బోన్ కేన్సర్‌తో బాధ³డుతున్న చిన్నారి వాహిని , తల్లిదండ్రులతో చిన్నారి వాహిని
ప్రత్తిపాడు రూరల్: ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి వాహిని ఎముకుల కేన్సర్‌తో బాధపడుతోంది. గ్రామానికి చెందిన తూరపాటి రాజు, దుర్గాదేవి దంపతుల కుమార్తె అయిన వాహినిని కొన్ని నెలలుగా జ్వరం పట్టి పీడిస్తుంటే మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించారు. వైద్య పరీక్షలు అనంతరం చిన్నారికి కేన్సర్ ఉండే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బోన్‌మోరో పరీక్ష చేయిస్తే బోన్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. అసలే తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో చిన్నారికి ఖరీదైన ఈ వైద్యసేవలు అందించడం ఎలాగో అర్థం కాక తల్లిదండ్రులు అల్లాడిపోయారు.
సన్నిహితుల సలహా మేరకు విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తీసువెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. వారానికి ఒక్కరోజు తప్పని సరిగా కిమోథెరపీ చేయించాల్సివస్తోంది. ఈ వైద్యానికి రూ.12 లక్షలు వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం కొంత మేరకు ఊరటనిచ్చినా అంతకు మించి అవుతున్న ఖర్చులను తట్టుకోలేని పరిస్థితి వారిది. ఇప్పటికే శక్తికి మించి రూ.లక్షల్లో ఖర్చు చేశారు. రెక్కాడితేకాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన వారు వైద్య సేవలు అందించడం శక్తికి మించినది కావడంతో ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
సహాయం చేయాల్సిన వారు తూరపాటి దుర్గాదేవి, సామర్లకోట, యూనియన్ బ్యాంకు, అకౌంట్ నెం:606502010010408
సెల్ : 9505762979
Comments
Please login to add a commentAdd a comment