మృతిచెందిన బస్సు డ్రైవర్ వెంకటేష్
–బస్సును ఆపి ప్రయాణికులను రక్షించిన వైనం
’వీకోటలో చోటుచేసుకున్న ఘటన
పలమనేరు: తనకు గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను క్షేమంగా కాపాడి తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే మిన్న అని భావించాడో డ్రైవర్. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వీకోటలో గురువారం జరిగింది. కుప్పం నుంచి వీకోటకు సాయంత్రం 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడులోని పేర్నంబట్‌కు బయలుదేరింది. డ్రైవర్ వెంకటేష్(45) బస్సును నడుపుతూ వీకోటకు చేరుకోగానే గుండెనొప్పి వచ్చింది. దీంతో బస్సును పక్కనపెట్టి అక్కడే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను వృతిచెందినట్టు వైధ్యులు తెలిపారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ వెంకటేష్ వృతదేహాన్ని చూసి ప్రయాణికులు సైతం కంటనీరు పెట్టుకున్నారు.