దేశాల్లో స్థిరపడ్డాం. అయితే మా స్నేహాన్ని చిరకాలం వర్థిల్లేలా చేసుకునేందుకు ప్రతి డిసెంబర్లో ఒక ప్లేస్ అనుకుని తప్పకుండా కలిసేవాళ్లం. ఆ క్రమంలోనే ఎవరికి వారుగా చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నా, మేం అంతా కలిసి ఏదైనా సంయుక్తంగా చేద్దామనుకున్నాం. అందులో భాగంగా సమాజంలో ఎవరూ అంతగా పట్టించుకోని ఓ కమ్యూనిటీని ఎంచుకుని సాయం చేయాలనే ఆలోచన చేశాం. అప్పుడే మాకు గుర్తొచ్చింది వాచ్మెన్ కమ్యూనిటీ’’ అని చెప్పారు మహేష్. భవనాలు భళా.. కాపలా వెలవెల నగరాల్లో ఇంటికి కాపలా కాసే వాచ్మెన్ల జీవితాలు గమనిస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఖరీదైన అపార్ట్మెంట్స్, కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే వాచ్మెన్లు కుటుంబ సమేతంగా నివసిస్తుంటారు. చాలా వరకూ అపార్ట్‌మెంట్స్‌లో మెట్లకిందే వీరి జీవనం. ఖరీదైన భవనాలు, ఆకాశహరŠామ్యల్లో ఉంటున్నా సరైన తిండీ, వసతి, పిల్లల చదువుకు నోచుకోని విచిత్రమైన పరిస్థితి వీరిది. ఆర్గానిక్ పద్ధతుల్లో చాక్లెట్ తయారీ వ్యక్తిగతంగా వీరికి సాయం అందించడం అలవాటైన ఈ స్నేహితుల చర్చల్లో తరచూ వీరి గురించి ప్రస్తావన వచ్చేది. అలా అలా అది ఒక ప్రత్యేకమైన చారిటీ కార్యక్రమంగా అవతరించింది. ఈ వాచ్మెన్ కమ్యూనిటీకి ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడంతో మొదలుపెట్టి అంతకు మించి ఏదైనా చేయాలని మిత్రబృందం సంకల్పించింది. అందుకోసం ఒక చాక్లెట్‌కి రూపకల్పన చేశారు. అదే హ్యాపీ బార్. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో తయారైన ఈ చాక్లెట్‌ను విక్రయించడం ద్వారా వచ్చే లాభాలను తమ చారిటీకి ఉపయోగిస్తామని ఈ మిత్రబృందం ప్రతినిధి మహేష్ చెప్పారు. -
అమ్మ ఒడి నుంచి అక్షరాల గుడికి
ఇప్పటి వరకు ఆకాశాన ఇంద్రధనస్సులోని ఏడు రంగులూ వారివే.. ఈత సరదాలు, వేసవి ఎండలు అన్నీ వారివే.. వేసవి సెలవుల్లో వారికి ప్రతి ఘడియా మధురమే.. అందుకే సెలవుల అమృత జ్ఞాపకాలన్నింటినీ చిరునవ్వుల్లో దాచుకుని.. నేడు అనురాగపు అమ్మ ఒడి నుంచి చదువులమ్మ గుడిలోకి అడుగుపెడుతున్నారు విద్యార్థులు.. మరో వైపు రాజన్న బాటలో అడుగులు వేస్తున్న ప్రభుత్వం సరస్వతీ నిలయాలకు వసతుల తోరణాలు కట్టి విద్యార్థులను మనసారా ఆహ్వానిస్తోంది. నో బ్యాగ్ డే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు వంటి నిర్ణయాలతో సర్కారు బడిని ఉన్నతంగా తీర్చిదిద్ది.. రేపటి పౌరుల బంగారు భవిష్యత్‌కు బంగారు బాటలు పరిచింది. సాక్షి, గుంటూరు : నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ప్రభుత్వ బడుల బలోపేతానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని నిరుపేద విద్యార్థులకు ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య అందించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. శనివారం నో బ్యాగ్ డే, ఆనంద పాఠ్యాంశాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటిల్ తరగతులు, పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ వంటి వాటిని దీటుగా అమలు చేసి ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేలా అడుగులు ముందుకు వేస్తోంది. ఒత్తిడి నుంచి ఉపశమనం.. ర్యాంకులతో కుస్తీలు పడుతూ విద్యార్థులు మానసికంగా ఒత్తిడికిలోనై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించటంతోపాటు వారిపై శారీరిక భారాన్ని కాస్త తగ్గించటంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి శనివారం బ్యాగ్ లేకుండా స్కూల్‌కు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. సులువుగా అర్థమయ్యేలా బోధించేందుకు డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ తరగతి గదులు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారారు. పిల్లలందరికీ పౌష్టికాహారం.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం పూర్తిగా కుంటుపడింది. దీంతో సీఎం జగన్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించే విధంగా విద్యా శాఖపై చేసిన తొలి సమీక్షలోనే ఆదేశాలు జారీ చేశారు. పౌష్టికాహారం రాజీ పడకుండా సరఫరా చేయాలని, సమీకృత వంటశాలను ఏర్పాటు చేసి వేడిగా, శుచిగా, శుభ్రంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులు మంజూరు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, డాక్టర్లు, నెలకోసారి పాఠశాలలకు వెళ్లి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారికి రిఫరల్ ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. ‘ప్రైవేట్’ కన్నా మిన్న.. ఫీజు ఎక్కువ ఉంటే స్కూలు మంచిదని, ఎక్కువ సమయం తరగతులు నిర్వహిస్తే ఆ స్కూల్ నంబరు వన్ అనే రీతిలో ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆదే అభిప్రాయంతో ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కార్పొరేట్ స్కూలు మెట్లు ఎక్కేందుకు ఆరాటపడుతున్నారు. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సాగుతుండగా ఇరుకు గదులు, ఆపార్టుమెంట్లలో ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. బూట్లు కూడా.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం బూట్లు ఉచితంగా విద్యార్థులకు సరఫరా చేయనుంది. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు బడిలో ఉండాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 8, 9 తగతుల బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లను అందిస్తోంది. 2017లో కేవలం ఎనిమిదో తరగతి విద్యార్థినులకు మాత్రమే సైకిళ్లు అందించగా.. గత ఏడాది నుంచి 9 వతరగతి బాలికలకు కూడా పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు బాలికల నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటున్నందున కొందరు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజన్న బడిబాట.... ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలను పెంచేందుకు కొత్త ప్రభుత్వం ‘రాజన్న బడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐదు రోజులుపాటు ప్రతి ఇంటికీ ఉపాధ్యాయులు వెళ్లి పిల్లల వివరాలను తెలుసుకొని బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం నిర్ణయాల వల్ల పాఠశాలలు ఎలా ఉండబోతున్నాయో, పిల్లలు ఎటువంటి లబ్ధి పొందనున్నారో వివరించనున్నారు. -
జొన్న ప్రొటీన్లు మిన్న
జొన్నరొట్టెకు పెరిగిన డిమాండ్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే జొన్నరొట్టెలను తింటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే కొవ్వును తగ్గించడానికి జొన్నరొట్టెలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతుండటంతో వాటిని తినేందుకు పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు ఆసక్తి చూపుతున్నారు. కొత్తకోట పట్టణంలోని కర్నూల్ రోడ్డులో పదుల సంఖ్యలో జొన్నరొట్టె సెంటర్లు వెలిశాయి. చాలామంది మహిళలు వీటినే ఉపాధిగా మలుచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెడుతున్నారు. రుచిని కాకుండా ఆహార ఉపయోగాల విషయాలపై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సూచనలతో దురలవాట్లను మార్చుకుని జంక్‌ఫుడ్‌తో కలిగే అనర్థాలను తెలుసుకుని జొన్నరొట్టె వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆహారంలో మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో జొన్నరొట్టెలకు డిమాండ్ పెరిగింది. ఒక్కరొట్టె రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది.చాలామంది ఇష్టంగా తింటున్నారు నేను ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసి అమ్ముతాను. కాలనీలోని వారు, ఉద్యోగస్తులు ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చి రొట్టెలు చేయించుకుంటారు. ప్రజలకు జొన్నరొట్టెలు తినడం అలవాటు కావడంతో నాకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్కోసారి 50 నుంచి 60 రొట్టెలు అమ్ముతాను. – జ్యోతి, కొత్తకోట -
పౌష్టికాహారం పక్కదారి
సాక్షి, అనంతపురం : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దారి మళ్లిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించడంలేదు. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పేదలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారాన్నిపక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నారు. జిల్లాలో 5126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 3.35 లక్షల మందికి రోజూ పౌష్టికాహారం అందజేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. దీంతో పాటు బాలామృతం స్థానంలో బాల సంజీవని ప్యాకెట్లు అందజేస్తున్నారు. పేద ప్రజల్లో రక్తహీనత తగ్గించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఏళ్ల తరబడి రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని అంగన్వాడీ కేంద్రాలు అందుకోలేకపోతున్నాయి. ఇందుకు కారణం ఐసీడీఎస్‌లో వేళ్లూనుకుపోయిన అవినీతే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అందినకాటికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత బాధితులు : రక్తహీనతతో బాధపడుతున్న వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్నా సంజీవని ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఇందులో రాగిపిండి, గోధుమపిండి, కర్జూరం, బర్ఫీలతో కూడిని కిట్స్‌ను అందజేస్తున్నారు. అయితే కదిరి డివిజన్లో మాత్రం కిట్స్‌ను మాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ పరిధిలో దారి మళ్లిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. కేవలం కదిరిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల్లో కోత వేసి పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్ : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కొన్ని నెలలుగా కోడిగుడ్లు సరఫరా నిలిచిపోయింది. గత సరఫరా దారుల టెండరు గడువు ముగియడంతో కొత్తగా టెండర్లకు ఆహ్వానించారు. రెండురోజుల క్రితం ధర్మవరం డివిజన్ మినహా అన్ని డివిజన్లకు కోడిగుడ్లు సరఫరా టెండర్లను ఆమోదించారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు రెండునెలలుగా కోడిగుడ్ల సరఫరా ఆగిపోయింది. ప్రస్తుత కాంట్రాక్టర్లు సరఫరా చేయడానికి ఇంకా సమయం పడుతుంది. అంటే దాదాపు మూడు నెలలుగా కోడిగుడ్లు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ధర్మవరం డివిజన్లో కోడిగుడ్లు సరఫరా చేయాలంటే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. అక్కడి అధికారపార్టీ నేతలకు, ఇతరులకు మామూళ్లు ఇచ్చుకోలేక టెండర్లలో దరఖాస్తులే రానట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ఐసీడీఎస్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరికీ పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు పౌష్టికాహారంతో పాటు పాలు, కోడిగుడ్లు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. దీన్ని మరింత బలోపేతం చేస్తాం. అలాగే ఇటీవల ధర్మవరం డివిజన్ మినహా అన్ని డివిజన్లకు కోడిగుడ్ల కాంట్రాక్టర్లు ఖరారు చేశాం. త్వరలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా మొదలవుతుంది. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
మరింత పక్కాగా..
మహబూబ్‌నగర్ రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహార పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రస్తుతం అక్రమాలు అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి బియ్యం, పప్పులు, నూనె, గుడ్లు, రవ్వ తదితర వస్తువులను చౌకధర దుకాణాల ద్వారా నేరుగా అందించాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యాన్ని డీలర్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు మరింత పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి అవసరమైన సరుకులను ప్రస్తుతం అందిస్తున్నట్లు ఏజెన్సీల ద్వారా కాకుండా చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ఫిబ్రవరి నెల నుంచే అమలుకానుంది. గతంలోనే అనుకున్నా.... గతంలోనే అంగన్వాడీ కేంద్రాలకు రేషన్‌షాపుల ద్వారా సరుకులు అందజేయాలని ప్రభుత్వం యోచించినా అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈనెల ఈ పద్ధతి అమల్లోకి రానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు చదువు నేర్పిస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే, ఆయా కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు బాలింతలకు అదనంగా నిత్యం ఒక గుడ్డు, 200 మిల్లిలీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏజెన్సీల ద్వారా ఈ సరుకులు అందజేసే వారు. అయితే పంపిణీలో అక్రమాలు, అవకతవకలను గుర్తించిన ప్రభుత్వం నేరుగా పౌరసరఫరాల శాఖ ద్వారా చౌకధర దుకాణాల నుంచి అందించాలని నిర్ణయించింది. జిల్లాలో 1,889 అంగన్వాడీ కేంద్రాలు... జిల్లాలోని 26 మండలాల్లో 1,889 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్ పరిధిలో మహబూబ్‌నగర్ అర్బన్, మహబూబ్‌నగర్ రూరల్, దేవరకద్ర, మద్దూరు, మక్తల్, జడ్చర్ల, నారాయణపేట ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ద్వారా ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు పాఠశాల పూర్వ విద్య బోధిస్తున్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రతీనెలా 3663.53 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ఇంతకాలం ఇస్తున్నట్లు ఏజెన్సీల ద్వారా కాకుండా సమీపంలోని రేషన్ దుకాణాల ద్వారా అవసరమైన అన్ని సరుకులను అందజేయాలని నిర్ణయించారు. సరుకుల్లో బియ్యంతో పాటు మంచినూనె, పప్పు తదితర నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాలని నిర్ణయించినా మొదటగా బియ్యం మాత్రమే ఇవ్వనున్నారు. బియ్యం పంపిణీ సజావుగా జరిగితే మిగతా సరుకులను సైతం ఈ విధానంలోనే అంగన్వాడీలకు అందచేస్తారు. ప్రతినెలా ఏ కేంద్రంలో ఎందరు పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉంటే ఇండెంట్ ప్రకారం సరుకులను తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 1నుంచి 15వ తేదీ వరకు... చౌకధర దుకాణాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీలోగా సరఫరా చేయాలని నిర్ణయించారు. దీంతో గోదాముల నుంచి, ఏజెన్సీల ద్వారా బియ్యం పంపిణీ చేసినప్పుడు తూకంలో తేడా ఉందంటూ వచ్చే ఆరోపణలకు చెక్ పడనుంది. కాగా, అంగన్వాడీ కేంద్రాల్లో వినియోగించిన బియ్యానికి సంబంధించిన ప్రతినెల 8వ తేదీలోపు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆ తర్వాత నెల బియ్యం సరఫరా చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న చౌకధర దుకాణాల వివరాలను ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. కేంద్రాల వారీగా సరఫరా చేయాల్సిన బియ్యం కోసం పౌరసరఫరాల శాఖ అధికారులకు నివేదించారు. అంగన్వాడీ టీచర్లు ప్రతినెల బయోమెట్రిక్ విధానం ద్వారా కేంద్రానికి అవసరమయ్యే బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. నేడు ప్రారంభించనున్న కలెక్టర్ చౌకధరల దుకాణాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ విధానాన్ని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ శుక్రవారం ప్రారంభించనున్నారు. నారాయణపేటలోని 7వ వార్డు పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్–2కు కలెక్టర్ బియ్యం అందజేస్తారు. ఇక మిగతా కేంద్రాల్లో కూడా అధికారులు బియ్యం పంపిణీని ప్రారంభిస్తారు. -
గుడ్డుకు సెలవు
అంగన్వాడీ కేంద్రాలకు 20 రోజులకు పైగా కోడిగుడ్లు సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం జిల్లాలవారీగా సరఫరా చేసే కాంట్రాక్టర్లను నియమించాలనే ఉద్దేశంతో గత నెల్లో అంతకుముందు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ను ఆపివేసి కొత్త టెండర్లు నిర్వహించింది. ఈ సందర్భంగా మూడు టెండర్లు దాఖలుకాగా మార్కెట్ ధరకంటే అధిక ధరకు కోట్ కావడంతో టెండర్ల ఖరారును జిల్లా అధికారుల ఆపివేశారు. దీంతో గుడ్డు సరఫరా జిల్లావ్యాప్తంగా ఆగిపోవడంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు సక్రమమైన పౌష్టికాహారం అందడం లేదు. నెల్లూరు, ఉదయగిరి: జిల్లాలో 3,774 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 17 ప్రాజెక్ట్‌ల పరిధిలో ఉండే అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రతిరోజూ 1.70 లక్షల గుడ్లు సరఫరా చేయాలి. 20 రోజులనుంచి పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం కోడిగుడ్లు రూ.4.63కు కాంట్రాక్టరు సరఫరా చేస్తుండగా కొత్త టెండర్లలో రూ.5.46కు టెండరు వేయడంతో అధికారులు నిలిపివేశారు. దీనిపై తుది నిర్ణయం కమిషనర్‌కు జిల్లా అధికారులు వదిలివేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమౌతోంది. ఆగిన పోషకాహారం అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు వారానికి ఆరురోజులు గుడ్లు పంపిణీ చేస్తారు. ప్రీస్కూలు పిల్లలకు వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. ఆర్నెల్లనుంచి మూడేళ్లలోపు పిల్లలకు వారానికి రెండు గుడ్లు ఇస్తారు. ప్రస్తుతం సరఫరా నిలిపివేయడంతో వీరెవరికీ గుడ్లు అందడం లేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీస్కూలు పిల్లలు, గర్భిణులు, బాలింతల సంఖ్య కూడా తగ్గిపోతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు గత 20 రోజులనుంచి గుడ్లు సరఫరా పూర్తిగా నిలిచిపోయినా సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేయలేదు. టెండర్ల దాఖలాలో ఏర్పడిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత కమిషనరు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో సరఫరా ఆలస్యం జరుగుతోంది. గత కొన్నేళ్లనుంచి గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టరుకే మళ్లీ అధిక ధరకు టెండరు దక్కేవిధంగా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపణలున్నాయి. అధిక ధరకు టెండరు ఇప్పించి అందులో కొంతమొత్తంలో కమీషన్ కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. పైగా అంగన్వాడీ కేంద్రాల కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా గుడ్లు సరఫరా అప్పగించే అవకాశముంది. దీంతో ఏడాదిలో కోట్ల రూపాయలు లబ్ధిపొందే పరిస్థితి నెలకొంది. ఎలాగైనా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు ఈ టెండరు దక్కేవిధంగా జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. -
పౌష్టికాహారం అందేనా?
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు తాజా కూరగాయలతో వండిన పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం న్యూట్రిగార్డెన్లను ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా ఆయా కేంద్రాలలో కూరగాయలను పండించుకోవడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు కనీసం 20 సెంట్ల స్థలాన్ని కేటాయించాలి. కాగా ఇప్పటివరకు జిల్లాలో 465 గ్రామ పంచాయతీల్లో స్థలాన్ని గుర్తించారు. కాగా మిగతా కేంద్రాల్లో స్థలాల గుర్తింపు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలో ప్రతి పంచాయతీలో న్యూట్రిషియన్ గార్డెన్లను ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ బాధ్యతను పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథక, స్త్రీ శిశు సంక్షేమశాఖకు ప్రభుత్వం అప్పగించింది. వీటి ఏర్పాటుకు ఈ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని న్యూట్రిషియన్ గార్డెన్ల కోసం పంచాయతీల పరిధిలో 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఉపాధి హామీ అధికారులకు అప్పగించాలని తహసీల్దార్లకు స్పష్టం చేసింది. ఈ స్థలాల గుర్తింపులో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి ఇప్పటివరకు 465 చోట్ల గుర్తించారు. జిల్లాలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 3,268, మినీ అంగన్వాడీ కేంద్రాలు 353 కలిపి మొత్తం 3,621 ఉన్నాయి. ఇందులో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు 1,05,711 మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలలోపు 96,570 మంది పిల్లలున్నారు. గర్భిణులు 2,321, బాలింతలు 22,174 మంది ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం అందించడానికి ప్రతినెల 35,48,222 కోడిగుడ్లు అందిస్తున్నారు. అందుబాటులో లేని ప్రభుత్వ స్థలాలు.. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించారు. మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలి. కూరగాయల ఖర్చులు, సరుకులకు ప్రభుత్వమే నిధులను విడుదల చేస్తోంది. అయితే ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ఆయా గ్రామాలలో 10 నుంచి 20 సెంట్ల స్థలాన్ని కేటాయించి, అక్కడ కూరగాయలు పండించాలి. అయితే ఒక్క గ్రామంలో కూడా దీనికి అవసరమైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు. దాతల నుంచి స్థలాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. తలకు మించిన భారం.. న్యూట్రిషియన్ గార్డెన్ల ఏర్పాటు అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఓ పక్క ఉన్నతాధికారుల ఒత్తిడి, మరోపక్క క్షేత్ర స్థాయిలో స్థలాల కొరత అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మంజూరైన అంగన్వాడీ కేంద్రాలకు కొన్ని గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం కూడా లభించక వాటి నిర్మాణ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. స్థల పరిశీలన చేపట్టాం.. ప్రభుత్వ నిబధనల ప్రకారం పది సెంట్ల స్థలం లభిస్తే అక్కడే పండిన కూరగాయలతో మంచి పౌష్టికాహా రాన్ని అంగన్వాడీ కేం ద్రాలలో అందించాలనే దృక్పథంతో ప్రభుత్వం న్యూట్రిషియన్ గార్డెన్లను ప్రవేశ పెడుతోంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో స్థలాల పరిశీలన చేపట్టాం. ఇప్పటికి 465 గ్రామ పంచాయతీలలో స్థలాలను గుర్తించాం. త్వరలో న్యూట్రిషియన్ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – పద్మజ, ఐసీడీఎస్ పీడీ, కడప -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ప్రకాశం, పొదిలి: పోషకాహార లోపంతో ఎదుగుదల లేని పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, బలహీనంగా ఉండే గర్భిణులు, గర్భిణుల్లో రక్తహీనత, మాతా శిశు మరణాల సంఖ్య లేకుండా చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ రకాల సేవలు అందిస్తోంది. గర్భిణులు, బాలింతలలకు పోషకాహారం తయారు చేసి కేంద్రాల్లోనే తినేలా చూస్తున్నారు. వీరికి పోషక అవసరాల్లో అధిక శాతం మాంసకృతులు, ఐరన్ ఇవ్వాలనేది ఐసీడీఎస్ లక్ష్యం. మరో వైపు పోషకాహార ప్రాధాన్యం గురించి గర్భిణులు, తల్లులకు అంగన్వాడీలు అవగాహన కల్పిస్తున్నారు. ఇదీ..ముఖ్య ఉద్దేశం పోషకాహార ప్రాధాన్యం తెలియజేయడం, ఆ దిశగా ఆహార పదార్థాలు తినేలా అలవాటు చేసుకునేలా చేయడం, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఎంత అవసరమో తెలియ జేయడం, పోషకాహారాల్లో ఏయే శక్తి ఎంత మేర ఉంటుందో సమగ్రంగా తెలియజెప్పటం పోషణ అభియాన్ ముఖ్య ఉద్దేశం. వంటలు తయారు చేసి ప్రదర్శించడం ద్వారా గర్భిణులు, తల్లులకు అవగాహన కల్పిస్తారు. నెలంతా కార్యక్రమాలు జిల్లాలోని 21 ప్రాజక్టుల పరిధిలో 4244 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలు 43 వేల మంది, చిన్నారులు 45 వేల మంది వరకు ఉన్నారు. పోషణ అభియాన్‌లో భాగంగా సెప్టెంబర్ నెలంతా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు రూపొందించారు. పోషణ అభియాన్‌లో నిర్వహించే కార్యక్రమాలపై జన చైతన్యం పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. నెలలో నాలుగు వారాలకు సంబంధించి తొలి వారం గ్రోత్ మానిటరింగ్, రెండో వారం విద్య, మూడో వారం స్వచ్ఛత, నాలుగో వారం న్యూట్రిషన్‌కు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. న్యూట్రిగార్డెన్లకు ప్రాధాన్యం ఈ పర్యాయం న్యూట్రిగార్డెన్లు పెంచాలని నిర్ణయించారు. ఈ గార్డెన్‌ల్లో రసాయనిక ఎరువులు వాడకుండా పెంచిన ఆకు కూరలు, కూరగాయలతో ఆహార పదార్థాలు తయారు చేసి లబ్ధిదారులకు ఇవ్వాలనేది ఉద్దేశం. ఆ దిశగా న్యూట్రిగార్డెన్లు జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పెంచాలని ఐసీడీఎస్ అధికారులు నిర్ణయించారు. నేటి బాలికలే రేపటి తల్లులు: యవ్వన దశలో హార్మోన్‌ల్లో జరిగే మార్పులు మూలంగా పోషకాహారం తప్పని సరి. ఎముకలకు అవసరమైన క్యాల్షియం ఇవ్వాలి. రుతు క్రమంలో రక్తాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున రక్తం పెరిగేందుకు అవసరమైన పోషకాహారం తీసుకోవాలి. ఈ దశలో ఇనుము, మాంసకృతులు అధికంగా లభించే పాలు, పప్పు, గుడ్లు, ఆకుకూరలు, బెల్లం, రాగులు రోజు వారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్‌లో ఆరోగ్యకర తల్లులుగా ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.పి.సరోజని, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
తిండి కలిగినా.. కండ లేదోయ్!
‘తిండికలిగితే కండకలదోయ్.. కండకలవాడేను మనిషోయ్’ అన్నారు గురజాడ అప్పారావు. కానీ రానురాను కండగలవారు కరువైపోతున్నారు దేశంలో. ప్రతి పదిమందిలో ఏడుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. దేశంలో 72 శాతం మంది కండరాల బలహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. ఇన్‌బాడీ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిలో 77 శాతం మందికి కండరాల బలహీనత ఉందని సర్వే తెలిపింది. హైదరాబాద్‌లో 75 శాతం (పురుషులు 78%, మహిళలు 72%) మందిలో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. దేశంలోని తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని వివరించింది. తూర్పు ప్రాంతాల్లో నివసించే మహిళల్లో ప్రమాదకర స్థాయిలో 80 శాతం మందికి కండరాల బలహీనత ఉందని చెప్పింది. దేహంలోని కండరాలను బలోపేతం చేయడంలో ప్రొటీన్లు కీలక భూమిక పోషిస్తాయి. అయితే 68 శాతం మంది భారతీయులు ప్రొటీన్ల లోపంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ప్రొటీన్ల లోపం వల్లే 50 ఏళ్లకు పైబడిన వారిలోనూ, మహిళల్లోనూ కండరాల బలహీనత ఉంది. తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎమినోయాసిడ్స్ అందుతాయి. అలా కండరాల్లో శక్తి పుంజుకుంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఒక కేజీ శరీర బరువుకి 0.8 నుంచి 1 గ్రాము ప్రొటీన్లు అవసరం ఉంటుంది. కొవ్వు కరిగించాల్సిందే.. భారతీయుల్లో 95 శాతం మంది శరీరంలో కొవ్వు పేరుకుపోయింది. అధిక బరువుకి మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ప్రధానమైన కారణం. వీరంతా కొవ్వు కరిగించుకోవాల్సిందే. అందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఒక్కటే మార్గం. 40 ఏళ్లు దాటిన వారిలో 97–98 శాతం మంది కొవ్వు తగ్గించుకోవాల్సి ఉంది. శరీరంలో ప్రధానంగా పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు, చర్మం కింద పేరుకునే కొవ్వు (సబ్‌క్యుటేనియస్ ఫ్యాట్, విసెరల్ ఫ్యాట్) అని రెండు రకాలైన కొవ్వులుంటాయి. వీటిలో ఏదీ అధికంగా ఉండ కూడదు. విసెరల్ ఫ్యాట్ పెరగడం మరింత ప్రమాదకరం. విసెరల్ ఫ్యాట్.. డయాబెటీస్, బీపీ, కేన్సర్, హృద్రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో విసెరల్ ఫ్యాట్ 1 నుంచి 20 శాతం ఉండాలి. కానీ దేశంలో 56 శాతం మందికి ఉండాల్సిన దానికంటే అధికంగా విసెరల్ ఫ్యాట్ పేరుకుపోయింది. 75 శాతం మహిళల్లో మరింత ప్రమాదకరంగా తయారైంది. 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారిలో కొవ్వు అధికంగా ఉండడంతోపాటు, కండరాలు బలహీనత ప్రమాదకరంగా ఉంది. కండరాల బలోపేతంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనం నొక్కి చెబుతోంది. రోజూ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తోంది. 9 నుంచి 10 గ్రాముల ప్రొటీన్లుండేలా చూసుకోవాలంటోంది. సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. దేశంలో ప్రతి పదిమందిలో ఏడుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహార లేమి, వ్యాయామం చేయకపోవడమే ఇందుకు కారణం. 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో 72 శాతం కండరాలు శక్తిహీనం. ఉద్యోగస్తుల్లో 72 శాతం. ఉద్యోగాలు చేయని వారిలో 69 శాతం. హైదరాబాద్‌లో 75 శాతం, అహ్మదాబాద్‌లో 73 శాతం, లక్నోలో 81 శాతం, పట్నాలో 77 శాతం మంది కండరాలు బలహీనం. పట్నా మహిళల్లో అత్యధికంగా 80 శాతం మందికి కండరాల బలహీనత. 95 శాతం మంది భారతీయుల శరీరంలో కొవ్వు పేరుకుపోయింది. పొట్టభాగంలో కొవ్వుతో ఇబ్బంది పడుతున్న వారు 56 శాతం. 81 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మహిళల్లో 86 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
అంగన్వాడీల్లో మరింత పౌష్టికాహారం
పోషణ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం నుంచి మరింత పౌష్టికాహారం అందనుంది. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ పథకం ద్వారా జిల్లాను పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అవకాశం రానుంది. ఇది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. రామభద్రపురం: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పోషణ అభియాన్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మరియు ఇతర జనాభాలో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లల పోషణ స్థితి మెరుగుదలకు అదనపు పౌష్టికాహారం అందించే ప్రత్యేక కార్యక్రమం అంగన్వాడీల్లో అమలు కానుంది. రక్తహీనత గల హైరిస్క్ గర్భిణులు, బాలింతలు, తీవ్ర పోషకాహార లోపం ఉన్న ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఈ నెల 27న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్ల 3,728 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషణ అభియాన్ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నారు. గర్భిణులు, బాలింతలకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో పాటు పొడవు 45 సెంటీమీటర్లు, 35 కిలోల కంటే తక్కువ ఉన్న వారికి, చిన్న వయసులో వివాహం జరిగి గర్భం దాల్చిన వారికి, 35 సంవత్సరాలు తరువాత గర్భం దాల్చిన వారికి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో 1.46 లక్షల మంది పిల్లలు ఉండగా వారిలో తీవ్ర పౌష్టికాహార లోపంతో రక్తహీనత కలిగిన ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు ఉన్న పిల్లలు 18 వేల మంది ఉన్నారు. వీరందరికీ రోజూ అందిస్తున్న మెనూతో పాటు కొత్త మెనూ ప్రకారం ప్రతి రోజూ ఒక గుడ్డు, 200 గ్రాముల పాలు అదనంగా ఇవ్వనున్నారు. రక్తహీనత హైరిస్క్ గల గర్భిణులు, బాలింతలకు రోజూ అందిస్తున్న మె నూతో పాటు రోజూ ఉదయం 50 గ్రాముల బెల్లంతో తయారు చేసిన వేరుశనగ చెక్కి, మధ్యాహ్నం ఒక గుడ్డు, వంద మి.లీ. పాలు, సాయంత్రం 50 గ్రాముల నువ్వల చెక్కి అదనపు పౌష్టికాహారంగా అందివ్వనున్నట్టు అధికారిక సమాచారం. రేపటి నుంచి కొత్త మెనూ 'అంగన్వాడీ కేంద్రాలలో తీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు కోసం పోషణ అభియాన్ పథకం ద్వారా కొత్త మెనూ ప్రారంభించనున్నాం. బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఈ కొత్త మెనూను సద్వినియోగ పరుచుకుంటే పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చును. పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఈ పథకం అమలు కానుంది. – వసంతబాల, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం సంతోషంగా ఉంది.. గతంలో గర్భిణులకు, బా లింతలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు నేను సైతం అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిం ది. ఈ పథకంలో భాగంగా దాతలు ద్వారా అదనపు పౌష్టికాహారాన్ని సేకరించి అందించాం. ఇక నుంచి ప్రభుత్వమే అదనపు పౌష్టికాహారం అందించనుంది. కాబట్టి దాతలను ఆశ్రయించాల్సిన పని ఉండదు. ప్రభుత్వమే అదనపు ఆహారం అందించడం సంతోషంగా ఉంది. – యర్రయ్యమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్, రామభద్రపురం పౌష్టికాహారం అందించేందుకే... బెల్లంలో ఐరన్, వేరుశనగ, నువ్వులలో ప్రోటీన్స్ ఉంటాయి. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, హైరిస్క్ అధికంగా ఉంటోంది. పిల్లల్లో పొడవు, బరువు తగ్గే అవకాసం ఉంటుంది. వీరికి శనగ, నువ్వులు చెక్కీలు, పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారం అందించడం వల్ల వారిలో ఉన్న పోషక లోపాన్ని అధిగమించవచ్చు. – హెచ్‌కె కామాక్షి, సీడీపీఓ, సాలూరు -
మందుల్లేవు..!
పొన్నలూరు: ఐదేళ్లలోపు చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందించి చిన్నారుల ఎదుగుదలకు దోహదపడాలనే లక్ష్యంతో స్థాపించిన అంగన్వాడీ కేంద్రాలు ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో పాటు చిన్నారులకు ఆరోగ్య సంరక్షణ కోసం అందించాల్సిన ప్రథమ చికిత్స కిట్లు సకాలంలో సరఫరా చేయకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే మందులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఆడుతూ పిల్లలు కిందపడి గాయాలపాలైతే కనీసం పూత మందు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం పంపిణీ చేసే ప్రథమ చికిత్స కిట్లు, మందులు రెండేళ్లుగా అందకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 21 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 4244 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులు 1,14,894 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,01,159 మంది ఉన్నారు. గర్భిణులు 44,978 మంది, బాలింతలు 45,240 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి చిరువ్యాధులు సోకినప్పుడు తాత్కాలిక ఉపశమనం పొందడానికి మందులు, సిరప్ ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాత అంగన్వాడీ కార్యకర్త చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లేలా వారి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం మందుల కొరతతో అంగన్వాడీ కేంద్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదు. చివరిగా అంగన్వాడీ కేంద్రాలకు 2015 జూలై నెలలో మందుల కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మందుల పరిస్థితి ఇదీ: అంగన్వాడీ కేంద్రాలకు రెండేళ్ల క్రితం సరఫరా చేసిన ప్రథమ చికిత్స సామగ్రిలోని అరకొర మందులనే నేటికీ అక్కడక్కడా కొన్ని సెంటర్లలో వినియోగిస్తున్నారు. మరి కొన్ని సెంటర్లలో తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్వాడీ కార్యకర్తలే వారి సొంత డబ్బులతో కొనుగోలు చేసి వాడుతున్నారు. ఎక్కువ శాతం అంగన్వాడీ కేంద్రాల్లో కనీసం రెండేళ్ల క్రితం ఇచ్చిన మందులు కూడా లేకపోవడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులు విరామ సమయాల్లో ఆడుకుని విశ్రాంతి పొందడానికి చాలా కేంద్రాల్లో అనువైన స్థలం లేదు. పిల్లలు ఆడుకునే సమయంలో పొరపాటున కాలుజారి కిందపడితే గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా వైద్యం చేయడానికి అందుబాటులో మందులు ఉండటం లేదు. దీంతో కేంద్రాలకు వస్తున్న పిల్లలకు కార్యకర్తలు ఆటలు నేర్పేందుకు వెనకాడుతున్నారు. చిరు వ్యాధులకూ అంతే... మూడేళ్లలోపు చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు తరచూ రోగాల బారిన పడుతుంటారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి చిరు వ్యాధులకు అందుబాటులో మందులు ఉంచితే కొంత మేరకు చిన్నారులకు ఉపశమనం కలిగి వారి ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది. అలాంటిది నేడు అంగన్వాడీ కేంద్రాల్లో మందులు అందుబాటులో లేవు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొండపి, ఉలవపాడు, పొదిలి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో సుమారుగా 719 అంగన్వాడీ కేంద్రాలు, 34,374 మంది చిన్నారులు, 4064 మంది గర్భిణులు, 4920 మంది బాలింతల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. త్వరలో మందుల కిట్లు అందజేస్తాం అంగన్వాడీ కేంద్రాలకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఆరోగ్య సామగ్రి సరఫరా చేసింది. ప్రస్తుతం ఇంకా కేంద్రాలకు మెడికల్ కిట్లు అందించలేదు. దీని ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆరోగ్య కిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం టెండర్లు నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే త్వరలో అన్ని సెంటర్లకు మందులు అందజేస్తాం.– సరోజిని, ఐసీడీఎస్ పీడీ, ఒంగోలు -
‘అక్షయపాత్ర’ కోసం సమంత ట్వీట్
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. రోజు తిండిలేక చనిపోయే వారెంతో మంది ఉన్నారు. ఎంతో మంది పిల్లలు సరైన భోజనం లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి. అనాథలు, స్కూల్ పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నాయి. అక్షయపాత్ర అనే సంస్థ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థకు సమంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది తన కుటుంబం వంద మంది స్కూల్ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించామని, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, మీ వంతుగా కేవలం రూ.950 చెల్లిస్తే సరిపోతుందని, ఈ డబ్బుతో ఏడాది పాటు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివచ్చని సమంత ట్వీట్ చేశారు. ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన లింక్‌ను కూడా షేర్ చేశారు. This year our family is sharing our lunch with 100 schoolchidlren for an entire year! You too can join by just contributing just 950/-. That provides hot, tasty & nutritious lunch to a schoolchild for an entire year!https://t.co/jGi8v2QEap#iShareMyLunch#AkshayaPatra — Samantha Akkineni (@Samanthaprabhu2) June 22, 2018 -
విద్యార్థినులకు ప్రత్యేక పౌష్టికాహారం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల్లో ఎక్కువ మంది రక్తహీనత, పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్‌తో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో గురుకుల సొసైటీ కార్యదర్శులు, విద్యా శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. బాలికలకు పౌష్టికాహారంలో భాగంగా బెల్లంతో చేసిన పల్లీ పట్టీలు, నువ్వుల పట్టీలను స్నాక్స్ రూపంలో ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ఉదయం రాగిమాల్ట్, పాలు, అల్పాహారం ఇవ్వడంతో పిల్లల ఆరోగ్యం కొంత మెరుగుపడిందన్నారు. మధ్యాహ్న భోజనంలో 50 గ్రాముల నెయ్యి, రాత్రి పూట మంచి భోజనం ఇస్తున్నామని తెలిపారు. దీనివల్ల గురుకుల విద్యార్థులలో చురుకుదనం పెరిగిందని, ఆరోగ్యం బాగుండటం వల్ల చదువు కూడా బాగా చదువుతున్నారన్నారు. నీట్, జేఈఈ పరీక్షల్లో తెలంగాణ గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే వారికి కోచింగ్ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ జూలై నుంచి అందిస్తున్నామని, ఇందులో బాలికలకు అవసరమైన 13 రకాల 50 వస్తువులున్నాయన్నారు. ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీల నుంచే కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభు త్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాం ఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ గురుకులాల డైరెక్టర్ భట్టు మల్లయ్య, మైనారిటీ గురుకులాల డైరెక్టర్ షఫీ యుల్లా, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్ల డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘బొద్దింక పాలు’ సూపర్‌ఫుడ్!
బెంగళూరు : ఇంట్లో బొద్దింకలను చూడగానే ఎక్కడలేని కోపం.. అసహ్యం వేస్తుంది కొందరికి. ఆ కోపంలో వాటిని కొట్టి చంపి చెత్తబుట్టలో పడేస్తారు. మళ్లీ బొద్దింకలు ఇంటి ఛాయల్లోకి రాకుండా జాగ్రత్త పడతారు. అలాంటి బొద్దింకలను ఆహారంగా తీసుకోవాల్సి వస్తే.. ఛీ ఛీ అనుకుంటున్నారా? కానీ రానున్న రోజుల్లో బొద్దింకలకు డిమాండ్ విపరీతంగా పెరగనుందని, వాటిలో ఎక్కువ శాతం పోషకవిలువలు ఉన్నాయని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్’ శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బొద్దింకలను ఉపయోగించి తయారు చేసిన పాలలో మామూలు పాలకంటే నాలుగు రెట్లు ఎక్కువ పోషకవిలువలు ఉన్నాయని కొన్నేళ్ల తర్వాత బొద్దింక పాలు సూపర్‌ఫుడ్‌గా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బొద్దింక జాతిలో ఒకటైన పసిఫిక్ బీటిల్ కాక్రూచ్ మామూటు బొద్దింకలలా గుడ్లు పెట్టకుండా పిల్లల్ని కంటాయి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ జీవులు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయని పరిశోధనలో తేలింది. ఈ బొద్దింకలను కేవలం పాలలోనే కాకుండా ఐస్క్రీమ్స్లలో కూడా వాడుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన గౌర్మట్ గర్బ్ అనే కంపెనీ ‘ఎంటోమిల్క్’ పేరిట బొద్దింకపాలను విక్రయిస్తోంది. ఈ బొద్దింకపాలలో కొవ్వులు, ప్రోటీన్లు, షుగర్, అమినోఆసిడ్స్ వంటివే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉంటాయి. కొన్ని కంపెనీలైతే పాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే పనిలో పడ్డాయి. -
గర్భిణుల పోషకాహారానికి ప్రోత్సాహక నగదు
తణుకు అర్బన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచి, మాతా శిశు సంరక్షణకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రూపొందిం చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి గర్భం దాల్చిన మొదటి కాన్పు గర్భిణులకు మూడు దఫాలుగా రూ.5 వేలు, జననీ సురక్ష యోజన కార్యక్రమంలో భాగంగా రూ.1,000 అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జిల్లావ్యాప్తంగా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తెలుపుతున్న ఈ పథకం ఇప్పుడు పట్టణాల్లో కూడా ఊపందుకుంది. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారానికి తోడు గర్భిణి తనకు కావాల్సిన పోషకాలను కొనుగోలు చేసుకునే వీలుగా ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. పథకంలో నగదు పంపిణీ ఇలా.. గర్భిణిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రూ. 1,000 గర్భిణి సొంత బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఆరో నెలలో వైద్యాధికారిచే వైద్య పరీక్షలు చేయించుకున్న పిదప బ్యాంకు ఖాతాలో రూ.2 వేలు జమ వేస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత మూడో డోసు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న తర్వాత రూ.2 వేలు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అర్హతలివే.. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత గర్భం దాల్చి ఉండి 12 వారాల్లోపు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి.మాతా శిశు ఆరోగ్య రక్షణ వివరాల కార్డు గర్భిణి ఆధార్ కార్డు గర్భిణి పేరుతో ఉండి ఆధార్ అనుసంధానం అయిన బ్యాంకు, పోస్టాఫీసు అకౌంట్ బుక్ గర్భిణి మొబైల్ నంబర్ భర్త వివరాలు, ఆధార్ నంబర్ పూర్తి చిరునామా బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం 3 నెలల్లో రూ.3.42 కోట్లు పంపిణీఇప్పటివరకు జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లోను, గ్రామాల్లోను 18,761 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.3.42 కోట్లు ఆన్లైన్ ద్వారా వారి ఖాతాలకు జమచేసినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గర్భిణులకు ఈ పథకంలో ఏమైనా సందేహాలు ఉంటే ఆ ఏరియా ఆరోగ్య కార్యకర్తను, సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని చెబుతున్నారు. గర్భిణులకు భరోసా.. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం పేద గర్భిణులకు భరోసాగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా గర్భిణికి దఫదఫాలుగా రూ.5 వేలు అందిస్తుండగా, జననీ శిశు సురక్ష ద్వారా మరో రూ.1,000 అందిస్తున్నాం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ తర్వాత గర్భం దాల్చి ఉండి మొదటి కాన్పు గర్భిణి ఈ పథకం వర్తిస్తుంది. – డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌వో, ఏలూరు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం.. పేద గర్భిణులు అంతా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఇంటింటికి వెళ్లి గర్భిణులను నమోదు చేయడంతోపాటు వారితో దరఖాస్తు చేయిస్తున్నాం. – డాక్టర్ బి.దుర్గామహేశ్వరరావు, తణుకు పీపీ యూనిట్ వైద్యాధికారి -
తింటున్న నీరెంత ?
నీరు.. ఆహారమే జగతిలో ప్రతి జీవి మనుగడకూ ఆధారం... మనం తినే ఆహారం ఏదైనా..ఆ మాటకొస్తే వేసుకునే వస్త్రమైనా... అంతా నీటి మయమే! ఏ ఆహార పదార్థం తయారు కావాలన్నా నీరు చాలానే ఖర్చవుతుంది. ఏయే ఆహార పదార్థాలకు ఎంతెంత నీరు ఖర్చవుతుందన్నది ప్రశ్న! దీని గురించి శాస్త్రీయంగా తెలియజెప్పేదే ‘వాటర్ ఫుట్‌ప్రింట్’! ఇదంతా ఎందుకూ అంటే..? భూతాపం పెరిగి వాతావరణం అనూహ్యంగా మారిపోతూ ఉంది.. ప్రకృతిలో మమేకమై ఉండే అన్నదాతలకు కూడా పంటల సాగు కత్తి మీద సాములాగా మారిపోతూ ఉంది.. భూతలమ్మీద నీటి లభ్యత నానాటికీ తగ్గుతుంటే, జనాభా మటుకు పెరుగుతూ ఉంది.. మనందరమూ ‘ఆహార నీటి’ చైతన్యం పొందాల్సిన అవసరం ఉంది. అంటే.. ఎక్కువ నీటితో పండే ఆహారంపై నుంచి మనసు మళ్లించి... ఆహార వృథాను అరికట్టాలి. తక్కువ నీటితో పండే సమతుల్య ఆహారం వైపు దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులు వస్తున్నాయి.. 5,000–7,000 వేల లీటర్ల సాగు నీటితో పండే కిలో వరి బియ్యం కన్నా.. ఇందులో సగం నీటితోనే.. అది కూడా కేవలం వాన నీటితోనే పండే చిరుధాన్యాలు నిజంగా సిరిధాన్యాలే కదా.. తినే వారిలో ‘ఆహార నీటి’ చైతన్యం వస్తే... పండించే వారిలోనూ వస్తుంది! అప్పుడిక ఆహార, పౌష్టికాహార భద్రతకు ఢోకా ఉండదు!! ఏ పంటకైనా లేదా ఏ ఆహార పదార్థానికైనా ఎంత నీరు ఖర్చవుతుందంటే ఠక్కున సమాధానం చెప్పడం అంత సులువేమీ కాదు. ఏయే పంటకు ఎంతెంత నీరు ఖర్చు అవుతుందనే విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆయా దేశ, కాల, వాతావరణ, భూమి స్థితిగతులను బట్టి.. ఇంకా చెప్పాలంటే, సాగు పద్ధతిని బట్టి.. ఉత్పాదకతను బట్టి కూడా నీటి ఖర్చు మారిపోతూ ఉంటుంది. కాబట్టి, కిలో వరి బియ్యం పండించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చయ్యే నీటికీ, అమెరికాలో ఖర్చయ్యేనీటికీ, చైనాలో ఖర్చయ్యే నీటికీ మధ్య చాలా వ్యత్యాసమే ఉంటుంది. ఏటేటా భూతాపం, ఉష్ణోగ్రత, వాతావరణ ఉపద్రవాలు పెరిగిపోతున్న గడ్డు పరిస్థితుల్లో పౌరులందరూ ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, వినియోగించేటప్పుడు ‘ఆహార నీటి’ చైతన్యంతో వ్యవహరించగలగాలి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత సాధించడానికి పాలకులు, ప్రజలు అందరూ ‘ఆహార నీటి’ చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం తరుముకొస్తోంది. ప్రజల్లో, విధాన నిర్ణేతల్లో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ‘వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్’ అనే సంస్థ ప్రపంచ దేశాల్లో వ్యవసాయ, ఆహార గణాంకాలను సేకరించి, క్రోడీకరించి ‘నీటి వినియోగ ముద్ర’(వాటర్ ఫుట్‌ప్రింట్)లను తయారు చేశారు. వర్షపాతం, కాలువ/చెరువుల ద్వారా పెట్టిన సాగు నీరు, బోరు/బావి ద్వారా తోడిన నీరు మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయ్యే నీటి ఖర్చును 2011 నాటి గణాంకాల ఆధారంగా లెక్కగట్టారు. ప్రతి ఒక్కరి ఆహారానికి 3,496 లీటర్ల నీటి ఖర్చు! ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషీ తింటున్న ఆహారోత్పత్తికి రోజుకు సగటున 3,496 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తేల్చింది. అయితే, ప్రతి పూటా మాంసం తినే పాశ్చాత్య దేశాలతో పోల్చితే అప్పుడప్పుడూ మాంసం తినే అలవాటున్న భారతీయ పౌరుడు తినే ఆహారానికి ఇంతకన్నా తక్కువే ఖర్చవుతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా.. తాగునీరు, ఇంటి అవసరాలకు తలసరి నీటి ఖర్చు రోజుకు 137 లీటర్లు కాగా, అనుదినం వాడే పారిశ్రామిక వస్తువుల నీటి ఖర్చు 167 లీటర్లు.ఆహార నీటి ఖర్చు ప్రపంచ సగటు కన్నా మన దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం తలసరి నీటి వినియోగంలో 92% ఆహారోత్పత్తికే ఖర్చవుతున్నదని అంచనా. మన దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అవసరాల నిమిత్తం రోజుకు 3 వేల లీటర్ల నీటిని వాడుతున్నారు. చైనా పౌరులు సగటున రోజుకు 2,900 లీటర్ల నీటిని వాడుతున్నారు. అమెరికా పౌరులు సగటున రోజుకు 7,800 లీటర్ల నీటిని వాడుతున్నారు.ఒక దేశంలో పండించిన పంట లేదా శుద్ధిచేసి ప్యాక్ చేసిన ఆహారోత్పత్తిని మరో దేశంలో ప్రజలు దిగుమతి చేసుకొని తింటూ ఉంటారు. అంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఆహార పదార్థం/ వస్తువు ఎగుమతి అయ్యిందీ అంటే.. నీరే మరో రూపంలో ఎగుమతి అవుతున్నదన్న మాట. ఈ ప్రకారం చూస్తే.. అమెరికన్లు 20% విదేశాల్లో నీటితో తయారైన వస్తువులు, ఆహారాన్ని దిగుమతి చేసుకొని వాడుతుంటే.. చైనీయులు 10%, భారతీయులు 3% వాడుతున్నారు. కిలో వరి బియ్యం ఉత్పత్తికి 5,331 లీటర్లు! ఆహార ధాన్యాల్లో వరి సాగుకు అత్యధికంగా నీరు ఖర్చవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటున కిలో వరి ధాన్యం పండించడానికి 1,670 లీటర్లు, కిలో బియ్యం పండించడానికి 2,497 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని (2011 నాటి గణాంకాల ప్రకారం) వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అయితే, మన దేశంలో రెట్టింపు నీరు ఖర్చవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.ఐ.–న్యూఢిల్లీ)లోని వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కోకిల జయరామ్ 2007–08లో మన దేశంలో పంటలకు వాడిన నీటిపై అధ్యయనం చేసి.. 2016లో నివేదిక వెలువరించారు. ఆ ప్రకారం.. వరి సాగుకు 1250 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. మన దేశంలో సగటున టన్ను వరి ధాన్యం ఉత్పత్తికి 35,71,900 లీటర్ల నీరు ఖర్చవుతోంది. టన్ను వరి ధాన్యాన్ని మిల్లు ఆడిస్తే 670 కిలోల బియ్యం వస్తాయనుకుంటే.. కిలో వరి బియ్యానికి 5,331 లీటర్ల నీరు ఖర్చవుతోంది. చిరుధాన్యాల దిశగా.. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో వరి సాగవుతున్న ఉభయ గోదావరి డెల్టా ప్రాంతాల్లో సైతం రానున్న రోజుల్లో పెరిగే 2 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల వరి దిగుబడులు భారీగా తగ్గే పరిస్థితి వస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) అధ్యయనంలో తేలింది. అనివార్యంగా చిరుధాన్యాల సాగు వైపు దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏయూ హెచ్చరించడం గమనించ వలసిన సంగతి. చిరుధాన్యాల సాగుకు 400 ఎం.ఎం. నీరు సరిపోతుంది. అది కూడా వర్షాధారంగానే సాగవుతుంది. సగటున ఎకరానికి 5–10 క్వింటాళ్ల చిరుధాన్యాల బియ్యం దిగుబడి వస్తుంది. శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చిన ఉదంతాలున్నాయి. వరితో పోలిస్తే ‘నీటి వినియోగ ముద్ర’ మూడింట రెండొంతులకు తగ్గిపోతుంది. సిరిధాన్యాలను నగర, పట్టణ ప్రాంతవాసులు దైనందిన ప్రధానాహారంగా తీసుకోవడం ప్రారంభిస్తే.. అందరికీ సంతులిత ఆహారం అందుతుంది. ఆధునిక జీవనశైలి జబ్బులను పారదోలడంతోపాటు మెట్ట రైతుల ఆదాయాలూ అనేక రెట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 15,400 లీటర్ల నీరు = కిలో మాంసం! మాంసం ఉత్పత్తి కన్నా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి చాలా తక్కువ నీరు ఖర్చవుతున్నదన్నది నిజం. కిలో పశు మాంసం ఉత్పత్తికి 15,400 లీటర్ల నీరు ఖర్చవుతున్నది. పాశ్చాత్య దేశాల్లో ఆవులను, ఎద్దులను పారిశ్రామిక పద్ధతుల్లో పెంచి మూడేళ్ల వయసులో పశువును వధిస్తే.. ఎముకలు తీసేయగా 200 కిలోల మాంసం వస్తుంది. ఒక్కో పశువు సగటున మూడేళ్లలో 1,300 కిలోల ధాన్యాలతో తయారైన దాణా, 7,200 కిలోల గడ్డి తింటుంది. ఈ ధాన్యాలను పండించడానికి 30 లక్షల 60 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. పశువు మూడేళ్లలో 24,000 లీటర్ల నీరు తాగుతుంది. దీని మాంసాన్ని శుద్ధి చేయడానికి 7 వేల లీటర్ల నీరు ఖర్చవుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పశుమాంసం ఉత్పత్తికన్నా చిన్న జీవాల మాంసం ఉత్పత్తికి తక్కువ నీరు ఖర్చవుతున్నది. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
-
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
మలక్‌పేట: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చిన్నపిల్లల న్యూట్రిషన్ ఫుడ్, సిరప్లు తయారు చేస్తున్న కేంద్రంపై ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన న్యూట్రిషన్ సిరప్లు, కెమికల్స్ కలిపిన ద్రావణం, ముడి సరుకులు, యంత్ర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్యకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మూసారంబాగ్ డివిజన్, ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలోని ఓ ఇంట్లో అనుమతులు లేకుండా ఆహార పానీయాలు, సిరప్లు, న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు. గాబ మనీశ్ అనే వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ హిమాలయ లైఫ్‌లైన్ పేరుతో గత 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నకిలీ సిరప్లు తయారు చేస్తూ ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దాదాపు 43 రకాల ఫ్లేవర్స్‌తో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. 2012లో వీటికి లైసెన్స్ లీసుకున్నట్లు పత్రాలు ఉన్నా, రెన్యువల్ చేయించుకోలేదని, దీనిపై విచారణ చేపడుతామన్నారు. ఈ ఉత్పత్తులపై ఎలాంటి హెచ్చరికలు, సూచనలు లేవని, వీరు తయారు చేస్తున్న సిరప్‌లను తెలిసిన వ్యక్తుల ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు నిందితుడు మనీశ్‌ను మలక్‌పేట పోలీస్‌లకు అప్పగించారు. దాడుల్లో ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ మోహన్ కుమార్, మలక్‌పేట ఎస్హెచ్ఓ గంగా రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ లు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్, గోవింద్ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. మనీశ్ తయారు చేస్తున్న ఉత్పత్తుల శాంపిల్స్‌ను ఫుడ్ ఇన్స్పెక్టర్ సేకరించారు. తయారీ కేంద్రానికి లేబర్, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్, లేవని సమాచారం. -
వినపడట్లేదు! గుర్తించట్లేదు..!
నవజాత శిశువులకు వినికిడి సమస్యలు శాపంగా మారుతున్నాయి. దేశంలో ప్రతి 1,000 మందిలో 300 మందికి వినికిడి సంబంధిత సమస్యలున్నట్లు కాక్లియర్ ఇండియా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఇటు ఆస్పత్రులు, అటు తల్లిదండ్రుల్లోనూ వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించాలన్న స్పృహ లేకపోవడంతో... చిన్నారుల బంగారుభవిష్యత్తుపై వినికిడి లోపాలు దుష్ప్రభావం చూపుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు మినహా మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాలు, ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లలో వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించే ల్యాబ్‌లు లేకపోవడం చిన్నారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరీక్షల విషయంలో కేరళ ఆదర్శంగా నిలుస్తోందని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రంలో సామాజిక భద్రతా మిషన్‌లో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో నవజాత శిశువులకు వినికిడి సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో నవజాత శిశువులకు వినికిడి సంబంధ పరీక్షలను సమగ్రంగా నిర్వహిస్తున్నారని వెల్లడించింది. ఈ నెల 3న ప్రపంచ వినికిడి దినోత్సవం (వరల్డ్ హియరింగ్ డే) సందర్భంగా ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. ఇలా గుర్తించాలి.. శిశువు జన్మించిన 24 గంటల తరవాత తొలిసారిగా వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించాలి. ఆ తరువాత మరో ఆరు నెలలకు ఈ పరీక్షలను విధిగా నిర్వహించాలి. కానీ పలు నగరాల్లో ఈ పరిస్థితి లేదు. దీంతో చిన్నారులకు రెండేళ్లు వచ్చే వరకు దీనిపై నిర్లక్ష్యం చేయడంతో సమస్య జఠిలంగా మారుతోందని ఈ సర్వేలో తేలింది. చాలా మంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకపోవడం శాపంగా మారుతోందని, నవజాత శిశువుల్లో వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రతి ఆస్పత్రి, ప్రసూతి కేంద్రాల్లో అటో అకౌస్టిక్ ఎమిషన్స్, ఆడిటర్ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ లాంటి పరికరాలతో ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు కేవలం రూ.4 లక్షలు మాత్రమే వ్యయమవుతుందని ఆడియాలజీ నిపుణురాలు విష్ణుప్రియ ‘సాక్షి’కి తెలిపారు. 50 శాతం వినికిడి సమస్యలను నివారించేందుకు శిశువులకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం, స్క్రీనింగ్ చేయించడం, అధిక ధ్వనులు చిన్నారులు వినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్వే సూచించింది. ప్రధాన కారణాలు.. ♦ జన్యుపరంగా పుట్టుకతో వచ్చే లోపాలు. ♦ మాతృత్వ సమయంలో తల్లులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం. ♦ చిన్నారులు గాయాలు, ప్రమాదాల బారినపడడం. ♦ గర్భిణులు, చిన్నారులు అధిక శబ్దాలు వినడం. ♦ గర్భిణులు విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్, ఆటోటాక్సిక్ డ్రగ్స్ వినియోగించడం. ♦ చిన్నారులు మీజిల్స్, మమ్స్ బారినపడడం. సర్వే ఫలితాలివీ... ♦ ప్రతి వెయ్యి మందిలో 5–6 మంది పుట్టుకతోనే వినికిడి సమస్యతో జన్మిస్తున్నారు. ♦ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు చాలామంది తల్లిదండ్రులు వినికిడి సమస్యను గుర్తించడం లేదు. ♦ 84 శాతం మంది తల్లులు తమ చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహించేందుకు సమ్మతించినా.. ఎక్కడా ఇందుకు సంబంధించిన పరికరాలు లేకపోవడం గమనార్హం. ♦ 75 శాతం మంది తల్లులు ఈ సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమస్య జఠిలం కాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ♦ చెవిలో తలెత్తే ఇన్ఫెక్షన్లే వినికిడి సమస్యలకు ప్రధాన కారణమని తల్లులు భావిస్తున్నారు. ♦ ప్రతి 10 మంది తల్లుల్లో ముగ్గురు వినికిడి సమస్యలున్న తమ చిన్నారులు ఇతర చిన్నారుల్లా సాధారణ జీవితం గడపలేరని భయాందోళనలకు గురవుతున్నారు. ♦ చిన్నారులకు వినికిడి సమస్య ఉందని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తున్నారు. అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌లోనూ శోధిస్తున్నారు. ♦ ప్రపంచ జనాభాలో సుమారు 5 శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ల మంది బాధితులు ఉండగా.. ఇందులో 91 శాతం పెద్దలు, 9శాతం చిన్నారులు. ♦ 1.10 బిలియన్ల యువత తాము వినియోగించే హెడ్‌ఫోన్స్, మ్యూజిక్ ఉపకరణాలతోనే ఈ సమస్యలో చిక్కుకున్నట్లు తేలింది. వినికిడి సమస్యలు.. ♦ చిన్నారులు సరిగా మాట్లాడలేకపోవడం. ♦ మాతృభాష ఉచ్ఛారణ సరిగా లేకపోవడం. ♦ భవిష్యత్‌లో చదువులో చురుగ్గా రాణించలేకపోవడం. ఉపాధ్యాయులతో సరిగా మాట్లాడలేకపోవడం. ♦ ఇతర పిల్లలతో కలిసి ఉండకపోవడం. -
ముద్ద దిగదు..ఆకలి తీరదు
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. సర్కారు స్కూళ్లలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతుంటే అంగన్వాడీల్లో దొడ్డు బియ్యంతో వండిపెడుతున్నారు. దీంతో తినేందుకు బాలింతలు, గర్భిణులు, చిన్నారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే కేంద్రాలకు రావడమే మానేశారు. సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 832 అంగన్వాడీ కేంద్రాలు, 76 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. 155 అంగన్వాడీలు సొంత భవనాల్లో, 355 ప్రభుత్వ పాఠశాలలో, 398 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 7 నెలల నుంచి మూడేళ్ల వయసు వారు 18,074, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు వారు 12,140 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 9,767 మంది ఉన్నారు. కనిపించని గర్భిణులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు గర్భిణులు, బాలింతలు కనిపించడంలేదు. రికార్డుల్లో పేర్లు ఉంటున్నాయి. వారి కుటుంబ సభ్యులు వచ్చి గుడ్లు, పాలు, భోజనం తీసుకువెళ్తున్నారు. ఈ దృశ్యం ఆత్మకూరు మండలం కామారంలోని అంగన్వాడీ కేంద్రంలో కనిపించింది. పక్కదారి పడుతున్న రేషన్ ఆరోగ్యలక్ష్మి పథకం కింద మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లలకు ఒక పూట భోజనం, ఉడికించిన గుడ్లు, కుర్కురేలు, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన గుడ్లు ఇవ్వాలి. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందించాల్సి ఉంది. హాజరు పట్టికలో సంఖ్య చూపుతున్నా కేంద్రాలలో వారు కనిపించడం లేదు. హాజరుకాకపోయినా వచ్చినట్లు చూపిస్తున్నారు. దీంతో పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయాలే టీచర్లు.. అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలే దిక్కవుతున్నారు. పౌష్టికహారం, ఆరోగ్య రక్షణ, అక్షరాలు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను నియమించింది. నిత్యం విధులకు హాజరుకావాల్సిన వారు సమయపాలన పాటించడంలేదు, చాలా మంది గైర్జాజరవుతున్నారు. టీచర్లు లేని చోట ఆయాలే అన్నీ చూసుకుంటున్నారు. పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పేవారు కరువయ్యారు. చిన్నారులకు ఐదేళ్లు వచ్చినా పాటలు, అక్షరాలు ఏమీ రావడంలేదు. దీంతో పిల్లలను పంపడానికి వారి తల్లిదండ్రులు వెనుకడగు వేస్తున్నారు. దీంతో రోజురోజుకూ హాజరు శాతం తగ్గిపోతోంది. చర్య తీసుకుంటాం అంగన్వాడీ కేంద్రాల్లో సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. టీచర్లు, ఆయాలు ఆలస్యంగా వస్తే గ్రామస్తులు సైతం ప్రశ్నించాలి. దొడ్డు బియ్యం ప్రభుత్వం నుంచే సరఫరా అవుతున్నాయి. వాటిని మార్చాలని సమావేశాల్లో చేస్పాం. ఆరోగ్యలక్ష్మి పథకం కింద మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లలకు ఒక పూట భోజనం, ఉడికించిన గుడ్డు, కుర్కురే, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నాం. – సబిత, జిల్లా సంక్షేమ అధికారి -
‘ముద్ద’ దిగదు!
మహబూబ్‌నగర్ రూరల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తినాలి. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు. కానీ పనిచేస్తేనే పూట గడిచే నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో పౌష్టికాహారం తినలేరు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలద్వారా పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం పెట్టడానికి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆలోచన మంచిదే అయినా సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యంతో అన్నం వండటంతో అది జీర్ణంకాక చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. నెరవేరని ముఖ్యమంత్రి ఆశయం అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని గత ఏడాది జన వరి 31న ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రక టన ప్రకటనగానే ఉండిపోయింది. ఏడాది దాడినా దాని ఊసే లేదు. దీంతో అంగన్వాడీలకు వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అంగన్వాడీ భోజనం అంటేనే వద్దులే.. అన్నట్లు ఆసక్తి కనబరచడంలేదు. రేషన్ బియ్యం కంటే నాసిరకంగా ఉండటంతో తినడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. రోజు గుడ్డుతో పాటు రోజొక కూరగాయ, సాంబారుతో రుచికరమైన భోజనం పెట్టేలా ఆహార పట్టికను తయారుచేసింది. పప్పులు, కోడిగుడ్లు ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇవన్నీ బాగానే ఉన్నా సన్నబియ్యానికి బదులు దొడ్డుబియ్యం సరఫరా చేయడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. చిన్నారులకు ముద్ద దిగితే ఒట్టు.. ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండడంతో చిన్నారులకు ముద్ద దిగడం లేదు. కాస్త తిని వదిలేస్తున్నారు. తిన్నది కూడా జీర్ణం కాక అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు కేంద్రాలకు పంపించడానికి వెనకాడుతున్నారు. ఉన్నతాధికారులనుంచి సన్నబియ్యం సరఫరా కాకపోవడంతో కార్యకర్తలు దొడ్డు రకం బియ్యాన్నే వండి పెడుతున్నారు. అన్నం ముద్దలు ముద్దలుగా ఉండడంతో తినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనూ సన్నబియ్యం అందిస్తుండగా అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం దొడ్డు రకం బియ్యం పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల పాఠశాలల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అరగంట తేడాతో మధ్యాహ్న భోజనాన్ని అందరికీ వడ్డిస్తారు. పక్కనే ఉన్న పాఠశాలల విద్యార్థులు సన్నరకం బియ్యంతో తృప్తిగా భోజనం చేస్తుంటే చిన్నారులు మాత్రం దొడ్డు బియ్యంతో అన్నం తినలేక వదిలేస్తున్నారు. అంగవాడీ కేంద్రాల నిర్వాహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా భోజనం విషయంలో శ్రద్ధ పెట్టడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఆదేశాలు రాలేదు అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అంగన్వాడీ కేంద్రాలకు దొడ్డుబియ్యం సరఫరా చేసినప్పటికీ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాం. – జి.శంకరాచారి, మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి -
పిల్లల బళ్లో ఎలుకలు పడ్డాయ్
చిన్నారులతో కళకళలాడాల్సిన అంగన్వాడీ బడి ఎలుకలు..పందికొక్కులకు ఆవాసమైంది. గ్రామంలోని బాలింతలకు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టింది. ఒకటి రెండు కాదు నెలరోజులుగా బడి తలుపులు తెరుచుకోకపోయినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. కడప కోటిరెడ్డి సర్కిల్: నగర శివార్లలోని మోడంమీదపల్లె (పాత కడప) దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించి పుణ్యం కట్టుకోవాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. నెలరోజులుగా అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తిగా తెరవలేదని వారు ఆరోపించారు. బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు నెలకు రెండు గుడ్లు, బియ్యం, కంది పప్పు మాత్రమే ఇంటికిస్తారన్నారు. పాలు ఎవరికి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపాన పోలేదన్నారు. బడి లోపల ఎలుకలు, పంది కొక్కులు, బండల సందులలో ఉన్న ఇసుకను బయటికి తీస్తున్నా శుభ్రం చేసేవారు కరువయ్యారన్నారు. తాము వెళ్లి ఏదైన విషయం అడిగితే గొడవ పడి మీ బుద్ధి పుట్టిన వారికి చెప్పుకోపోండి అని ఆయా, కార్యకర్త చెబుతున్నారని ప్రజలు ఆవేదనతో తెలిపారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం నగర శివార్లలోని మోడంమీదపల్లెలో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా నెల రోజుల నుంచి స్కూలు మూసివేసిన విషయం తన దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని అర్బన్ సీడీపీవో అరుణకుమారిని ఆదేశించాం. నివేదిక రాగానే కార్యకర్త, ఆయా పై చర్యలు తీసుకుంటాం. –మమత, జిల్లా ప్రాజెక్టు డైరక్టర్, ఐసీడీఎస్. కడప అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించండి... మా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపిం చాలి. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అం దించాలనే ఉద్దేశంతో స్కూల్ ఏర్పా టు చేస్తే కార్యకర్త, ఆయా అవేమి పట్టించుకోవడం లేదు. గతనెలంతా స్కూలు తెరవలేదు. –సుబ్బలక్షుమ్మ, స్థానికురాలు నెలకు రెండు గుడ్లే.... బాలింతలకు, గర్భిణులకు రెండు గుడ్లు మాత్రమే ఇస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇదేనా? స్కూలులో ఏమేమి ఇస్తారో మెను కూడా లేదు. ఇంత అధ్వానంగా ఆయా, కార్యకర్త వ్యవహరిస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు.–బేబి, స్థానికురాలు -
ఆహారానికి ఆధార్ కావాలి
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఆధార్‌ను ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి అనుసంధానం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం అందించే జాతీయ పోషకాహార మిషన్ కింద చిన్నపిల్లలు ఆహారం పొందాలంటే ఆధార్ రిజిస్ట్రేషన్ అవసరమని ప్రభుత్వం నేడు లోక్‌సభకు తెలిపింది. మహిళల, పిల్లల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. సర్వీసులను, ప్రయోజనాలను, సబ్సిడీలను అందించడానికి ఆధార్‌ను ఒక ఐడెంటీ కార్డుగా వాడనున్నామని, ఇది ప్రభుత్వం డెలివరీ ప్రక్రియను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఆధార్ పారదర్శకతను, సామర్థ్యాన్ని తీసుకొస్తుందన్నారు. ఒకరి గుర్తింపును నిరూపించేందుకు బహుళ పత్రాలను సమర్పించే అవసరానికి ఆధార్ చెక్ పెడుతుందన్నారు. లబ్ధిదారులకు ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుందని వివరించారు. అంతేకాక దేశంలో ప్రాంతం ఆధారంగా పోషకాహార స్థితిని గుర్తించడానికి కూడా ఆధార్ సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇటీవలే ప్రభుత్వం కేంద్ర పోషకాహార మిషన్‌ను ఆమోదించింది. ఈ మిషన్ కింద దేశంలో ఉన్న పోషకాహార లోపాన్ని గుర్తించి, నిర్మూలించడం ప్రారంభించింది. ఈ మిషన్‌కు అయ్యే ఖర్చు మూడేళ్లలో రూ.9,046.17 కోట్లుగా ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అంగనవాడీ సెంటర్లలో చిన్న పిల్లల నకిలీ రిజిస్ట్రేషన్లను గుర్తించడానికి ఎలాంటి సర్వే చేపట్టడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా కుమార్ చెప్పారు. -
చికెన్, మటన్, నెయ్యి!
కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని విద్యార్థినులకు ఇక మంచి పోషకాహారం అందనుంది. చికెన్, మటన్, గుడ్డు, నెయ్యి అందించేలా సర్కార్ చర్యలకు ఉపక్రమించనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో చికెన్, గుడ్డు అందిస్తున్నారు. ఇకపై నెలలో రెండు వారాలు మటన్, నిత్యం నెయ్యి అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో ఎదిగే విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం అందనుంది. వికారాబాద్, యాలాల(తాండూరు): బడిబయటి పిల్లలతో పాటు చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)ల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థినులు ఆరోగ్యపరంగా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన అధికారులు వారికి నాణ్యమైన మాంసకృత్తులు అందించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూర్బాల్లో చికెన్‌తో పాటు మేక మాంసం, ప్రతిరోజు గుడ్డు, నెయ్యితో మెనూను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వారానికొకసారి అందించే చికెన్‌తో పాటు మేకకూర ప్రతిరోజు నెయ్యి, గుడ్డు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు కోసం కొత్త సంవత్సరం నుంచి కేజీబీవీల్లో కొత్త మెనూ అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు అస్కారం ఉంటుంది. జిల్లాలోని కసూర్బా పాఠశాలలు.. జిల్లాలోని 18 మండలాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,374 మంది విద్యార్థినులు విద్యభ్యాసం చేస్తున్నారు. వీరికి ప్రతిరోజూ నాణ్యమైన భోజనంతో పాటు వారంలో ఒకరోజు(ఆదివారం)చికెన్ అందిస్తున్నారు. భోజనంతో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఇలా ఒక్కో విద్యార్థికి రూ.33 పర్ కేపిటాగా నెలకు రూ.990లు ఖర్చు చేస్తున్నారు. అయితే, కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న నూతన మెనూలో భాగంగా మటన్, నెయ్యి, గుడ్డు విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగంగా మార్కెట్లో మటన్ కిలోకు దాదాపు రూ.400, నెయ్యి కిలోకు రూ.400, గుడ్డు ఒక్కోటి రూ.5గా ఉంది. కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.45 పర్ కేపిటాగా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎదిగే బాలికలు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుకుండా, రక్తహీనత బారినపడకుండా ఉండేందుకు ఈ కొత్త మెనూ దోహదపడుతుందని కేజీబీవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అమలు అవుతున్న మెనూలో భాగంగా నెలకు నాలుగుసార్లు చికెన్‌తో పాటు రెండుసార్లు మేక మాంసాన్ని మెనూ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రతినెలా రెండు, నాలుగో ఆదివారం మేక మాంసం అందించేలా ప్రణాళికలు చేపడుతున్నారు. ఇదే అమలు అయితే విద్యార్థినులు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం కేజీబీవీల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న మెనూతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు ఇక్కడ చదువుకుంటారు. ఇక్క డ కేజీబీవీల్లో విద్యార్థినులు రక్తహీనత, ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతుంటారు. కొత్త మెనూ ప్రకారం మేక మాంసం, నెయ్యి, గుడ్డుతో ఎంతో మేలు కలుగుతుంది. తద్వారా విద్యార్థినులు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికే మెనూపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. –సుధాకర్‌రెడ్డి, ఎంఈఓ, యాలాల -
పాత తరం తిండితో మేలైన ఆరోగ్యం..
ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు పాత తరం తిండే మేలని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యత చాలా తక్కువని ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని శాస్త్రవేత్త లారా ఇయనోట్టి తెలిపారు. పాతతరం ఆహారం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేదని పేర్కొ న్నారు. పరిశోధన వివరాలు న్యూట్రీషన్ రివ్యూస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ ఆహారం వల్ల కాలక్రమంలో మానవ జన్యుక్రమంలోనూ వైవిధ్యత వచ్చి చేరిందని చెప్పారు. పాతకాలపు తిండి అలవాట్లను మరింత ఎక్కువగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని లారా చెప్పారు. అతిగా శుద్ధి చేసిన పదార్థాలు.. మరీ ముఖ్యంగా తిండిగింజల నుంచి తయారు చేసే నూనెలు, పిండి పదార్థాలు, చక్కెరలు పాతకాలపు ఆహారంలో లేవని, ఇవి చేరడం వల్లే ప్రస్తుతం పోషకాహార లోపం సమస్య ఎక్కువవుతోందని వివరించారు. -
సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జూకల్‌లో జాతీయ పోషణ వారోత్సవాలు శంషాబాద్ రూరల్: సమతుల ఆహారంతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యమని ఆహార, పోషణ బోర్డు డెమాన్‌స్ట్రేషన్ అధికారి వి.నటరాజశేఖర్ తెలిపారు. జాతీయ పోషణ వారోత్సవాల సందర్భంగా మండలంలోని జూకల్‌లో గురువారం పోషకాహారంపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమతులంగా ఉన్నప్పుడే శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న తాజా కూరగాయలు, పప్పు దినుసులతో తక్కువ ఖర్చులోనే పోషకాహారం పొందవచ్చన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు తగు మోతాదులో పోషకాహారం తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆరోగ్యమే మహాభ్యాగం అనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. ప్రతి ఏటా సెప్టెంబరు 1 నుంచి 7 వరకు జాతీయ పోషణ వారోత్సవాలు నిర్వహిస్తూ పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన బిడ్డలకు వీలైనంత త్వరగా తల్లిపాలు అందించాలని, ఆరు నెలల వయస్సు తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించాలన్నారు. తాజా కూరగాయలు, పండ్లు, గుడ్లు ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఎక్కువ మోతాదులో పోషకాలు అందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీటీఎం రామేశ్వర్రావు, సర్పంచ్ అనిత, సీడీపీఓ నిర్మల, సూపర్వైజర్లు కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ ‘అంగన్వాడీ’
ఆదిలాబాద్ : కౌమర బాలికలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, 0 నుంచి 6ఏళ్లలోపు పిల్లలకు ప్రీ స్కూ ల్ నిర్వహించాల్సిన అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. పై స్థాయి సిబ్బంది నుంచి కింది స్థాయి వరకు అక్రమాల్లో భాగస్వాములు కావడంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు. మాతా,శిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సాకారానికి దూరంగా నిలుస్తున్నాయి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా గాడితప్పాయి. నిర్వహణ, పథకాలను పర్యవేక్షించాల్సిన శాఖ అధికారులే అవినీతికి పాల్పడుతుండడంతో అంగన్వాడీల ప్రయోజనం లబ్ధిదారులకు చేకూరడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహార సరుకుల పంపిణీ జరగడం లేదని కలెక్టర్ దృష్టికి రావడంతో గత నెల 12న ఆయన సర్వేకు ఆదేశించారు. 13న ఒకే రోజు జిల్లా అంతటా మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలకు మండల స్థాయి అధికారులు నేరుగా వెళ్లి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో విస్తూపోయే విషయాలు వెల్లడయ్యాయి. నేరుగా పరిశీలన గత నెల 13న కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని 3,538 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 588 మినీ అంగన్వాడీ కేంద్రాలను మండల అధికారులు తనిఖీ చేశారు. మం డల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో సర్వే సాగిం ది. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఏవోలు, ఎంఈవోలు, ఈవోఆర్డీలు, ఏఈఈలు, డెప్యూటీ తహశీల్దార్లు, ఎ మ్మార్ఐలు, ఎపీఎంలు, డీపీఎంలు తదితరులు యుద్ధప్రాతిపదికన సర్వే చేపట్టారు. సర్వేకు సంబంధించి ఏ అంశాలను పరిశీలించాలనే దా నిపై ముందుగా రూపొందించిన ప్రొఫార్మా ఆ ధారంగా వివరాలు సేకరించారు. అందులో మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం కింద ఆ హార పంపిణీ, మూడు నుంచి ఆరు ఏళ్లలోపు పి ల్లలకు అందజేసే ఆహారం, గర్భిణులు, బాలిం తలకు ఇందిరమ్మ అమృతహస్తం కింద అందజేసే ఆహారం, సబల కింద 11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు సప్లమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రాం కింద అందజేసే ఆహారం వివరాలను ప్రొఫార్మాలో అంశాలుగా రూపొందించి సేకరించారు. సర్వే చేపట్టిన అధికారులు బాలికలు, గర్భిణులు, బాలింతలు నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. రిజిష్టర్‌లో స్టాక్ ఎంట్రీ వివరాలను పరిశీలించారు. ఈ వివరాలను మండల అధికారులు ఆర్డీవోకు అందజేయగా, ఆర్డీవో నుంచి డీఆర్వో, అదనపు జేసీలు క్రోడీకరించి వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. సరుకులు స్వాహా.. బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. వీటిలో అక్రమాలు జరిగాయి. సరుకుల్లో నాణ్య త లోపిస్తోంది. కాంట్రాక్టర్లతో సీడీపీవోలు మి లాఖతై అక్రమాలకు పాల్పడుతున్నారు. సర్వే అధికారులు స్టాక్ రిజిష్టర్ల విషయంలో అంగన్వాడీ వర్కర్లను అడిగినప్పుడు పలు అంశాలు దృష్టికి వచ్చాయి. బియ్యం, పప్పు, నూనె, గు డ్లు కోత పెట్టి పై నుంచి పంపిస్తుండడంతో తాము ఏమి చేయలేకపోతున్నామని వర్కర్లు అధికారుల ముందు వాపోయారు. ఇందిరమ్మ అమృతహస్తంకు సంబంధించి నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోవడంతో తాము అంగన్వాడీ కేంద్రాలను నడిపించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని, అప్పు తెచ్చి నడుపుతున్నామని వర్కర్లు తమ గోడు వెల్లడించారు. బాలామృతం కింద 0 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 1,18,547 మంది ఉండగా, వారికి ప్రతిరోజు 100 గ్రాముల పౌష్టికాహారం, వారానికి రెండు గుడ్లు అందజేయాల్సి ఉండగా, లబ్ధిదారులకు అందడం లేదని తేలింది. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు జిల్లాలో 91,255 మంది ఉండగా, వారికి ప్రతిరోజు పౌష్టికాహారంతోపాటు నెలకు 16 గుడ్లు అందజేయాల్సి ఉండగా, సగం మందికి కూడా ఇది అందడం లేదని సర్వేలో స్పష్టమైంది. 1,26,883 మంది కిశోర బాలికలకు ప్రతి నెల మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అరకిలో నూనె, 16 గుడ్లు అందజేయాల్సి ఉండగా, ఇటు సరుకుల్లో నాణ్యతలోపం, గుడ్లు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులైన బాలికలకు పౌష్టికాహారం లభించడం లేదు. అక్రమాలకు పాల్పడితే చర్యలే.. - ఎం.జగన్మోహన్, కలెక్టర్ లబ్ధిదారులకు పౌష్టికాహారం విషయంలో గత నెల సర్వే నిర్వహించాం. అటెండెన్స్ ఎక్కువగా వేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. నాణ్యమైన ఆహారం అందించడం లేదని పరిశీలనలో తేలింది. సర్వే ఆధారంగా వెలుగులోకి వచ్చిన అంశాలపై సీరియస్‌గా తీసుకుంటున్నాం. సీడీపీవోలు, అంగన్వాడీలతో రెండు సార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు జారీ చేశాం. ఆర్జేడి ద్వారా అంగన్వాడీల ప్రక్షాళనపై చర్యలు చేపడుతున్నాం. ముగ్గురు సీడీపీవోలకు చార్జీ మెమో జారీ చేశాం. ఆసిఫాబాద్‌కు సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టర్‌ను తప్పించాం. అంగన్వాడీల్లో లబ్ధిదారులకు పౌష్టికాహారం సరైన విధంగా అందేలా చర్యలు తీసుకుంటాం. విస్తుపోవాల్సిందే.. బోథ్ నియోజకవర్గంలో అదనపు జేసీ ఎస్ఎస్ రాజు ఓ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లినప్పుడు సగం మంది పిల్లలు కేంద్రంలో లేరు. ఆయన స్టాక్ రిజిష్టర్‌ను చూసి విస్తుపోయారు. ప్రతిరోజు చిన్నచిన్న పేపర్లపై సరుకుల వినియోగానికి సంబంధించి రాసి కొన్ని నెలల స్లిప్పులను రిజిష్టర్‌కు కుట్టి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మరో సెంటర్లో రిజిష్టర్ నిండా తప్పులు రాయడంతో వైట్నర్తో సరిచేసి మళ్లీ పై నుంచి రాశారు. రిజిష్టర్ రాయడం రాదని ఆ వర్కర్ పేర్గొనడం గమనార్హం. రెండేళ్ల నుంచి ఒక లబ్ధిదారు కూడా గైర్హాజరు లేకుండా ప్రతి రోజు హాజరైనట్లు అటెండెన్స్ రిజిష్టర్ ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. పిల్లలు సగం మందే ఉన్నారు కాదా అని.. వర్కర్‌ను అడిగితే పండగలు ఉండడంతో తల్లులు వచ్చి పిల్లలను తీసుకెళ్లారని ఆమె నుంచి సమాధానం వచ్చింది. ఓ సెంటర్లో గుడ్లు ఎన్ని మిగిలాయి.. అని అడిగితే రెండు అని ఆ వర్కర్ చెప్పగా, పరిశీలనలో ఎనిమిది ఉండడం కనిపించింది. ఆదిలాబాద్ మండలంలో ఓ అంగన్వాడీ సెంటర్లో లబ్ధిదారులకు నెలకు 16 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, ఎనిమిది గుడ్లు మాత్రమే ఇస్తుండడం అధికారుల దృష్టికి వచ్చింది. పై నుంచి తమకు కోత పెట్టి ఇస్తున్నారని, దీంతో తాము లబ్ధిదారులకు కోత పెట్టాల్సి వస్తోందని వారు చెప్పడంతో అధికారుల దిమ్మతిరిగినట్లైంది. మరో అంగన్వాడీ కేంద్రంలో వర్కర్ స్థానికంగా ఉండకపోవడం, పట్టణ ప్రాంతం నుంచె ఆమె ఆపరేటింగ్ చేస్తుండడం దృష్టికి వచ్చింది. అనేకమంది వర్కర్లు తమకు రిజిష్టర్ రాయడం రాదని, ఇతరులతో రాయించుకుంటామని చెప్పారు. ఇలా అనేక అంశాలు అధికారుల పరిశీలనలో కనిపించాయి. -
సంపూర్ణ భోజనమే..
‘ఐసీడీఎస్’ కొత్త మెనూ జోగిపేట:గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ అమృత హస్తం’ పథకాన్ని సర్కార్ సమూలంగా మార్పులు చేసింది. పేరుతో పాటు మెనూ కూడా మార్చేసింది. ఒకపూట సంపూర్ణ భోజనం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ అమలు చేయనుంది. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు గర్భిణులు, బాలింతలకు నెలకు 18 ఉడికించిన కోడి గుడ్లు మాత్రమే అందించేవారు. ఇక నుంచి మారిన మెనూ ప్రకారం ప్రతి రోజు గుడ్లు, పాలు ఇవ్వనున్నారు. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ పథకం నిర్వాహణ బాధ్యతలు సైతం అంగన్వాడీలకే అప్పగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి ఒక పూట సంపూర్ణ భోజనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లబ్ధిపొందేవారు ఎవరంటే... అమృతహస్తం పథకం స్థానంలో ఈనెల 15వ తేదీ నుంచి ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ కార్యక్రమాన్ని అన్ని ప్రాజెక్టుల్లో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 3,009 మెయిన్, 375 మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని 26,208 మంది గర్భిణులకు, 29,924 మంది బాలింతలకు, 1,02,304 మంది 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు పౌష్టికాహారం అందించనున్నారు. అంతేకాకుండా 7 నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల 1,20,892 మంది చిన్నారులకు నేరుగాఇంటికే ప్రతినెలా ఒక బాలామృతం ప్యాకెట్‌తో పాటు గుడ్డును పంపిణీ చేయనున్నారు. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఆరు మాసాల వరకు కూడా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. నిర్వాహణ బాధ్యత అంగన్వాడీలదే ఒక్కపూట సంపూర్ణ భోజనం పథకం నిర్వాహణ బాధ్యతను అంగన్వాడీల కార్యకర్తలకే అప్పగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అమృతహస్తం పథకంలో సమైఖ్య సంఘాల సభ్యులు భోజనం వండి గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు సమైఖ్య సంఘాల సభ్యుల మధ్య సమన్వయ లోపంతో ఈ పథకం అస్తవ్యస్థంగా మారిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కపూట సంపూర్ణ భోజనం పథకాన్ని అంగన్వాడీలకే అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం కోసం ఐసీడీఎస్ ద్వారా బియ్యం, పప్పు, కోడి గుడ్డు, నూనె, అందింస్తుండగా ..అంగన్వాడీ కార్యకర్తలు పాలు, కూరగాయలు, ఆకు కూరలు పెరుగు అందజేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ కార్యకర్తల పేరిట జీరో అక్కౌంట్ తీస్తే, ప్రతినెల వారి ఖాతాల్లో ఖర్చు పెట్టిన సొమ్మును జమచేస్తారు. కమిటీ సభ్యులు వీరే... ఈ పథకం నిర్వాహణకుగాను ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేయనుంది. కమిటీ చైర్మన్‌గా సర్పంచ్, లేదా వార్డు సభ్యుడు/కౌన్సిలర్ ఆశ కార్యకర్త, ఇద్దరు తల్లులు, సైన్స్ ఉపాధ్యాయుడు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అంగన్వాడీ కార్యకర్త, ఇద్దరు గ్రామస్తులు సభ్యులుగా ఉంటారు. త్వరలో మరిన్ని మార్పులు ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ పేరును ప్రభుత్వం తాత్కాలికంగా నామకరణం చేసింది. త్వరలో అసలు పేరు ఖరారు చేయనుంది. కాగా అంగన్వాడీ వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని అధికారులు అంటున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పప్పు, కోడిగుడ్లు, పక్కదారి పట్టకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తున్న కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చే యాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పథకం పేరు మార్పు: సీడీపీఓ ఎల్లయ్య ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి ఒక్క పూట సంపూర్ణ భోజనం పథకాన్ని నిర్వహిస్తుంది. ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పేరు మార్చి పకడ్బందీగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రసవమైన తర్వాత కేంద్రానికి రాలేని బాలింతల ఇళ్లకే గుడ్లు, బాలామృతం ప్యాకెట్‌ను పంపుతాం. రోజుతో తరహా ఆహారం అందించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వమే మెనూను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామ కమిటీని 11 మంది సభ్యులతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
15నుంచి ‘వన్ ఫుల్ మిల్’..
ఆదిలాబాద్ టౌన్ : గర్భిణి, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ‘వన్ ఫుల్ మిల్’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింతగా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇదివరకు గర్భిణులు, బాలింతలకు నెలకు 16 ఉడికించిన కోడిగుడ్లను మాత్రమే అందించేవారు. ఇక నుంచి నెలరోజులపాటు వారికి కోడిగుడ్లు ఇవ్వనున్నారు. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు. జిల్లాలో ఇలా... అమృత హస్తం పథకం 2013 జనవరిలో జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో ప్రారంభించారు. ఆరు ప్రాజెక్టు పరిధిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి 18 ప్రాజెక్టుల పరిధిలోని 3,538 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాలో 44 వేల మంది గర్భిణి, బాలిం తలకు పౌష్టికాహారం లభించే అవకాశం ఉంది. రూ.15 విలువ గల భోజనాన్ని ప్రతిరోజూ వారికి ఇవ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, ఉడికించిన కోడిగుడ్లు, ఎగ్‌కర్రీ కూడా అందించనున్నారు. నెలలో 25 రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం పెట్టనున్నారు. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఆరు నెలల వరకు కూడా ప్రయోజనం పొందవచ్చు. నిర్వహణ బాధ్యత అంగన్వాడీలదే.. అమృతహస్తం పథకం (వన్ ఫుల్ మిల్) నిర్వహణ బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు. ప్రస్తుతం గ్రామ సమైక్య సంఘాల సభ్యులు భోజనం వండి గర్భిణి, బాలింతలకు అందజేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమైక్య సభ్యుల మధ్య సమన్వయ లోపంతో ఈ పథకం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. ఐసీడీఎస్ ద్వారా బియ్యం, పప్పు, కోడిగుడ్లు, నూనె అందజేయనుండగా, అంగన్వాడీ కార్యకర్తలు పాలు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు అందజేయాల్సి ఉంటుంది. అన్ని అంగన్వాడీ కార్యకర్తల పేరిట జీరో అకౌంట్ తీసి నెలనెల వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. గర్భిణులు, బా లింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జి చెప్పారు. కమిటీ మెంబర్లు వీరే.. ఈ పథకం నిర్వహణకు చైర్మన్‌గా సర్పంచ్ లేదా వార్డు సభ్యుడు/కౌన్సిలర్, ఆశా కార్యకర్త, ఇద్దరు తల్లులు, సైన్స్ ఉపాధ్యాయుడు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అంగన్వాడీ కార్యకర్త, ఇద్దరు గ్రామస్తులు సభ్యులుగా ఉంటారు. మెనూ.. సోమవారం అన్నం, సాంబర్, కూరగాయలు, ఎగ్‌కర్రి, పాలు, కోడిగుడ్డు. మంగళవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు. బుధవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, ఎగ్‌కర్రి, కోడిగుడ్డు, పాలు. గురువారం అన్నం, సాంబర్, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు. శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు. శనివారం అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు. -
ఆకలి తీర్చాల్సిన అంగన్వాడీ కేంద్రాలు..
ఆకలి తీర్చాల్సిన అంగన్వాడీ కేంద్రాలు.. అరకొర వసతులతో అలమటిస్తున్నాయి. నాణ్యమైన సరుకులు అందక పౌష్టికాహార కేంద్రాలు నిస్సారంగా మారాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ.. మాతాశిశు మరణాలను నివారించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు అవస్థలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో కొనసాగుతున్న సెంటర్ల నిర్వహణపై మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన విజిట్‌లో పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. వీటికి సరఫరా అవుతున్న సరుకుల్లో ముక్కిన బియ్యం.. కుళ్లిన కోడి గుడ్లు కనిపించాయి. అనేక చోట్ల ఆయాలే కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని కేంద్రాలు రెగ్యులర్‌గా తెరుచుకోవడం లేదు. టీచర్లు కూడా మొక్కుబడిగానే హాజరవుతున్నారు. మెనూ పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. పాలు, ఆకు కూరల జాడే లేదు. రికార్డుల్లో ఉన్న సంఖ్యకు.. సెంటర్లలో ఉన్న చిన్నారులకు పొంతన లేకుండా ఉంది. చాలా కేంద్రాల్లో ఐదుగురికి మించి లేకున్నా.. ఇరవై మందికిపైగా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. బాలింత లు, గర్భిణులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో బాలామృతాన్ని పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. అరకొరగా సరఫరా అవుతున్న సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా కార్యకర్తలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. సెంటర్లకు సొంత భవనాలు లేక అద్దెకొంపల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా శిథిలమై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వేతనాలు, భవనాల అద్దెల చెల్లింపుల్లో చోటు చేసుకుంటున్న జాప్యం వల్ల సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని కార్యకర్తలు, ఆయాలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూసిన నిజాలు.. నో ఫుడ్డు, నో గుడ్డు నర్సాపూర్:అంగన్వాడీ కేంద్రాలలో రెండు నెలలుగా ఫుడ్డు లేదు, గుడ్డు లేదు. మూడేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాల్సి ఉండగా సరకుల సరఫరానే అస్తవ్యస్తంగా తయారయింది. కొల్చారం, హత్నూర మండలాల్లోని పలు కేంద్రాల్లో ముక్కిన బియ్యం ఉండగా పలు చోట్ల కుళ్లిన కోడిగుడ్లు కన్పించాయి. నియోజకవర్గ పరిధిలో 384 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో 266 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దె భవనాలన్నీ ఇరుకుగా ఉండడంతో పిల్లలకు ఇబ్బందులు కల్గుతున్నాయి. భవనాలకు ప్రభుత్వం నుంచి అద్దె నామమాత్రంగా రావడంతో చిన్న గదులు తీసుకుని కేంద్రం నడపడంతో ఒకే గదిలో ఒక పక్క పిల్లలు, మరో పక్క వంట చేయడంతో కట్టెల పొయ్యితో వచ్చే పొగతో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఇళ్లకు మళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. కిరాయి..కేంద్రాలే గజ్వేల్: నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో 341 అంగన్వాడీ కేంద్రాలకుగానూ 240కిపైగా అద్దె ఇళ్లల్లో కొనసాగుతున్నాయి. చాలా చోట్లా పాడుబడిన ఇళ్లల్లో కేంద్రాలు కొనసాగడం వల్ల పిల్లలు, అంగన్వాడీ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు మెనూ ప్రకారం అందాల్సిన పోషకాహారం అందడంలేదు. చిన్నారులకు కుర్కురే ప్యాకెట్ల సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ అందడంలేదు. ఇళ్లకు అద్దె ఆరునెలలుగా రావటం లేదు. నిజానికి అద్దె రూ.750 చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఇస్తున్న రూ.200కూడా ఇవ్వడంలేదు. పౌష్టికాహార ‘బాలమృతం’ ప్యాకెట్లపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ సిబ్బంది విఫలమవుతున్నారు. ఆయాలే టీచర్లు రామచంద్రాపురం/పటాన్చెరు రూరల్/జిన్నారం: పలు అంగన్వాడీ కేంద్రాల్లో సిలిండర్లు లేక వంట చేయక పోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు టిఫిన్‌బాక్సులు తీసుకు వచ్చి చిన్నారులకు తినిపించే పరిస్థితి నెలకొంది. అంగన్వాడి కేంద్రాల్లో సరుకులు ఆలస్యంగా రావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రామచంద్రాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో అంగన్వాడి కేంద్రంలో చిన్నారులు, సిబ్బంది బిక్కు బిక్కుమంటూ గడపారు. అంగన్వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తె లియని చందంగా తయారయింది. పటాన్చెరు మండలంలోని బీరంగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు అక్షయపాత్ర భోజనం వడ్డించారు. మరో అంగన్వాడీ కేంద్రం మూసివేశారు. జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆయాలే నిర్వహిస్తున్నారు. గడ్డపోతారం, బొంతపల్లి, వావిలాల తదితర గ్రామాల్లోనూ అదే దుస్థితి. సరైన సరకులు లేకపోవడంతో విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు తగిన పౌష్టికాహారం అందటం లేదు. ప్రస్తుతం సరుకులు అందుబాటులో ఉండకపోవటంతో అదీ నిలిపివేశారు. -
అమ్మలకు పస్తులు
ఉధృతమైన అంగన్వాడీల సమ్మెనిలిచిపోయిన ‘అమృత హస్తం’ కేంద్రాలకు తాళాలు వేసిన కార్యకర్తలు ప్రత్యామ్నాయ మార్గాలు చూడని అధికార యంత్రాంగం గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టిక భోజనం శిశువుల చెంతకూ చేరని ఆహారం సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు సమ్మెబాట పట్టడంతో బాలింతలు, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత హస్తం పథకం సమ్మె కారణంగా నిలిచిపోయింది. మోర్తాడ్, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా అమృత హస్తం పథకం కిం ద లబ్ధి పొందుతున్నవారికి పౌష్టికాహారం అంద డం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు సమ్మె నోటీసును ముందుగానే ఇచ్చారు. ఈ క్ర మంలో అమృత హస్తం పథకం అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్లు ఉండటంతో అమృత హస్తం పథకం నిలిచిపోయింది. భీమ్‌గల్, మద్నూర్, బాన్సువాడ, దోమకొండ, ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 19 మండలా లలో ఉన్న 2,628 అంగన్వాడీ కేంద్రాలలో ఈ పథకం అమలవుతోంది. గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 11,694 మంది గర్భిణులు, 7,650 బాలింతలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకున్నారు. సంఖ్య పెరిగినా గర్భం దాల్చిన ప్రతి మహిళకు పౌష్టిక ఆహారం అందించాలి. వారు ప్రసవించిన తరువాత ఆరు నెలల వరకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి. ప్రస్తుతం గర్భిణులు, బాలింతల సంఖ్య పెరిగింది. రోజూ మధ్యాహ్నం వారికి అన్నం, పప్పు, కూరలతోపాటు కోడి గుడ్డు, పాలను అందించాలి. అంగన్వాడీ కేంద్రాలలోనే వంట చేసి అమృత హస్తం భోజనాన్ని అందించాల్సి ఉంది. కొన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి లోటు కలిగించలేదు. చిన్నారుల పరిస్థితీ అంతే ఇపుడు పూర్తి స్థాయిలో సమ్మె చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావడంతో పథకానికి ఆటంకం కలుగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టిక ఆహా రం అందని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా నియమితులైన లింకు వర్కర్లతో అమృతహస్తం పథకాన్ని కొనసాగించాలని అధికారులు భావించా రు. అయితే సామగ్రి ఉంచే గదులకు తాళాలు వేసిన కార్యకర్తలు తాళం చేతులు ఎవరికి ఇవ్వలేదు. అధికారులు సమ్మెకు ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగ న్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించి అమృత హస్తం పథకాన్ని పునప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి వెళ్తూ బిచ్కుంద : పది రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. నిరుపేద గర్భిణులు రోజూ పౌష్టికాహారం కోసం కేంద్రానికి వచ్చి వెనుదిరిగి వెళ్తున్నారు. పుట్టబోయే పిల్లలు శారీ రకంగా ధృడంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన అమృత హస్తం పథకం వారికి అందకుండా పోతోంది. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు 125 గ్రాముల బియ్యంతో వండిన అన్నం, వివిధ రకాల కూరగాయలు, రోజుకో గుడ్డు, 200 గ్రాముల పాలు ఇవ్వాలి. గత పది రోజుల నుంచి ఆహారం అందక పోవడంతో గర్భిణులు, బాలింతలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో లేదోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామాతో అంగన్వాడీ సమస్యలను పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు. -
'బాలామృతం'.. విషం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ప్రచారం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న పథకాలు అమల్లో మాత్రం అత్యంత అధ్వానంగా మారిపోతున్నాయి. ఈ పథకాల కోసం ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను నిలిపేయడం వల్ల లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోతోంది. అలాంటి మరో ఆర్భాటపు పథకమే.. ‘బాలామృతం’. ఏడు నెలల వయసు నుంచి ఏడేళ్ల మధ్య చిన్నారులకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా గత నెలలో ప్రకటించిన ఈ పథకం ఆచరణలో మాత్రం దాదాపు పూర్తిగా విఫలమైంది. దీనికోసం ఏటా రూ. 250 కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు చెప్పుకొంటున్న గొప్పలేమిటో... కనీసం మూడోవంతు చిన్నారులకు కూడా పౌష్టికాహారం అందడం లేదనే నిష్ఠుర సత్యం స్పష్టంగా కళ్లకు కడుతోంది. దానికితోడు ‘బాలామృతం’ పథకం కింద అందజేస్తున్న పౌష్టికాహారంలో కలుపుతున్న పాలపొడి నాసిరకంగా ఉంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లోపం కారణంగా పలు చోట్ల చిన్నారులు వాంతులు, విరేచనాలు వంటి అస్వస్థతకు గురవుతున్నారు. సమగ్ర కార్యాచరణ ఏది? గోధుమలు, శనగపప్పు, వేరుశనగ, పంచదార, పాలపొడి మిశ్రమంతో ఏపీ ఫుడ్స్ బాలామృతాన్ని ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తోంది. రోజుకు 100 గ్రాముల చొప్పున, 25 రోజులకు ఒక్కొక్కరికి 2.5 కేజీల ప్యాకెట్‌ను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని నిర్దేశించారు. అయితే, ఐసీడీఎస్ పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమం ఇంత వరకూ సమగ్ర కార్యాచరణకు నోచుకోలేదు. పథకం కింద అందిస్తున్న పౌష్టికాహారం ప్యాకెట్ల డిమాండ్‌కు, పంపిణీకి మధ్య ఏమాత్రం పొంతన లేదు. ముందస్తు ప్రణాళిక కరువు.. ‘బాలామృతం’ పౌష్టికాహార ప్యాకెట్ల పంపిణీ వ్యవహారంపై అధికారుల్లోనూ అయోమయం కనిపిస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా పథకాన్ని ప్రకటించడమే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ‘సోయా మీల్ (సోయాబీన్ ఇతర పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారం)’ పొడి మాత్రమే అందించేవారు. అయితే, కొత్తగా పాలపొడిని చేర్చాలనే యోచనకు అనుగుణంగా ప్రత్యేక యంత్రాలు, ప్యాకింగ్ పరికరాలు కావాలని అధికారులు అంటున్నారు. దాంతో అక్టోబర్‌లో 1,200 టన్నులు, నవంబర్‌లో 1,800, డిసెంబర్లో 2,300 టన్నులు మాత్రమే అందించగలిగామని అధికారులు పేర్కొన్నారు. రెంటికీ నోచని చిన్నారులు.. ఐసీడీఎస్ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 406 ప్రాజెక్టుల కింద 80 వేల అంగన్వాడీ కేంద్రాలు, 10 వేల మినీ అంగన్వాడీలున్నాయి. అందులో కేవలం 160 ప్రాజెక్టులకే ‘బాలామృతం’ సరఫరా అవుతోంది. మిగతా ప్రాజెక్టులకు గతంలో మాదిరిగా సోయామీల్‌ను పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ, చాలా జిల్లాల్లో సోయామీల్ కూడా సరిగా అందడం లేదని సమాచారం. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రాంతంలో ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో 100 నుంచి 120 మంది చిన్నారులు ‘బాలామృతం’ ప్యాకెట్ల కోసం నమోదు చేసుకున్నారు. కానీ, ఒక్కో కేంద్రంలో సుమారు 40 మందికి సరిపడా ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. మెదక్ జిల్లా జోగిపేటలో ‘బాలామృతం’ ప్యాకెట్లలో తెల్లటి పురుగులు వచ్చాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అదే గ్రామం ఎస్సీ కాలనీలో చిన్నారులకు ‘బాలామృతం’ తిన్న వెంటనే వాంతులవడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రాణాంతకమే..! రాష్ట్రంలో చాలా చోట్ల ‘బాలామృతం’ పౌష్టికాహార ప్యాకెట్లలో అందించే పొడి నాసిరకంగా ఉంటోందని.. పురుగులు, బూజు వంటివి కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ‘బాలామృతం’ తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు నాసిరకంగా ఉండటం, బూజు పట్టిన సరుకును తయారీలో వినియోగించడమే దీనికి కారణమనే వాదన విన్పిస్తోంది. ఇందులో కలిపే పాలపొడిని గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల అమూల్ డైరీలు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఆ సంస్థలు నాసిరకం పాలపొడిని సరఫరా చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పాలపొడిలో ఏమాత్రం నాణ్యత లోపించినా, నిర్ధారిత సమయం మించిపోయినా... అది విషపూరితమయ్యే ప్రమాదం ఎక్కువ. పాలపొడి ప్రమాణాల్లో తేడా వస్తే... ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు ప్రభుత్వానికి అంతర్గత నివేదికలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. అంతా బాగానే ఉంది: జేడీ బాలామృతం పథకాన్ని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ సరళారాజ్యలక్ష్మి తెలిపారు. నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామన్నారు. ‘బాలామృతం’ పొడిని చిన్నారులకు తినిపించేటప్పుడు శుభ్రత పాటించకపోవడమే అస్వస్థతకు కారణమన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పారు. -
పసిపిల్లల పొట్టగొడుతున్న కాంట్రాక్టర్లు
రాజాపేట, న్యూస్‌లైన్ అంగన్వాడీలకు పౌష్టికాహారం అందిం చేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సరకుల పంపిణీలో చేతివాటం ప్రదర్శిస్తు న్నారు . తల్లుల, పసిపిల్లల పొట్టగొడుతున్నా రు. మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు గురువారం పప్పు పంపిణీ చేశారు. అయితే బస్తా పప్పులో తూకం తక్కువ వచ్చిన ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. ఆలేరు ఐసీడీఎస్ పరిధి రాజాపేట మండలం బొందుగుల సెక్టారులో 19 అంగన్వాడీ కేంద్రాలు, రాజాపేట సెక్టార్లో 23 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, తల్లులు, బాలింతలు, పసిపిల్లలకు టేక్ హోం రేషన్, అమృతహస్తం ద్వారా పౌష్టికాహారం అందజేస్తారు. తల్లులకు రోజుకు బియ్యం 125 గ్రాములు, నూనె 16 గ్రాములు, పప్పు 30 గ్రాముల చొప్పున, ఆరె నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు పిల్లకు నెలకు కేజీ బియ్యం, అరకేజీ పప్పు, అరకేజీ నూనె చొప్పున పౌష్టికాహారం అందించాలి. ఈ పౌష్టికాహారం అందించే కాం ట్రాక్టర్లు వారి చేతివాటం ప్రదర్శిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. 25 కేజీలు ఉండాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా వ్యహరిస్తూ ఒక్క బస్తాలో 25 కేజీల పప్పు ఉండాల్సి ఉండగా 16 కేజీల నుంచి 20 కేజీల లోపు మాత్రమే ఉంటుంది. సుమారు బస్తాలో 9 కేజీల పప్పు తక్కువ తూకంతో సరఫరా చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో రికార్డు లెక్కల్లో మాత్రం బస్తా తూకం 25 కేజీలు ఉన్నట్లు చూపుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి లేదని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలో సర్దుబాటు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం పిల్లల పొట్టగొడుతూ పౌష్టికాహారం పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రఘనాథపురంలో.. రఘునాథ పురంలో గ్రామ సర్పంచ్ రామిండ్ల నరేందర్ ఎదుట తూకం వేశారు. బస్తా తూకం 25 కేజీలకు బదులు 20 కేజీలు మాత్రమే ఉండటంతో స్టాకును తీసుకోకుండా తిరిగి పంపించి వేశారు. తక్కువగా వచ్చిన విషయం మా దృష్టికి వచ్చింది అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న కంది పప్పు బస్తాలల్లో తూకం తక్కువగా వచ్చిన విషయం మా దృ ష్టికి వచ్చింది. బస్తాలు పంపిణీ సూపర్వైజర్ పర్యవేక్షణలో జరగాలి. కానీ వారికి వరసగా మీటింగ్ , ట్రై నింగ్, వీడియో కాన్ఫెరెన్స్‌లు ఉండటంతో వారికి వీలుపడ లేదు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం. - సీడీపీఓ స్వరూపారాణి, ఐసీడీఎస్,ఆలేరు