కాసీంకోట: అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా కాసీంకోట మండలంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలో విజయవాడ నుంచి వస్తున్న అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌లోని రోగితో పాటు మరో సహాయకురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.