అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ వల్ల మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘవ్యాధుల వస్తాయని అందరికీ తెలిసిందే. నిపుణులు కూడా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ చాలామంది వాటిని తినే అలవాటుని మానుకోరు. పైగా అందుకు తగ్గట్టు యాడ్‌లు కూడా ఆకర్షణీయంగా వస్తాయి. అందులోనూ ప్రముఖులు, సెలబ్రెటీలే వాటిని ప్రమోట్ చేయడంతో నిపుణుల సలహాలను పక్కకు పెట్టేస్తుంటారు.
అందువల్లే దేశమంతటా ఊబకాయం, మధుమేహ వ్యాధుల కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడూ ఆ విషయం నిపుణులు జరిపిన తాజా నివేదికలో తేలింది. ఆయా ఫుడ్స్ యాడ్స్ తప్పుదారి పట్టించి..తినేలా ప్రేరేపిస్తున్నట్లు న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్‌ఏపీఐ) 50 షేడ్స్ ఆఫ్ ఫుడ్ అడ్వర్టైజింగ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో ఢిల్లీలో అందుబాటులో ఉన్న ప్రముఖ, ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో వస్తున్న సుమారు 50 ఫుడ్ ప్రకటనలను పరిశీలించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
భావోద్వేగాలు రేకెత్తించేలా అనారోగ్యకరమైన ఆ ఆహార ఉత్పత్తులను ప్రముఖులచే అడ్వర్టైజింగ్ చేపించి, వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సమయంలోనూ, సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను న్యూట్రిషన్ అడ్వకేసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ (ఎన్‌ఏపీఐ) కన్వీనర్, పీడియాట్రిక్ అరుణ్ గుప్తా నివేదించారు. అంతేగాదు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వస్తున్న వాణిజ్య ప్రకటనలపై ముగింపు పలికేలా ప్రస్తుత నిబంధనలను సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతేగాదు ఆయా ప్రొడక్ట్‌లు వందగ్రాములు/మిల్లీ లీటర్‌కు ఎన్ని పోషకాలు ఉంటున్నాయనేది బోల్డ్ అక్షరాలతో బహిర్గం చేసే చర్యలకు పిలుపునిచ్చారు. కాగా, ఇటీవలే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్) ఈ ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల్లో 10 ఏళ్లలోపు వయసుగల పిల్లల్లో పదిశాతానికి పైగా ఎక్కువ మంది ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్నారని పేర్కొంది.
(చదవండి: అరటి కాండంతో చాట్..! ఎప్పుడైనా ట్రై చేశారా..?)
Comments
Please login to add a commentAdd a comment