గుండ కవిత(ఫైల్)
జగిత్యాల: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన గుండ కవిత, నరసింహులుకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడు సంతానం. డిగ్రీ చదువుతున్న కూతురుకు పెళ్లి చేయాలని నరసింహులు.. చదువుకోనివ్వాలని కవిత ఆదివారం రాత్రి గొడవపడ్డారు.
తీవ్ర వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన కవిత సోమవారం వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో భర్త నరసింహులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. అప్పటికే కవిత మృతి చెందింది. మెట్‌పల్లి సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై నవీన్‌కుమార్ సిబ్బందితో ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కవిత మృతిపై అనుమానం ఉందని ఆమె తండ్రి తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment