drivar
-
అంబులెన్స్ డ్రైవర్ మృతి.. తిరిగి అదే అంబులెన్స్‌లో..
జగిత్యాల: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో యువకు డు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన కోరుట్ల శివారులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోరుట్లలోని హాజీపురాలో నివాసముండే అంబులెన్స్ డ్రైవర్ ఇమ్రాన్ (22), జమ్మూ (24), వాజిద్ (31), ఇమ్రాన్ (22), అబీద్ (23), మోసిన్ (23), ఫాజిల్ (22) మేడిపల్లి మండలం పోరుమల్లలో జరిగే పీరీలను చూసేందుకు జమ్మూలో ఆటోలో బయలుదేరారు. కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకోగానే జగిత్యాల నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న ఇమ్రాన్, వాజిద్, జమ్మూకు తీవ్రగాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. జమ్మూ, వాజిద్ జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు ఆదిల్ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసునమోదు చేశారు. లారీ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. అదే అంబులెన్స్‌లో ఇంటికి.. ఆపద సమయాల్లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడటంలో ముందున్న ఇమ్రాన్‌ను చివరికి అదే అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత అదే అంబులెన్స్‌లో ఇమ్రాన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం కలచివేసింది. కోరుట్లలో అంబులెన్స్ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. -
ఉచిత ప్రయాణం..! మహిళల ఇష్టారాజ్యం..!!
యశవంతపుర: ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గొడవ పడడంతో డ్రైవర్ బస్‌ను నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూర పట్టణంలో జరిగింది. శనివారం సాయంత్రం చిక్కోడి నుంచి గోకాక్‌కు ఆర్టీసీ బస్ బయలుదేరింది. బస్‌ను ఆరోగ్య కేంద్రం వద్ద నిలపాలని కొందరు మహిళలు డిమాండ్ చేశారు. అక్కడ స్టాప్ లేదని డ్రైవర్ చెప్పాడు. ఎందుకు నిలపవంటూ ఇద్దరు మహిళలు డ్రైవర్, కండక్టర్‌తో గలాటాకు దిగారు. దీంతో డ్రైవర్ కబ్బూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వచ్చాక గొడవలు పెరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి -
UK Bumper Offer : జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాం
-
క్యాబ్ డ్రైవర్‌పై బూతులతొ విరుచుకుపడిన యువతి
-
యువతి తిట్ల పురాణం.. వినలేం బాబోయ్
సాక్షి, హైదరాబాద్: బంజారాహీల్స్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ఓ యువతి తిట్లపురాణంతో హల్చల్ చేసింది. వెనుక నుంచి వచ్చి బైక్‌ను ఢీ కొట్టిన కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై యువతి చేయిచేసుకుంది. అంతటితో ఆగకుండా అతడిపై బూతులతో విరుచుకుపడింది. ఎందుకు కొడతావ్ అని అతను ప్రశ్నిస్తే.. బరాబర్ కొడతాం అంటూ డ్రైవర్‌పై చిందులేసింది. యువతి తిట్లు దగ్గరలోని కెమెరాలో రికార్డయ్యాయి. తనపై చెయిచేసుకుని, బూతులు తిట్టిందని క్యాబ్ డ్రైవర్ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
‘ఆన్ డ్యూటీ’లో వీరంగం
ప్రభుత్వ వాహనంతో బైక్‌ను ఢీకొట్టిన అటవీశాఖ డ్రైవర్ మద్యం మత్తులో క్షతగాత్రులతో వాగ్వాదం పోలీసులకు అప్పగించిన స్థానికులు ఖమ్మం క్రైం: విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ జీపు డ్రైవర్ గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖమ్మంలో వాహనాన్ని ఇష్టారీతిన నడుపుతూ బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రీ కూతుళ్లకు గాయాలయ్యాయి. అంతకుముందే ఓ బాలిక సైకిల్‌పై వెళ్తుండగా ఢీకొనడంతో..అదృష్టవశాత్తూ ఆమె సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అటవీశాఖ రేంజర్ వాహనాన్ని నడిపే డ్రైవర్ శంకర్ మద్యం సేవించి ఇష్టారీతిగా వాహనం నడుపుతూ వస్తూ త్రీటౌన్ పరిధిలోని జమలాపురం కేశవరావు పార్క్ వద్ద వెనుక నుంచి ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనంపై ఉన్న ఖమ్మం రూరల్ మండలం బారుగూడేనికి చెందిన కూలి సెల్వరాజు, అతని మూడెళ్ల కూతురు జపన్యకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడు సెల్వరాజు జీపును అడ్డుకోవడంతో..మద్యం మత్తులో తూలుతూ వాహనం దిగిన డ్రైవర్ శంకర్..తాను ఫారెస్ట్ ఉద్యోగినని, ఏం చేస్తావంటూ బెదిరించసాగాడు. ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అక్కడికి చేరుకొని..గాయాలపాలైన చిన్నారిని చూసి చలించారు. మద్యం మత్తులో బైక్‌ను ఢీకొంది కాక..బెదిరిస్తుండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పారిబోయిన అతడిని పట్టుకొని త్రీటౌన్, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అటవీశాఖ జీపులోనే జిల్లా ఆస్పత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ చూడడంతో సీరియస్.. గొడవ జరుగుతున్నప్పుడు ఎస్పీ షానవాజ్‌ఖాసీం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వెళుతున్నారు. కేశవరావు పార్క్ వద్ద గొడవ జరుగుతుండడాన్ని తన వాహనంలో గమనించిన ఆయన..త్రీటౌన్ సీఐ మొగిలి, ట్రాఫిక్ సీఐ నరేష్‌రెడ్డికి ఫోన్ చేసి..పరిశీలించినట్లుగా సమాచారం. సాక్షాత్తూ ఎస్పీనే సూచించడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారిస్తున్నారు. -
గుండె పొటుతో బస్సు డ్రైవర్ మృతి
–బస్సును ఆపి ప్రయాణికులను రక్షించిన వైనం ’వీకోటలో చోటుచేసుకున్న ఘటన పలమనేరు: తనకు గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను క్షేమంగా కాపాడి తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే మిన్న అని భావించాడో డ్రైవర్. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వీకోటలో గురువారం జరిగింది. కుప్పం నుంచి వీకోటకు సాయంత్రం 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడులోని పేర్నంబట్‌కు బయలుదేరింది. డ్రైవర్ వెంకటేష్(45) బస్సును నడుపుతూ వీకోటకు చేరుకోగానే గుండెనొప్పి వచ్చింది. దీంతో బస్సును పక్కనపెట్టి అక్కడే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను వృతిచెందినట్టు వైధ్యులు తెలిపారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ వెంకటేష్ వృతదేహాన్ని చూసి ప్రయాణికులు సైతం కంటనీరు పెట్టుకున్నారు. -
గుండె పొటుతో బస్సు డ్రైవర్ మృతి
–బస్సును ఆపి ప్రయాణికులను రక్షించిన వైనం ’వీకోటలో చోటుచేసుకున్న ఘటన పలమనేరు: తనకు గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను క్షేమంగా కాపాడి తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే మిన్న అని భావించాడో డ్రైవర్. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వీకోటలో గురువారం జరిగింది. కుప్పం నుంచి వీకోటకు సాయంత్రం 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడులోని పేర్నంబట్‌కు బయలుదేరింది. డ్రైవర్ వెంకటేష్(45) బస్సును నడుపుతూ వీకోటకు చేరుకోగానే గుండెనొప్పి వచ్చింది. దీంతో బస్సును పక్కనపెట్టి అక్కడే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను వృతిచెందినట్టు వైధ్యులు తెలిపారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ వెంకటేష్ వృతదేహాన్ని చూసి ప్రయాణికులు సైతం కంటనీరు పెట్టుకున్నారు.