eswar
-
సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్ విద్యార్థి..
మంచిర్యాల: పదో తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న హైదరబాద్‌లోని రవీంద్రభారతీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడని పాఠశాల హెచ్ఎం గుండ రాజన్న తెలిపారు.కార్యక్రమం అనంతరం విద్యార్థిని, తల్లిదండ్రులను ముఖ్యమంత్రి సన్మానిస్తారని తెలిపారు. ఈ నెల 10న హరిహర కళాభవన్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులను సత్కరిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం, విద్యాదాత పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. విద్యార్థిని శుక్రవారం ఎంఈవో విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు దాముక కమలాకర్, కమిటీ చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు అభినందించారు. -
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. మళ్లీ కనిపిస్తే బాగుండు!
మంజుల-విజయ్ కుమార్ల వారసురాలిగా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్‌కుమార్. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తెలుగులో 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్గా నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్ లాంటి చిత్రాల్లోను కనిపించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్‌ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అయితే ప్రభాస్‌కు మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తోంది. అయితే ప్రభాస్‌కు జంటగా నటించిన ఈశ్వర్ చిత్రం 2002లో రిలీజైంది. ఈ మూవీ విడుదలై దాదాపు 22 ఏళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా.. వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరిపై ఓ అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈశ్వర్ సినిమా రిలీజై 22 ఏళ్లు అవుతున్నా ఇద్దరు ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు.. రాబోయే ప్రభాస్ అన్నయ్య సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తే బాగుండు అని రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రీదేవి పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడని వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది ముద్దుగుమ్మ. Prabhas 1st Heroine #SrideviVijayKumar ❤️🔥 Eeshwar release ayyi 22 years ayna still they both look good together 😍#Prabhas Anna future movies lo edho okka chinna role lo ayna kanapadithe bagundu ❤️#Kalki2898AD #Spirit #TheRajaSaab pic.twitter.com/o3Hhm7Ne8l — Ayyo (@AyyAyy0) March 29, 2024 -
ప్రభాస్ మొదటి సినిమాకు ఎంత లాభం వచ్చిందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 'ఈశ్వర్' సినిమాతో మొదలైంది. ఈ చిత్రం 2002 నవంబరు 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ దుమ్ములేపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకున్నాడు ప్రభాస్. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈశ్వర్ సినిమాను తెరకెక్కిస్తే. నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మొదటి సినిమాతోనే యూత్, మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ప్రభాస్ సంపాదించుకున్నాడు. ఈశ్వర్ తర్వాత 'రాఘవేంద్ర' సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రంతో అమ్మాయిల హృదయాలతో పాటు రూ. 21 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో యంగ్ రెబల్ స్టార్‌గా అప్పట్లో చెరగని ముద్రవేశాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన) -
బోల్డ్ స్టూడెంట్
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా ముఖ్య తారలుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘4 లెటర్స్’. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత మహారాణా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో బోల్డ్‌గా ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ పాత్ర చేశాను. కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నట్లే నా డైలాగ్స్ చాలా సహజంగా ఉండేలా దర్శకులు జాగ్రత్త తీసుకున్నారు. అందుకు రఘురాజ్గారికి థ్యాంక్స్. పాత్ర పరంగా నా లుక్‌లో కొంచెం ఎక్కువ గ్లామర్ కనిపిస్తుంది. బాగా నటించాను. సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. టాలీవుడ్లో నాకు టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను. ఈశ్వర్, టువ మంచి కో స్టార్స్. నిర్మాతలు బాగా సహకరించారు’’ అని అన్నారు. -
మమ్మల్ని పట్టించుకోకుండా ‘ముందస్తు’కా?
సాక్షి, హైదరాబాద్: ‘మా సమస్యల్ని పట్టించుకోకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరుల వివరాలపై ఇంకా స్పష్టత లేదు’ అంటూ రాజ్‌భవన్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కాసేపట్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు తీర్మానంతో రాజ్‌భవన్‌కు వస్తారనగా.. ఈ పరిణామంతో కలకలం రేగింది. మీడియా ప్రతినిధుల మధ్య నుంచి ముందుకొచ్చిన బొప్పాని ఈశ్వర్ అనే వ్యక్తి జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన మీడియా ప్రతినిధులు, పోలీసులు అతడిని నిలువరిస్తున్నా.. నినాదాలు చేస్తూ.. తానెందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చిందో వివరించాడు. ఉద్యమకారులకు ఏం దక్కలేదు..: ‘నా పేరు బొప్పాని ఈశ్వర్ (27). ఓయూ(నిజాం కాలేజీ) పూర్వ విద్యార్థిని. మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి అవురవాణి గ్రామం. ‘తెలంగాణ సామా జిక విద్యార్థి వేదిక’ తరఫున నా నిరసనను తెలుపుతున్నాను. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు నేటికీ న్యాయం జరగలేదు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల వివరాలపై నేటికీ స్పష్టత లేదు. తెలంగాణ కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడినా విద్యార్థులైన మాకు ఏం దక్కలేదు. మేం చదువును పక్కనబెట్టి, లాఠీ దెబ్బలు తిని మిమ్మల్ని (కేసీఆర్) సీఎం చేస్తే మీరు మాకు ఏం చేయలేదు. మీ ఇంట్లో అందరికీ పదవులు వచ్చాయి. మేం మాత్రం చదువులు, ఉద్యోగాలకు దూరమయ్యాం. ఇవన్నీ పరిష్కరించకుండానే పదవీకాలం ముగియకముందే ముందస్తు ఎన్ని కలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈలోగా పోలీసులు వచ్చి అతనిని పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
చెక్‌బౌన్స్ కేసులో 6 నెలల జైలు
హిందూపురం అర్బన్ : చెక్‌బౌన్స్ కేసులో ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఈశ్వర్‌కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.3,06,780 జరిమానా విధిస్తూ హిందూపురం స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆనందతీర్థ తీర్పునిచ్చినట్లు న్యాయవాది శివశంకర్ మంగళవారం తెలిపారు. ఈశ్వర్ 2013లో హిందూపురం వైశ్యాబ్యాంకుకు చెందిన చెక్కులను ముద్దిరెడ్డిపల్లి మాధవయ్యకు ఇచ్చారు. అయితే ఆ ఖాతాలో డబ్బు లేకపోవడంతో చెక్‌బౌన్స్ అయింది. ఈ కేసును స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో బాధితుడి తరఫున న్యాయవాది శివశంకర్ వాదించారు. ఈ మేరకు జడ్జి విచారణలు చేసి తీర్పు ఇచ్చినట్లు ఆయన వివరించారు. -
కిరోసిన్ తాగి బాలుడి మృతి
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామానికి చెందిన 14 నెలల బాలుడు కిరోసిన్ తాగి, చికిత్స అందక మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్, గాయత్రిలకు ఈశ్వర్(14 నెలలు) ఉన్నాడు. చిన్నారికి తల్లిదండ్రులు డబ్బా పాలు తాగించేవారు. మంగళవారం రాత్రి గాయత్రి వంట పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి ఈశ్వ ర్ ఆడుకుంటూ వెళ్లి సీసాలో ఉన్న కిరోసిన్ తాగాడు. తర్వా త ఏడుస్తుండడంతో కిరోసిన్ తాగినట్లు గుర్తించిన గాయత్రి తొలుత వర్ని ఆస్పత్రికి, అక్కడి నుంచి బోధన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చికి త్స ప్రారంభించిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. కూనీపూర్ నుంచి బోధన్‌కు 20 కిలోమీటర్లు ఉండగా, అక్కడికి తీసుకొచ్చే వరకు జాప్యం జరిగిందని, అందువల్లే బాలుడు చనిపోయాడని స్థానికులు అంటున్నారు. డబ్బాపాలు తాగే అలవాటున్న ఈశ్వర్ పాలసీసాగా భావించి కిరోసిన్ తాగాడు.