![Anketa Maharana talks about her role in 4 Letters - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/20/Untitled-18.jpg.webp?itok=x94VDdMO)
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా ముఖ్య తారలుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘4 లెటర్స్’. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత మహారాణా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో బోల్డ్‌గా ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ పాత్ర చేశాను. కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నట్లే నా డైలాగ్స్ చాలా సహజంగా ఉండేలా దర్శకులు జాగ్రత్త తీసుకున్నారు.
అందుకు రఘురాజ్‌గారికి థ్యాంక్స్. పాత్ర పరంగా నా లుక్‌లో కొంచెం ఎక్కువ గ్లామర్ కనిపిస్తుంది. బాగా నటించాను. సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. టాలీవుడ్‌లో నాకు టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను. ఈశ్వర్, టువ మంచి కో స్టార్స్. నిర్మాతలు బాగా సహకరించారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment