Bone cancer
-
ఎముక కేన్సర్ అంటే..?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ కేన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎముక కేన్సర్‌లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ కేన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక కేన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ కేన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన కేన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ కేన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ కేన్సర్లలో... మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే కేన్సర్) ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన కేన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ రూన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ కేన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రోస్టేట్ వంటి ఇతర ప్రాంతాల్లో వచ్చి కేన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక కేన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అమాయకరం కాని ‘నాన్ కేన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. లక్షణాలు..ఎముక కేన్సర్ లక్షణాలు తొలి దశల్లోనే గుర్తించడం అంతగా సాధ్యం కాదు. లక్షణాలిలా ఉంటాయి. నొప్పి : కేన్సర్ గడ్డ వచ్చిన ఎముక ప్రాంతంలో నిరంతరం నొప్పి వస్తూ సమయం గడుస్తున్నకొద్దీ దీని తీవ్రత పెరుగుతుంది. వాపు : ఎముక క్యాన్సర్ వచ్చిన చోట స్పష్టంగా వాచినట్లుగా వాపు కనిపిస్తుంది. ఫ్రాక్చర్లు: క్యాన్సర్ వచ్చిన ఎముక బలహీనంగా మారడంతో తేలిగ్గా విరగడానికి అవకాశాలెక్కువ. తీవ్రమైన అలసట, బరువు తగ్గడం : బాధితుల్లో బాగా నీరసం, నిస్సత్తువ, అలసట కనిపిస్తాయి. అలాగే బాధితులు ఎక్కువగా బరువు తగ్గుతారు. చికిత్స... ఒకసారి ఎముక కేన్సర్ నిర్ధారణ చేశాక... ఆ కేన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక కేన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. కీమోథెరపీ : కొన్ని మందులతో కేన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి కేన్సర్ల కోసం వాడతారు. రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో కేన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని కేన్సర్లలో లాగే ఎముక కేన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతోపాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (ప్రోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన కేన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతోపాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక కేన్సర్‌తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక కేన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని కేన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతోపాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తమకు వచ్చిన కేన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతోపాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతోపాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక కేన్సర్ నిర్ధారణ చేస్తారు. డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్ మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
ఎముక క్యాన్సర్ అంటే...?
ఎముక మీద ఏదైనా అసాధారణ లేదా అవాంఛిత కణజాలం పెరుగుదలతో కనిపించే ‘ఎముక ట్యూమర్’లను ఎముక క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి ఎముక గడ్డలు శరీరంలోని ఏ ఎముకపైన అయినా రావచ్చు. అంటే ఎముక పైభాగంలో లేదా లోపలి వైపునా ఇంకా చెప్పాలంటే ఎముకలోని మూలుగ (బోన్ మ్యారో)లో... ఇలా ఎక్కడైనా రావచ్చు. ఈ బోన్ క్యాన్సర్ గురించి సాధారణ ప్రజలకూ అవగాహన కలిగేలా యూకే బర్మింగ్హమ్లోని రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. రాజేశ్, అలాగే అక్కడి వైద్యురాలు డాక్టర్ సుష్మితా జగదీశ్ చెబుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.ఎముక క్యాన్సర్‌లో రకాలివి...ఎముకల గడ్డల గురించి... ఎముక మీద వచ్చే ఈ గడ్డ (బోన్ ట్యూమర్) అన్నది ప్రమాదాన్ని తెచ్చిపెట్టే (మేలిగ్నెంట్) బోన్ క్యాన్సర్ గడ్డ కావచ్చు లేదా అది ఎలాంటి ప్రమాదాన్నీ కలిగించని (బినైన్) గడ్డ కూడా కావచ్చు. ఇక ఎముక క్యాన్సర్ గురించి చెప్పాలంటే వచ్చే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గనక ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ ఈ క్యాన్సర్ దేహంలోని మరో చోట మొదలై... ఆ కణాలు ఎముక మీదికి చేరి ఎముక కణాలనూ క్యాన్సర్ కణాలుగా మార్చడం వల్ల వచ్చిన క్యాన్సరైతే దాన్ని ‘మెటాస్టాటిక్ బోన్ డిసీజ్’ అనీ ‘సెకండరీ బోన్ క్యాన్సర్’ అని డాక్టర్లు చెబుతారు. ప్రైమరీ బోన్ క్యాన్సర్లలో... ⇒ మల్టిపుల్ మైలోమా (మూలుగలో వచ్చే క్యాన్సర్)⇒ ఆస్టియోసార్కోమా (ఇది టీనేజీ పిల్లల ఎముకల్లో కనిపించే సాధారణమైన క్యాన్సర్... సాధారణంగా మోకాలి చుట్టూ ఇది అభివృద్ధి చెందుతుంది) ⇒ ఈవింగ్స్ సార్కోమా (ఇది కూడా యువతలో ఎక్కువగా కనిపిస్తూ సాధారణంగా కాళ్లూ, కటి భాగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది) ∙కాండ్రో సార్కోమా (ఇది ఎముకల్లో కనిపించే అతి సాధారణ క్యాన్సర్లలో రెండో ది, ఎక్కువగా మధ్య వయస్కుల్లో అందునా చాలావరకు కటి లేదా భుజం ఎముకల్లో కనిపిస్తుంది). సెకండరీ బోన్ క్యాన్సర్లలో దేహంలోని... రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ్రపోస్టేట్ వంటి ఇతర ్రపాంతాల్లో వచ్చి క్యాన్సర్లు పెరుగుతూ ఆ కణాలు ఎముకలకూ చేరి అలా ఎముక క్యాన్సర్‌కూ కారణమవుతాయి. ఇక... ఏ హానీ చేయని బినైన్ ట్యూమర్స్ అని పిలిచే ఎముక గడ్డల విషయానికి వస్తే... తేడాలను బట్టి వాటిని ఆస్టియోకాండ్రోమా, జెయింట్ సెల్ ట్యూమర్స్ అని పిలుస్తారు. ఇవి ఎముకలపై పెరిగే అంతగా అపాయకరం కాని ‘నాన్ క్యాన్సరస్’ గడ్డలని చెప్పవచ్చు. చికిత్స... ఒకసారి ఎముక క్యాన్సర్ నిర్ధారణ చేశాక... ఆ క్యాన్సర్ దశ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ్రపాధాన్యక్రమంలో ఏ చికిత్స ప్రక్రియను తొలుత లేదా ఆ తర్వాత నిర్వహించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఎముక క్యాన్సర్‌కు అవలంబించే సాధారణ చికిత్స ప్రక్రియల్లో ముఖ్యమైనవి... ⇒ శస్త్రచికిత్స : ఎముకపైన ఉన్న గడ్డనూ... దాంతోపాటు ఆ చుట్టుపక్కల కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ⇒ కీమోథెరపీ : కొన్ని మందులతో క్యాన్సర్ కణాలను తుదముట్టించే ప్రక్రియను కీమోగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ప్రక్రియను ఆస్టియోసార్కోమా వంటి క్యాన్సర్ల కోసం వాడతారు. ⇒ రేడియేషన్ థెరపీ : అత్యంత శక్తిమంతమైన రేడియేషన్ కిరణాల సహాయంతో క్యాన్సర్‌ను మాడ్చివేసే ప్రక్రియనే రేడియోషన్ థెరపీగా చెబుతారు. సా«ధారణంగా శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డలను తొలగించలేని సమయాల్లో డాక్టర్లు ఈ ప్రక్రియను ఎంచుకుంటారు. అన్ని క్యాన్సర్లలో లాగే ఎముక క్యాన్సర్‌నూ ఎంత త్వరగా గుర్తించి, నిపుణులైన డాక్టర్లతో మంచి చికిత్స అందిస్తే ఫలితాలూ అంతే మెరుగ్గా ఉంటాయి. మరీ ముఖ్యంగా... పెరుగుతున్న పిల్లల్లో ఇవి వారి ఎదుగుదలను ప్రభావితం చేయడంతో పాటు కొన్నిసార్లు వైకల్యాలకూ కారణమయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా వీటిని కనుగొని, తగిన చికిత్స అందించాలి. బాధితుల్లో కనిపించే మెరుగుదల (్రపోగ్నోసిస్) అనే అంశం... అది ఏ రకమైన క్యాన్సర్ లేదా ఏదశలో దాన్ని కనుగొన్నారు, బాధితుడికి అందుతున్న చికిత్సకు ఎలా ప్రతిస్పందిస్తున్నాడనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల మంచి అధునాతన చికిత్స ప్రక్రియలతో పాటు కొత్త కొత్త చికిత్స ప్రణాళికలు అందుబాటులోకి రావడం, సరికొత్త పరిశోధనలతో వచ్చిన ఆవిష్కరణల కారణంగా బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వస్తే... ఎముక క్యాన్సర్‌తో జీవించాల్సి వచ్చే బాధితులకు తమ కుటుంబసభ్యుల నుంచి, డాక్టర్ల నుంచి ఆరోగ్య సంరక్షకుల నుంచి మంచి సహకరం అవసరం. ఎముక క్యాన్సర్ వచ్చిందని తెలియగానే అన్ని క్యాన్సర్లలో లాగానే బాధితులు షాక్‌కు గురికావడం, జీవితం శూన్యమైనట్లు అనుకోవడం, నిరాశా నిస్పృహలకు గురికావడం వంటివి ఉంటాయి. అయితే వాళ్లు బాగా కోలుకోవడం అన్నది... వాళ్లకు అందే చికిత్సతో పాటు వాళ్లకు నైతిక మద్దతు అందించే కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.తమకు వచ్చిన క్యాన్సర్ రకం, దాని గురించి అవసరమైన సమాచారంతో పాటు తమకు వచ్చిన వ్యాధి గురించి డాక్టర్లు, తమకు నమ్మకమైనవాళ్లతో అరమరికలు లేకుండా చర్చించడం వంటి అంశాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఈ క్రమంలో నర్సులూ, తాము తీసుకునే మందులు, తమకు లభించాల్సిన ట్రాన్స్‌పోర్టు సహకారాలూ, బాధితుల బాధల్ని తమవిగా ఎంచి, సహానుభూతితో మద్దతు అందించే సపోర్ట్ గ్రూపుల సహకారం బాగుంటే కోలుకునే ప్రక్రియ కూడా మరింత మెరుగ్గా, వేగంగా జరుగుతుంది. ∙నిర్ధారణ...సాధారణంగా ఎక్స్–రే, ఎమ్మారై, సీటీ స్కాన్ పరీక్షలతో పాటు సాధారణంగా చిన్న ముక్క తీసి పరీక్షించే బయాప్సీ ద్వారా ఎముక క్యాన్సర్ నిర్ధారణ చేస్తారు. -
ఎముకల క్యాన్సర్లు... ఒక అవగాహన
మన శరీరానికి ఒక ఆకృతినీ, ఎత్తునీ, బరువునూ నిర్ణయించేది మన ఎముకలే. అంతేకాదు... మన శరీరంలోని కీలకమైన అవయవాలను... అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను వివిధ ఆకారాల్లో ఉండే ఎముకలు రక్షిస్తూ ఉంటాయి. ఎముకల ఉపరితలం గట్టిగా ఉండి లోపల స్పాంజ్‌లా ఉంటుంది. ఎముక లోపలి గుజ్జును బోన్‌మ్యారో అంటారు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి బోన్‌మ్యారో నుంచి జరుగుతుంది. వయసుపైబడే కొద్దీ మరీ ముఖ్యంగా మహిళల్లో ఎముకలు మరింత పలచగా, పెళుసుగా మారి తేలిగ్గా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలా జరగడాన్ని ‘ఆస్టియో పోరోసిస్’ అంటారు. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. చిన్నప్పట్నుంచి శరీరానికి ఎండ తగలనిస్తూ, క్యాల్షియం లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడితే మంచిది. ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఎముకలకు సంబంధించి బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ వంటి సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. చాలామందిలో బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఒకదానికి మరొకటిగా పొరబడటమూ జరుగుతుంది. ఎముకల మీద గడ్డ వచ్చే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అది క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డ అయినా, కాకపోయినా ఎముక మీద గడ్డ ఏర్పడితే ఫ్రాక్చర్స్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండటం, జ్వరం, రాత్రి చెమటలు పోయడం, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముకలు విరగడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గడ్డ తొలిదశలో చాలా చిన్నగా కనిపించడం వల్ల ఎక్స్‌రే పరీక్షతో నిర్ధారణ సరిగా జరగకపోవచ్చు. అందుకనే లక్షణాలు కనిపించినప్పుడు సమస్యను సరిగా నిర్ధారణ చేయడానికి సీటీ, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ కాని గడ్డ అయితే గుండ్రంగా, మెల్లగా పెరుగుతుంది. క్యాన్సర్ కణితి అయితే ఖచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతుంది. కణితి కొంచెం పెద్దగా ఉంటే ఎక్స్‌రేలోనూ, చిన్నగా ఉంటే ఎమ్మారై, సీటీ స్కాన్లలో బయటపడుతుంది. గడ్డ ఏరకమైనదో నిర్ధారణ చేయడానికి బయాప్సీ చేస్తారు. బోన్ క్యాన్సర్ గడ్డలలో ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా, కాండ్రో సార్కోమా, ఫైబ్రో సార్కోమా, కార్డోమా అనే రకాలుంటాయి. వయసు మీద ఆధారపడి ఈ గడ్డలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా చిన్నవయసువారిలో ఎక్కువగా కనిపిస్తే, కాండ్రో సార్కోమా మధ్యవయసు వారిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. బోన్క్యాన్సర్స్ చాలావరకు సెకండరీగానే ఉంటాయి. శరీరంలో మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్... ఎముకలకు వ్యాప్తి చెందడం (మెటాస్టాసిస్) ఎక్కువగా చూస్తుంటాం. ఎముకలోనే క్యాన్సర్ ముందుగా రావడం కొంతవరకు అరుదుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి లంగ్, ప్రోస్టేట్... ఇలా మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్ ఎముక మీద గడ్డలాగా ముందుగా బయటపడవచ్చు. అన్ని క్యాన్సర్లలో లాగానే సర్జరీ, రేడియో, కీమో థెరపీల ప్రాధాన్యత ఎముక క్యాన్సర్లలోనూ ఉంటుంది. క్యాన్సర్ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తీసివేసినప్పుడు, చిన్నగా ఉంటే సిమెంటింగ్, గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులతో సరిచేస్తారు. ఎముక తీయవలసిన ప్రదేశం ఎక్కువగా ఉంటే బోన్ బ్యాంక్ నుంచి ఎముకను సేకరించి, వాడటం లేదా మెటల్ ఇంప్లాంట్స్ వాడటం జరుగుతుంది. క్యాన్సర్ కణితి పెద్దగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేసి, తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్స్‌కు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహేబిలిటేషన్ వంటి ప్రక్రియల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎముకల క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే సెకండరీ బోన్ క్యాన్సర్స్ ఎక్కువ కాబట్టి మిగతా క్యాన్సర్లను ముందుగా గుర్తించి, చికిత్స తీసుకోగలిగితే ఈ క్యాన్సర్‌ను నివారించినట్లవుతుంది. క్యాన్సర్ వచ్చిన ఎముకలను గట్టిపరచడానికి బిస్పాస్ఫోనేట్స్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లకు మిగతా క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఎముకలకు పాకే గుణం ఉంటుంది. బోన్ క్యాన్సర్‌కు గురైనప్పుడు శరీరంలో క్యాల్షియం లెవెల్స్ కూడా పెరగవచ్చు. క్యాన్సర్ కణితి వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడటం వల్ల కాళ్లలో లేదా చేతులలో బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి. శరీరంలో ఎక్కడైనా మార్పు కనిపించినా, లక్షణాల్లో మార్పులు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకుని క్యాన్సర్ కణాన్ని తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, డాక్టర్ నిర్దేశించిన కాల వ్యవధి ప్రకారం సర్జరీ తర్వాత లేదా సర్జరీకి ముందు లేదా సర్జరీ లేకుండానే అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవాలి. అంతేకాదు... శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ వస్తే పక్కనుండే ఎముకలకు పాకే అవకాశం ఉన్నందున, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా ఐదేళ్ల వరకు చెకప్స్ చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. డా. సి.హెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ Ph: 98480 11421 -
బోన్ క్యాన్సర్ అని తెలియడంతో...
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీకి చెందిన దువ్వారాపు రాము(32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేసిన రాము అనారోగ్యం కారణంగా కొద్ది నెలల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. గతంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కాగా వైద్యపరీక్షలు చేయించగా బోన్ క్యాన్సర్ అని తేలడంతో మాసికంగా కుంగిపోయాడు. భార్య, పిన్ని చర్చికి వెళ్లిన సమయంలో శ్లాబ్‌కు చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రాముకు బాల్యం నుంచి కష్టాలే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని అసిరిపోలమ్మ అన్నీ తానై పెంచింది. ఈ క్రమంలో వివాహం కూడా చేసింది. రాముకు భార్య యమున, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. అసిరిపోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. లారీని ఢీకొట్టిన బైక్ ఇచ్ఛాపురం: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పులారి జానకిరావు (27), పిన్నింటి దర్మరాజు, మద్దిలి ప్రవీణ్‌కుమార్‌లు ఆదివారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సుమండి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో జానకిరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మరాజు, ప్రవీణ్‌కుమార్‌లను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తీసుకెళ్లారు. ఒడిశా గొలంత్ర పోలీసులు కేసు నమోదు చేసి జానకిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరంపురం పెద్దాసుపత్రికి తరలించారు. (చదవండి: భార్యపై కతితో దాడి చేసి...ఆ తర్వాత...) -
‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?'
సాక్షి, అనంతపురం: ‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా? బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా! ఎలాగైనా ఈ జబ్బు నయం చేయించు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న కుమార్తెను చూసిన తల్లిదండ్రుల వేదనకు అంతు లేకుండా పోతోంది. మళ్లీ ఆమెను మునుపటిలా చేయాలనే తపన వారికీ ఉంది. అయితే పేదరికం కారణంగా శస్త్రచికిత్స చేయించలేని స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. కాలికి పుండులా వ్యాపించి భరించ లేని నొప్పితో విలవిల్లాడుతున్న తమ కుమార్తెకు శస్త్ర చికిత్స చేయించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషాలకు బ్రేక్ పడిందిలా! బుక్కరాయసముద్రం మండలం విరుపాక్షేశ్వర నగర్‌కు చెందిన పేరూరు పురుషోత్తం.. నగరంలోని ఓ ఫ్యాక్టరీలో దినకూలీగా పనిచేస్తున్నాడు. భర్తకు తోడుగా భార్య పుష్పావతి సైతం చిన్నాచితక పనులతో సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సంకీర్తన.. డిగ్రీ చదువుతోంది. చిన్నమ్మాయి సుప్రజ.. నగరంలోని పాతూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆనందంగా సాగిపోతున్న సుప్రజ జీవితాన్ని అంతుచిక్కని వ్యాధి కకావికలం చేసింది. గత ఏడాది చివర కాలుపై కురుపులాంటిది కనిపిస్తే వైద్యం చేయించారు. భరించరాని నొప్పితో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయిస్తే ‘బోన్ కాన్సర్ ’ అని తేలింది. అనంతపురం సర్వజనాస్పత్రితో పాటు, కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించారు. నయం కాలేదు. తిరుపతిలోని స్విమ్స్‌లో వైద్యం చేయించారు. ఫలితం దక్కలేదు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేయాలని... ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో రూ.8 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని వైద్యులు సూచించారు. ఎక్కడ పది రూపాయలు తక్కువవుతుందని తెలిసినా గంపెడాశతో పరుగులు పెట్టిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కు తోచలేదు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో బడికెళ్లి చదువుకోవాలనే తపన ఆ చిన్నారిలో మరింత ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో తమ బిడ్డకు ప్రాణదానం చేసే ఆపన్న హస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు సంప్రదించాల్సిన చిరునామా పేరు : పేరూరు పురుషోత్తం ఫోన్ నంబర్ : 63035 59280 బ్యాంక్ ఖాతా నంబర్ : 1100 2614 0452 (కెనరాబ్యాంక్, సుభాష్‌రోడ్డు, అనంతపురం శాఖ) ఐఎఫ్ఎస్సీ కోడ్ : సీఎన్ఆర్బీ0000659 -
బీడీ చుట్టలు చుడితేనే జీవనం సాగేది.. అలాంటిది పది లక్షలంటే..
సాక్షి, నిజామాబాద్(దోమకొండ): బీడీ చుట్టలు చుడితేనే ఆ పేద కుటుంబం జీవనం సాగేది. ఆర్థికంగా ఇబ్బందులున్నా చదువు ఉంటేనే భవిష్యత్తుల్లో ఏదో ఒకరకంగా జీవనం సాగించవచ్చని భావించి పాఠశాలకు పంపుతున్నారు. ఈలోగా తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె యాయత్రికి బోన్ క్యాన్సర్ అని తెలిసి దోమకొండకు చెందిన బీసు రాజనర్సు, అర్చన దంపతలు ఒక్కసారిగా కుంగిపోయారు. ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల కోసం ప్రస్తుతం ఆ పేద కుటుంబం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల కిందట చేతినొప్పి రావడంతో డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బోన్ క్యాన్సర్‌గా ధృవీకరించారు. విద్యార్థిని తండ్రి రాజనర్సు కామారెడ్డిలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, తల్లి అర్చన బీడీలు చుడుతుంది. తమ కుమార్తె వైద్యం కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు రాజనర్సు (ఫోన్ నెంబర్ 9951068730) అర్చన (7036475197) విజ్ఞప్తి చేశారు. -
పెద్ద మనసు చాటుకున్న మంచు మనోజ్
హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బోన్ కేన్సర్ బాధపడుతున్న ఓ బాబుకు అండగా నిలిచాడు. అతనికి అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఓ బాబు బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆమె కుటుంబ సభ్యులు చికిత్స చేయించే స్థితిలో లేరని తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్, సోనూసూద్‌కి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అందులో మనోహర్ బాబు అనే వ్యక్తి మాట్లాడుతూ.. తాను ఆటో డ్రైవర్ని అని, తన బిడ్డకు చికిత్స అందించేందుకు డబ్బులు లేవంటూ సాయం చేయాలని కనీళ్లు పెట్టుకుంటూ అభ్యర్థించాడు. ఆ ట్వీట్ చూసి చలించిన మనోజ్.. వారికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. (చదవండి: డైలాగ్ కింగ్ 45 ఏళ్ల సినీ ప్రయాణం) ‘దయచేసి నా ఇన్‌బాక్స్‌కి అన్ని వివరాలు పంపండి. ఆసుపత్రి పేరు, వైద్యుల పేర్లు కూడా పంపండి. ధైర్యంగా ఉండండి. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్ రీట్వీట్ చేశాడు. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మనోజ్‌ను మరో సోనూసూద్ అంటూ కొనియాడుతున్నారు. ఆయనను మరో సోనూసూద్ అని కొనియాడుతున్నారు. ‘ దైవం మనుష్య రూపేణా నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నయ్య’, ‘మీరు రియల్ హీరో అన్నయ్య’, ‘ఇంత త్వరగా రియాక్షన్ అసలు ఎవరు ఊహించి ఉండరు అన్న. సమాజానికి ఏం జరిగినా సమాజంలో ఏం జరిగినా ముందు ఉండేది నువ్వే సామి. నీ మానవత్వానికి మనుషులు శిరస్సు వంచి జీవితాంతం నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నారు మనోజ్ అన్న’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, లాక్డౌన్ సమయంలోనూ మంచు మనోజ్ వలస కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. సొంత డబ్బులతో హైదరాబాద్‌లో ఉన్న కార్మికులను స్వగ్రామాలకు తరలించారు. Please send me all the details to my inbox - Hospital name and Doctors name too please ... Stay strong andi .. praying for his speedy recovery 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️ Much love to your boy and family 🙏🏻 https://t.co/w8m6tkc6LX — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 22, 2020 -
కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి
ప్రత్తిపాడు రూరల్: ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి వాహిని ఎముకుల కేన్సర్‌తో బాధపడుతోంది. గ్రామానికి చెందిన తూరపాటి రాజు, దుర్గాదేవి దంపతుల కుమార్తె అయిన వాహినిని కొన్ని నెలలుగా జ్వరం పట్టి పీడిస్తుంటే మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షలు అనంతరం చిన్నారికి కేన్సర్ ఉండే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బోన్మోరో పరీక్ష చేయిస్తే బోన్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. అసలే తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చిన్నారికి ఖరీదైన ఈ వైద్యసేవలు అందించడం ఎలాగో అర్థం కాక తల్లిదండ్రులు అల్లాడిపోయారు. సన్నిహితుల సలహా మేరకు విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తీసువెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. వారానికి ఒక్కరోజు తప్పని సరిగా కిమోథెరపీ చేయించాల్సివస్తోంది. ఈ వైద్యానికి రూ.12 లక్షలు వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం కొంత మేరకు ఊరటనిచ్చినా అంతకు మించి అవుతున్న ఖర్చులను తట్టుకోలేని పరిస్థితి వారిది. ఇప్పటికే శక్తికి మించి రూ.లక్షల్లో ఖర్చు చేశారు. రెక్కాడితేకాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన వారు వైద్య సేవలు అందించడం శక్తికి మించినది కావడంతో ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయాల్సిన వారు తూరపాటి దుర్గాదేవి, సామర్లకోట, యూనియన్ బ్యాంకు, అకౌంట్ నెం:606502010010408 సెల్ : 9505762979 -
చిట్టి తల్లి హేమలత ఇకలేదు
సాక్షి, అల్లిపురం (విశాఖ): బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విశాఖలోని అల్లిపురం, గౌరీవీధికి చెందిన హేమలత (11) బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో వచ్చిన వార్తకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పటల్ వారు ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. చిట్టితల్లికి వైద్యం అందజేయాలని ముఖ్యమంత్రి చెప్పడంతో చాలామంది దాతలు స్పందించి హేమలత కుటుంబానికి అండగా నిలిచారు. బాలిక ఆరోగ్యం బుధవారం విషమించడంతో కొద్దిసేపటికే ఆమె మృతి చెందిందని హేమలత తల్లిదండ్రులు అప్పలరాజు, అమ్మాజీ తెలిపారు. బాధితుల కుటుంబాలకు రూ.13 కోట్లు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలు, అత్యాచార బాధితులు, క్యాన్సర్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. జిల్లాకు రూ.కోటి చొప్పున 13 జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) బుధవారం ఉత్తర్వులిచ్చింది. -
కన్నీటి విన్నపం..
రోజురోజుకూ కొడుకు ఆరోగ్యం క్షీణించిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఏడాది కిందటి వరకు చలాకీగా తిరిగిన కుమారుడు మంచం దిగలేక అవస్థ పడుతుంటే నిస్సహాయులుగా చూడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. దా చుకున్న డబ్బంతా చికిత్సకు మంచులా కరిగిపోతుంటే.. రేపటి రోజును తలచుకుని భయపడుతున్నారు. మరో వైపు తన కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను కనీసం ఓదార్చలేక ఆ యువకుడు కుమిలిపోతున్నాడు. ఉన్నదంతా కోల్పోయి, అప్పులు కూడా పుట్టని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం సమాజం నుంచి సాయం అరి్థస్తోంది. యుక్త వయసులో ఉన్న కొడుకుని కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు కాసింత చేయూత కోరుతున్నారు. రేగిడి: రేగిడి గ్రామానికి చెందిన కురిటి తవిటినాయుడు, బుల్లెమ్మలు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ కూలి పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. వీరికి మొదటి కుమారుడు కురిటి లోకేశ్వరరావు, రెండో కుమారుడు బాలకృష్ణ. వీరిలో మొదటి కుమారుడు ఏడాది నుంచి బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నా డు. గత ఏడాది డిసెంబర్లో లోకేశ్వరరావు ఆరో గ్యం బాగోలేదని రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి విశాఖ తీసుకెళ్లాలని సూచించా రు. లోకేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు కొంత డబ్బు అప్పు చేసుకొని విశాఖపట్నం తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు బోన్ కేన్సర్‌గా నిర్ధారణ చేశారు. కొడుకును కాపాడుకునేందుకు దాచుకున్న డబ్బుతో పాటు దాదాపు రూ.3 లక్షల వరకు అప్పు చేసి ఆ తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఉన్న సొమ్ములు అయిపోయాయి.. ఇంకా చికిత్స మిగిలే ఉంది. ఆరోగ్య శ్రీ ద్వారా ఆదుకోవాలని కోరితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు మంచానికే పరి మితమైపోయాడు. చలాకీగా స్నేహితులతో తిరగాల్సిన కుర్రాడు ఇలా దీనావస్థకు చేరడం చూస్తే మనసు చలించిపోతుంది. దయనీయ స్థితి.. లోకేశ్వరరావు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. బోన్ కేన్సర్‌తో ఎడమ కాలు పూర్తిగా సహకరించడం లేదు. శరీర భాగాల పనితీరు కూడా మందగించింది. శరీరం అస్థిపంజరంలా మారిపోయింది. నిద్రాహారాలు సరిగ్గా ఉండడం లేదు. ఆ యువకుడిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. తల్లిదండ్రులు మా త్రం అనునిత్యం మంచంపై ఉన్న కొడుకుకి సపర్యలు చేస్తూ కాపాడుకుంటున్నారు. ఆదుకోవాలని వేడుకోలు.. ప్రస్తుత ప్రభుత్వం తమ బిడ్డను ఆదుకోవాలని తల్లిదండ్రులు కురిటి తవిటినాయుడు, బుల్లెమ్మలు వేడుకుంటున్నారు. వైద్యం చేయించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించే స్థోమత కూడా లేదని అంటున్నారు. చిన్నకొడుకును చదివించుకునేందుకు కష్టం చేసి తెచ్చిన కూలి డబ్బులు కొద్దిపాటి మందులకే సరిపోతున్నాయని వారు బాధపడుతున్నారు. మనసున్న వారు మానవత్వంతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 6304857588. బ్యాంకు అకౌంట్ నంబర్ఏఎన్డీబీ0000932––093210100037889. ప్రభుత్వం ఆదుకోవాలి నా బిడ్డను ప్రభుత్వమే ఆదుకోవాలి. బోన్ కేన్సర్‌తో రోజురోజుకీ ఆరోగ్యం పాడైపోతోంది. మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. మనసున్నవారు ఆర్థిక సాయం చేస్తే నా కుమారుడిని బతికించుకుంటాను. – కురిటి తవిటినాయుడు, రోగి తండ్రి, రేగిడి -
పేదింటికి పెద్ద కష్టం
సాక్షి, పాలకొండ రూరల్: అసలే మధ్య తరగతి కుటుంబం. అటుపై రెక్కాడితే గానీ డొక్కాడని వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. అంది వస్తాడని అనుకున్న చిన్న కుమారుడిపై బోన్ కేన్సర్ రూపంలో పంజా విసిరింది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఆ కుర్రాడిని మంచా నికి పరిమితం చేసింది. బిడ్డను రక్షించుకునేం దుకు తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తోంది. పాలకొండ పట్టణం కోరాడ వీధి సమీ పంలో నివాసముంటున్న జోగ ఎర్రంనాయు డు, లక్ష్మి దంపతుల మూడో కుమారుడు గంగరాం స్థానిక పెదకాపువీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తున్న గం గారంకు మూడు నెలల కిందట వెన్ను, భుజం భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో తల్లిదండ్రులు తమ బిడ్డను శ్రీకాకుళం తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. భుజం లో ఎముక చిట్లి ఉంటుందని వైద్యులు భా వించి అందుకు తగ్గట్టుగా మందులు అందించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో పాటు బిడ్డ శరీరంలో స్వల్ప మార్పులు రావడం తల్లిదండ్రులు గమనించారు. మెరుగైన వైద్యం కోసం మహాత్మాగాంధీ కేన్స ర్ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు రూ.3 లక్షలు ఖర్చుచేయడంతో తమ కుమారుడికి బోన్ కేన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గంగా రాం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నకొడుకును ప్రాణాంతక వ్యాధి రోజు రోజుకూ కబళిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గంగారాం కీమోథెరపీ చేయించుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ఒక్కో ఇంజెక్షన్ రూ.3,500, తనకు అందిస్తున్న మాత్రలు రూ.1600 ఖర్చు చేయడం ఆ తల్లిదండ్రులకు తల కు మించిన భారమైంది. ఆటో నడుపుకుని కుటుం బాన్ని పోషిస్తున్న బాధితుడు గంగారాం తండ్రి ఎర్రంనా యు డు అప్పు చేసి కుమారుడిని రక్షించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కళ్ల ముందే కుంగిపోతున్న కుమారుడి దయనీయ స్థితికి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. దాదాపు రూ.10 లక్షలు ఉంటే గానీ మెరుగైన వైద్యం, ఆపరేషన్లు చేయలేమని విశాఖకు చెందిన పికానికి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారని తల్లిదండ్రులు చెబుతుతున్నారు. మనసున్న మారాజులు ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాలకొండ ప్రభుత్వ బాలికల కళాశాల యాజమాన్యం కొంతమేర ఆర్థిక సాయం అందించింది. ఈ కోవలోనే మానవతా దృక్పథంతో సహకరించాలని ఆ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ దయనీయమైన పరిస్థితిపై ఆరా తీసేందుకు 9346877720, 7729055065 నంబర్లకు ఫోన్ చేయాలని, చెమర్చిన కళ్లతో అభ్యర్థిస్తున్నారు. -
విమానం ఎక్కాలన్న ముచ్చట తీరింది..
గన్నవరం: బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడు విమానం ఎక్కాలన్న కోరికను విజయవాడకు చెందిన ‘యువర్ విష్ అవర్ డ్రీమ్’ అనే స్వచ్ఛంద సంస్థ నెరవేర్చింది. కృష్ణా జిల్లా కంకి పాడుకు చెందిన సంతోష్(8) కేన్సర్‌తో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమానం ఎక్కాలనే ఆ బాలుడి కోరికను వైద్యులు ద్వారా తెలుసుకున్న యువర్ విష్ అవర్ డ్రీమ్ సంస్థ ప్రతినిధులు గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్‌లు బాలుడిని విమానం ఎక్కించేందుకు అంగీకరించారు. దీంతో సంస్థ అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరి, ఉపాధ్యక్షులు శనివారం బాలుడిని కొద్దిసేపు విమానం ఎక్కించారు. -
సూపర్ కాప్ హిమాంశు ఆత్మహత్య
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అదనపు డీజీపీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మాజీ చీఫ్ హిమాంశురాయ్ (54) శుక్రవారం ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న రాయ్ మధ్యాహ్నం నారీమన్‌పాయింట్‌లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. రివాల్వర్‌తో కాల్చుకున్న వెంటనే పక్కనున్న బాంబే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది. ఈయన 26/11 ముంబై దాడి మొదలుకుని ఎన్నో కీలక కేసుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించి.. మహారాష్ట్ర అదనపు డీజీపీ వరకు ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలున్న అధికారిగా పేరొందారు. 2016 నుంచి సుదీర్ఘ సెలవులో ఉన్న రాయ్ మూడేళ్లుగా కేన్సర్‌కు దేశ, విదేశాల్లో చికిత్స పొందినా ఎలాంటి మార్పులేకపోవటంతో బలవన్మరణాకికి పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పట్టు వదలడు! ముంబై క్రైమ్‌బ్రాంచ్ బాస్‌గా, ఏటీఎస్ చీఫ్‌గా ఈయన బాధ్యతలు నిర్వహించారు. దేశం యావత్తూ సంచలనంరేపిన ముఖ్యమైన కేసుల పరిష్కారంలో ఈయన పాత్ర కీలకం. ముంబైలో జర్నలిస్టు జ్యోతిర్మయి డే, బాలీవుడ్ నటి లైలాఖాన్, మరోనటి మీనాక్షీ థాపా, 2012లో ఐఏఎస్ అధికారి కూతురు, యువ న్యాయవాది పల్లవి పుర్యకాయస్త హత్యలు సహా పలు కేసుల్లో దోషులకు శిక్షపడేలా చేశారు. ముంబై దాడి కేసులో అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ హాడ్లీ భారత్‌లో రెక్కీ నిర్వహించిన విషయంలోనూ సాక్ష్యాధారాల సేకరణలో చాలా శ్రమించి.. విజయం సాధించారు. మాలేగావ్, నాసిక్ ఎస్పీలుగా, నాసిక్ కమిషనర్‌గా, ముంబై అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ముంబై జాయింట్ కమిషనర్ (క్రైమ్)గా ఉన్నప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విచారణతో బాలీవుడ్, క్రికెటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఏటీఎస్ చీఫ్‌గా బదిలీ అయిన తర్వాత.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని అమెరికన్ స్కూల్ పేల్చివేతకు కుట్రపన్నిన అనీస్ అన్సారీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసి భారీ ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి పోలీసు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా రాయ్ కేన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. అయినా ఈ విధంగా తన జీవితాన్ని అంతం చేసుకుంటాడనుకోలేదు’ అని ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఎమ్ఎన్ సింగ్ తెలిపారు. సీఏ నుంచి ఐపీఎస్‌గా.. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన హిమాంశురాయ్ 1988లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య భావన రాయ్ ఐఏఎస్ అధికారి. వివాహం అయిన కొంతకాలానికే ఈమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేస్తున్నారు. శారీరక దృఢత్వంపై మొదట్నుంచీ ఎక్కువ ఆసక్తి చూపించే హిమాంశురాయ్ కేన్సర్ బారిన పడిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా డిప్రెషన్లోకి వెళ్లారు. -
మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్ ఆత్మహత్య
సాక్షి, ముంబాయి : మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఆయన ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కాగా హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్‌మాతా’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న హిమాన్షు ఏడాదిన్నరగా మెడికల్ లీవ్‌లో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాంబే ఆస్పత్రికి తరలించారు. 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్‌ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. -
ఎముక క్యాన్సర్లు అస్థికకు అనర్థం
శరీరం లోపల మనకు ఎముక లేకపోతే... అసలు మనకు రూపమే ఉండదు. ఎముకల సముదాయంతో అస్థిపంజరం మనకో అస్థిత్వాన్ని ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకృతికి మూలం అస్థిసముదాయమే. శరీరంలోని భాగమే కాబట్టి అన్ని అవయవాల్లాగే దానికీ క్యాన్సర్ల వంటి జబ్బులు వస్తాయి. కాకపోతే నేరుగా ఎముకకే క్యాన్సర్ రావడం కాస్తంత అరుదు. కానీ ఇతర క్యాన్సర్లు ఎముకలకు పాకడం సాధారణం. ఎముకలకు వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలు, ఇటీవల ఈ రంగంలోనూ వచ్చిన ఆధునిక చికిత్సల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. రకాలు... బయటకు కనిపించే శరీరాకృతిని అలా నిలబెట్టి ఉంచడానికి తోడ్పడేవి ఎముకలే. వీటిలో మూడు రకాల కణాలు ఉంటాయి. మొదటివి ఆస్టియోబ్లాస్ట్స్ (ఎముక పెరిగే సమయంలో దీని నుంచే కొత్త కణాలు పుడుతుంటాయి); రెండోవి ఆస్టియోసైట్స్ (అంటే ఇవి ప్రధాన ఎముక కణాలన్నమాట), మూడో రకం కణాలను ఆస్టియోక్లాస్ట్స్ అంటారు. అంటే ఎముక కణాల జీవితం పూర్తయ్యాక వాటిని శిథిలం చేసే కణాలివి. ఎముక క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మనం క్యాన్సర్ గురించీ కాస్త తెలుసుకోవాలి. ఏ అవయవంలోని కణాలైనా ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా హానికరమైన రీతిలో పెరగడమే క్యాన్సర్. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. శరీరంలోని ఏ భాగంలో క్యాన్సర్ మొదలైతే... దాన్ని ఆ అవయవ క్యాన్సర్‌గా చెబుతారు. ఉదాహరణకు ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తే దాన్ని లంగ్ క్యాన్సర్ అంటారు. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఇక క్యాన్సర్ అన్నది ఆ భాగానికే పరిమితం కాకుండా అలా ఎటుపడితే అటు పెరిగిపోతుందన్న విషయం కూడా తెలిసిందే. ఇలా ఒక క్యాన్సర్ పెరగడాన్ని మెటస్టాసిస్ అంటారు. క్యాన్సర్ అన్నది తొలుత ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ శరీరంలోని వేరే ఏదైనా భాగానికి క్యాన్సర్ వచ్చి అది పాకే (మెటాస్టాటైజ్) క్రమంలో ఎముకకు చేరితే దాన్ని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు. మామూలుగా ఈ క్యాన్సర్ ఏ ఎముకకైనా రావచ్చు. కానీ చిన్న ఎముకలతో పోలిస్తే పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉన్న కాళ్లు, చేతుల ఎముకలకు రావడం ఒకింత ఎక్కువ. సాధారణంగా నేరుగా ఎముకకు క్యాన్సర్ రావడం అరుదే అయినప్పటికీ... రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వచ్చి... ఆ కణుతులు పెరుగుతూ ఎముకలకు పాకి... నిర్దిష్టమైన ఆకృతిలో సాఫీగా ఉండే ఎముకలపై సైతం కణుతులుగా ఏర్పడతాయి. ఇవి గాక... శరీరంలోని మృదు కణజాలమైన చర్మం, కండరాలు, నరాలూ-రక్తనాళాల సముదాయం, కొవ్వు కణాలు, ఎముకలోనే ఉండే మృదువైన కణజాలపు పొర సైనోవియమ్ వంటి వాటికి వచ్చే క్యాన్సర్లు మరో రకం. లక్షణాలు ఎముకలో నొప్పి: ఎముకని ఏదైనా భాగంలో కణితి పెరగగానే కనిపించే మొదటి లక్షణం నొప్పి. తొలుత ఈ నొప్పి రోజులోని ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ నొప్పి వచ్చే వ్యవధి కూడా పెరుగుతుంది. అయితే ప్రతి నొప్పినీ క్యాన్సర్‌గా భావించనవసరం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సాధారణ జబ్బుల్లోనూ ఎముకలూ, కీళ్లలో నొప్పులు వస్తాయి. ఇదే సమయంలో మరో విషయమూ గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఎముకలకు వచ్చే కణుతులను ఆటల్లో తగిలిన గాయాలుగా పొరబడే అవకాశమూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష చేయించుకుని, క్యాన్సర్ కాదని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండాలి. వాపు : ఎముకలో నొప్పి వచ్చే చోట, వాపు కూడా కనిపించవచ్చు. ఎముక విరగడం : సాధారణంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందిన ప్రాంతంలో ఎముక బలహీనంగా మారుతుంది. అందుకే అక్కడ అది తేలిగ్గా విరుగుతుంది. శరీర కదలికలు తగ్గడం : సాధారణంగా ఎముక క్యాన్సర్‌లో కణితి కీళ్ల వద్ద వస్తే మామూలు కదలికలు సైతం తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కాబట్టి శరీర కదలికలు తగ్గుతాయి. ఇతర లక్షణాలు: ఎముకల్లో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి అవాంఛిత పరిణామాలూ, నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే సదరు అవయవానికి చెందిన లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఎముక మృదుకణజాల క్యాన్సర్లలో : ఎముకలోని మృదు కణజాలానికి క్యాన్సర్ వ్యాపించినప్పుడు తొలి దశల్లో లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఎముక మృదుకణజాలానికి సాగేగుణం (ఎలాస్టిసిటీ) ఎక్కువ. మనం దాన్ని కనుగొనే సమయానికి దాని పరిమాణం చాలా పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. అందుకే ఈ తరహా క్యాన్సర్లలో మొదటి లక్షణం... నొప్పి లేని గడ్డ. ఈ గడ్డ పెరుగుతూ పోతున్నకొద్దీ నరాలనూ, కండరాలనూ నొక్కుతూ వాటిపై ఒత్తిడి పెంచుతుంది. దాంతో నొప్పి కలుగుతుంది. ప్రైమరీ బోన్ క్యాన్సర్ క్యాన్సర్ ముందుగా ఎముకలోనే పుట్టడాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారన్నది తెలిసిందే. ఈ తరహా క్యాన్సర్‌ను ‘సార్కోమా’ అంటారు. ఇందులోని మరికొన్ని రకాలివి... ఆస్టియోసార్కోమా: ఎముకలోనే పుడుతుంది కాబట్టి దీన్ని ‘ఆస్టియోజెనిక్ సార్కోమా’ అని కూడా అంటారు. ఎముక క్యాన్సర్లలో ఇది అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ప్రధానంగా భుజాలు, కాళ్లు, పృష్టభాగం (పెల్విస్) ప్రాంతపు ఎముకల్లో 10 నుంచి 30 ఏళ్ల వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాండ్రోసార్కోమా : ఎముకల చివర్లో మృదువైన అస్థికణజాలం ఉంటుంది. దీన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్‌లో వచ్చే క్యాన్సర్‌ను కాండ్రోసార్కోమా అంటారు. సాధారణంగా ఇది 20 ఏళ్లలోపు వారికి చాలా అరుదు. అయితే వయసుతో పాటు ఎదుగుతున్న క్రమంలో ఇది వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. ఎవింగ్స్ సార్కోమా : ఇది ఎముకల్లోనూ మొదలుకావచ్చు లేదా కండరాల్లోనూ ఆవిర్భవించవచ్చు. పిల్లలు, టీనేజర్లలో ఎక్కువగా కనిపించే సాధారణ క్యాన్సర్లలో దీనిని మూడో స్థానం. ఫైబ్రోసార్కోమా అండ్ మ్యాలిగ్నెంట్ ఫైబ్రస్ హిస్టియోసైటోమా : ఈ రెండు రకాల క్యాన్సర్లూ వృద్ధుల ఎముకల చివర్లలో ఉండే మృదుకణజాలంలో మొదలవుతాయి. ప్రధానంగా భుజాలు, కాళ్లు, దవడ ఎముకల్లో ఈ తరహా క్యాన్సర్ల మొదలవుతాయి. జెయింట్ సెల్ ట్యూమర్ ఆఫ్ బోన్: ఈ తరహా క్యాన్సర్లలో నిరపాయకరమైనవీ ఉంటాయి. హాని చేసేవీ ఉంటాయి. అయితే అపాయం కలిగించని తరహావే ఎక్కువ. సాధారణంగా యుక్తవయస్కులు, మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలావరకు పాకకుండా స్థిరంగా ఉంటాయి. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాడోమా: సాధారణంగా 30 ఏళ్లు దాటినవారిలో ఇది వెన్నెముకకుగానీ లేదా పుర్రె కింది భాగపు ఎముకలకు గాని వచ్చే క్యాన్సర్. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఇది వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కానీ విస్తరించవు. అయితే శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అప్పుడవి ఊపిరితిత్తులకూ, కాలేయానికీ, లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తాయి. ఎముక క్యాన్సర్... దశలు ఎముక క్యాన్సర్‌ను అక్కడి నుంచి చిన్న ముక్క తీసి (బయాప్సీ), పరీక్షించి నిర్ధారణ చేస్తారు. అది ఏ మేరకు పాకింది, ఎంత విస్తరించిందన్న అంశాల ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందన్నది నిర్ధారణ చేస్తారు. బయాప్సీ ద్వారా క్యాన్సర్ దశలో ఉందన్న విషయాన్ని నిర్ణయించడం పైనే చికిత్స ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎముకకు క్యాన్సర్ అని, అది ఏ దశలో ఉందన్నది నిర్ధారణ అయితే ఇతర ఆర్థోపెడిక్ సర్జన్లతోనూ సంప్రదించి, రోగిని బతికించడానికి సదరు అవయవాన్ని ఏ మేరకు తొలగించాలన్న విషయాన్నీ నిర్ధారణ చేస్తారు. సాధారణంగా ఎముక క్యాన్సర్ ఏ దశలో ఉందనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి అమెరికన్ జాయింట్ కమిషన్ ఆన్ క్యాన్సర్ (ఏజేసీసీ) రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ఇందులో ట్యూమర్ (టీ), లింఫ్ నోడ్ (ఎన్), మెటాస్టాసిస్ (ఎమ్) అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని బట్టి క్యాన్సర్ ఏ దశ (గ్రేడ్)లో ఉందో తెలుసుకుంటారు. అందుకే ఈ దశను ‘జీ’ (గ్రేడ్) అనే ఇంగ్లిష్ అక్షరం ద్వారా సూచిస్తారు. జీ1, జీ2 అనే దశలో తక్కువ తీవ్రమైనవిగానూ, జీ3, జీ4 దశలో చాలా తీవ్రమైనవిగానూ నిర్ణయిస్తారు. వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి. సెకండరీ బోన్ క్యాన్సర్ ఇక ఈ తరహా క్యాన్సర్లు శరీరంలోని ఏ భాగంలోనైనా ఆవిర్భవించి, ఎముకకు పాకితే దాన్ని సెకండరీ క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. రక్తప్రవాహంతో గానీ, లింఫ్ ప్రవాహంతోగానీ క్యాన్సర్ కణాలు ఎముకకు పాకి అక్కడ పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ల సాధారణంగా శరీరం మధ్యభాగంలో ఉండే ఎముకలు అంటే పృష్ఠభాగం (పెల్విస్)లోగానీ వెన్నెముక (స్పైన్)లోగాని కనిపిస్తాయి. చికిత్స ప్రక్రియలు ఎముక క్యాన్సర్‌కు ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ చికిత్స ప్రక్రియలు... శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఫ్రాక్షనేటెడ్ డోస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. శస్త్రచికిత్స : ఇక ఎముకల మృదు కణజాలానికి క్యాన్సర్ వస్తే అనుసరించే ప్రక్రియల్లో శస్త్రచికిత్స చాలా సాధారణం. ఈ శస్త్రచికిత్సల్లోనూ తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించినా లేదా చుట్టూ ఉన్న మృదుకణజాలానికే క్యాన్సర్ పరిమితమైనా... శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించినప్పటికీ, వ్యాధి సోకిన అవయవాన్ని సాధ్యమైనంత వరకు తొలగించకుండా రక్షించడానికే ప్రయత్నిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉంటే అప్పుడు కూడా అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ... కేవలం ఎముకను మాత్రమే తొలగించి, దాని స్థానంలో లోహంతో తయారు చేసిన, కొత్తదైన కృత్రిమ ఎముకను అమర్చి అవయవం ఎప్పటిలాగే ఉంచేలా చూస్తారు. ఒకవేళ క్యాన్సర్ గనక లింఫ్నోడ్స్కు చేరితే... (లింఫ్‌నోడ్స్... అన్ని అవయవాలకూ క్యాన్సర్‌ను చేర్చే గేట్ వే లాంటివి కాబట్టి) వాటిని పూర్తిగా తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణజాలాన్ని తొలగించాక... ఆ అవయవం మునుపటి ఆకృతి కోల్పోతే... అది ముందులాగే ఉండేలా చూసేందుకు ‘రీ-కన్స్ట్రక్టివ్ సర్జరీ లేదా రీప్లేస్మెంట్ సర్జరీ’ని నిర్వహిస్తారు. ఇక క్యాన్సర్ కారణంగా ఎముకలకు తీవ్రమైన నొప్పి వస్తే... చివరి ఉపశమనంగా నిర్వహించే శస్త్రచికిత్సను ‘ప్యాలియేటివ్ సర్జరీ’ అంటారు. ఇందులో ఏ రకమైన శస్త్రచికిత్సను ఎంపిక చేయాలన్న అంశం... వ్యాధి ఏ దశలో ఉంది, ఎముకలోని ఏ ప్రాంతంలో ఉంది, ఆ క్యాన్సర్ గడ్డ సైజ్ ఎంత, రోగి తాలూకు ఇతర ఆరోగ్యపరిస్థితులేమిటి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనితో పాటు అవసరాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాలి. సర్జరీ అవసరం లేకుండా చేసే చికిత్సలు: క్యాన్సర్ గడ్డ ఏ రకానికి చెందినది, అది ఏ ప్రాంతంలో ఉంది అన్న అంశం ఆధారంగా చేయాల్సిన చికిత్స-ప్రణాళికను నిర్ణయిస్తారన్నది తెలిసిందే. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేని సందర్భాల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే బీమ్రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి మార్గాలు అనుసరిస్తారు. అయితే క్యాన్సర్ ఉన్న ప్రాంతం, గ్రేడ్, రోగి వయసు, ఆరోగ్యపరిస్థితి వంటి అనేక అంశాల ఆధారంగా శస్త్రచికిత్స, కీమో, రేడియేషన్ థెరపీలను సంయుక్తంగా ఉపయోగించుకుంటారు. అవయవాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం... ఎల్ఎస్ఎస్ కాలి ఎముక లేదా చేతి ఎముక ఇలా ఏ ఎముకకు క్యాన్సర్ సోకినా... డాక్టర్ల ప్రధాన లక్ష్యం సాధ్యమైనంత వరకు ఆ అవయవాన్ని కోల్పోకుండా కాపాడటమే. శస్త్రచికిత్స ప్రక్రియను ఎంపిక చేసుకున్నప్పటికీ ఇందుకోసమే డాక్టర్లు శ్రమిస్తారు. డాక్టర్ల ఈ ఉద్దేశాన్నే వైద్యపరిభాషలో ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’ (ఎల్.ఎస్.ఎస్.)అంటారు. ఇందులో రెండు అంచెలుంటాయి. మొదటి అంచెలో ఆరోగ్యకరమైన భాగాన్ని వీలైనంతగా రక్షించుకుంటూ... క్యాన్సర్‌కు గురైన భాగాన్ని పూర్తిగా తొలగించడం. రెండో అంచెలో... ఇలా తొలగింపు తర్వాత కోల్పోయిన భాగాన్ని పునర్నిర్మించడం. ఈ పునర్నిర్మాణం కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తారు. ఉదాహరణకు... కోల్పోయిన ఎముక స్థానంలో లోహంతో చేసిన అలాంటి ఆకృతినే అమర్చుతారు. ఇలా కృత్రిమంగా అమర్చే లోహభాగాన్ని ‘ప్రోస్థెసిస్’ అంటారు. ఒక్కోసారి మొత్తం ఎముకే... లోహంతో తయారు చేసి తొలగించిన ఎముక స్థానంలో దీన్ని అమరుస్తారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే ఎముక మార్పిడి (బోన్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్స అన్నమాట. ఇలా చేయడానికి అనుగుణంగా ఇప్పుడు సర్జన్సకు రకరకాల లోహాలు అంటే... మృదులాస్థి కోసం మృదువైన లోహాలతో తయారైనవీ (వీటిని సాఫ్ట్ టిష్యూ అల్లోగ్రాఫ్ట్ప్ అంటారు); గట్టి ఎముకల కోసం గట్టి లోహాలతో రూపొందించనవీ... రోగి ఎముక పరిమాణం ఎంతుందో అంతే సైజ్‌లో ఉన్నవీ లభ్యమవుతున్నాయి. వయసుతో పాటూ ఎదిగే కృత్రిమ ఎముకలు... ఇప్పుడు వైద్యవిజ్ఞానశాస్త్రంలో ఈ శస్త్రచికిత్స ప్రక్రియల పురోగతి ఎంతగా ఉందంటే... ఎదిగే వయసులో ఉన్న ఒక అబ్బాయికి ఎముక క్యాన్సర్ సోకి... ఎముకను తొలగించాల్సి వస్తే... అతడిది పెరిగే వయసు కాబట్టి... పెరుగుతున్న కొద్దీ లోహపు ఎముక కూడా పెరిగేలా వ్యాప్తిచెందే కృత్రిమ ఎముకలూ ఉన్నాయి. రోగి అవయవాన్ని రక్షించడం కోసమే ఈ తరహా ఉపకరణాలను రూపొందించారన్నమాట. శస్త్రచికిత్సల్లో మరో రెండు ప్రక్రియలు... ఆర్థ్రోడెసిస్: ఈ ప్రక్రియలో రోగి నుంచే తీసుకున్న ఎముకను గానీ... లేదా ఎముకల బ్యాంకులో అతడికి సరిపడే ఎముకనుగానీ స్వీకరించి ఎముక మార్పిడి చికిత్స చేస్తారు. ఆర్థ్రోడెసిస్ ప్రక్రియను అనుసరిస్తే... కీలు వద్ద కూడా ఎముక వంగదు. ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కానీ రోగి అవయవాన్ని కోల్పోకుండా ఉండే సౌలభ్యం మాత్రం ఉంటుంది. ఆర్థ్రోప్లాస్టీ : ఇందులో రోగి నుంచి తొలగించిన ఎముక పరిణామం, అతడిలో సరిగ్గా ఇమిడిపోగల తత్వం వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రతికూలతలూ ఉండవచ్చు... అయితే ఆర్థ్రోడెసిస్ లేదా ఆర్థ్రోప్లాస్టీ... ఇలా ప్రక్రియ ఏదైనప్పటికీ కృత్రిమ ఎముక మార్పిడి చికిత్స తర్వాత ఎముక అరగడం, ప్రమాదాల వంటివి జరిగినప్పుడు ఎముక విరగడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. ఇక కృత్రిమ ఎముకల అమరిక అన్నది రోగులందరికీ సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితులను బట్టి అనుకూలతలు లేకపోతే కొందరిలో అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితీ ఉండవచ్చు. ఇవన్నీ రోగి పరిస్థితిని బట్టి చికిత్స చేసే డాక్టర్ల బృందం సంయుక్తంగా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎముక మార్పిడి విషయంలో ఎముకలను ఇతర వ్యక్తుల నుంచి సేకరించి ఉంచిన ‘బోన్ బ్యాంకు’ నుంచి స్వీకరించి, దాన్ని రోగి శరీరంలో అమర్చితే రోగి దేహం దాన్ని ఆమోదించకపోవడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. అరుగుదల రేటూ ఎక్కువే. కానీ లోహపు ప్రోస్థసిస్ వంటివి అమరిస్తే మాత్రం ఇలాంటి కాంప్లికేషన్లకు అవకాశం తక్కువ. ఇన్ని సౌకర్యాలూ, ఆధునిక పరిజ్ఞానం, వయసు ఎదిగే కొద్దీ పెరిగే కృత్రిమ ఎముకల అందుబాటు వంటి ఎన్నెన్నో మార్గాలు ఉన్నప్పటికీ డాక్టర్ ప్రధాన ధ్యేయం రోగి ప్రాణాలను రక్షించడమే. ఆ తర్వాతే సాధ్యమైనంత వరకు మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకుని, రోగి మునపటి సౌకర్యాలను వీలైనంతగా పొందేలా డాక్టర్లు చూస్తారు. దీనితో పాటు రోగికి అవసరమైన ఆహారం (న్యూట్రిషన్), నొప్పి తగ్గించడం (పెయిన్ మేనేజ్మెంట్), కదలికలను మునుపటిలా చేసే స్వాభావిక చికిత్స (నేచురోపతి మెడిసిన్), ఫిజియోథెరపీ, ఆధ్యాత్మిక అంశాల బోధన వంటి అనేక విషయాలతో రోగికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. - నిర్వహణ: యాసీన్ -
ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించి, అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని ఆధ్వర్యంలో చికిత్స జరిగితే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. కాన్స్టిట్యూషనల్ హోమియోవైద్యం ద్వారా క్యాన్సర్ కణాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటూనే హోమియో చికిత్సనూ అనుసరిస్తే... ఇతర దుష్ర్పభావాలు రాకుండా అరికట్టవచ్చు. కొన్ని ముఖ్యమైన హోమియో మందులు హెక్లాలావా: ‘ఆస్టియోసార్కోమా’ వంటి ఎముక క్యాన్సర్, దవడ ఎముక, చీలమండ లోపలి ఎముక (టిబియా)లో వచ్చే క్యాన్సర్లకు వాడదగిన ఔషధం. హైడ్రాస్టిస్ కెనడెన్సిస్: పూర్తి క్యాన్సర్ దశలో వాడదగిన ఔషధం. ఇది ముఖ్యంగా ఎముకలు, నాలుక, ఉదరం, జననాంగాలపై వచ్చే క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే కండరాల బలహీనతను అధిగమించడానికి ఉపయోగపడుతూనే కండరాల పటుత్వాన్నీ పెంచుతుంది. కాల్కేరియా ఫాస్: వివిధ రకాల క్యాన్సర్ మందులు పూర్తిస్థాయిలో పనిచేయకుండా ఉన్నప్పుడు వాటిని క్రియాశీలం చేసేందుకు కాల్కేరియా ఫాస్ చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఎముకల ఫ్రాక్చర్లు త్వరగా తగ్గిపోడానికీ, చిన్నపిల్లల్లో వచ్చే ఎముక క్యాన్సర్లు తగ్గడానికి పనిచేస్తుంది. మెజీరియం: ఇది ఎముక, దాని చుట్టూ ఉండే కవచంపైన ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఎముక నుంచి ఏర్పడే ద్రవంతో కూడిన సిస్టిక్ ట్యూమర్, నుదురు, దవడ ఎముకల్లో వచ్చే చీముగడ్డల నివారణకు ఉపయోగపడుతుంది. సవాయిరోగాన్ని (సిఫిలిస్‌ను) అణచివేయడం వల్ల వచ్చే కపాల వాపు, కపాలంపై వచ్చే కణుతులకు చక్కగా పనిచేస్తుంది. ఫాస్ఫరస్: ఎముక క్యాన్సర్ ముఖ్యంగా తొడ ఎముక (ఫీమర్), కాలిచీలమండ లోపలి ఎముక (టిబియా) పెరుగుదల ఉన్నవారిలో, చీముతో కూడిన కాలి పుండ్లు ఉన్నవారిలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారణంగా అధిక రక్తస్రావం జరగడం, ఎముక చుట్టూ ఉండే కవచం పుండుగా మారి ఊడిపోవడం... ఎముక గరుకుగా మారడం, మంటతో కూడిన నొప్పులు, జ్వరం, చల్లటిపదార్థాలు తీసుకోవాలనిపించడం, అస్థిమితం వంటి వాటికి ఇది మంచి మందు. రేడియం బ్రోమాటం: మొటిమలు, డర్మటైటిస్ అనే చర్మవ్యాధి కి, ఎముకల్లో నొప్పులు, కీళ్లనొప్పులు, ఎముక క్యాన్సర్‌కు పనిచేస్తుంది. ఆరమ్ మెట్: క్యాన్సర్‌తో మనోవ్యాకులతకు గురై ఆత్మహత్య చేసుకోవాలనిపించేవారికి పనిచేస్తుంది. సింఫైటమ్: అన్నిరకాల ఎముక సంబంధ వ్యాధులు... ముఖ్యంగా ఎముక వాపు, దవడవాపు, సార్కోమా వంటి సమస్యలకు వాడదగిన మందు. అంతేకాకుండా సింఫైటమ్ను ఎముక చీలికలు లేదా ఫ్రాక్చర్లు త్వరగా మానడానికి ప్రథమ చికిత్సగా వాడతారు. నరాల నొప్పి, మోకాలి నొప్పి, టెండన్స్ ఇబ్బందులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. -
బాలుడికి అరుదైన శస్త్రచికిత్స
బోన్ క్యాన్సర్ బాధితుడికి ఆపరేషన్ వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్ అమరిక రాష్ర్టంలో ఇదే తొలి శస్త్రచికిత్సగా వైద్యుల వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: తొడ ఎముక క్యాన్సర్ (ఈవింగ్ సర్కోమా)తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో ఇదే ప్రథమమని వారు వెల్లడించారు. అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రి వైద్యులు ఈ శసతచ్రికిత్సను విజయవంతంగా నిర్వహించారు. క్యాన్సర్ సోకిన భాగాన్ని పూర్తిగా తీసేసి ఆ స్థానంలో బాలుడి వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్‌ను అమర్చి ఎందుకూ పనికి రాకుండా చచ్చుపడిపోయిన అతని కాలుకి పునర్జన్మను ప్రసాదించారు. శుక్రవారం హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రికి చెందిన ప్రముఖ బోన్ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ కిషోర్ బి రెడ్డి శస్త్రచికిత్సకు సంబంధించి వెల్లడించిన వివరాలు.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన దర్శన్(9) కుడికాలు తొడ ఎముక వాపుతో బాధపడుతున్నాడు. అతని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించారు. తొడలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఆరు నెలల క్రితం సర్జరీ చేశారు. శస్త్రచికిత్స తర్వాత జబ్బు నయం కాకపోగా మరింత ముదరడంతో మళ్లీ వైద్యులను సంప్రదించారు. అనుమానం వచ్చి బయాప్సీ చేయగా, అప్పటికే క్యాన్సర్ సోకి తొడ ఎముక పూర్తిగా పాడైనట్టు గుర్తించారు. కాలును తొలగించడం ఒక్కటే దీనికి పరిష్కారమని చెప్పడంతో బాలుని తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ అంశంపై మరో నిపుణుడి సలహా తీసుకోవాలని భావించి ఐదు నెలల క్రితం అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రిలోని ప్రముఖ బోన్ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ కిషోర్ బి రెడ్డిని సంప్రదించారు. వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్‌ను అమర్చడం ద్వారా బాలుడి కాలును కాపాడవచ్చని సూచించారు. దీనికి వారు అంగీకరించడంతో నెల రోజులపాటు కీమో థెరపీ నిర్వహించారు. క్యాన్సర్ కణాలన్నీ చనిపోయిన తర్వాత మూడు వారాల క్రితం బాలుడికి శ స్త్రచికిత్స చేశారు. క్యాన్సర్ సోకిన 44 సెంటీమీటర్ల పొడవు ఎముకను కట్ చేసి తొలగించి, దాని స్థానంలో బాలుడి వయసుతోపాటు పెరిగే అధునాతన రాడ్‌ను సుమారు ఏడున్నర గంటలపాటు శ్రమించి అమర్చారు. బాలుడికి యుక్తవయసు వచ్చే వరకు అతని శారీరక ఎదుగుదలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాడ్డు పొడవును పెంచుకునే వీలుంది. ఇలా ప్రతి ఆరు నెలలకోసారి చేయాల్సి ఉంది. ఇలా చేసిన ప్రతిసారి మోకాలు జాయింట్స్ పైభాగంలో ఓ చిన్న రంధ్రం చేసి కండరాల లోపల అమర్చిన ఇంప్లాంట్ పొడవు (జాకీ మాదిరిగా ఉండే స్క్రూను తిప్పడం వల్ల) పెంచవచ్చు. దీని ఖరీదు రూ.30 లక్షలు కాగా, తయారీ కంపెనీతో స్వయంగా మాట్లాడి బాలుడికి రూ.16.50 లక్షలకే సమకూర్చినట్టు డాక్టర్ కిషోర్ బి రెడ్డి చెప్పారు. పదిహేనేళ్లలోపు ఉన్న ప్రతి పదివేల మంది పిల్లల్లో ఎవరో ఒకరు మాత్రమే ‘ఈవింగ్ సర్కోమా’ క్యాన్సర్ బారిన పడుతారని తెలిపారు. ప్రపంచంలో ఏటా 10-15 సర్జరీలకు మించి జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఇదే తొలి సర్జరీ అని ప్రకటించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎలాంటి సపోర్టు లేకుండా స్వయంగా నడుస్తున్నట్టు చెప్పారు. -
ఎముకల క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించాలి
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎముకల క్యాన్సర్(బోన్‌మ్యారో)ను తొలిదశలో గుర్తించడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ మురళీ సుందరం అన్నారు. మస్కులోస్కెలిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ హాలులో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో బోన్‌మ్యారో అంశంపై ఆయన ఆదివారం డాక్టర్ కాకర్ల సుబ్బారావు గోల్డ్ మెడల్ ప్రసంగం చేశారు. బోన్‌మ్యారో ఎంఆర్ఐ గురించి సుందరం వివరించారు. బోన్‌మ్యారోకు సంబంధించి పలు ఇమేజ్‌లు చూపిస్తూ వాటిలో క్యాన్సర్ కణాలను ఎలా గుర్తించాలో వివరించారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో మడమ ఎమ్ఆర్ఐకి అవసరమైన సాధనాలు, చికిత్సా విధానాలపై చంఢీఘర్‌కు చెందిన డాక్టర్ మహేష్ ప్రకాష్, మోకాలిలో లిగమెంట్లు వాటి ప్రాధాన్యత- కలిగే వ్యాధులు, చికిత్సా విధానాలపై అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ అంకుర్‌షా వివరించారు. మోకాలు కీలులోని మృదులాస్థికి సంబంధించి వచ్చే ఇబ్బందులు, అరిగిపోవడం- చేయాల్సిన చికిత్సలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ యన్. విజయభాస్కర్ విశ్లేషణాత్మకంగా చెప్పారు. ఎక్స్‌టెన్సార్ ‘మెకానిజమ్ ఆఫ్ నీ’ అంశంపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లలిత, పొస్టిరోలేటరర్ స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ నీ అంశంపై ముంబాయికి చెందిన డాకట్ ్రమాలిని లావండీ, ఎముకపై లీజన్స్ వాటికి వచ్చే సమస్యలు చికిత్సా విధానాలు, కండరాల ఎంఆర్ఐ చికిత్సా విధానంపై అమెరికాకు చెందిన ప్రొఫెసర్ నోగా హరమతి, ఆస్టియో నెక్రోసిన్ ఇమేజింగ్, దీనివల్ల ఫలితాలను చెన్నైకు చెందిన గోవిందరాజ్‌లు వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దండమూడి శ్రీనివాస్, డాక్టర్ కులదీప్ తదితరులు పాల్గొన్నారు.