A Young Man Died in an Auto Collision With a Lorry in Jagtial District - Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ డ్రైవర్‌ మృతి.. తిరిగి అదే అంబులెన్స్‌లో..

Published Sun, Jul 30 2023 1:02 AM | Last Updated on Tue, Aug 1 2023 6:15 PM

- - Sakshi

జగిత్యాల: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో యువకు డు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన కోరుట్ల శివారులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోరుట్లలోని హాజీపురాలో నివాసముండే అంబులెన్స్‌ డ్రైవర్‌ ఇమ్రాన్‌ (22), జమ్మూ (24), వాజిద్‌ (31), ఇమ్రాన్‌ (22), అబీద్‌ (23), మోసిన్‌ (23), ఫాజిల్‌ (22) మేడిపల్లి మండలం పోరుమల్లలో జరిగే పీరీలను చూసేందుకు జమ్మూలో ఆటోలో బయలుదేరారు.

కోరుట్ల పాలిటెక్నిక్‌ కళాశాల వద్దకు చేరుకోగానే జగిత్యాల నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న ఇమ్రాన్‌, వాజిద్‌, జమ్మూకు తీవ్రగాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇమ్రాన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు.

చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. జమ్మూ, వాజిద్‌ జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు ఆదిల్‌ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసునమోదు చేశారు. లారీ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

అదే అంబులెన్స్‌లో ఇంటికి..

ఆపద సమయాల్లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడటంలో ముందున్న ఇమ్రాన్‌ను చివరికి అదే అంబులెన్స్‌లో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత అదే అంబులెన్స్‌లో ఇమ్రాన్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం కలచివేసింది. కోరుట్లలో అంబులెన్స్‌ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement