hemalatha
-
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. నెల్లూరుకు చెందిన వినయ్(23), హేమలత(23) ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. తిరుమల దర్శనార్థం శుక్రవారం బయలుదేరారు. శనివారం తిరిగి నెల్లూరుకు బైక్‌పై వెళుతుండగా శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద హేమలత బ్యాగు లారీకి చిక్కుకోవడంతో ఆమె లారీ కింద పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందింది. వినయ్ స్వల్పగాయాలతో బయటపడడ్డాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
ఢిల్లీ: ఆరోగ్యంగా ఉండటంలో పౌష్టిక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తినటం వల్ల శరీరకంగా బలంగా ఉంటాం. సమతుల ఆహారం తీసుకోవటంతో వ్యాధులు సైతం దరిచేరవు. ఇందుకోసమే.. తాజాగా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొన్ని ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది.భారతీయులకు ఈ ఆహార మార్గదర్శకాలను పోషకాహార పరిశోధనా సంస్థ, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్), హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ 17 ముఖ్యమైన ఆహార మార్గదర్శకాలతో కూడిన ఈ బుక్‌ను ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డెరెక్టర్ డాక్టర్. హేమలత బుధవారం విడుదల చేశారు.ముఖ్యమైన 17 ఆహార మార్గదర్శకాలు ఇవే..1. సమతుల ఆహారం కోసం అన్ని రకాల ఆహారాలను తినాలి.2. గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు సాధారణం కంటే కొంచం అధిక మోతాదులో పౌష్టిక ఆహారం తీసుకోవాలి.3. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా శిశువులకు రెండేళ్లు వచ్చే వరకు ఆపై కూడా తల్లి పాలు అందించాలి. 4. శిశువులకు ఆరు నెలల తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన ఘన, ద్రవ ఆహారాన్ని తినిపించాలి.5. చిన్నపిల్లలు అనారోగ్యం పాలు కాకుండా.. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చాలినంత ఆహారాన్ని అందించాలి.6. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.7. ఆహారంలో నూనెను సాధారణ మోతాదులో వాడాలి. మంచి కొవ్వు కోసం నూనె గింజలు, పప్పులు, అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.8. నాణ్యమైన ప్రోటిన్, ఆమైనో యాసిడ్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. కండరాల దృఢత్వం కోసం ప్రోటిన్ సప్లిమెంట్లుకు దూరంగా ఉండటం మంచిది.9. జీవనశైలిలో ఉబకాయం, అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.10. ఆరోగ్యం కోసం శరీరాన్ని కదిలిస్తూ.. రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.11. ఆహారంలో ఉప్పును అధికంగా తినటం తగ్గించాలి. 12. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తినాలి13. మంచి ఆహార తయారీ పద్దతులు పాటించాలి.14. అధిక మోతాదులో శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి.15. అధిక కొవ్వు, తీపి ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.16. వృద్ధులు ముఖ్యంగా పౌష్టిక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.17.ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కోసం.. ఆహార పదార్థాల మీద ఫుడ్ లెబుల్స్‌ను చదవాలి. -
తమిళనాడులో ఉద్యోగం.. ఆంధ్రలో రాజకీయం
సాక్షి, తిరుపతి: సత్యవేడు టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఇన్చార్జ్ హెలెన్ తీరునచ్చని టీడీపీలోని మరోవర్గం ఆమె రాజీనామా ‘డ్రామా’ ఆడుతోందంటూ ఆధారాలతో బయటపెట్టారు. టీడీపీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారని చంద్రబాబుని నమ్మించి సత్యవేడు నుంచి పోటీచేసేందుకు హై డ్రామా ఆడారంటూ ఆ పార్టీలోని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలకు బలం చేకూరేలా హెలెన్ తమిళనాడులో ఉద్యోగం చేస్తూ.. ఏపీలో రాజకీయం చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల మధ్య వర్గపోరుతో సత్యవేడు రాజకీయం రంజుగా మారింది. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్. హేమలత వారసురాలిగా హెలెన్‌ను తెరపైకి తెచ్చిన మాజీ ఎమ్మెల్యే సత్యవేడు ఇన్చార్జ్గా తన కుమార్తెను ప్రకటింపజేశారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీలోని మరో రెండు వర్గాలు మాజీ ఎమ్మెల్యే హేమలత, కుమార్తె హెలెన్ విషయాలను బయటపెట్టడం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా గతంలోనే హేమలతపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే కుమార్తె హెలెన్పైనా అదే స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత టీడీపీ సత్యవేడు ఇన్చార్జ్ డాక్టర్ హెలెన్ తమిళనాడులోని ఈఎస్ఐ హాస్పిటల్లో అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తూ, ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని సొంత పార్టీనేతలే విమర్శిస్తున్నారు. నాగలాపురం ఈస్ట్ దళితవాడకు చెందిన ఎ.సెల్వకుమార్ నమోదు చేసుకున్న ఆర్టీఐ యాక్ట్ ద్వారా డాక్టర్ హెలెన్ ప్రస్తుతం ఈఎస్ఐ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద డాక్టర్ హెలెన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు చెప్పారని, కానీ ప్రస్తుతం అక్కడా నేనే.. ఇక్కడా నేనే అనే విధంగా ఆమె వ్యవహార శైలి ఉందని ఆ పార్టీ శ్రేణులు పరోక్షంగా విమర్శిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన హెలెన్, అందుకు భిన్నంగా ‘మీరు ఆ వర్గం, మీరు ఈ వర్గం’ అంటూ పార్టీ కేడర్‌లో విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పార్టీకోసం జెండా మోస్తున్న నిజాయితీగల కేడర్ ను అయోమయానికి గురిచేస్తున్నట్లుగా పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హెలెన్ వైఖరి మెచ్చని నియోజకవర్గ ఏడు మండలాల్లోని పలువురు నేతలు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిపై హెలెన్ వర్గీయుల ఆగ్రహం హెలెన్ అభ్యర్థిత్వాన్ని నచ్చని మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య, జేడీ రాజశేఖర్ వర్గీయులే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వర్గీయులు మండిపడుతున్నారు. 2019లో జేడీని అభ్యర్థిగా ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య కనిపించకుండా పోయారని ఆరోపిస్తున్నారు. పార్టీ నమ్మి టికెట్ ఇచ్చి గెలిపిస్తే.. ఎమ్మెల్యేగా ఉన్న ఆ ఐదేళ్లు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకుని, వసూళ్లు చేసుకుని పత్తాలేకుండా వెళ్లిపోయారంటూ హెలెన్ వర్గీయులు మండిపడుతున్నారు. పార్టీ కి ఉపయోగపడని మాజీ ఎమ్మెల్యే తలారి ఇన్చార్జ్ హెలెన్‌కి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన జేడీ రాజశేఖర్ నమ్మిన వారిని నట్టేట ముంచిన వ్యక్తి అని ఆరోపిస్తున్నారు. మండల నాయకుల వద్ద డబ్బులు ఖర్చుచేయించి పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టిన జేడీఆర్ హెలెన్‌ని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తుతున్నారు. సత్యవేడు టీడీపీలో గ్రూపులు ప్రోత్సహించింది జేడీఆర్ అని ఆమె వర్గీయులు మండిపడుతున్నారు. -
టైగర్ నాగేశ్వరరావులో రేణుదేశాయ్.. ఆ పాత్ర వెనక ఇంత కథ ఉందా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోంది. మాస్ మహారాజా మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో నటిస్తోంది. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి భారీ క్రేజ్ వస్తోంది. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. హేమలత లవణం ఎవరంటే? ఈ చిత్రంలో రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర పట్ల ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె క్యారెక్టర్ వెనక ఉన్న అసలు సంగతేంటో తెలుసుకుందాం. అసలు ఆ పేరు ఎవరిదీ? అంత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ను రేణుదేశాయ్ పోషించడంతో అభిమానులు సైతం నెట్టంట ఆరా తీస్తున్నారు. ఈ చిత్రంలోని హేమలత లవణం ఎవరు? అసలు ఆమె ఎవరో వివరాలు తెలుసుకుందాం. హేమలత లవణం జీవితం హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించింది. ఆమె తన విద్యనంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్ని పొందింది. ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు వివాహం జరిగింది. అయితే అప్పట్లో వర్ణ వివక్షను ఎదురించి చేసుకున్న ఆమె వివాహం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆమె వినోబా భావే భూదాన యాత్రలో చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసికంగా పరివర్తన తెచ్చేందుకు కృషిచేసింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అనే సేవా సంస్థను స్థాపించి వెనుకబడిన, దిగువ కులాల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. 1981లో కావలిలో నవవికాస్ అనే సంస్థను స్థాపించి అణగారినవర్గాలను ఆదుకుంది. (ఇది చదవండి: బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!) జోగిని వ్యవస్థపై పోరాటం అప్పట్లో మహిళల జోగిని వ్యవస్థపై పోరాటం చేసింది. జోగినులను, వారి పిల్లలను కాపాడేందుకు 'సంస్కార్' చెల్లి నిలయం అనే సంస్థలు ఏర్పాటు చేసింది. 'బాణామతి' లాంటి గుడ్డి నమ్మకాలతో మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వాటికి వ్యతిరేకంగా పోరాడింది. రెండు వేలకు పైగా జోగినులను సంస్కరించడమేకాక.. ప్రభుత్వం చేత వారికి పొలాలు ఇప్పించింది. అంతే కాకుండా జోగినులకు వివాహాలు కూడా చేసింది. సంస్కార్ సంస్థను స్థాపించి.. నిజామాబాదు జిల్లాలోని జోగినీ వ్యవస్థ నిర్మూలనకు హేమలత లవణం చేసిన కృషి ఫలితంగానే.. అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం జోగినీ వ్యవస్థ నిర్మూలణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత వర్ణ, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది. చైల్డ్ ఎట్ రిస్క్ పేరుతో వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణుదేశాయ్ ఆమె పాత్రనే పోషిస్తోంది. ఈ సినిమాలో జోగినిల సంక్షేమం కోసి కృషి చేసిన హేమలత లవణం చరిత్రనే తెరపై చూపించనున్నారు. కాగా.. రేణు దేశాయ్ నటిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. -
‘‘నాన్నా నిద్రలేవు.. నన్ను చూడు’’
కర్నూలు: ‘‘నాన్నా నిద్రలేవు.. నన్ను చూడు’’ అంటూ కుమార్తె అనుషశ్రీ తండ్రి మృతదేహంపై రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆదోని డీఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సందీప్‌కుమార్(32) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక కుమార్తె గుండెలవిసేలా రోదించింది. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి పెద్దకుమారుడు సందీప్‌కుమార్ 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఈయనకు భార్య హేమలత, కుమార్తె అనూషశ్రీ ఉన్నారు. ఆదోని పట్టణంలోని కపటినగర్లో వీరు నివాసముంటున్నారు. కుమార్తె పట్టణంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం ఇంట్లో బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు జంక్షన్ వైరుతో ఉరి వేసుకొని సందీప్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం హాలులో పడుకున్న తల్లి, కుమార్తె రూములోకి వెళ్లి చూడగానే ఫ్యాన్‌కు సందీప్‌కుమార్ వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు విక్రమసింహా, శ్రీనివాసనాయక్, ఎస్ఐ చంద్ర, సిబ్బంది లక్ష్మణ్, విష్ణు తదితరులు వెంటనే సందీప్‌కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న కానిస్టేబుల్ మృతదేహాన్ని కిందకు దింపి, అనంతరం అంబులెన్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో మృతుడి కుమార్తె అనుషశ్రీ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సందీప్‌కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటున్ల టూటౌన్ సీఐ శ్రీనివాసనాయక్ తెలిపారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని స్వగ్రామమైన గుమ్మనూరుకు అంబులెన్స్‌లో తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పట్టుదలతో ప్రయత్నిస్తే.. శిఖరాలే తలవంచేలా..
కొత్తగూడ: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లెబోయిన హేమలత ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బొల్లెబోయిన పద్మ, కుమార స్వామి దంపతుల పెద్ద కూతురు హేమలత చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు చలించిపోయేది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పట్టుదలతో చదువు కొనసాగించింది. ఈ క్రమంలో ఎస్సై ఉద్యోగానికి ఎంపిది. ఎస్సై పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, తమ కూతురు ఎస్సైగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పద్మ, కుమారస్వామి తెలిపారు. -
పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం ఎనర్జీ రంగానికి ఉంది
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, వంటకు సరైన ఇంధనం లేక అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని గ్రీన్ కాలర్ అగ్రిటెక్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు హేమలత అన్నామలై అన్నారు. వారి పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం ఎనర్జీ రంగానికి ఉందని చెప్పారు. బుధవారం విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన హేమలత అన్నామలై మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎనర్జీ రంగం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఐఐపీఈ అందించిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంధన రంగానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుతో దేశ భవిష్యత్ ముడిపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడుగురిలో ఒకరికి విద్యుత్ అందుబాటులో లేదన్నారు. ఇంకా మూడు బిలియన్ల ప్రజలు కిరోసిన్, కలప, బొగ్గు ఆధారంగానే వంటలు చేస్తున్నారని చెప్పారు. ఐఐపీఈ విద్యార్థులు నూతన ఆవిష్కరణలను చేసి ఎనర్జీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా 87 మందికి డిగ్రీ పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పీకే బానిక్, ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడితో లవ్ ఎఫైర్.. భర్తకు తెలియడంతో..
సాక్షి, కశింకోట (విశాఖపట్నం): మండలంలోని మోసయ్యపేట శివారు గోకివానిపాలెంలో గురువారం వివాహిత సహా యువకుడు అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ గ్రామాల నుంచి బైక్‌పై వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు. రైతులు గుర్తించి సమాచారం అందివ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి సీఐ జి.శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం.. గోకివానిపాలెంలో బుచ్చియ్యపేటకు చెందిన మజ్జి శ్రీనివాసరావు(25), కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన వివాహిత చెల్లపల్లి హేమలత(23) విగత జీవులుగా పడి ఉన్నారు. శ్రీనివాసరావు చోడవరంలోని ఒక షోరూంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. హేమలత గృహిణి. వీరు 2017లో చోడవరం కళాశాలలో చదివేవారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం, తరచుగా సెల్ఫోన్లో సంభాషిస్తున్న విషయం భర్త భాస్కరరావు, హేమలత తండ్రికి తెలియడంతో వారు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి శ్రీనివాసరావుతో బైక్‌పై గోకివానిపాలెం గ్రామం వద్ద చేరుకొని ఆత్మహత్యకు పాల్పడి విగత జీవులుగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానిక రైతులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: (దుబాయ్‌కి వెళ్లాలని భార్యతో గొడవ.. వసంత తండ్రికి ఫోన్‌చేసి..) -
ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..
సాక్షి, కదిరి (అనంతపురం): భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడం కళ్లారా చూసిన భర్త రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది హతమార్చిన సంఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఏడేళ్ల బాలుడు మురళి, ఐదేళ్ల బాలిక కీర్తన ఉన్నారు. చదవండి: (ఏడాది కిందట పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య!) పట్నం గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తితో హేమలత గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయమై పలుమార్లు పద్దతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించడం జరిగింది. అయినా ఆమె ఖాతరు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజినేయులుతో కలసి ఉండడం కళ్లారా చూసిన శివశంకర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పక్కనే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) ఇది చూసి భయపడిపోయిన రామాంజినేయులు పారిపోయాడు. ఆ వెంటనే తన మామ (హేమలత తండ్రి) గోపాలప్పకు నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. అందుకే చంపేశానంటూ ఫోన్ చేసి చెప్పాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పట్నం ఎస్సై సాగర్ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత రచయిత వరవరరావు (80)కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం, పాతపట్నం: మెళియాపుట్టి మండలం వెంకటాపురం పంచాయతీ బందపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తన ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని సవర హేమలత (25) ఆత్మహత్య చేసుంది. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం... ఆమె తండ్రి సవర పాపయ్య, తల్లి జానకమ్మ పోడు వ్యవసాయం కోసం కొండపైకి వెళ్లారు. ఇంతలో ఈ దారుణానికి ఒడిగట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ సిద్ధార్థ కుమార్ చేరుకుని పరిశీలించి, మృతురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హేమలత ఇంటర్ వరకు చదువుకుంది. తమ్ముడు అనిల్ ఉన్నాడు. పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
చిట్టి తల్లి హేమలత ఇకలేదు
సాక్షి, అల్లిపురం (విశాఖ): బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విశాఖలోని అల్లిపురం, గౌరీవీధికి చెందిన హేమలత (11) బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో వచ్చిన వార్తకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పటల్ వారు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. చిట్టితల్లికి వైద్యం అందజేయాలని ముఖ్యమంత్రి చెప్పడంతో చాలామంది దాతలు స్పందించి హేమలత కుటుంబానికి అండగా నిలిచారు. బాలిక ఆరోగ్యం బుధవారం విషమించడంతో కొద్దిసేపటికే ఆమె మృతి చెందిందని హేమలత తల్లిదండ్రులు అప్పలరాజు, అమ్మాజీ తెలిపారు. బాధితుల కుటుంబాలకు రూ.13 కోట్లు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలు, అత్యాచార బాధితులు, క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. జిల్లాకు రూ.కోటి చొప్పున 13 జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) బుధవారం ఉత్తర్వులిచ్చింది. -
కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు
కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత విమర్శించారు. సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభను శనివారం కుషాయిగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలో కార్మిక చట్టాలు నీరుగారిపోవడంతో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్లకు పెద్దపీఠ వేశారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కోడ్ బిల్లు మూలంగా చట్టసభల్లో కార్మికుల సమస్యలు ప్రస్తావించే అవకాశముండదని, సమ్మెను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో నియంత దొరపాలన సాగుతోందని హేమలత ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి ఆర్టీసీ కార్మికుల సమ్మేనని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి 8న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
అడ్డుగా ఉన్నాడనే దారుణం..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు భర్తను హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే .. కృష్ణాజిల్లాకు చెందిన నాగరాజు(35), హేమలత దంపతులు నగరానికి వలసవచ్చి ప్రగతినగర్ ప్రాంతంలో ఉంటున్నారు. గతంలో వారు స్థానిక ప్రశాంతి గోల్డెన్ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పని చేసేవారు. ఈ క్రమంలో హేమలత వెంకటేశ్వరెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలీప్ పారిశ్రామికవాడ ప్రాంతానికి మాకాం మార్చాడు. అయినా వారి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. తమ వివాహేతర సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించిన హేమలత, వెంకటేశ్వరరెడ్డి అతడిని హత్య చేయాలని పథకం పన్నారు. ఈ నేపథ్యంలో అతడు తినే ఆహారంలో విషం కలపాలని సూచించిన వెంకటేశ్వరరెడ్డి రెండుసార్లు హేమలతకు విషం తెచ్చి ఇచ్చాడు. అయితే ఆమె ధైర్యం చేయలేకపోయింది. దీంతో అతడిని హత్య చేసేందుకు బీదర్, వాడిచెల్కాపూర్ ప్రాంతానికి చెందిన మాపన్న అనే వ్యక్తి రూ.లక్షకు సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 10న నాగరాజును బీదర్ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లిన వెంకటేశ్వర్‌రెడ్డి మాపన్నతో అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహంపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించారు. అనంతరం ఈ విషయాన్ని హేమలతకు చెప్పడంతో ఆమె తనకు ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమలత, వెంకటేశ్వరరెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హేమలత పేరున ఫ్లాట్ రిజిస్ట్రేషన్.. హేమలతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకటేశ్వరెడ్డికి ఆమెకు ప్రగతినగర్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి నిందితులు.. నిందితులు వెంకటేశ్వరెడ్డి, మాపన్నలను సీఐ జగదీశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఏ విధంగా హత్య చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే దానిపై వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. -
హేమలత న్యాయపోరాటం
అనంతపురం, తాడిమర్రి: ప్రేమించి..పెళ్లిచేసుకున్నోడే...నేను పోషించలేను...నిన్ను ఏలుకోలేనని నిర్దయగా చెప్పగా...అతన్ని నమ్మివెళ్లిన ఆ అమ్మాయి జీవితం సందిగ్ధంలో పడింది. కేవలం ‘కులం’ వేరు కావడంతోనే తన అత్తామామలు చేరదీయక అన్యాయమై పోయిన హేమలత దిక్కుతోచని స్థితిలో మంగళవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పరిచయం..ప్రేమ...పెళ్లి తాడిమర్రి మండలంలోని నార్శింపల్లి గ్రామానికి చెందిన ఎరికల సామాజిక వర్గానికి చెందిన సాకే ఈరప్ప, సాకే లింగమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారికి వాణి, హేతలత ఇద్దరు అమ్మాయిలు సంతానం. కూలికెళితే గానీ పూట గడవని కుటుంబం..అయినా పిల్లలిద్దరినీ కష్టపడి చదివించారు. పెద్ద కుమార్తె వాణి డిగ్రీ (బీఎస్సీ) చదవగా.. చిన్న కుమార్తె హేమలత ధర్మవరంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ (బీకాం) చదివింది. అక్కాచెల్లెలు ఇద్దరు రోజు కళాశాలకు ధర్మవరం వెళ్లి, వస్తుండేవారు. ఈ క్రమంలో హేమలతకు తాడిమర్రి మండలం పూలఓబయ్యపల్లి గ్రామానికి చెందిన పాళ్యం శివయ్యతో పరిచయం ఏర్పడి... అది ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. పెద్దలు ఒప్పుకోరని.... ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరని భావించిన హేమలత, శివయ్య ఏప్రిల్ 21న ధర్మవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి పరీక్ష రాసి తిరుపతికి వెళ్లారు. అక్కడే ఓ ఆలయంలో ఆదే రోజున వివాహం చేసుకున్నారు. సాయంత్రానికి రావాల్సిన కూతురు ఇంటికి రాకపోవడంతో హేమలత తల్లిదండ్రులు కళాశాల, బంధువుల గ్రామాల్లో విచారించారు. చివరకు కూతురు కనిపించలేదని తాడిమర్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంతలో వధూవరులిద్దరూ పూలఓబయ్యపల్లిలోని వరుని ఇంటికి వెళ్లారు. ‘‘ఎరికల కులం అమ్మాయివి నీవు మా ఇంటిలోకి రాకూడదు’’ అని అత్తామామలు హేమలతను గెంటేశారు. కుమారునికి మాయమాటలు చెప్పి హేమలతపై మనసు లేకుండా చేశారు. పోలీసులు ఆర్డీఓ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం పెట్టిస్తే నెల తిరక్కనే ‘‘నిన్ను పోషించలేను’’ అని వరుడు అడ్డం తిరిగాడు. దీంతో హేమలత తనకుటుంబీకులతో కలిసి న్యాయం పోరాటం చేస్తోంది. ఈక్రమంలోనే ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలవగా...ఆయన ధర్మవరం డీఎస్పీ వెంకటరమణకు ఫోన్‌చేసి న్యాయం చేయాలని ఆదేశించారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ప్రేమ, పెళ్లి అంటే ఏమిటో తెలియక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎరికల దానివి ఇంటిలోకి రాకూడదని మా అత్తామామలు అంటున్నారు. నా భర్త శివయ్య నిన్ను పోషించలేను, విడపోదామంటున్నాడు. ఒకసారి ఒకరితో తాళి కట్టించుకుని, జీవితం పంచుకుని విడిపోయి ఎలా జీవించను. న్యాయం జరిగే వరకూ పోరాడతా.–హేమలత, వధువు,నార్శింపల్లి, తాడిమర్రి తప్పకుండాన్యాయం చేస్తాం హేమలతకు తప్పకుండా న్యాయం చేస్తాం. అమ్మాయి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మంగళవారం నన్ను కలిసింది. వారి సమస్య విన్నాను. వెంటనే ధర్మవరం డీఎస్పీకి ఆదేశాలు కూడా జారీ చేశా. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
వరవరరావు కేసులో మీ వైఖరి ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలపై ‘భీమా కొరేగాం హింసా కాండ కేసు’లో వరవరరావును ఇరికించిన విషయంలో మీ వైఖరేంటో బహిరంగంగా ప్రకటించాలని ఆయన సతీమణి హేమలత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ఎన్నికల ప్ర చారంలో ప్రధాని మోదీ అబద్ధాలు, అక్రమాల మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే వరవరరావుపై పన్నిన అబద్ధపు కేసు గురించి మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. గతంలో విప్లవ రచయితల సంఘంపై నిషే ధమున్న సమయంలో చంచల్‌గూడ జైలులో అక్రమ నిర్బంధంలో ఉన్న వరవరరావును 2005 సెప్టెంబర్ 3న కేంద్ర మంత్రి హోదాలో మీరు కలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నానని తెలిపారు. ప్రస్తుత అక్రమ నిర్భంధం కేసులోనూ అదే వైఖరి తీసుకుంటారని ఆశిస్తున్నా నని చెప్పారు. గత 45 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరవరరావుపై 25 అబద్ధపు కేసులు బనాయించారని, ఇవన్నీ రుజువుకాకపోయినా ఏడేళ్ల జైలు జీవితాన్ని గడిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం పుణే పోలీసులు పెట్టిన కేసు, జైలులో ఉండగానే అహోరీలో బనాయించిన మరొక కేసు కూడా అబద్ధపు కేసులని, న్యాయస్థానాల్లో నిలబడవని, బీజేపీ ప్రభుత్వం అక్రమ నిర్బంధంలో ఉంచడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆరోగ్యం బాగా లేని 79 ఏళ్ల వయసున్న వరవరరావును ఇలా వేధించడం అమానవీయం, చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. గతంలో అన్ని కేసుల విచారణకు హజరైనట్లే ఈ విచారణకు కూడా హాజరవుతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వరవరరావును వెంటనే బెయిల్ మీద విడుదల చేయాలని కోరారు. మోదీ మీరు ప్రకటిస్తున్న వ్యతిరేకత నిజమైనదేనని, చిత్తశుద్ధి కలిగినదేనని చూపుకోవాలంటే వరవరరావు అక్రమ నిర్భంధం మీద మీ వైఖరి ప్రజలకు తెలపాలని హేమలత అభ్యర్థించారు. -
నిన్నే చూస్తూ...
నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) ముఖ్య తారలుగా కె.గోవర్ధన్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. వీరభద్ర క్రియేషన్స్‌పై హేమలతా రెడ్డి నిర్మించారు. చిత్రబృందం సమక్షంలో హేమలతారెడ్డి ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ– ‘‘ఇదొక అందమైన ప్రేమకథా చిత్రం. మానవీయ విలువలతో మనసుకు హత్తుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆడియోను, అదే నెలలో సినిమాను రిలీజ్ చేస్తాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సుహాసిని, సుమన్, భానుచందర్, కాశీ విశ్వనాథ్, షాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, కెమెరా: ప్రసాద్ ఈదర. -
వాహనాల విద్యుల్లత
ఒక మహిళ.. పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టడమే వైవిధ్యం. అది కూడా ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపిస్తే అది విశేషం. అందులోనూ మరింత వినూత్నంగా ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపిస్తే.. ఒక సంచలనం అవుతుంది. అలాంటి సంచలనమే హేమలతా అన్నామలై. కోయంబత్తూరుకు చెందిన హేమలతా అన్నామలై ‘యాంపేర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పరిశ్రమ స్థాపించి ఏడాదికి అరవై వేల వాహనాలను తయారు చేస్తున్నారు. తన పరిశ్రమల్లో నలభై శాతం ఉద్యోగాల్లో మహిళలనే నియమించారు. ఈ విజయ ప్రస్థానం వెనుక ఒక కథ ఉంది. హేమలతకు ఓ రోజు జపాన్ నుంచి ఊహించని ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ఆ ఫోన్ కాల్‌తో వెంటనే ఆమె జపాన్‌కు ప్రయాణమయ్యారు. అయితే ఆ ఫోన్ కాల్ వచ్చింది ఆమె భర్త బాల పచ్చయ్యప్ప నుంచే. జపాన్‌లో ఆటోమొబైల్ కాన్ఫరెన్స్‌కు వెళ్లారాయన. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటా అధిపతి ప్రసంగం పచ్చయ్యప్పలో కొత్త ఆలోచనకు తెర లేపింది. వెంటనే భార్యకు ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది, కాబట్టి వెంటనే బయల్దేరమని చెప్పారు. హేమలత ఆ వివరాలను చెప్తూ ‘‘ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ గురించి అధ్యయనం మొదలు పెట్టాను. 2007లో జెనీవాలో జరిగిన సదస్సుకు కూడా వెళ్లాను. అక్కడికి వచ్చిన వాళ్లతో మాట్లాడిన తరవాత నా ప్రాజెక్టుకు ఒక రూపం స్పష్టంగా కళ్ల ముందు మెదిలింది. 2008లోఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ట్రై సైకిళ్లు, వేస్ట్ క్యారియర్ల తయారీ ప్రారంభించాను. పద్దెనిమిదేళ్ల పాటు సింగపూర్‌లో పని చేసిన అనుభవం కూడా తోడైంది. పేద, మధ్య తరగతికి అందుబాటు ధరల్లో వాహనాన్ని తయారు చేయడం, మహిళలు ఉపయోగించడానికి అనువుగా డిజైన్ చేయడం నా ఉద్దేశం. అందులో విజయవంతమయ్యాను. ఇప్పుడు మా కంపెనీ నుంచి ఏడాదికి అన్ని రకాలు కలిపి అరవై వేల వాహనాలు తయారవుతున్నాయి. మా వాహనాలు పర్యావరణ హితమైనవి కావడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారామె.పరిశ్రమ స్థాపించడం, లాభాలార్జించడం వరకే పరిధులు విధించుకోవడం లేదు హేమలత. సరికొత్త డిజైన్ల రూపకల్పన కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని రూపొందించారు. యువ ఇంజనీర్లను నియమించుకుని కొత్త డిజైన్ల కోసం పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారామె. ‘మిత్ర’ పేరుతో ఆమె తయారు చేసిన మూడు చక్రాల వాహనం కూడా అలాంటిదే. ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి ఊరి బయట కంపోస్ట్ యార్డుకు తరలించడానికి అనువుగా తయారైన వాహనంలో 250 కిలోలు, 450 కిలోల కెపాసిటీతో రెండు మోడళ్లు తయారవుతున్నాయి. గ్రామాలు, పట్టణాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వాహనం అది. తమిళనాడులోని రూరల్ డెవలప్మెంట్ విభాగం ఈ వాహనాలను వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పారు హేమలత. – మంజీర -
బోల్డ్ స్టూడెంట్
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా ముఖ్య తారలుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘4 లెటర్స్’. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత మహారాణా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో బోల్డ్‌గా ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ పాత్ర చేశాను. కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నట్లే నా డైలాగ్స్ చాలా సహజంగా ఉండేలా దర్శకులు జాగ్రత్త తీసుకున్నారు. అందుకు రఘురాజ్గారికి థ్యాంక్స్. పాత్ర పరంగా నా లుక్‌లో కొంచెం ఎక్కువ గ్లామర్ కనిపిస్తుంది. బాగా నటించాను. సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. టాలీవుడ్లో నాకు టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను. ఈశ్వర్, టువ మంచి కో స్టార్స్. నిర్మాతలు బాగా సహకరించారు’’ అని అన్నారు. -
మోదీ, బాబులను ఇంటికి సాగనంపండి
విజయనగరం పూల్‌బాగ్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలను కూల్చివేయాలని, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ అఖి ల భారత అధ్యక్షుడు డాక్టర్ హేమలత పిలుపునిచ్చారు. విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి గురజాడ కళాభారతి వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆల్‌ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆది, సోమవారాల్లో విజయనగరంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. మన దేశంలో పేదల కడుపుకొట్టి ధనవంతులకు దోచిపెడుతున్నారన్నారు. బీజేపీ కులంపేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని తెలిపారు. నరేంద్రమోదీ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో దేశ సమైక్యతను దెబ్బతీసేలా మాట్లాడటం అంటే కార్మిక, ఉద్యోగ, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎ గపూర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి జపంతో ప్రజల ఆస్తులను పెట్టుబడుదారులకు అప్పనంగా ఇస్తున్నారన్నారు. కనీసవేతనం అమలు చేయలేని మోదీ, చంద్రబాబులకు పాలించే హక్కులేదని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బరావమ్మ, బేబిరాణి తదతరులు పాల్గొని ప్రసంగించారు. -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ సంథిగూడ గ్రామానికి చెందిన బిడ్డిక హేమలత అనే విద్యార్థిని గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం.. హేమలత గుమ్మలక్ష్మీపురంలో ఉన్న సారథి ఓకేషనల్ జూనియర్ కళాశాలలో ఫస్ట్ఇయర్ చదువుతోంది. గుమ్మలక్ష్మీపురంలోనే నివాసముంటున్న అన్న,వదినల ఇంట్లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లివచ్చేది. గత నెల 29న హేమలత ఇంట్లో చెప్పకుండా తన స్నేహితురాళ్లతో కలిసి ఊరుకు వెళ్లింది. గురువారం తిరిగి ఇంటికి రావడంతో చెప్పకుండా ఎందుకెళ్లావంటూ అన్నావదినలు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన హేమలత ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. కొంతసేపటి తర్వాత ఇంటికొచ్చిన కుటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న హేమలతను గమనించి వెంటనే భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా వైద్యాధికారి మహేశ్వరి వైద్యసేవలందించారు. విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. -
ఒకరికి ఒకరు
మిషాల్ శైలేష్ జైన్, హేమలత జంటగా వి.ఎస్. ఫణీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శుక్రా ప్రొడక్షన్స్ పతాకంపై సంజీవ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సంజీవ్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు సత్యప్రకాశ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత సంజీవ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ ఫణీంద్రగారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేస్తున్నా. సత్యప్రకాశ్ మా సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఒకరికొకరు అనుకునే ప్రేమలో ఒకరు పోతే మరొకరు అనే ధోరణి వచ్చింది. ఇలా ఎందుకు? అని ఆలోచించుకుని రాసుకున్న లవ్ అండ్ యాక్షన్ మూవీ ఇది. చక్కటి కథతో మంచి టీమ్‌తో చేస్తున్నా. ఈ చిత్రంలో సత్యప్రకాశ్గారిని కొత్త కోణంలో చూస్తారు. హర్ష ప్రవీణ్ మంచి సంగీతం అందించారు’’ అన్నారు వీఎస్ ఫణీంద్ర. ఈ చిత్రానికి కెమెరా: అలీ. -
నేరపరిశోధనలో నారీమణి
అత్యాచారాలు.. హత్యలు.. దోపిడీలు.. ఇంకా క్రూరాతి క్రూరమైన లైంగిక నేరాలలో.. నిజ నిర్ధారణ సవాళ్లతో కూడుకున్న పని. అయితే ‘ఫోరెన్సిక్ ఒడంటాలజీ’లో నిష్ణాతురాలైన డా. హేమలతా పాండే ఎంతో నైపుణ్యంతో ఈ అంతుచిక్కని నేరాలను ఛేదిస్తున్నారు. దంత వైద్యశాస్త్రంతో ముడిపడిన ‘ఫోరెన్సిక్ ఒడంటాలజీ’ భారత్‌లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా.. లైంగికదాడులు, ఇతర హింసాత్మక కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్ కేసులతో పాటు క్రీడాకారుల వయసు నిర్ధారణ వివాదాల పరిష్కారానికీ ఈ శాస్త్ర పరిశోధన దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా తొలిసారి ఫోరెన్సిక్ ఒడంటాలజీ వెలుగులోకి వచ్చింది. దీని ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫొటోల్లోని ముఖకవళికలను బట్టి నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్‌కు పాల్పడిన వారిలో ఓ మైనర్ కూడా ఉండటంతో) నిర్ధారించారు.నిర్భయ శరీరంపైæగాయాలను ఈ నిందితుల పలువరసను పోల్చి చూడటం ద్వారా ఈ కేసును పరిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించడంతో పాటు హత్యలు లేదా ఏవైనా ప్రమాదాల్లో ఆనవాలు పట్టలేని విధంగా మారిపోయిన శరీర అవశేషాలతో అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల పరిష్కారంలోనూ ఈ శాస్త్రం ముఖ్యభూమిక పోషిస్తోంది. అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా వేసే వయసు అంచనాలో పదేళ్ల వరకు వ్యత్యా సం ఉండే అవకాశం ఉండగా.. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల వయసు అంచనా ఓ ఏడాది మాత్రమే అటూ ఇటుగా ఉండటంతో ఈ ఒడంటాలజీకి ప్రాధాన్యం చేకూరింది. దేశంలో ఉన్నది పదిమందే! సవాళ్లతో కూడుకున్న ఈ ఫోరెన్సిక్ ఒడంటాలజీ రంగంలో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభను చాటుతున్నారు. ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన అనుభవమున్న వారు దేశవ్యాప్తంగా ఉన్నది కేవలం పదిమందే. వీరంతా కూడా విదేశాల్లో ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) హాస్పటల్లో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్నపుడు హేమలతకైతే అర్హులైన ఫోరెన్సిక్ సైన్స్ బోధకులే ఉండేవారు కాదు. అయినా ఫోరెన్సిక్ డెంటిస్ట్రీపై పాండేకు ఆసక్తి పెరిగింది. ఇంగ్లండ్‌లోని వేల్స్ నుంచి మాస్టర్డిగ్రీ పూర్తిచేశాక, 2013 లో కేఈఎం ఆసుపత్రిలోనే చేరారు. ఫోరెన్సిక్ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత స్థానికంగా, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ కేసుల పరిశోధనలకు పోలీసులకు సహకారాన్ని అందించారు.గుర్తుపట్టలేనంతగా తయారైన శరీరభాగాల కొలతలతో ముందుగా పుర్రె స్వరూపాన్ని రూపొందించుకుని అందులో దంత ద్వయాన్ని, పండ్ల మధ్యనున్న సందులు ఇతర రూపాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్, బంకమట్టి, ఇతర మోడళ్లు, డిజిటల్ పరికరాలతో తయారుచేసుకుంటామని హేమలత తెలిపారు. గ్రామీణ యువతి హత్య కేసు అత్యాచారాలు, లైంగికహింస, హత్యల వంటి కేసుల్లో మరణించిన వారి వయసుతో పాటు, వారు ఆడా, మగా అనేది ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది. హతులు ఫలానావారు అయుండొచ్చని పోలీసులు అనుమానిస్తే తదనుగుణంగా వారి ఫొటోలు, ముఖకవళికలను బట్టి గుర్తించేందుకు వీలుగా పంటి ద్వయాన్ని సిద్ధం చేస్తారు. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బృందం ఓ గ్రూపు ఫొటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్ధారించగలిగారు. ఫొటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిది నెలల తర్వాత డీఎన్ఏ టెస్ట్‌లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్‌నగర్ రేప్ కేస్లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాదాపు పది, పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్ సైన్స్ నిపుణురాలిగా హేమలత సాక్ష్యమిచ్చారు. స్పెషల్ కోర్సు లేదు! భారత్‌లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ’ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఒడొంటాలజీ మాత్రం.. ఓ సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ అసోసియేషన్ కార్యదర్శి డా. ఆషిత్ ఆచార్య నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్‌లోని ఎస్డీఎం కాలేజి ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పటల్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ, పురుషులవిగా ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఇక హైదరాబాద్‌లోని పాణనీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చి ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్ బళ్లా వివిధ కేసుల్లోని దోషుల వయసు నిర్ధారణలో తనవంతు కృషి చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్ధారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్ధారిస్తారు. – కె. రాహుల్ -
ఆ పిటిషన్‌ను విచారణ చేయనవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: పౌర హక్కుల నేత వరవరరావును ఇటీవల పుణే పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన సతీమణి హేమలత దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది. పౌర హక్కుల నేతల అరెస్టు వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, ఈ వ్యాజ్యంపై విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరవరరావుతో పాటుగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, వరవరరావు అరెస్ట్‌పై ఆయన సతీమణి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేసింది. -
సీనియర్ ఫిజీషియన్‌ను పంపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్న తన భర్త, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ, వరవరరావు సతీమణి హేమలత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వరవరరావు ఇంటికి గాంధీ ఆసుపత్రిలో సీనియర్ ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుడిని పంపాలని డీజీపీని ఆదేశించింది. వరవరరావును పరిశీలించి ఆయనకు వైద్య సేవలు అవసరమైతే, వాటిని అందించాలని వైద్యుడిని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో వరవరరావు కూడా ఉన్నారు. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అరెస్ట్ చేసిన వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్‌పై ఆయన సతీమణి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గతవారం విచారణ సందర్భంగా వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని హేమలత హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్మాసనం వరవరరావుకు వైద్యసాయం కోసం పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో హేమలత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం, ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. అరెస్టయిన నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు కూడా తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
వరవరరావుకు వైద్య సాయంపై పిటిషన్ దాఖలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహ నిర్భంధంలో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించే విషయంలో పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలన జరుపుతామని వరవరరావు సతీమణికి హైకోర్టు స్పష్టం చేసింది. వరవరరావుతో పాటు దేశవ్యాప్తంగా పలువురు పౌర హక్కుల నేతల అరెస్టుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనున్న నేపథ్యంలో వరవరరావు అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పూణే పోలీసులు గత నెల 28న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్‌పై కూడా ఆయన సతీమణి హేమలత ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని కోర్టుకు నివేదించారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది సంతోశ్ వాదనలు వినిపిస్తూ, పౌర హక్కుల నేతల అరెస్టులపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరపనున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరుపుతామని తెలిపింది. వరవరరావుకు వైద్య సేవల నిమిత్తం కుటుంబ డాక్టర్‌ను అనుమతించే విషయంపై పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలన జరుపుతామని హేమలతకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఆల్వాల్‌కు చెందిన వెంకటరెడ్డి కుమార్తె హేమలత, హోమియో వైద్యుడు శ్రీకర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. జీడిమెట్ల శ్రేయ ఆర్యన్ అపార్టుమెంట్లో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీకర్ హేమలతను వేధిస్తున్నాడు. దీనిపై హేమలత అతడిని నిలదీయడంతో ఆమెపై దాడి చేసి ఇల్లువదిలి వెళ్లిపోయాడు. దీంతో హేమలత సోదరుడు వీరభద్రారెడ్డి ఇంటికి రావల్సిందిగా పలుమార్లు ప్రాథేయ పడినా ప్రయోజనం కనిపించలేదు. ఈ నెల 8న ఇంటికి వచ్చిన శ్రీకర్ విడాకుల పత్రంపై సంతకం చేయాలని, లేని పక్షంలో పిల్లలను తీసుకు వెళ్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన హేమలత ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. మృతురాలి సోదరుడు వీరభద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందమైన ప్రేమ
వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై కె.గోవర్ధనరావు దర్శకత్వంలో హేమలతా రెడ్డి నిర్మించిన చిత్రం ‘నిన్ను చూస్తూ’. నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్ హీరోలుగా హేమలతా హీరోయిన్గా నటించాయి. సీనియర్ నటులు సుమన్, భానుచందర్, నటి సుహాసిని కీలక పాత్రలు చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఓ అందమైన ప్రేమకథతో ఈ సినిమా తీశాం. మానవతా విలువలతో మనసుకు హత్తకునే సన్నివేశాలతో చిత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు గోవర్ధనరావు కథ చెప్పినదానికంటే బాగా తీశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్. -
చాలా స్పెషల్
నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నే చూస్తు’. కె.గోవర్ధన్‌రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్నారు. సుహాసిని, సుమన్, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హేమలతా రెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సంగీత దర్శకుడు రమణ్ రాథోడ్ అద్భుతమైన పాటలు అందించారు. ఈ చిత్రానికి ‘నిన్నే చూస్తు’ టైటిల్ సాంగ్ చాలా ప్రత్యేకం. మలేషియాలోని అందమైన లొకేషన్స్‌లో తెరకెక్కించాం. పాట అవుట్‌పుట్ చూసి యూనిట్ సభ్యులు సంతోషించారు. నృత్యదర్శకురాలు రేఖ కొరియోగ్రఫీ మరో హైలైట్. త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. సన, కాశీ విశ్వనాథ్, సాయాజీ షిండే, ‘వెన్నెల’ కిశోర్, రజిత తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), శంకర్ (సెకండ్ కెమెరామెన్). -
మోదీ వస్తే.. కుటుంబంతో ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై : తన తల్లి, ఇద్దరు సోదరిల ఆత్యహత్యకు కారణమైన పుదుచ్చేరిలోని అరవింద్ ఆశ్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినట్లయితే మిగిలిన కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని జార్ఖండ్‌కు చెందిన హేమలత హెచ్చరించారు. చెన్నైలో శనివారం ‘అమ్మ ద్విచక్ర వాహన పథకం’ను ప్రారంభించిన మోదీ ఆదివారం పుదుచ్చేరిలో అర వింద్ ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హేమలత మీడియాకు చెప్పిన వివరాలు.. పుదుచ్చేరి అరవింద్ ఆశ్రమంలో హేమలత, ఆమె నలుగురు సోదరిలు జయశ్రీ, అరుణశ్రీ, రాజ్యశ్రీ, నివేదిత ఉండేవారు. 2002లో ఆశ్రమ నిర్వాహకులు, సభ్యు లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వీరు ఆరోపించడంతో నిర్వాహకులు వీరిని బలవంతంగా బయటకు పంపారు. దీంతో వీరి కుటుంబం 2014 డిసెంబర్ 18వ తేదీ తెల్ల వారుజామున హేమలత, అరుణశ్రీ, నివేదిత, జయశ్రీ, రాజ్యశ్రీ వారి తల్లిదండ్రు లు ప్రసాద్, శాంతిదేవితో కలసి పుదుచ్చేరి సముద్రంలోకి దిగారు. ఈ సంఘటనలో అరుణశ్రీ (52), రాజ్యశ్రీ (48), తల్లి శాంతిదేవి (78) చనిపోయారు. అలల్లో కొట్టుమిట్టాడుతున్న నివేదిత, హేమలత, జయశ్రీ, తండ్రి ప్రసాద్‌ను జాలర్లు రక్షించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమకు తిరిగి ఆశ్రమంలో నివసించే అవకాశం కల్పించనందుకు బాధితులు అనేక పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం పుదుచ్చేరిలో అరవింద్ ఆశ్రమ కార్యక్రమానికి వస్తే తామంతా ఆత్మ హత్య చేసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
మహిళా టాపర్‌గా హేమలత
మారుమూల పల్లెటూరు... సాధారణ వ్యవసాయ కుటుంబం... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం... ఇవేవీ ఆమె లక్ష్యానికి అడ్డంకి కాలేదు! స్వయంకృషితో ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే కుటుంబం అండగా నిలిచింది! సివిల్ సర్వీసెస్ తర్వాత అంత అత్యున్నతమైన ఉద్యోగాన్ని సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి! తొలిసారిగా ఒక గ్రూప్–1 టాపర్‌ను సమాజసేవకు అందించిన కనుగులవానిపేటలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి! ఇంతటి భావోద్వేగాలకు కారణమైన ఆమె పేరు కనుగుల హేమలత! గ్రూప్–1 (2011)లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. మహిళల్లోనే టాపర్‌గా నిలిచింది. సిక్కోలు సిగలో మరో మణిపూసగా మెరిసింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం రూరల్ మండలంలో ఇప్పిలి శివారు గ్రామమైన కనుగులవానిపేట ముద్దుబిడ్డే హేమలత! ఆమె తండ్రి ప్రసాదరావు, తల్లి సుజాత. వారిది వ్యవసాయ కుటుంబం. ఆరోగ్యపరమైన కారణాల వల్ల ప్రసాదరావు పాఠశాల స్థాయిలో అర్ధంతరంగా చదువు ముగించాల్సి వచ్చింది. ఆయన సోదరులంతా విద్యాభ్యాసం ద్వారానే మంచి స్థానంలోకి వెళ్లారు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, సమాజసేవ చేయాలి అనే కలలను తన పిల్లల ద్వారా సాకారం చేయాలని తపించారు. అందుకు తగ్గట్లే హేమలత సహా ముగ్గురు పిల్లలూ గౌరవనీయమైన ఉద్యోగాలు సాధించారు. ప్రసాదరావు పెద్ద కుమార్తె హైమావతి ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు జగదీశ్వరరావు జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని దేవరకొండలోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె హేమలత గ్రూప్–1లో టాపర్‌గా నిలిచారు. ఈ ర్యాంకు డిప్యూటీ కలెక్టరు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజసేవ చేయడానికి, తద్వారా ఉన్నతస్థాయిలో తగిన గుర్తింపు పొందడానికి అవకాశం రావడంతో హేమలత కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ... కనుగులవానిపేటలో ప్రసాదరావు కుటుంబానికి మూడెకరాల మెట్టు భూమి ఉంది. గతంలో చిన్న రైస్‌మిల్లు కూడా ఉండేది. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబపోషణ చూసేవారు. కానీ ఏదేమైనా బాగా చదువుకోవాలని పిల్లలకు నూరిపోసేవారు. తండ్రి మనస్సును అర్థం చేసుకున్న పిల్లలు ముగ్గురూ కష్టపడి చదివారు. హేమలత ప్రాథమిక విద్యాభ్యాసం కనుగులవానిపేట పాఠశాలలోనే చదివారు. అయితే గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువు బాగుంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. దీంతో తండ్రి ప్రోత్సాహంతో హేమలత ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సీటు సాధించింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అక్కడే విద్యాభ్యాసం సాగింది. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో 2001 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు వచ్చింది. అప్పుడే తోటి స్నేహితుల మధ్య సివిల్స్, గ్రూప్–1 గురించి చర్చ వచ్చేదని, సమాజసేవ నేరుగా చేసే అవకాశం ఆ ఉద్యోగాల్లో ఉంటుందనే విషయం తెలిసిందని హేమలత చెప్పారు. కానీ ఇంటర్ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్ ఏడాది చేసినా ఆశించిన ర్యాంకు రాలేదు. అక్క హైమావతి ప్రోత్సాహంతో టీచర్ ట్రైనింగ్ వైపు దృష్టి పెట్టారు. 2002లో శ్రీకాకుళం డైట్లో సీటు సాధించారు. 2004లో కోర్సు పూర్తి చేస్తుండగానే డీఎస్సీ–2003 నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షల్లోనూ రాష్ట్రస్థాయిలో మహిళా టాపర్‌గా హేమలత నిలిచారు. 2005లో సెకండ్‌గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఎల్ఎన్ పేట మండలం బొత్తాడసింగి పాఠశాలలో, తర్వాత 2012 వరకూ ఎచ్చెర్ల మండలంలో పనిచేశారు. ఒకవైపు టీచర్ ఉద్యోగం చేస్తూనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కూడా పూర్తి చేశారు. 2012లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పార్వతీపురంలో పనిచేస్తున్నారు. పదేళ్ల పరిశ్రమ ఫలించింది సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు 2007 సంవత్సరంలోనే హేమలత ప్రిపరేషన్ ప్రారంభించారు. గ్రూప్–1 2007 నోటిఫికేషన్లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ దశ వరకూ వెళ్లారు. త్రుటిలో అవకాశం చేజారింది. తర్వాత మరో రెండు నోటిఫికేషన్లలోనూ ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2011 గ్రూప్–1 నోటిఫికేషన్లో దరఖాస్తు చేశారు. 2012లో మెయిన్స్, ఇంటర్వ్యూ ఆమె బాగానే చేశారు. కానీ న్యాయపరమైన వివాదాల వల్ల ఫలితాలు రద్దు చేసినా ఆమె నిరాశపడలేదు. 2016 సెప్టెంబర్‌లో మరోసారి మెయిన్స్ పరీక్షలు, ఇటీవలే నిర్వహించిన ఇంటర్వ్యూలో బాగానే అటెమ్ట్ చేశానని, తప్పక మంచి పోస్టు వస్తుందని ఆశించానని హేమలత చెప్పారు. ఆశించినట్లే రెండో ర్యాంకు, మహిళలలో ప్రథమ ర్యాంకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. భర్త నుంచి ప్రోత్సాహం హేమలత భర్త కె.తవిటినాయుడు ప్రస్తుతం విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ప్రణవ్ ఉన్నాడు. తన విజయంలో తల్లిదండ్రులు, సోదరి, సోదరుడుతో భర్త ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని హేమలత చెప్పారు. గ్రామీణ ప్రాంతవారమని నిరాశ వద్దు ‘ఉన్నత ఉద్యోగాల సాధనకు గ్రామీణ నేపథ్యం ఏమాత్రం అడ్డంకి కాదు. గ్రామీణ ప్రాంతవారమని అమ్మాయిలకు నిరాశ వద్దు. కష్టపడి, ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అభిరుచిని బట్టి ఏ రంగాన్ని ఎంచుకున్నా లక్ష్యం సాధించేవరకూ విశ్రమించకూడదు.’ – కనుగుల హేమలత, గ్రూప్–1 విజేత -
నిన్నే చూస్తూ..
కథానాయికగా ఓ వెలుగు వెలిగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కూడా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నారు సుహాసిని. ఇటీవల విన్న కథల్లో ‘నిన్నే చూస్తూ’ నచ్చి, ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన నటుడు శ్రీకాంత్ హీరోగా, హేమలత (బుజ్జి ) హీరోయిన్గా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కె. గోవర్ధన్ రావు దర్శకుడు. ఈ చిత్రం మెదటి షెడ్యూల్ అమలాపురంలో జరుగుతోంది. నిర్మాత హేమలతారెడ్డి మాట్లాడుతూ – ‘‘ఇందులో సుహాసినిగారు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ కథ విని సుహాసినిగారు హిట్ మూవీ అవుతుందన్నారు. అలాగే లేడీ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని కూడా ఆమె అభినందించారు’’ అన్నారు. ‘‘మంచి కథ, కథనాలు కుదిరాయి’’ అని దర్శకుడు తెలిపారు. భానుచందర్, సన, కాశీ విశ్వనాథ్, రజిత, ‘వెన్నెల’ కిశోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్. -
నా సపోర్ట్ ఆ అమ్మాయికే...
నూతన నటుడు శ్రీకాంత్, హేమలత (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. భానుచందర్, సుమన్, సన, కాశీ విశ్వనాధ్ ముఖ్యపాత్రల్లో కె. గోవర్ధన్‌రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు మల్కాపురం శివకుమార్, హేమలత కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ‘మల్టీ డైమన్షన్’ వాసు క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. అయోధ్య కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. హేమలతారెడ్డి మాట్లాడుతూ– ‘‘మేం నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఓ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 20న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అతిథిగా కాకుండా, ఫుల్‌లెంగ్త్ రోల్ చేస్తున్నా. హేమలతకి సినిమా పట్ల చక్కని అభిరుచి ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా’’ అన్నారు భానుచందర్. ‘‘ఆంధ్ర, తెలంగాణలలో 50–60 రోజులు షూటింగ్ చేస్తాం’’ అన్నారు గోవర్ధన్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, కెమెరా: ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్). -
నిలకడగా ఉన్న మార్క్సిజమ్
► సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రపంచంలో అన్ని సిద్ధాతాలు మారినా... ఒక్క మార్క్సిజమ్ మాత్రం నిలకడగా ఉందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత అన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ సభ నిర్వహించారు. సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. దీనికి విముక్తి ఒక సోషలిజంతోనే సాధ్యమన్నారు. దోపిడీ సమాజంలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. 2016 నవంబర్ 07 నుంచి ప్రపంచమంతా అక్టోబర్ విప్లవ శతజయంతి సభలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల వ్యవస్థ అంతంకాక తప్పదన్నారు. 1917లో ప్రపంచంలో మొదటిసారిగా రష్యాలో కార్మికవర్గం నాయకత్వాన విప్లవం వచ్చిందని గుర్తు చేశారు. కార్మికవర్గమే అన్ని పోరాటాలకు ముందుంటోందని తెలిపారు. ఆ పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోగలుగుతున్నామని తెలిపారు. ఏ సిద్ధాంతం ప్రజల సమస్యలను తీర్చలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. ప్రజా, కార్మికుల సమస్యలు పరిష్కరించే సత్తా తమకే ఉందని తెలిపారు. ఉద్యమాలతోనే హక్కులను, సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, జిల్లా కార్యదర్శి రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి, నాయకులు పాండురంగారెడ్డి, వెంకటరాజ్యం, వాజిద్, నాగేశ్వర్రావు, సాయిలు, యాదవరెడ్డి, పెంటయ్య, కోటేశ్వర్రావు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : అనంతపురం సత్యసాయినగర్‌లో డ్రైవర్ సూర్యనారాయణ భార్య హేమలత(33) శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీటౌన్ సీఐ మురళీకష్ణ తెలిపారు. సూర్యనారాయణ మొదటి భార్య మరణించడంతో హేమలతను రెండో పెళ్లి చేసుకున్నాడు. తొలి భార్యకు ఇద్దరు, రెండో భార్యకు ఒక కుమార్తె సంతానం. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న సూర్యనారాయణ తరుచూ ఆమెను వేధిస్తుండేవాడన్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వివరించారు. కాగా హేమలత మతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్రీ టౌన్ సీఐ మురళీకష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు మేయర్‌గా హేమలత
చిత్తూరు అర్బన్: మేయర్ కుర్చీని రెండోమారు మహిళ అధిష్టించారు. 17 నెలలుగా ఖాళీగా ఉన్న మేయర్ పదవి ఎట్టకేలకు భర్తీ అయింది. అప్పటివరకు మేయర్‌గా ఉన్న అనురాధ హత్యకు గురవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. బీసీ-మహిళకు రిజర్వు అయిన మేయర్ స్థానంలో పురుషుడు పాలన సాగించడంపై మహిళా కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి చిత్తూరులో ఖాళీగా ఉన్న 33, 38వ వార్డులకు ఉప ఎన్నిక నిర్వహించింది . 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దివంగత మేయర్ అనురాధ కోడలు హేమలత చేత తొలుత ఇన్చార్జ్ మేయర్ ఆర్.సుబ్రమణ్యం కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిల్ హాలుకు చేరుకున్న కలెక్టర్ కార్పొరేటర్ల హాజరును తనిఖీ చేసి కోరం ఉన్నట్లు ప్రకటించారు. మేయర్ పదవికి హేమలతను టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించి విప్ జారీ చేయడంతో ఇన్చార్జి మేయర్ ప్రతిపాదించగా కార్పొరేటర్ కిరణ్ బలపరిచారు. ఎవరూ పోటీ లేకపోవడంతో హేమలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. -
విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం తలుపూరులో రమాదేవి, శ్రీనివాసులు దంపతుల కుమార్తె హేమలత(14) అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ధరణికిశోర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే హేమలత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేదన్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున కడుపునొప్పి ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది విష గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుందన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చిన్నారి సురక్షితం
– అనుష్క కిడ్నాప్ కేసును ఛేదించిన కదిరి పోలీసులు కదిరి : కదిరి మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన వరాలు, ఆంజనేయులు దంపతుల ఐదేళ్ల కుమార్తె అనుష్క కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఒకప్పుడు కుటాగుళ్లలోనే కాపురముండి, ప్రస్తుతం జమ్మలమడుగులో ఉంటున్న నాగమణి తన కుమార్తె హేమలతతో కలిసి డబ్బు కోసం చిన్నారిని గురువారం తెల్లవారుజామున కిడ్నాప్ చేసింది. తర్వాత ఏం చేయాలో తెలియక ధర్మవరంలో ఉంటున్న అల్లుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లింది. ఈ చిన్నారి ఎవరని అతను ప్రశ్నించాడు. తనకు తెలిసిన వారి అమ్మాయి అని, వెంటబడగా తీసుకొచ్చామని నమ్మబలికింది. కాగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కదిరి డీఎస్పీ రామాంజనేయులు పట్టణ ఎఐ మధుసూదన్‌రెడ్డి నేతత్వంలో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారి ధర్మవరంలో ఉందని తెలుసుకున్న ఈ బందం అక్కడికి వెళ్లింది. నిందితురాలు నాగమణి, ఆమె కుమార్తె, అల్లుణ్ని అదుపులోకి తీసుకుంది. చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
పుట్టెడు దు:ఖంలోనూ పరీక్ష రాసిన విద్యార్థినులు
రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయిన బాధతో ఒకరు, అనారోగ్యంతో తండ్రి చనిపోయిన బాధతో మరొకరు పుట్టెడు దుఃఖంలోనూ శుక్రవారం పదో తరగతి పరీక్ష రాశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం చెన్నడం గ్రామానికి చెందిన ఉల్లూరి చందన.. నగరం గ్రామంలోని శ్రీచైతన్య స్కూలులో పదో తరగతి చదువుతూ మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరవుతృంది. ఆమె తల్లి హేమలత (35) ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమలత మృత్యువాత పడింది. ఆమె మృతదేహాన్ని గురువారం స్వగ్రామం తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న చందన ఆ బాధను దిగమింగుకుని శుక్రవారం పరీక్షకు హాజరైంది. కాగా, మాకనపాలెం గ్రామానికి చెందిన బొక్కా దుర్గాభవాని లూటుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. ఆమె తండ్రి బొక్కా వెంకటపతి (60) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. తండ్రి చనిపోయిన బాధతో ఉన్న దుర్గాభవాని కూడా అంత బాధలోనూ మొక్కవోని దీక్షతో పదో తరగతి పరీక్ష రాసింది. -
ఆప్ ఆయే... బహార్ ఆయీ...
హైదరాబాదీ..హేమలత: ఆమె రాకతో సినీ సంగీత ప్రపంచంలోకి కొత్త వసంతం వచ్చింది. అప్పటికే గానకోకిల లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోంస్లే బాలీవుడ్‌ను ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో పసితనం వీడక ముందే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే ‘తూ ఇస్ తరహ్ మేరే జిందగీ మే..’ అంటూ శ్రోతలను ఓలలాడించిన ఆ గొంతు పేరు హేమలత. అసలు పేరు లతా భట్. హైదరాబాద్‌లోని సంప్రదాయ రాజస్థానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. కొద్దికాలానికే ఆమె కుటుంబం కోల్‌కతా చేరుకుంది. బాల్యం అక్కడే గడిచింది. చిన్ననాటి నుంచే హేమలత సంగీతమంటే చెవి కోసుకునేది. ఆమె తండ్రి జయ్‌చంద్ భట్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడే అయినా, ఛాందసుడైన ఆయనకు కూతురు పాడటం ఇష్టం ఉండేది కాదు. అయినా, ఆమె రహస్యంగా పూజా పెండాల్స్ వద్ద పాడేది. హేమలత తండ్రి జయ్‌చంద్ భట్ శిష్యుడు గోపాల్ మల్లిక్ ఆమె ప్రతిభ గుర్తించాడు. జయ్‌చంద్‌ను ఒప్పించి, కోల్ కతాలోని రవీంద్ర స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఆమె చేత పాడించాడు. అప్పుడామె వయసు ఏడేళ్లు మాత్రమే. అక్కడి నుంచి ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కలకత్తా నుంచి ఆమె కుటుంబం 1966లో బాంబేకు తరలి వచ్చింది. అక్కడే ఆమె ఉస్తాద్ అల్లారఖా ఖాన్, ఉస్తాద్ రియాజ్ ఖాన్ వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ఏసుదాస్‌తో అత్యధిక హిందీ గీతాలు పాడిన ఘనత గానగంధర్వుడు కె.జె.ఏసుదాస్‌తో కలసి అత్యధిక సంఖ్యలో హిందీ గీతాలు పాడిన ఘనత హేమలతకే దక్కుతుంది. హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, రాజస్థానీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళ, మలయాళ, డోగ్రీ, కొంకణి, ప్రాకృత, సంస్కృత వంటి స్వదేశీ భాషలు, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు కలిపి మొత్తం 38 భాషల్లో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఎస్.డి.బర్మన్, మదన్మోహన్, సలిల్ చౌదరి, ఖయ్యాం, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్‌జీ-ఆనంద్జీ, రాజ్‌కమల్, ఉషా ఖన్నా, రవీంద్ర జైన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో చిరస్మరణీయమైన గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ముకేశ్, మన్నా డే, మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, ఏసుదాస్, శైలేంద్ర సింగ్, సురేశ్ వాడ్కర్ వంటి గాయకులతో కలసి యుగళగీతాలతో ఉర్రూతలూగించింది. సినీగీతాలే కాదు, భక్తిగీతాల ప్రైవేట్ ఆల్బంలు, వివిధ దేశాల్లో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కచేరీలూ ఆమెను లక్షలాది మంది అభిమానులకు చేరువ చేశాయి. ‘చిత్‌చోర్’లో పాడిన ‘తూ జో మేరే సుర్ మే...’ పాట 1977లో ఆమెకు ‘ఫిలింఫేర్’ ఉత్తమ గాయని అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఫకీరా’, ‘సునయనా’, ‘ఆప్ ఆయే బహార్ ఆయీ’, ‘ఆప్‌తో ఐసా న థే’ వంటి సినిమాల్లో హేమలత పాడిన పలు హిట్ పాటలు సంగీతాభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అమెరికాలో మ్యూజిక్ అకాడమీ అమెరికాలో మ్యూజిక్ అకాడమీ స్థాపించిన ఏకైక సినీ గాయని హేమలత మాత్రమే. ప్రపంచ సిక్కుల సంఘం, పంజాబ్ ప్రభుత్వాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్ అకల్ తక్త్‌లో 1999లో జరిగిన ఖల్సా పంత్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా ‘గుర్మత్ సంగీత్’ గీతాలను వాటి అసలు రాగాలలో ఆలపించే అవకాశం లభించింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌ల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని అందుకుంది. - పన్యాల జగన్నాథదాసు -
ఎటూ తేలని 'చిన్నారి' పంచాయితీ
ఇద్దరు తల్లుల నడుమ నలిగిపోతున్న 2 సంవత్సరాల చిన్నారి పంచాయితీ ఎటూ తేలకపోవడంతో స్త్రీ శిశుసంక్షేమ శాఖాధికారులు శుక్రవారం బిడ్డను బుద్ధవరంలోని చైల్డ్కేర్సెంటరుకు అప్పగించారు. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న చిన్నారి వివాదం ముదిరిపాకాన పడడంతో తిరువూరు పోలీసుస్టేషనులో గురువారం పంచాయితీ చేసిన విషయం విదితమే. అయితే చిన్నారి కోసం కన్నతల్లి హేమలత, పెంచిన తల్లి విమల ఎవరికి వారే పట్టుదలకు పోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని ఐసీడీఎస్ సీడీపీవో అంకమాంబను కోరారు. దీంతో ఇరువురి వాదనల్లో నిజమెంతో తేలేవరకు ఆ బిడ్డను చైల్డ్ కేర్ సెంటరుకు అప్పగించామని సీడీపీవో అంకమాంబ తెలియజేశారు.కాగా చైల్డ్‌కేర్ సెంటరుకు బిడ్డను అప్పగిస్తారని తెలియడంతో హేమలత, విమలల మధ్య రాజీకుదర్చడానికి కొందరు పెద్దలు చేసిన ప్రయత్నం విఫలమయింది. పత్తాలేని మధ్యవర్తులు... హేమలత బిడ్డను పెంచుతామని డబ్బులు తీసుకున్న తిరువూరుకు చెందిన విజయనాధం అనే వ్యక్తి కనిపించకపోవడంతో సమస్య జఠిలమైంది. విజయనాథం నుంచి ఆ బిడ్డను తీసుకున్న మరో వ్యక్తి తన సమీపబంధువైన విమలకు సంతానం లేకపోవడంతో పెంపకం నిమిత్తం అప్పగించారు. అయితే తాము పెంచుకుంటున్న పాపను విక్రయించడానికే హేమలత మళ్లీ వివాదం సృష్టిస్తోందని విమల ఫిర్యాదులో పేర్కొంది. పాపం పసిపాప.... ఆ పాపకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తనను అల్లారు ముద్దుగా పెంచుతున్న వారితో బోసినవ్వులు నవ్వుతూ, నవ్విస్తూ 19 నెలలు గడిపింది. దేవుడిచ్చిన వరంగా భావించిన ఆ దంపతులు ఈ పాపను అపురూపంగా పెంచుకున్నారు. విధి ఎంత విచిత్రంగా ఉంటుందటే ఆ పాపతో పాటు పెంచుకుంటున్న వారిలోనూ వేదన మిగిల్చింది. పాప తన కూతురంటూ వచ్చిన తల్లిలోనూ అదే వేదన మిగిలింది. ఈ పాపను ఎవరి వద్ద ఉంచాలనేది అధికారులతో పాటు ఎవరూ తేల్చి చెప్పలేని పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.... నాలుగేళ్ల క్రితం తిరువూరుకు చెందిన బల్లిపర విజయనాధంకు నెల్లూరుకు చెందిన హేమలత చెన్నైలో పరిచయం అయింది. ఆమె వద్ద ఉన్న తొమ్మిది నెలల కుమార్తెను విజయనాధంకు ఇచ్చి కనిపిచకుండా పోయింది. విజయనాధం ఆ పాపను తిరువూరులోని గద్దల సందీప్, విమల దంపతులకు ఇచ్చాడు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. విజయనాధం ఈ పాపను ఇవ్వడంతో దేవుని ప్రసాదమని భావించి తీసుకున్నారు. నా బిడ్డను నాకివ్వండి... పందొమ్మిది నెలల్లో రెండుసార్లు హేమలత విమల దంపతుల వద్దకు వచ్చింది. తన కుమార్తెను తనకు ఇవ్వాలని కోరింది. అయితే వారు ఆమె కోరికను తిరస్కరించారు. నాలుగు నెలల క్రితం మరోసారి వచ్చిన హేమలత ఇలాగే అడిగి వెళ్లిపోయింది. అయితే వారం రోజుల క్రితం తిరువూరు వచ్చి తన కుమార్తెను తనకు ఇవ్వాలంటూ గొడవ చేసింది. దీంతో విమల దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పంచాయితీ ఎటూ తేలకపోవడంతోనూ, కన్నతల్లినని చెప్పుకుంటున్న హేమలత వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పాపను పోలీసులు ఐసీడీఎస్ వారికి అప్పగించారు.