
హేమలత (ఫైల్)
సాక్షి, అల్లిపురం (విశాఖ): బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విశాఖలోని అల్లిపురం, గౌరీవీధికి చెందిన హేమలత (11) బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో వచ్చిన వార్తకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పటల్ వారు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. చిట్టితల్లికి వైద్యం అందజేయాలని ముఖ్యమంత్రి చెప్పడంతో చాలామంది దాతలు స్పందించి హేమలత కుటుంబానికి అండగా నిలిచారు. బాలిక ఆరోగ్యం బుధవారం విషమించడంతో కొద్దిసేపటికే ఆమె మృతి చెందిందని హేమలత తల్లిదండ్రులు అప్పలరాజు, అమ్మాజీ తెలిపారు.
బాధితుల కుటుంబాలకు రూ.13 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలు, అత్యాచార బాధితులు, క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. జిల్లాకు రూ.కోటి చొప్పున 13 జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) బుధవారం ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment