ఐ విల్‌ మిస్‌ యూ బ్రదర్‌: లలిత్‌ మోదీ | I Really will miss Himanshu, Lalit Modi | Sakshi
Sakshi News home page

ఐ విల్‌ మిస్‌ యూ బ్రదర్‌: లలిత్‌ మోదీ

Published Fri, May 11 2018 5:45 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

I Really will miss Himanshu, Lalit Modi - Sakshi

లండన్‌: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి హిమాన్షు రాయ్‌ ఆత్మహత్య చేసుకోవడంపై ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న లలిత్‌ మోదీ..  హిమాన్షు రాయ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ‘ఐ రియల్లీ మిస్‌ యూ. నీ ఉద్యోగ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. కానీ నీ ఆత్మహత్యకు కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మా గుండెల్లో ఎప్పుడూ నీవు చిరస్థాయిగా ఉంటావు. ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో..ఇక నీకు ఏ బాధ ఉండదూ. నీవు ఒక మెరిసే నక్షత్రానివి’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

శుక్రవారం హిమాన్షు రాయ్‌ ముంబయిలోని తన నివాసంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1988 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హిమాన్షు రాయ్‌ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్‌ నటుడు విందు దారా సింగ్‌ను అరెస్ట్‌ చేశారు. వీటితో పాటు అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్  ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్‌ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్‌ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

 హిమాన్షు రాయ్‌ గత కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్‌మఠ్‌’  పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా, ఏడాదిన్నరగా మెడికల్‌ లీవ్‌లో ఉన్న హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement