![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/17/Rakesh%20111.jpg.webp?itok=7DGe_jvL)
సాక్షి, జగిత్యాల: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని వెంగళాపూర్ గ్రామానికి చెందిన అంతెల్పుల రాకేశ్ (22) కొంతకాలంగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సదరు యువతి పెళ్లికి ఒప్పుకోవడంలేదని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్!
Comments
Please login to add a commentAdd a comment