హిమాన్షు రాయ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబాయి : మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఆయన ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కాగా హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్‌మాతా’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న హిమాన్షు ఏడాదిన్నరగా మెడికల్ లీవ్‌లో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాంబే ఆస్పత్రికి తరలించారు.
1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్‌ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment