
వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై కె.గోవర్ధనరావు దర్శకత్వంలో హేమలతా రెడ్డి నిర్మించిన చిత్రం ‘నిన్ను చూస్తూ’. నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్ హీరోలుగా హేమలతా హీరోయిన్‌గా నటించాయి. సీనియర్ నటులు సుమన్, భానుచందర్, నటి సుహాసిని కీలక పాత్రలు చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా చిత్రనిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఓ అందమైన ప్రేమకథతో ఈ సినిమా తీశాం. మానవతా విలువలతో మనసుకు హత్తకునే సన్నివేశాలతో చిత్రం ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు గోవర్ధనరావు కథ చెప్పినదానికంటే బాగా తీశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్.