ఐసీఎంఆర్‌ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే.. | ICMR RELEASES DIETARY GUIDELINES FOR INDIANS | Sakshi
Sakshi News home page

ఐసీఎంఆర్‌ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..

Published Wed, May 8 2024 6:59 PM | Last Updated on Wed, May 8 2024 9:37 PM

ICMR RELEASES DIETARY GUIDELINES FOR INDIANS

ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.

భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్‌ నేషనల్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్‌ను ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ డెరెక్టర్‌ డాక్టర్‌. హేమలత బుధవారం విడుదల చేశారు.

ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..

1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.
2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.
3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా  ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 
4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.
5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.
6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.
7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ ఆహారంలో భాగం చేసుకోవాలి.
8. నాణ్యమైన ప్రోటిన్‌, ఆమైనో యాసిడ్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్‌ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.
9. జీవనశైలిలో  ఉబకాయం, అధిక  బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.
11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 
12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి
13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.
14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.
15. అధిక కొవ్వు,  తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్‌ లెబుల్స్‌ను చదవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement