
మర్రిపాలెం: ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ కావడంతో విశాఖలో ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. జువాలజీ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యింది.
దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి.. కిందకు దించేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.