brandix company
-
అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్ సీడ్స్–2 కంపెనీలో పనిచేసే 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రెండో షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. మిగతా ప్లాంట్లలో సిబ్బందిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి అమర్నాథ్ అచ్యుతాపురం ఘటనపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టితో మాట్లాడారు. గ్యాస్ లీక్‌కు కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత -
సెజ్‌లు ఏర్పాటు చేసింది అందుకే
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం బ్రాండిక్స్ ఇండియా కంపెనీలో పర్యటించారు. దుస్తులు ఎగుమతి గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో 60 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. 20 ఉద్యోగాలు కల్పించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పిస్తే మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో వైఎస్సార్ సెజ్‌లను ఏర్పాటు చేశారన్నారు. కానీ టీడీపీ హయాంలో పరిశ్రముల పూర్తిగా గాడితప్పాయని ఆరోపించారు. కాలుష్యం విషయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశించారు. -
బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు
-
బస్సును ఢీకొట్టిన లారీ: 40 మందికి గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం బయ్యారం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బాండ్రెక్స్ కంపెనీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను అనకపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.