బోయిన్‌పల్లిలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య! | Hyderabad Crime: Bowenpally Mother Daughters Case Details | Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లిలో తీవ్ర విషాదం..తల్లి బాధ చూడలేక కూతుళ్లూ ఆత్మహత్య?!

Published Tue, Jun 13 2023 7:38 PM | Last Updated on Tue, Jun 13 2023 7:44 PM

Hyderabad Crime: Bowenpally Mother Daughters Case Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయినపల్లి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి.. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని స్వస్థలానికి పంపించినట్లు సమాచారం. 

తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలోని భవానీపురంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె భర్త చనిపోగా.. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో కూతుళ్లు చంద్రకళ, దివ్యాంగురాలైన మరో కూతురు సౌజన్య పాలు పంచుకున్నారు.

అంతా కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారే ఏమో పాపం.. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రకళ ఎంబీఏ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇదీ చదవండి: కాపీ కొడుతూ దొరికిన దీపిక!.. అందుకే సూసైడ్‌ చేసుకుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement