విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం బయ్యారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాండ్రెక్స్ కంపెనీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను అనకపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.