యువకుడితో లవ్‌ ఎఫైర్‌.. భర్తకు తెలియడంతో.. | Married Woman Young Man Commits Suicide Kasimkota Visakhapatnam | Sakshi
Sakshi News home page

యువకుడితో లవ్‌ ఎఫైర్‌.. భర్తకు తెలియడంతో..

Published Thu, Mar 31 2022 9:20 PM | Last Updated on Thu, Mar 31 2022 9:20 PM

Married Woman Young Man Commits Suicide Kasimkota Visakhapatnam  - Sakshi

సాక్షి, కశింకోట (విశాఖపట్నం): మండలంలోని మోసయ్యపేట శివారు గోకివానిపాలెంలో గురువారం వివాహిత సహా యువకుడు అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ గ్రామాల నుంచి బైక్‌పై వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు. రైతులు గుర్తించి సమాచారం అందివ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి సీఐ జి.శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం.. గోకివానిపాలెంలో బుచ్చియ్యపేటకు చెందిన మజ్జి శ్రీనివాసరావు(25), కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన వివాహిత చెల్లపల్లి హేమలత(23) విగత జీవులుగా పడి ఉన్నారు.

శ్రీనివాసరావు చోడవరంలోని ఒక షోరూంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. హేమలత గృహిణి.  వీరు 2017లో చోడవరం కళాశాలలో చదివేవారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం, తరచుగా సెల్‌ఫోన్‌లో సంభాషిస్తున్న విషయం భర్త భాస్కరరావు, హేమలత తండ్రికి తెలియడంతో వారు తాజాగా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి శ్రీనివాసరావుతో బైక్‌పై గోకివానిపాలెం గ్రామం వద్ద చేరుకొని ఆత్మహత్యకు పాల్పడి విగత జీవులుగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానిక రైతులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

చదవండి: (దుబాయ్‌కి వెళ్లాలని భార్యతో గొడవ.. వసంత తండ్రికి ఫోన్‌చేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement