సాక్షి, విశాపట్నం: విశాఖలో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, తన స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టులేక హరి ప్రకాష్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆతహత్యకు ముందు ఆరు పేజీల సూసైడ్ లేఖ రాశాడు. అలాగే ఆత్మహత్యకు గల కారణాలపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
కాగా హరి ప్రకాశ్‌కు భవనేశ్వరితో వి2019లో వివాహమైంది. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. ఈ జంటకు నాలుగేళ్ల పాప కూడా ఉంది. అయితే భువనేశ్వరికి, హరి ప్రకాశ్‌కు గత మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్యకు ఇతరులతో సంబంధం పెట్టుకుందన్న ఈ క్రమంలోనే తన స్నేహితుడు రాజేష్‌కు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తున్నట్లు హరి ప్రకాశ్ ఆరోపించాడు. వారిద్దరికి ఓ పాప కూడా ఉన్నట్లు తెలిపారు. భార్య వేధింపులు, ఇతరులతో ఆమె సంబంధాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు.
కుమారుడి ఆత్మహత్యపై పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ద్వారకా జోన్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హరి ప్రకాష్ మృతదేహన్ని పోలీసులు మార్చరీకి తరలించారు. హరి ప్రకాష్ భార్యభువనేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడు రాజేష్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment