
హేమలత, శ్రీకాంత్
నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) ముఖ్య తారలుగా కె.గోవర్ధన్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. వీరభద్ర క్రియేషన్స్‌పై హేమలతా రెడ్డి నిర్మించారు. చిత్రబృందం సమక్షంలో హేమలతారెడ్డి ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ– ‘‘ఇదొక అందమైన ప్రేమకథా చిత్రం. మానవీయ విలువలతో మనసుకు హత్తుకునే కుటుంబ సన్నివేశాలతో నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆడియోను, అదే నెలలో సినిమాను రిలీజ్ చేస్తాం. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సుహాసిని, సుమన్, భానుచందర్, కాశీ విశ్వనాథ్, షాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్, కెమెరా: ప్రసాద్ ఈదర.