
గన్నవరం: బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడు విమానం ఎక్కాలన్న కోరికను విజయవాడకు చెందిన ‘యువర్ విష్ అవర్ డ్రీమ్’ అనే స్వచ్ఛంద సంస్థ నెరవేర్చింది. కృష్ణా జిల్లా కంకి పాడుకు చెందిన సంతోష్(8) కేన్సర్‌తో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విమానం ఎక్కాలనే ఆ బాలుడి కోరికను వైద్యులు ద్వారా తెలుసుకున్న యువర్ విష్ అవర్ డ్రీమ్ సంస్థ ప్రతినిధులు గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్‌లు బాలుడిని విమానం ఎక్కించేందుకు అంగీకరించారు. దీంతో సంస్థ అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరి, ఉపాధ్యక్షులు శనివారం బాలుడిని కొద్దిసేపు విమానం ఎక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment