kasimkota
-
యువకుడితో లవ్ ఎఫైర్.. భర్తకు తెలియడంతో..
సాక్షి, కశింకోట (విశాఖపట్నం): మండలంలోని మోసయ్యపేట శివారు గోకివానిపాలెంలో గురువారం వివాహిత సహా యువకుడు అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ గ్రామాల నుంచి బైక్‌పై వచ్చి ఈ చర్యకు పాల్పడ్డారు. రైతులు గుర్తించి సమాచారం అందివ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి సీఐ జి.శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం.. గోకివానిపాలెంలో బుచ్చియ్యపేటకు చెందిన మజ్జి శ్రీనివాసరావు(25), కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన వివాహిత చెల్లపల్లి హేమలత(23) విగత జీవులుగా పడి ఉన్నారు. శ్రీనివాసరావు చోడవరంలోని ఒక షోరూంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. హేమలత గృహిణి. వీరు 2017లో చోడవరం కళాశాలలో చదివేవారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం, తరచుగా సెల్ఫోన్లో సంభాషిస్తున్న విషయం భర్త భాస్కరరావు, హేమలత తండ్రికి తెలియడంతో వారు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి శ్రీనివాసరావుతో బైక్‌పై గోకివానిపాలెం గ్రామం వద్ద చేరుకొని ఆత్మహత్యకు పాల్పడి విగత జీవులుగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానిక రైతులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చదవండి: (దుబాయ్‌కి వెళ్లాలని భార్యతో గొడవ.. వసంత తండ్రికి ఫోన్‌చేసి..) -
పంచదార చిలుకలు.. తియ్యటి వేడుక చేసుకుందాం..
కశింకోట (అనకాపల్లి)/విశాఖ జిల్లా: పంచదార చిలుకలు తీపిని పంచుతాయి. పిల్లలు మొదలుకొని పెద్దలను సైతం ఆకర్షిస్తాయి. ఆత్మీయత, అభిమానాన్ని పంచుతాయి. పంచదార చిలుకలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాలు, తీర్థాలు జరగవనే చెప్పాలి. కొందరు వివాహాలు, ఉపనయనాలలో కూడా వీటిని సంప్రదాయంగా సారె గాను, బంధువర్గానికి పంపిణీకి వినియోగిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పంచదార చిలుకల తయారీకి మండల కేంద్రం కశింకోట ప్రసిద్ధి. ఇక్కడి వడ్డి వీధిలో ఏళ్ల తరబడి పంచదార చిలుకల తయారీయే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన వడ్డెర కులానికి చెందిన సుమారు 20 కుటుంబాలు పంచదార చిలుకలను తయారు చేసి జీవనం సాగించేవారు. అయితే ఆధునికంగా రంగుల స్వీట్లు ప్రవేశించడంతో వీటికి క్రమేపి ఆదరణ తగ్గింది. దీంతో కొంతమంది పత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగు కుటుంబాల వారు మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి కొనసాగిస్తున్న వృత్తిని మానుకోలేక, మరో పని చేతకాక ఇదే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తయారీదారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని బుచ్చియ్యపేట మండలం వడ్డాది, యలమంచిలి మండలం కొప్పాక, పాయకరావుపేట, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో కూడా వీటిని తయారు చేస్తారు. ప్రధానంగా సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు, తీర్థాల్లో వీటికి గిరాకీ ఉంటుంది. దీంతో ఉత్సవాలకు ముందు వీటిని తయారు చేసి సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి, ఆ తర్వాత జిల్లాలో జరిగే తీర్థాలు, ఉత్సవాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. పంచదార చిలుకలను ఆకర్షణకు వివిధ రకాలుగా తయారు చేస్తారు. తాజ్‌మహాల్, పన్నీరు బుడ్డీ, ఆలయ గోపురాలు తదితర ఆకారాల్లో తయారు చేస్తారు. వీటిలో ఎక్కువగా రామచిలుకల ఆకారంలోనే తయారు చేస్తారు. రూ.10 నుంచి వంద రూపాయల వరకు వీటిని విక్రయిస్తారు. పంచదార చిలుకల తయారీలో నిమగ్నం చిలుకల తయారీ... చిలుకల తయారీకి ఎక్కువ సరుకులు అవసరం లేదు. పంచదార, ఆకర్షణకు రంగు ఉంటే చాలు. పంచదారను సరిపడిన నీరు పోసి పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆకర్షణ కోసం రంగు వేసి పాకాన్ని ముందుగా చెక్కలతో తయారు చేసిన కావలసిన పరిమాణం, ఆకారంలో ఉన్న అచ్చుల్లో పోస్తారు. కొంతసేపు అచ్చుల్లోనే ఆరిన తర్వాత అచ్చుల నుంచి బయటకు తీసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. కిలో చిలుకల తయారీకి రూ.85 ఖర్చు అవుతుంది. దీనిలో పంచదార, రంగు, కట్టెలు లేదా గ్యాస్ ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. పాకం సరిగా లేకపోతే చిలుకలు తయారు కావు. ముక్కలు అవుతాయి. దీంతో వాటిని మళ్లి మరిగించి పాకం సిద్ధం చేసి చిలుకలు తయారు చేయవలసి వస్తుంది. దీనివల్ల తరుగు ఏర్పడి పాకం తగ్గిపోయి నష్టం వస్తుంది. సంక్రాంతి స్పెషల్ చిలకలు సంక్రాంతి సంబరాలు, తీర్థాల రోజుల్లోనే పంచదార చిలుకలను తయారు చేస్తాం. కిలో చిలుకల తయారీకి రూ.85 అవుతుంది. జిల్లాలో జరిగే ఉత్సవాలు, తీర్థాలకు తీసుకెళ్లి విక్రయిస్తాం. ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. సంక్రాంతి రోజుల్లోనే తమకు ఆదాయం సమకూరుతుంది. మిగిలిన రోజుల్లో ప్రత్యామ్నాయం పనులు వెతుక్కొవలసి వస్తోంది. –శ్రీకాకుళపు కుమార్, పంచదార చిలుకల తయారీదారు, కశింకోట. -
ఆ కుంచె.. సౌందర్యం చిలికించే..
తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ, చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు ! ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి ఆయన పొట్టిగా ఉన్నా గీసిన గట్టి చిత్రాలు ఎన్నో ఆయన నిరాడంబరుడే కానీ ఆయన చిత్రాల్లో నాయకి, నాయకులంతా ఆడంబరులే. ఆయన చిత్రకళా యోగే కాదు, భోగి కూడా ఆయన వాస్తవం కంటే – ఊహల్లో ఎక్కువ జీవిస్తారు. ఆయనకు పగలే రాత్రి, రాత్రే పగలు. ఆయనకు పగలు విశ్రాంతి –నిశీధి నిశ్శబ్దంలో కళాసాధన. ఆయన జీవికకు సరిపడా ‘సిరి ’లేని, కళా శ్రీమంతుడు. ఆయన ఎవరికీ అభిమాని కాదు కానీ, ఆయనకు లక్షల్లో కళాభిమానులున్నారు. ఆయన చిత్రాలు తెలుగు సంస్కృతిక ప్రతీకలు. అవి అభిమానులకు రసగుల్లాలు ! అభిమానుల గుండెల్లో అమరుడు..ఆయనే కళాభిమానుల వడ్డాది పాపయ్య.. శ్రీకాకుళంలో పుట్టి, మద్రాసులో మెరిసి, కశింకోటలో కన్నుమూశారు. బుధవారం 28వ వర్ధంతితోపాటు శత జయంతి ఉత్సవాలను చిత్ర కళాభిమానులు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభా పాఠవాలను అవలోకిస్తే... సాక్షి, కశింకోట (అనకాపల్లి): తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళను స్వయం కృషితో సాధన చేసి మహా చిత్రకారుడు కావచ్చునని వడ్డాది పాపయ్య నిరూపించారు. చిత్ర కళా జగత్తును మకుటం లేని మహారాజులా నాలుగు దశాబ్దాల పాటు ఏలారు. ఆయన 1992 డిసెంబర్ 30న కశింకోటలోని పావని నిలయంలో తనువు చాలించారు. వ.పా.గా వినుతికెక్కిన వడ్డాది పాపయ్య 1921 సెపెంబర్ 10న శ్రీకాకుళంలో మధ్య తరగతికి చెందిన వడ్డెర కుటుంబంలో జన్మించారు. అత్త వారి గ్రామమైన కశింకోటలో స్థిరపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఐదో ఏట నుంచే చిత్ర కళకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి రామ్మూర్తికి చిత్రకళలో ప్రవేశం ఉంది. ఆయన చిత్రాలు గీస్తున్నప్పుడు దగ్గర ఉండి చిత్రకళలో మెళకువలను తెలుసుకొని అభ్యసించి స్వయం కృషితో సాధన చేశారు. ఐదవ ఏటనే ఆంజనేయస్వామి చిత్రాన్ని మొదటిసారిగా గాశారంటే అతిశయోక్తి కాదు. పాపయ్య కుంచె పట్టిన తొలి నాళ్లలో ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ, దురంధర్ల ప్రభావం ఉండేది. తర్వాత కాలంలో తనదైన శైలిలో ‘వ.పా. శైలి అనితర సాధ్యం’ అనే రీతిలో ఇతరులెవరూ అనుకరించడానికి అవకాశం లేని విధంగా చిత్రాలే గీసేవారు. చిత్ర కళా ప్రియుల హృదయాలను దోచుకున్నారు. వ.పా.కుంచె నుంచి జాలువారేది చిత్ర కళ కాదు సాక్షాత్తూ మహిళా సౌందర్య స్వరూపమే. పత్రికా ప్రపంచానికి వ.పా.గా సుపరిచితుడైన పాపయ్య అనేక మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. చందమామ, ఆంధ్రజ్యోతి, భారతి, రేరాణి, అభిసారిక, యువ, స్వాతి వంటి పలు మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. ఆయన గీసిన చిత్రాలు పత్రికల్లో ప్రచురితం అయి తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన గీసిన చిత్రాల కోసమే కొన్ని పత్రికలు అమ్ముడయ్యేవంటే అతిశయోక్తి కాదు. పాపయ్యకు సంగీతం అంటే ప్రత్యేక అభిమానం. ఎన్నో రాగాలకు సంబంధించిన చిత్రాలను గీయడం ఇందుకు నిదర్శనం. నవ రసాల్లో శృంగారానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే రసానికి ఇవ్వలేదు. శృంగార పరమైన గ్రామీణ మహిళల చిత్రాలు గీసి యువతను రస డోలలో గిలిగింతలు పెట్టారు. కళా దేవులపల్లి, పోతన, శ్రీశ్రీల సాహిత్యమంటే ఆయన అభిమానించేవారు. పాపయ్య చిత్రకారుడే కాదు మంచి రచయిత, ఫొటోగ్రాఫర్ కూడా. పొగడ్తలంటే గిట్టేవి కాదు. ఇంటర్వ్యూలన్నా, కళా ప్రదర్శనలన్నా ఆమడ దూరంలో ఉండేవారు. ఎవరైనా కళను గౌరవించాలిగాని వ్యక్తులను కాదని అభిప్రాయపడేవారు. పాపయ్య ఎక్కువగా నీలి రంగు చిత్రాల పట్లే మక్కువ చూపేవారు. తైల వర్ణాల కంటే నీలి రంగు చిత్రాలు అయితే అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా సత్వరమే చిత్రాలను పూర్తి చేయవచ్చునని అభిప్రాయపడేవారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు వర్ణ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ.పా. నిరాడంబర జీవితాన్ని సాగించి ఇక్కడ తనువు చాలించారు. ఆయన చిత్రాలతో వ.పా. ఆర్ట్సు గ్యాలరీని ప్రదర్శనకు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. అలాగే వ.పా. జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ప్రతిభా పాటవాలను నేటి తరానికి తెలిసే విధంగా చాటాలని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. -
బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు
-
బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం బయ్యారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాండ్రెక్స్ కంపెనీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను అనకపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఉంగరం కోసం చేతినే కోసేశారు
విశాఖ: నిద్రపోతున్న వ్యక్తి ఉంగరాన్ని అపహరించేందుకు ప్రయత్నించిన దొంగలు ఉంగరం రాకపోవడంతో ఏకంగా కత్తితో చేతినే గాయపరిచి పరారైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖపట్నం రైల్వే న్యూకాలనీకి చెందిన మాణిక్యం.. ఉత్సవం సందర్భంగా కశింకోటలోని అత్తమామల ఇంటికి వచ్చాడు. ఆరుబయట పడుకున్న మాణిక్యంపై రాత్రి 2 గంటల సమయంలో దొంగలు అతని చేతి ఉంగరాన్ని అపహరించేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఉంగరం రాకపోవడంతో మత్తు మందు చల్లి కత్తితో ఉంగరపు వేలు కోశారు. అయినప్పటికీ రాకపోవడంతో వేళ్ల దిగువ భాగాన్ని కత్తితో కోసి చీల్చేశారు. ఇంతలో మెలకువవచ్చి కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారని బాధితుడు తెలిపాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. వరుస దొంగతనాలతో కశింకోట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అంబులెన్స్, లారీ ఢీ: ఇద్దరి మృతి
కాసీంకోట: అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా కాసీంకోట మండలంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలో విజయవాడ నుంచి వస్తున్న అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌లోని రోగితో పాటు మరో సహాయకురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిమ్మకాయ మింగి చిన్నారి మృతి
కశింకోట, దిష్టి తగలకుండా మంచంపై ఉంచిన నిమ్మకాయ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. గుండెలు పిండేసే ఈ సంఘటన విశాఖ జిల్లా కశింకోటలో సోమవారం జరిగింది. విశాఖలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన శీల కనకేశ్వరరావుకు, కశింకోటకు చెందిన గోవాడ కొండమ్మ కుమార్తె వరలక్ష్మి దంపతులకు రోహన్‌సాయి (10నెలలు) కొడుకు. కనకేశ్వరరావు సైన్యంలో పనిచేస్తూ జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్నాడు. వరలక్ష్మి అత్తవారింట ఉంటోంది. చిన్నారికి నలతగా ఉండడంతో వరలక్ష్మి పుట్టింటి వారు ఆదివారం సాయంత్రం ఆమెను, బాబును కశింకోట తీసుకువ చ్చారు. రోహన్ పడుకునే మంచంపై నిమ్మకాయను దిష్టిగా ఉంచారు. బాలుడు దానితో ఆడుతూ నోట్లో పెట్టుకుని మింగేశాడు. ఊపిరాడక బాధపడుతున్న చిన్నారిని వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.